🌹. శ్రీమద్భగవద్గీత - 356 / Bhagavad-Gita - 356 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 18 🌴
18. గతిర్భర్తా ప్రభు: సాక్షీ నివాస: శరణం సుహృత్ |
ప్రభవ: ప్రలయ: స్థానం నిధానం బీజమవ్యయమ్ ||
🌷. తాత్పర్యం :
గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.
🌷. భాష్యము :
“గతి”యనగా చేరవలసిన గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికిని శ్రీకృష్ణభగవానుడే చేరవలసిన గమ్యస్థానము. శ్రీకృష్ణుని తెలిసికొనలేనివాడు తప్పుదోవ పట్టగలడు. అంతియేగాక అట్టివాని నామమాత్ర పురోగతి పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. కొందరు వివిధదేవతలను తమ గమ్యస్థానముగా భావించి ఆయా విధానముల తీవ్ర యత్నములచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకాది వివిధలోకములును చేరుచుందురు. శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఆ లోకములన్నియు ఏకకాలమున కృష్ణునితో సమానములు మరియు కృష్ణునితో అసమానములై యున్నవి. కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములై ఆ లోకములు కృష్ణునితో సమానమైన కృష్ణుని సంపూర్ణజ్ఞానమును పొందుటలో ముందడుగు వంటివి మాత్రమే. అనగా కృష్ణుని వివిధశక్తుల దరిచేరుట లేదా వాటిని గమ్యముగా భావించుట యనునది శ్రీకృష్ణుని పరోక్షముగా చేరుట వంటిది. కాని మనుజుడు కాలము మరియు శక్తి వ్యర్థము కాకూడదని తలచినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని దరిచేరవలెను.
ఉదాహరణమునకు అనేక అంతస్థులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్థునకు చేరుటకు యంత్రసౌకర్యమున్నచో మెట్ల మీద నెమ్మదిగా ఏల పోవలెను? సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి యున్నందున అతని ఆశ్రయము లేనిదే ఏదియును స్థితిని కలిగియుండలేదు. సమస్తము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తి పైననే ఆధారపడియుండుటచే వాస్తవమునకు సర్వమును ఆ భగవానుడే పరమ నియామకుడు. సర్వుల హృదయములందు పరమాత్మ రూపున వసించియుండుటచే అతడే దివ్య సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నియు వాస్తవమునకు శ్రీకృష్ణునితో సమానమే. అతడే పరమ ఆశ్రయమైనందున రక్షణమునకు లేదా దుఃఖనాశమునకు ప్రతియొక్కరు అతనినే శరణము నొందవలెను. మనము ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమాకుర్చునది ఒక సజీవశక్తియై యుండవలెనని మనము గుర్తెరుగవలెను. శ్రీకృష్ణుడే పరమజీవశక్తియై యున్నాడు. మన సృష్టికి అతడే కారణుడైనందున లేదా దివ్యజనకుడైనందున అతనికి మించిన సన్నిహిత స్నేహితుడుగాని, బంధువుగాని వేరొకరుండరు. ఆ శ్రీకృష్ణుడే సృష్టికి ఆదికారణుడు మరియు ప్రళయము పిమ్మట సర్వమునకు నిధానమునై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వకారణములకు నిత్యకారణమని తెలియబడినాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 356 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 18 🌴
18. gatir bhartā prabhuḥ sākṣī nivāsaḥ śaraṇaṁ suhṛt
prabhavaḥ pralayaḥ sthānaṁ nidhānaṁ bījam avyayam
🌷 Translation :
I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.
🌹 Purport :
Gati means the destination where we want to go. But the ultimate goal is Kṛṣṇa, although people do not know it. One who does not know Kṛṣṇa is misled, and his so-called progressive march is either partial or hallucinatory. There are many who make as their destination different demigods, and by rigid performance of the strict respective methods they reach different planets known as Candraloka, Sūryaloka, Indraloka, Maharloka, etc.
But all such lokas, or planets, being creations of Kṛṣṇa, are simultaneously Kṛṣṇa and not Kṛṣṇa. Such planets, being manifestations of Kṛṣṇa’s energy, are also Kṛṣṇa, but actually they serve only as a step forward for realization of Kṛṣṇa. To approach the different energies of Kṛṣṇa is to approach Kṛṣṇa indirectly. One should directly approach Kṛṣṇa, for that will save time and energy. For example, if there is a possibility of going to the top of a building by the help of an elevator, why should one go by the staircase, step by step? Everything is resting on Kṛṣṇa’s energy; therefore without Kṛṣṇa’s shelter nothing can exist. Kṛṣṇa is the supreme ruler because everything belongs to Him and everything exists on His energy. Kṛṣṇa, being situated in everyone’s heart, is the supreme witness.
🌹 🌹 🌹 🌹 🌹
Comments