🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 24 🌴
24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
నతు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ||
🌷. తాత్పర్యం :
నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.
🌷. భాష్యము :
వేదవాజ్మయమునందు పలువిధములైన యజ్ఞములు నిర్దేశింపబడియున్నను, వాస్తవమునకు అవియన్నియును దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడినవి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. యజ్ఞముగా విష్ణువు. యజ్ఞుడు లేదా విష్ణువు ప్రీత్యర్థమే ప్రతియొక్కరు కర్మనొనరించవలెనని భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున స్పష్టముగా తెలపబడినది. మానవనాగరికతకు పరిపక్వరూపమైన వర్ణాశ్రమధర్మము విష్ణుప్రీతికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది.
కనుకనే శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట “నేనే దివ్యప్రభువును గావున సర్వయజ్ఞములకు నేనే భోక్తను” అని పలికియున్నాడు. కాని మందమతులైనవారు ఈ సత్యమును తెలియక తాత్కాలిక లాభముల కొరకు ఇతర దేవతలను పూజింతురు. తత్కారణముగా వారు భౌతికస్థితికి పతనము నొంది ఎన్నడును మానవజన్మ యొక్క వాంఛితలక్ష్యమును సాధింపలేరు. అయినను ఎవరేని ఒక భౌతికకోరికరను కలిగియున్నచో దాని కొరకై శ్రీకృష్ణభగవానుని ప్రార్థించుట ఉత్తమము (అది శుద్ధభక్తి కానేరదు). తద్ద్వారా అతడు వాంఛితఫలమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 362 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 24 🌴
24. ahaṁ hi sarva-yajñānāṁ bhoktā ca prabhur eva ca
na tu mām abhijānanti tattvenātaś cyavanti te
🌷 Translation :
I am the only enjoyer and master of all sacrifices. Therefore, those who do not recognize My true transcendental nature fall down.
🌹 Purport :
Here it is clearly stated that there are many types of yajña performances recommended in the Vedic literatures, but actually all of them are meant for satisfying the Supreme Lord. Yajña means Viṣṇu. In the Third Chapter of Bhagavad-gītā it is clearly stated that one should only work for satisfying Yajña, or Viṣṇu. The perfectional form of human civilization, known as varṇāśrama-dharma, is specifically meant for satisfying Viṣṇu.
Therefore, Kṛṣṇa says in this verse, “I am the enjoyer of all sacrifices because I am the supreme master.” Less intelligent persons, however, without knowing this fact, worship demigods for temporary benefit. Therefore they fall down to material existence and do not achieve the desired goal of life. If, however, anyone has any material desire to be fulfilled, he had better pray for it to the Supreme Lord (although that is not pure devotion), and he will thus achieve the desired result.
🌹 🌹 🌹 🌹 🌹
Comments