top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 398: 10వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 398: Chap. 10, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 398 / Bhagavad-Gita - 398 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 26 🌴


26. అశ్వత్థ: సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద: |

గంధర్వాణాం చిత్రరథ: సిద్దానాం కపిలో ముని: ||


🌷. తాత్పర్యం :


నేను వృక్షములలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.


🌷. భాష్యము :


అత్యంత ఉన్నతమును మరియు సుందరమును అగు వృక్షములలో రావిచెట్టు ఒకటి. భారతదేశజనులు తమ ప్రాత:కాల కర్మలలో ఒకటిగా దానిని అర్చింతురు. విశ్వములలో గొప్ప భక్తునిగా పరిగణింపబడెడి నారదుడు దేవతలలో సైతము పూజలనందును. కనుకనే భక్తుని రూపున అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. గంధర్వలోకము మనోహరముగా గానము చేయువారితో నిండియుండును. వారి ఉత్తమగాయకుడు చిత్రరథుడు.


సిద్దులలో దేవహుతి తనయుడైన కపిలుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. శ్రీకృష్ణుని అవతారమైన అతడు తెలిపిన తత్త్వము శ్రీమద్భాగవతమున వివరింపబడినది. తదనంతర కాలమున వేరొక కపిలుడు ప్రసిద్ధి పొందినను అతని తత్త్వము నాస్తికమైనట్టిది. కావుననే వారి నడుమ గొప్ప అంతరము కలదు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 398 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 10 - Vibhuti Yoga - 26 🌴


26. aśvatthaḥ sarva-vṛkṣāṇāṁ devarṣīṇāṁ ca nāradaḥ

gandharvāṇāṁ citrarathaḥ siddhānāṁ kapilo muniḥ


🌷 Translation :


Of all trees I am the banyan tree, and of the sages among the demigods I am Nārada. Of the Gandharvas I am Citraratha, and among perfected beings I am the sage Kapila.


🌹 Purport :


The banyan tree (aśvattha) is one of the highest and most beautiful trees, and people in India often worship it as one of their daily morning rituals. Amongst the demigods they also worship Nārada, who is considered the greatest devotee in the universe.


Thus he is the representation of Kṛṣṇa as a devotee. The Gandharva planet is filled with entities who sing beautifully, and among them the best singer is Citraratha. Amongst the perfect living entities, Kapila, the son of Devahūti, is a representative of Kṛṣṇa. He is considered an incarnation of Kṛṣṇa, and His philosophy is mentioned in the Śrīmad-Bhāgavatam. Later on another Kapila became famous, but his philosophy was atheistic. Thus there is a gulf of difference between them.


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Comments


bottom of page