top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 392: 10వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 392: Chap. 10, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 392 / Bhagavad-Gita - 392 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 20 🌴


20. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత: |

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ||


🌷. తాత్పర్యం :


ఓ అర్జునా! నేను సర్వజీవ హృదయములందు వసించి యున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదిమధ్యాంతములు నేనే అయి యున్నాను.


🌷. భాష్యము :


ఈ శ్లోకమున అర్జునుడు గూడాకేశునిగా సంబోధింప బడినాడు. అనగా నిద్ర యనెడి అంధకారమును జయించినవాడని భావము. అజ్ఞానాంధకారమున నిద్రించువారికి ఏ విధముగా భగవానుడు భౌతిక, ఆధ్యాత్మికజగత్తులందు వివిధరీతుల ప్రకటితిమగునో అవగతము చేసికొనుట సాధ్యము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఆ విధముగా సంబోధించుట ప్రాముఖ్యమును సంతరించుకొన్నది. అర్జునుడు అంధకారమును ఆవలయుండుట వలననే శ్రీకృష్ణభగవానుడు అతనికి వివిధభూతులను వివరించుటకు అంగీకరించెను. తాను తన ప్రధానవిస్తారము ద్వారా సమస్త విశ్వమునకు ఆత్మనై యున్నానని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలుపుచున్నాడు.


సృష్టికి పూర్వము శ్రీకృష్ణభగవానుడు తన ప్రధానాంశము ద్వారా పురుషావతారములను దాల్చగా అతనిని నుండియే సర్వము ఆరంభమయ్యెను. కనుక అతడే ఆత్మయై (విశ్వపు మూలతత్త్వమైన మహతత్త్వమునకు ఆత్మ) యున్నాడు. అనగా భౌతికశక్తి యనునది సృష్టికి కారణము కాదు. వాస్తవమునకు మహావిష్ణువు మహాతత్త్వమనెడి సంపూర్ణ భౌతికశక్తి యందు ప్రవేశించును. అతడే దానికి ఆత్మయై యున్నాడు. సృష్టింపబడిన విశ్వములలో ప్రవేశించు మహావిష్ణువు తిరిగి పరమాత్మగా ప్రతిజీవి యందును ప్రకటమగును. ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచియుండుననియు, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధినొందదనియు మనము అనుభవపుర్వకముగా నెరిగియున్నాము. అదే విధముగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ప్రవేశించినంతనే భౌతికసృష్టియు వృద్ధినొందదు. కనుకనే “సర్వవిశ్వములందు భగవానుడు పరమాత్మ రూపున వసించియున్నాడు” అని సుబలోపనిషత్తు నందు తెలుపబడినది (ప్రకృత్యాదిసర్వభుతాంతర్యామీ సర్వశేషీ చ నారాయణ: ).


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 392 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 10 - Vibhuti Yoga - 20 🌴


20. aham ātmā guḍākeśa sarva-bhūtāśaya-sthitaḥ

aham ādiś ca madhyaṁ ca bhūtānām anta eva ca


🌷 Translation :


I am the Supersoul, O Arjuna, seated in the hearts of all living entities. I am the beginning, the middle and the end of all beings.


🌹 Purport :


In this verse Arjuna is addressed as Guḍākeśa, which means “one who has conquered the darkness of sleep.” For those who are sleeping in the darkness of ignorance, it is not possible to understand how the Supreme Personality of Godhead manifests Himself in various ways in the material and spiritual worlds. Thus this address by Kṛṣṇa to Arjuna is significant. Because Arjuna is above such darkness, the Personality of Godhead agrees to describe His various opulences. Kṛṣṇa first informs Arjuna that He is the soul of the entire cosmic manifestation by dint of His primary expansion. Before the material creation, the Supreme Lord, by His plenary expansion, accepts the puruṣa incarnation, and from Him everything begins.


Therefore He is ātmā, the soul of the mahat-tattva, the universal elements. The total material energy is not the cause of the creation; actually the Mahā-viṣṇu enters into the mahat-tattva, the total material energy. He is the soul. When Mahā-viṣṇu enters into the manifested universes, He again manifests Himself as the Supersoul in each and every entity. We have experience that the personal body of the living entity exists due to the presence of the spiritual spark. Without the existence of the spiritual spark, the body cannot develop. Similarly, the material manifestation cannot develop unless the Supreme Soul, Kṛṣṇa, enters. As stated in the Subāla Upaniṣad, prakṛty-ādi-sarva-bhūtāntar-yāmī sarva-śeṣī ca nārāyaṇaḥ: “The Supreme Personality of Godhead is existing as the Supersoul in all manifested universes.”


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

תגובות


bottom of page