top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 368: 09వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 368: Chap. 09, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 30 🌴


30. ఆపి అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |

సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ||


🌷. తాత్పర్యం :


మిక్కిలి హేయమైన కార్యము నినరించినప్పటికిని మనుజుడు భక్తియుతసేవలో నియుక్తుడైయున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింప వలెను.


🌷. భాష్యము :


ఈ శ్లోకమునందలి భావగర్భితమైన “సుదురాచార” అను పదమును మనము సరిగా అర్థము చేసికొనవలెను. జీవుడు బద్ధస్థితిలో నున్నప్పుడు బద్ధకర్మలు మరియు సహజస్థితికి అనుగుణమైన కర్మలనెడి రెండు విధములైన కర్మలను కలిగియుండును. దేహమును రక్షించుకొనుటకు లేదా సంఘము మరియు దేశమునకు సంబంధించిన నియమనిబంధనలను పాటించుటకు బద్ధజీవనస్థితి యందు నిక్కముగా వివిధ కర్మములు కలవు. అవియే బద్ధజీవన కర్మలనబడును. అవి భక్తులకు సైతము తప్పవు. కాని తన ఆధ్యాత్మికస్వభావమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన (భక్తియోగము) యందు నియుక్తుడైన జీవుడు ఆ బద్ధకర్మలతో పాటు ఆధ్యాత్మికములనబడు కర్మలను సైతము కలిగియుండును. అట్టి కర్మలు అతని సహజస్థితి యందు ఒనరింపబడుచు భక్తియోగకర్మలుగా పిలువబడును. కనుక బద్ధస్థితిలో నున్నప్పుడు భక్తికర్మలు మరియు దేహపరమైన బద్ధకర్మలు రెండును సమానాంతరములుగా సాగుచున్నను, కొన్నిమార్లు అవి ఒకదానికొకటి విరుద్ధములుగా తయారగును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంతవరకు అత్యంత జాగరూకుడై తన భక్తికి మరియు సహజస్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండును.


కృష్ణభక్తిభావనా అనుభవపు పురోగతి పైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడియుండునని అతడు ఎరిగియుండును. అయినను కొన్నిమార్లు అట్టివాడు సంఘదృష్ట్యా లేదా చట్టము దృష్ట్యా అత్యంత హేయముగా భావింపబడు కార్యమును ఒనరించినట్లుగా కనిపించవచ్చును. కాని అట్టి తాత్కాలికమగుపతనము అతనిని ఏ విధముగను అనర్హుని చేయజాలదు. అత్యంత శ్రద్ధతో భక్తియుక్తసేవ యందు నిలిచియున్నవాడు ఒకవేళ పతనము నొందినను హృదయస్థుడైన పరమాత్ముడు అతనిని పవిత్రుని చేసి ఆ పాపమును క్షమించునని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అనగా భౌతికసంపర్కము అత్యంత బలమైనదగుటచే భగవత్సేవ యందు పూర్ణముగా నియుక్తుడైన యోగి సైతము కొన్నిమార్లు మాయకు గురియగును. కాని కృష్ణభక్తి యనునది మరింత బలమైనదగుటచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుక భక్తియోగము సదా జయమునే కలిగించును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 368 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 30 🌴


30. api cet su-durācāro bhajate mām ananya-bhāk

sādhur eva sa mantavyaḥ samyag vyavasito hi saḥ


🌷 Translation :


Even if one commits the most abominable action, if he is engaged in devotional service he is to be considered saintly because he is properly situated in his determination.


🌹 Purport :


The word su-durācāraḥ used in this verse is very significant, and we should understand it properly. When a living entity is conditioned, he has two kinds of activities: one is conditional, and the other is constitutional. As for protecting the body or abiding by the rules of society and state, certainly there are different activities, even for the devotees, in connection with the conditional life, and such activities are called conditional. Besides these, the living entity who is fully conscious of his spiritual nature and is engaged in Kṛṣṇa consciousness, or the devotional service of the Lord, has activities which are called transcendental. Such activities are performed in his constitutional position, and they are technically called devotional service.


Now, in the conditioned state, sometimes devotional service and the conditional service in relation to the body will parallel one another. But then again, sometimes these activities become opposed to one another. As far as possible, a devotee is very cautious so that he does not do anything that could disrupt his wholesome condition. He knows that perfection in his activities depends on his progressive realization of Kṛṣṇa consciousness. Sometimes, however, it may be seen that a person in Kṛṣṇa consciousness commits some act which may be taken as most abominable socially or politically. But such a temporary falldown does not disqualify him.


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Comments


bottom of page