🌹. శ్రీమద్భగవద్గీత - 371 / Bhagavad-Gita - 371 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 33 🌴
33. కిం పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామ్ ||
🌷. తాత్పర్యం :
ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్తసేవలో నియుక్తుడవగుము.
🌷. భాష్యము :
భౌతికజగమున జనులలో పలువర్గములున్నను వాస్తవమునకు వారెవ్వరికినీ ఈ జగము సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే “అనిత్యమ్ అసుఖం లోకమ్” అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ఈ భౌతికజగత్తు అశాశ్వతము, దుఃఖపూర్ణమునై సజ్జనుడైనవాడు నివసించుటకు యోగ్యము కాకున్నది. ఈ జగము శ్రీకృష్ణభగవానునిచే అశాశ్వతమైనదిగను మరియు దుఃఖపూర్ణముగను ప్రకటింపబడగా, కొందరు తత్త్వవేత్తలు (ముఖ్యముగా మయావాదులు) దీనిని మిథ్యగా వర్ణింతురు. కాని గీత ప్రకారము జగత్తు ఆశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యత్వము మరియు అనిత్యత్వముల నడుమ భేదము కలదు. భౌతికజగము అశాశ్వతము. కాని దీనికి పరమైన వేరొకజగము నిత్యమైనది. అలాగుననే ఈ జగము దుఃఖపూర్ణము. కాని దీనికి పరమైన జగము నిత్యమైనది మరియు ఆనందపూర్ణమైనది.
అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించినట్టివాడు. అతనికి సైతము “నా భక్తియోగమును చేపట్టి శీఘ్రమే నా ధామమును చేరుము” అని శ్రీకృష్ణుడు ఉపదేశమొసగియుండెను. అనగా దుఃఖపూర్ణము మరియు ఆశాశ్వతమైన ఈ లోకముననే ఎవ్వరును నిలిచిపోరాదు. ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని ఆశ్రయించి నిత్యానందమును పొందవలెను. అన్ని తరగతుల జనుల సమస్యలు పరిష్కరింపబడుటకు ఆ దేవదేవుని భక్తియోగమే ఏకైక విధానము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనము అలవరచుకొని తమ జీవితమును పూర్ణము కావించుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 371 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 33 🌴
33. kiṁ punar brāhmaṇāḥ puṇyā bhaktā rājarṣayas tathā
anityam asukhaṁ lokam imaṁ prāpya bhajasva mām
🌷 Translation :
How much more this is so of the righteous brāhmaṇas, the devotees and the saintly kings. Therefore, having come to this temporary, miserable world, engage in loving service unto Me.
🌹 Purport :
In this material world there are classifications of people, but, after all, this world is not a happy place for anyone. It is clearly stated here, anityam asukhaṁ lokam: this world is temporary and full of miseries, not habitable for any sane gentleman. This world is declared by the Supreme Personality of Godhead to be temporary and full of miseries. Some philosophers, especially Māyāvādī philosophers, say that this world is false, but we can understand from Bhagavad-gītā that the world is not false; it is temporary. There is a difference between temporary and false. This world is temporary, but there is another world, which is eternal. This world is miserable, but the other world is eternal and blissful.
Arjuna was born in a saintly royal family. To him also the Lord says, “Take to My devotional service and come quickly back to Godhead, back home.” No one should remain in this temporary world, full as it is with miseries. Everyone should attach himself to the bosom of the Supreme Personality of Godhead so that he can be eternally happy. The devotional service of the Supreme Lord is the only process by which all problems of all classes of men can be solved. Everyone should therefore take to Kṛṣṇa consciousness and make his life perfect.
🌹 🌹 🌹 🌹 🌹
Kommentare