top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 376: 10వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 376: Chap. 10, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 376 / Bhagavad-Gita - 376 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 04 🌴


04. బుద్ధిర్ జ్ఞానమసమ్మోహ: క్షమా సత్యం దమ: శమ: |

సుఖం దుఃఖం భవో(భావో భయం చాభయమేవ చ ||


🌷. తాత్పర్యం :


బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము,


🌷. భాష్యము :


జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి. విషయములను సరియైన దృక్పథముతో విశ్లేషించు శక్తియే బుద్ధి యనబడును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనెడి అవగాహనయే జ్ఞానము. విశ్వవిద్యాలయ చదువుతో లభ్యమైన జ్ఞానము భౌతికమునకు సంబంధించిన జ్ఞానమైనందున, వాస్తవజ్ఞానముగా ఆంగీకరింపబడదు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదము నెరుగగలుగుటయే వాస్తవజ్ఞానము. కాని నేటి ఆధునిక విద్యావిధానమున ఆధ్యాత్మికత్వమును గూర్చిన ఎట్టి జ్ఞానము లేదు. జనుల కేవలము భౌతికమూలకములు మరియు దేహావసరముల యెడ మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విద్యాలయజ్ఞానము అసంపూర్ణమై యున్నది. మనుజుడు శంకను వదిలి దివ్యతత్త్వము నవగాహన చేసికొనినప్పుడు సంశయము మరియు భ్రాంతిరాహిత్యమనెడి (అసమ్మోహము) స్థితిని సాధించగలడు. అట్టివాడు నెమ్మదిగా అయినప్పటికిని నిక్కముగా భ్రాంతి నుండి ముక్తుడు కాగలడు. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా ఆంగీకరింపక శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింప వలసియున్నది.


ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు. ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను. దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 376 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 10 - Vibhuti Yoga - 04 🌴


04. buddhir jñānam asammohaḥ kṣamā satyaṁ damaḥ śamaḥ

sukhaṁ duḥkhaṁ bhavo ’bhāvo bhayaṁ cābhayam eva ca


🌷 Translation :


Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness,


🌹 Purport :


The different qualities of living entities, be they good or bad, are all created by Kṛṣṇa, and they are described here. Intelligence refers to the power to analyze things in their proper perspective, and knowledge refers to understanding what is spirit and what is matter. Ordinary knowledge obtained by a university education pertains only to matter, and it is not accepted here as knowledge. Knowledge means knowing the distinction between spirit and matter. In modern education there is no knowledge about spirit; they are simply taking care of the material elements and bodily needs. Therefore academic knowledge is not complete.


Asammoha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. Slowly but surely he becomes free from bewilderment. Nothing should be accepted blindly; everything should be accepted with care and with caution. Kṣamā, tolerance and forgiveness, should be practiced; one should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are, for the benefit of others. Facts should not be misrepresented.


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comentarios


bottom of page