top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 360: 09వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 360: Chap. 09, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 22 🌴


22. అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనా: పర్యుపాసతే |

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||


🌷. తాత్పర్యం :


నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును).


🌷. భాష్యము :


కృష్ణభక్తిరసభావన లేకుండా క్షణకాలమును జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవలను గూర్చుట, సఖ్యము, ఆత్మనివేదనముల ద్వారా భక్తియుక్తసేవ యందు నియుక్తుడై ఇరువదినాలుగు గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను అన్యమును కావింపడు. అట్టి కర్మలు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తిపూర్ణములు. అవి ఆత్మానుభవమునందు భక్తుని పూర్ణుని కావింపగలదు. తద్ద్వారా శ్రీకృష్ణభగవానుని సాహచార్యము పొందుటయే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టము లేకుండా చేరగలడు. వాస్తవమునకు ఇదియే యోగమనబడును.


భగవానుని కరుణచే అట్టి భక్తుడు ఎన్నడును ఈ భౌతికజీవనమునకు తిరిగిరాడు. ఈ శ్లోకమునందలి “క్షేమము” అను పదము శ్రీకృష్ణ భగవానుని కృపాపూర్ణరక్షణమును సూచించుచున్నది. అనగా యోగము ద్వారా కృష్ణభక్తిరసభావనను పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణభగవానుడు, అతడు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితుడైన పిమ్మట దుఃఖభూయిష్టమైన బద్ధజీవనమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణము నొసగును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 360 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 22 🌴


22. ananyāś cintayanto māṁ ye janāḥ paryupāsate

teṣāṁ nityābhiyuktānāṁ yoga-kṣemaṁ vahāmy aham


🌷 Translation :


But those who always worship Me with exclusive devotion, meditating on My transcendental form – to them I carry what they lack, and I preserve what they have.


🌹 Purport :


One who is unable to live for a moment without Kṛṣṇa consciousness cannot but think of Kṛṣṇa twenty-four hours a day, being engaged in devotional service by hearing, chanting, remembering, offering prayers, worshiping, serving the lotus feet of the Lord, rendering other services, cultivating friendship and surrendering fully to the Lord. Such activities are all auspicious and full of spiritual potencies, which make the devotee perfect in self-realization, so that his only desire is to achieve the association of the Supreme Personality of Godhead. Such a devotee undoubtedly approaches the Lord without difficulty. This is called yoga.


By the mercy of the Lord, such a devotee never comes back to this material condition of life. Kṣema refers to the merciful protection of the Lord. The Lord helps the devotee to achieve Kṛṣṇa consciousness by yoga, and when he becomes fully Kṛṣṇa conscious the Lord protects him from falling down to a miserable conditioned life.


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Comentarios


bottom of page