🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 18 🌴
18. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన |
భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్
🌷. తాత్పర్యం : ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు. 🌷. భాష్యము : శౌనకుని అధ్యక్షతన గల నైమిశారణ్య ఋషులు సైతము సూతగోస్వామితో ఈ విధముగనే పలికియుండిరి. వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే | యచ్చృణ్వాతామ్ రసజ్ఞానామ్ స్వాదు స్వాదు పదేపదే “ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిరంతరము శ్రవణము చేసినను ఎవ్వరును తనివినొందలేరు.
శ్రీకృష్ణునితో దివ్యసంబంధమును కలిగినవారు అతని లీలావర్ణనములను అడుగడున అస్వాదింతురు” (శ్రీమద్భాగవతము 1.1.19). అనగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చియు, ముఖ్యముగా అతడు ఏ విధముగా సర్వవ్యాపియై యున్నాడన్న విషయమును గూర్చియు శ్రవణము చేయుటలో అనురక్తుడై యున్నాడు. కృష్ణునకు సంబంధించిన ఏ వర్ణనమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అటువంటి అమృతమును ఎవ్వరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును. ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్యకథలు శ్రీకృష్ణుని దివ్యలీలకు భిన్నములై యుండును. మనుజుడు వారి యెడ కొంతకాలమునకు విసుగు చెందవచ్చునేమో గాని కృష్ణుని గూర్చి వినుట యందు విసుగు చెందడు. కనుకనే విశ్వచరిత్ర దేవదేవుని వివిధావతారములతో నిండియున్నది. భగవానుని అట్టి వివిధ అవతారముల యందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. ఈ కారణముననే ఎన్నిమార్లు పఠించినను వాని యందలి పఠనాంశములు నిత్యనూతనముగా నుండును. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 390 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj 🌴 Chapter 10 - Vibhuti Yoga - 18 🌴 18. vistareṇātmano yogaṁ vibhūtiṁ ca janārdana bhūyaḥ kathaya tṛptir hi śṛṇvato nāsti me ’mṛtam
🌷 Translation :
O Janārdana, again please describe in detail the mystic power of Your opulences. I am never satiated in hearing about You, for the more I hear the more I want to taste the nectar of Your words.
🌹 Purport :
A similar statement was made to Sūta Gosvāmī by the ṛṣis of Naimiṣāraṇya, headed by Śaunaka. That statement is:
vayaṁ tu na vitṛpyāma uttama-śloka-vikrame
yac chṛṇvatāṁ rasa-jñānāṁ svādu svādu pade pade
“One can never be satiated even though one continuously hears the transcendental pastimes of Kṛṣṇa, who is glorified by excellent prayers. Those who have entered into a transcendental relationship with Kṛṣṇa relish at every step the descriptions of the pastimes of the Lord.” (Śrīmad-Bhāgavatam 1.1.19) Thus Arjuna is interested in hearing about Kṛṣṇa, and specifically how He remains as the all-pervading Supreme Lord. Now as far as amṛtam, nectar, is concerned, any narration or statement concerning Kṛṣṇa is just like nectar.
And this nectar can be perceived by practical experience. Modern stories, fiction and histories are different from the transcendental pastimes of the Lord in that one will tire of hearing mundane stories but one never tires of hearing about Kṛṣṇa. It is for this reason only that the history of the whole universe is replete with references to the pastimes of the incarnations of Godhead. The Purāṇas are histories of bygone ages that relate the pastimes of the various incarnations of the Lord. In this way the reading matter remains forever fresh, despite repeated readings.
🌹 🌹 🌹 🌹 🌹
Comments