top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 386: 10వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 386: Chap. 10, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 14 🌴


14. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |

న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా: ||


🌷. తాత్పర్యం :


ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.


🌷. భాష్యము :


శ్రద్ధలేని వారు, దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణభగవానుని ఎరుగజాలరని అర్జునుడు ఇచ్చట ధ్రువపరచుచున్నాడు. అతడు దేవతలకే తెలియబడుట లేదన్నచో ఆధునిక జగత్తుకు చెందిన నామమాత్ర పండితులను గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కాని అర్జునుడు ఇచ్చట కృష్ణని కరుణ వలన అతనిని పరతత్త్వముగను, పరిపూర్ణునిగను తెలిసికొనగలిగెను. భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతియొక్కరు అనుసరింపవలెను. చతుర్ధాధ్యాయమున తెలుపబడినట్లు గీతాధ్యాయనము కొరకు వలసిన పరంపర నశించియుండుటచే ఆ పరంపరను శ్రీకృష్ణభగవానుడు తిరిగి అర్జునునితో ప్రారంభించెను.


అర్జునుని సన్నిహిత స్నేహితుడనియు మరియు భక్తుడనియు ఆ దేవదేవుడు భావించుటయే అందులకు కారణము. కనుక ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమున తెలుపబడినట్లు భగవద్గీతను పరంపరారూపముననే అవగతము చేసికొనవలెను. అట్టి పరంపర నశించియుండుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు పలికిన సర్వమును అర్జునుడు అంగీకరించిన విధమును తప్పక అనుసరింపవలెను. అప్పుడే భగవద్గీత సారము మనకు అవగతము కాగలదు. ఆ పిదపనే శ్రీకృష్ణుడు దేవదేవుడని మనము సంపూర్ణముగా అవగాహనము చేసికొనగలము.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 386 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 10 - Vibhuti Yoga - 14 🌴


14. sarvam etad ṛtaṁ manye yan māṁ vadasi keśava

na hi te bhagavan vyaktiṁ vidur devā na dānavāḥ


🌷 Translation :


O Kṛṣṇa, I totally accept as truth all that You have told me. Neither the demigods nor the demons, O Lord, can understand Your personality.


🌹 Purport :


Arjuna herein confirms that persons of faithless and demonic nature cannot understand Kṛṣṇa. He is not known even by the demigods, so what to speak of the so-called scholars of this modern world? By the grace of the Supreme Lord, Arjuna has understood that the Supreme Truth is Kṛṣṇa and that He is the perfect one. One should therefore follow the path of Arjuna. He received the authority of Bhagavad-gītā.


As described in the Fourth Chapter, the paramparā system of disciplic succession for the understanding of Bhagavad-gītā was lost, and therefore Kṛṣṇa reestablished that disciplic succession with Arjuna because He considered Arjuna His intimate friend and a great devotee. Therefore, as stated in our Introduction to Gītopaniṣad, Bhagavad-gītā should be understood in the paramparā system. When the paramparā system was lost, Arjuna was selected to rejuvenate it. The acceptance by Arjuna of all that Kṛṣṇa says should be emulated; then we can understand the essence of Bhagavad-gītā, and then only can we understand that Kṛṣṇa is the Supreme Personality of Godhead.


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


bottom of page