🌹. శ్రీమద్భగవద్గీత - 405 / Bhagavad-Gita - 405 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 33 🌴
33. అక్షరాణా మకారోస్మి ద్వన్ద్వ: సామాసికస్య చ |
అహమేవాక్షయ: కాలో ధాతాహం విశ్వతోముఖ: ||
🌷. తాత్పర్యం : నేను అక్షరములలో ఆకారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి యున్నాను.
🌻. భాష్యము : సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన ‘అ’ కారము వేదవాజ్మయమునకు ఆదియై యున్నది. ‘అ’ కారము లేకుండా ఏదియును ధ్వనింపదు గనుక, అది ధ్వనికి ఆదియై యున్నది. సంస్కృతమున అనేక సమాసపదములు గలవు. అందు “రామకృష్ణులు” వంటి ద్వంద్వపదము ద్వంద్వసమాసమనబడును. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును ఒకే రూపమును కలిగియున్నందున అది ద్వంద్వసమాసముగా పిలువబడినది.
కాలము సమస్తమును నశింపజేయును కావున సంహరించువారిలో అది చరమమైనది. రాబోవు కాలములో సృష్ట్యాంతమున గొప్ప అగ్ని ఉద్భవించి, సర్వమును నశింపజేయును కనుక కాలము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. సృష్టి కార్యము కావించు జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు. కనుక అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 405 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 33 🌴
33. akṣarāṇām a-kāro ’smi dvandvaḥ sāmāsikasya ca
aham evākṣayaḥ kālo dhātāhaṁ viśvato-mukhaḥ
🌷 Translation : Of letters I am the letter A, and among compound words I am the dual compound. I am also inexhaustible time, and of creators I am Brahmā.
🌹 Purport : A-kāra, the first letter of the Sanskrit alphabet, is the beginning of the Vedic literature. Without a-kāra, nothing can be sounded; therefore it is the beginning of sound. In Sanskrit there are also many compound words, of which the dual word, like rāma-kṛṣṇa, is called dvandva. In this compound, the words rāma and kṛṣṇa have the same form, and therefore the compound is called dual.
Among all kinds of killers, time is the ultimate because time kills everything. Time is the representative of Kṛṣṇa because in due course of time there will be a great fire and everything will be annihilated. Among the living entities who are creators, Brahmā, who has four heads, is the chief. Therefore he is a representative of the Supreme Lord, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires