top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 404: 10వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 404: Chap. 10, Ver. 32


🌹. శ్రీమద్భగవద్గీత - 404 / Bhagavad-Gita - 404 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 32 🌴


32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున |

ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాద: ప్రవదతామహమ్ ||


🌷. తాత్పర్యం : ఓ అర్జునా! సమస్తసృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయియున్నాను.


🌻. భాష్యము : భౌతికతత్త్వముల సృష్టి యనునది సృష్టులలో ఆదియైనది. పూర్వము వివరింపబడినట్లు విశ్వము మహావిష్ణువుచే (గర్భోదకశాయివిష్ణువు మరియు క్షీరోదకశాయివిష్ణువు) సృష్టినొంది, పోషింపబడి, పిదప శివునిచే లయమొందింపబడును. బ్రహ్మదేవుడు వాస్తవమునకు గౌణసృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి, స్థితి, లయకారకులందరును కృష్ణుని భౌతిక గుణావతారములు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వసృష్టులకు ఆది, మధ్యము, అంతమునై యున్నాడు. ఉన్నతవిజ్ఞానము కొరకు నాలుగువేదములు, షడంగములు, వేదాంత సూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు ఆది పలుగ్రంథములు గలవు.


మొత్తము మీద ఉన్నతవిజ్ఞానము కొరకు పదునాలుగు విభాగముల గ్రంథములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను ఒసగునట్టి గ్రంథము (ముఖ్యముగా వేదాంతసూత్రము) శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. తార్కికుల నడుమ వివిధములైన వాదములు జరుగుచుండును. నిదర్శనముతో తన వాడమునే బలపరచువాదము జల్పమనవడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేయబడు వాదము వితండము. కాని వాస్తవతత్త్వ నిర్ణయమే నిజమైన వాదము. అట్టి కడపటి సత్యము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 404 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 10 - Vibhuti Yoga - 32 🌴


32. sargāṇām ādir antaś ca madhyaṁ caivāham arjuna

adhyātma-vidyā vidyānāṁ vādaḥ pravadatām aham


🌷 Translation : Of all creations I am the beginning and the end and also the middle, O Arjuna. Of all sciences I am the spiritual science of the self, and among logicians I am the conclusive truth.


🌹 Purport : Among the created manifestations, the first is the creation of the total material elements. As explained before, the cosmic manifestation is created and conducted by Mahā-viṣṇu, Garbhodaka-śāyī Viṣṇu and Kṣīrodaka-śāyī Viṣṇu, and then again it is annihilated by Lord Śiva. Brahmā is a secondary creator. All these agents of creation, maintenance and annihilation are incarnations of the material qualities of the Supreme Lord. Therefore He is the beginning, the middle and the end of all creation.


For advanced education there are various kinds of books of knowledge, such as the four Vedas, their six supplements, the Vedānta-sūtra, books of logic, books of religiosity and the Purāṇas. So all together there are fourteen divisions of books of education. Of these, the book which presents adhyātma-vidyā, spiritual knowledge – in particular, the Vedānta-sūtra – represents Kṛṣṇa. Among logicians there are different kinds of argument. Supporting one’s argument with evidence that also supports the opposing side is called jalpa. Merely trying to defeat one’s opponent is called vitaṇḍā. But the actual conclusion is called vāda. This conclusive truth is a representation of Kṛṣṇa.


🌹 🌹 🌹 🌹 🌹





1 view0 comments

Comments


bottom of page