🌹. శ్రీమద్భగవద్గీత - 391 / Bhagavad-Gita - 391 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 19 🌴
ల యందు దివ్యానందమును పొందుదురు.
శ్రీకృష్ణుని దివ్యవిభూతులను మరియు వివిధశక్తులను చర్చించుట యందు అట్టి శుద్ధభక్తులు ఆధ్యాత్మికానందమును అనుభవింతురు. కనుకనే వాటి శ్రవణమును మరియు చర్చను వారు చేయగోరుదురు. తన విభూతుల పరిధిని జీవులు అవగతము చేసికొనలేరని శ్రీకృష్ణుడు తెలిసియున్నందునే వివిధశక్తుల
19. శ్రీ భగవానువాచ
హస్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయ: |
ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను : సరియే! నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసెదను. కాని ఓ అర్జునా! నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానినే నేను నీకు తెలుపుదును.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుని ఘనతను మరియు అతని విభూతుల ఘనతను సంపూర్ణముగా గ్రహించుట సాధ్యముగాని విషయము. జీవుని ఇంద్రియములు పరిమితములుగా నుండి శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా నెరుగుటకు అతనిని అనుమతింపవు. అయినను భక్తులైనవారు శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు సదా యత్నింతురు. కాని ఏదేని ఒక ప్రత్యేక సమయమున లేదా ప్రత్యేక జీవనస్థితిలో అతనిని పూర్తిగా అవగతము చేసికొనియే తీరుదుమనెడి భావనలో కాదు. పైగా కృష్ణపరములగు విషయములు అత్యంత మధురములై వారికి అమృతప్రాయములుగా తోచును కనుకనే వారు కృష్ణకథలో ప్రధానమైన వానిని మాత్రమే తెలుపుటకు అతడు ఆంగీకరించినాడు. ఇచ్చట “ప్రాధాన్యత:” అను పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణభగవానుని విభూతులు అనంతములైనందున వానిలో ప్రధానములైన కొన్నింటినే మనము తెలిసికొనగలము. వానినన్నింటిని అవగతము చేసికొనుట సాధ్యముగాని విషయము. భగవానుడు ఏ విభూతుల ద్వారా సమస్త జగత్తును నియమించునో వాటినే ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన “విభూతి” యను పదము సూచించుచున్నది. విభూతి యనునది అసాధారణ వైభవమును సూచించునని అమరకోశనిఘంటువు నందు తెలుపబడినది.శ్రీకృష్ణభగవానుని అసాధారణ విభూతులనుగాని, అతని దివ్యశక్తులనుగాని నిరాకారవాది లేక బహుదేవతార్చనాపరుడు ఎరుగలేడు. భౌతిక, ఆధ్యాత్మికజగత్తు లందంతటను అతని దివ్యశక్తులు సర్వరూపములలో విస్తరించియున్నవి. కాని సామాన్యుడు ప్రత్యక్షముగా గాంచగలిగిన దానినే శ్రీకృష్ణుడు ఇచ్చట వివరింపనున్నాడు. అనగా వైవిధ్యముతో కూడిన అతని శక్తిలో కొంతభాగమే ఇచ్చట వర్ణింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 391 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 19 🌴
19. śrī-bhagavān uvāca
hanta te kathayiṣyāmi divyā hy ātma-vibhūtayaḥ
prādhānyataḥ kuru-śreṣṭha nāsty anto vistarasya me
🌷 Translation :
The Supreme Personality of Godhead said: Yes, I will tell you of My splendorous manifestations, but only of those which are prominent, O Arjuna, for My opulence is limitless.
🌹 Purport :
It is not possible to comprehend the greatness of Kṛṣṇa and His opulences. The senses of the individual soul are limited and do not permit him to understand the totality of Kṛṣṇa’s affairs. Still the devotees try to understand Kṛṣṇa, but not on the principle that they will be able to understand Kṛṣṇa fully at any specific time or in any state of life. Rather, the very topics of Kṛṣṇa are so relishable that they appear to the devotees as nectar. Thus the devotees enjoy them. In discussing Kṛṣṇa’s opulences and His diverse energies, the pure devotees take transcendental pleasure.
Therefore they want to hear and discuss them. Kṛṣṇa knows that living entities do not understand the extent of His opulences; He therefore agrees to state only the principal manifestations of His different energies. The word prādhānyataḥ (“principal”) is very important because we can understand only a few of the principal details of the Supreme Lord, for His features are unlimited. It is not possible to understand them all. And vibhūti, as used in this verse, refers to the opulences by which He controls the whole manifestation. In the Amara-kośa dictionary it is stated that vibhūti indicates an exceptional opulence. The impersonalist or pantheist cannot understand the exceptional opulences of the Supreme Lord nor the manifestations of His divine energies. Both in the material world and in the spiritual world His energies are distributed in every variety of manifestation.
🌹 🌹 🌹 🌹 🌹
댓글