🌹. శ్రీమద్భగవద్గీత - 377 / Bhagavad-Gita - 377 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 05 🌴
05. అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశః |
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా: ||
🌷. తాత్పర్యం :
అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.
🌷. భాష్యము :
జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి. ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు.
ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను. దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 377 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 05 🌴
05. ahiṁsā samatā tuṣṭis tapo dānaṁ yaśo ’yaśaḥ
bhavanti bhāvā bhūtānāṁ matta eva pṛthag-vidhāḥ
🌷 Translation :
Nonviolence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy – all these various qualities of living beings are created by Me alone.
🌹 Purport :
The different qualities of living entities, be they good or bad, are all created by Kṛṣṇa, and they are described here. Asammoha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. Slowly but surely he becomes free from bewilderment. Nothing should be accepted blindly; everything should be accepted with care and with caution. Kṣamā, tolerance and forgiveness, should be practiced; one should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are, for the benefit of others. Facts should not be misrepresented.
🌹 🌹 🌹 🌹 🌹
Comments