🌹. శ్రీమద్భగవద్గీత - 379 / Bhagavad-Gita - 379 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 07 🌴
07. ఏతాం విభూతిం యోగం చ మామ యో వేత్తి తత్త్వత: |
సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ: ||
🌷. తాత్పర్యం :
నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మికపూర్ణత్వము యొక్క అత్యున్నతదశ వంటిది. ఆ భగవానుని వివిధములైన దివ్యవిభూతుల యెడ స్థిరనిశ్చయము కలుగనిదే ఎవ్వరును సంపూర్ణముగా భక్తియోగమున నెలకొనలేరు. సాధారణముగా జనులు భగవానుడు గొప్పవాడని తెలిసియుందురుగాని అతడెంతటి గొప్పవాడనెడి విషయమును పూర్తిగా ఎరిగియుండరు. ఇచ్చట ఆ విషయములన్నియును సమగ్రముగా తెలుపబడినవి. శ్రీకృష్ణభగవానుడు ఎంతటి ఘనుడనెడి విషయము సమగ్రముగా తెలిసినపుడు సహజముగా మనుజుడు అతనికి శరణమునొంది భక్తియుతసేవలో నిమగ్నుడగును. భగవానుని దివ్యవిభూతులు యథార్థముగా అవగతమైనప్పుడు అతని శరణుజొచ్చుట కన్నను మనుజునకు వేరొక్క మార్గముండదు. ఇటువంటి వాస్తవమైన జ్ఞానమును భగవద్గీత, భాగవతము మరియు అటువంటి ఇతర వాజ్మయము ద్వారా తెలిసికొనవచ్చును.
ఈ విశ్వపాలనము కొరకు విశ్వమనదంతటను పలుదేవతలు కలరు. వారిలో బ్రహ్మ, శివుడు, సనకసనందనాదులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైనవారు. విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వపితృదేవతలకు ఆది పితృదేవుడై యున్నాడు. ఇవన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతుల యెడ విశ్వాసము కలిగినవాడు శ్రీకృష్ణుని శ్రద్ధతో శంకారహితముగా గ్రహించి, అతని భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. భగవత్సేవలో ఆసక్తిని మరియు శ్రద్ధను వృద్ధిపరచుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము అత్యంత అవసరమై యున్నది. శ్రీకృష్ణభగవానుని దివ్యఘనతను సంపూర్ణముగా నెరుగుటచే మనుజుడు శ్రద్ధాపూరితమైన భక్తియోగమున స్థిరుడు కాగాలనందున ఆ దేవదేవుడు ఎంతటి ఘనుడో తెలిసికొనుట యందు ఎవ్వరును ఉపేక్ష వహింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 379 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 07 🌴
07. etāṁ vibhūtiṁ yogaṁ ca mama yo vetti tattvataḥ
so ’vikalpena yogena yujyate nātra saṁśayaḥ
🌷 Translation :
One who is factually convinced of this opulence and mystic power of Mine engages in unalloyed devotional service; of this there is no doubt.
🌹 Purport :
The highest summit of spiritual perfection is knowledge of the Supreme Personality of Godhead. Unless one is firmly convinced of the different opulences of the Supreme Lord, he cannot engage in devotional service. Generally people know that God is great, but they do not know in detail how God is great. Here are the details. If one knows factually how God is great, then naturally he becomes a surrendered soul and engages himself in the devotional service of the Lord. When one factually knows the opulences of the Supreme, there is no alternative but to surrender to Him. This factual knowledge can be known from the descriptions in Śrīmad-Bhāgavatam and Bhagavad-gītā and similar literatures.
In the administration of this universe there are many demigods distributed throughout the planetary system, and the chief of them are Brahmā, Lord Śiva and the four great Kumāras and the other patriarchs. There are many forefathers of the population of the universe, and all of them are born of the Supreme Lord, Kṛṣṇa. The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original forefather of all forefathers. These are some of the opulences of the Supreme Lord. When one is firmly convinced of them, he accepts Kṛṣṇa with great faith and without any doubt, and he engages in devotional service. All this particular knowledge is required in order to increase one’s interest in the loving devotional service of the Lord. One should not neglect to understand fully how great Kṛṣṇa is, for by knowing the greatness of Kṛṣṇa one will be able to be fixed in sincere devotional service.
🌹 🌹 🌹 🌹 🌹
Comments