🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 29 🌴
29. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ: |
యే భజన్తి తు మాం భక్యా మయి తే తేషు చాప్యహమ్ ||
🌷. తాత్పర్యం :
నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతురు. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు సర్వుల యెడ సమముగా వర్తించువాడైనచో మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక స్నేహితులు కానిచో తన దివ్యసేవలో సదా నిమగ్నులై యుండెడి భక్తుల యెడ ఎందులకై ప్రత్యేకశ్రద్ధ వహించుననెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. కాని వాస్తవమునకు ఇది సహజమేగాని భేదభావము కాదు. ఉదాహరణకు జగమునందు ఎవరేని మనుజుడు గొప్పదాత యని పేరుగాంచినను, తన సంతానము యెడల అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. అదే విధముగా భగవానుడు వివిధరూపములలో నున్న సర్వజీవులను సంతానముగ భావించి వారి జీవితావాసరమునకు కావలసిన సర్వమును ఉదారముగా సమకూర్చును. భూమియని గాని, కొండయని గాని, జలమని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షమును కురిపించెడి మేఘము వంటివాడు ఆ దేవదేవుడు. కాని తన భక్తుల యెడ మాత్రము అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును.
అట్టి భక్తిపరాయణులైనవారే ఈ శ్లోకమునందు పేర్కొనబడినవారు. కృష్ణభక్తిభావనలో సదా నిలిచియుండుటచే ఆ భక్తులు నిత్యము కృష్ణుని యందే స్థితిని కలిగియుందురు. కనుకనే కృష్ణభక్తిభావనము నందున్న మహాత్ములు దివ్యాత్ములై ఆ శ్రీకృష్ణభగవానుని యందు నిలిచియున్నట్టివారని “కృష్ణభక్తిరసభావనము” అనెడి పదము సూచించుచున్నది. తత్కారణముగనే శ్రీకృష్ణుడు “మయితే” (వారు నాయందున్నారు) అని స్పష్టముగా పలికియున్నాడు. అనగా భగవానుడు వారియందున్నాడు. ఇట్టి పరస్పరానుభవమే “యే యథా మామ్ ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్” అనెడి భగవానుని వాక్యములను సైతము వివరించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 367 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 29 🌴
29. samo ’haṁ sarva-bhūteṣu na me dveṣyo ’sti na priyaḥ
ye bhajanti tu māṁ bhaktyā mayi te teṣu cāpy aham
🌷 Translation :
I envy no one, nor am I partial to anyone. I am equal to all. But whoever renders service unto Me in devotion is a friend, is in Me, and I am also a friend to him.
🌹 Purport :
One may question here that if Kṛṣṇa is equal to everyone and no one is His special friend, then why does He take a special interest in the devotees who are always engaged in His transcendental service? But this is not discrimination; it is natural. Any man in this material world may be very charitably disposed, yet he has a special interest in his own children. The Lord claims that every living entity – in whatever form – is His son, and so He provides everyone with a generous supply of the necessities of life. He is just like a cloud which pours rain all over, regardless of whether it falls on rock or land or water. But for His devotees, He gives specific attention. Such devotees are mentioned here: they are always in Kṛṣṇa consciousness, and therefore they are always transcendentally situated in Kṛṣṇa.
The very phrase “Kṛṣṇa consciousness” suggests that those who are in such consciousness are living transcendentalists, situated in Him. The Lord says here distinctly, mayi te: “They are in Me.” Naturally, as a result, the Lord is also in them. This is reciprocal. This also explains the words ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham: “Whoever surrenders unto Me, proportionately I take care of him.” This transcendental reciprocation exists because both the Lord and the devotee are conscious. When a diamond is set in a golden ring, it looks very nice. The gold is glorified, and at the same time the diamond is glorified. The Lord and the living entity eternally glitter, and when a living entity becomes inclined to the service of the Supreme Lord he looks like gold. The Lord is a diamond, and so this combination is very nice. Living entities in a pure state are called devotees. The Supreme Lord becomes the devotee of His devotees.
🌹 🌹 🌹 🌹 🌹
Comments