🌹. శ్రీమద్భగవద్గీత - 407 / Bhagavad-Gita - 407 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 35 🌴
35. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహం |
మాసానాం మార్గశీర్షో(హమృతూనాం కుసుమాకర: ||
🌷. తాత్పర్యం : నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.
🌻. భాష్యము : వేదములలో తాను సామవేదమునని శ్రీకృష్ణభగవానుని ఇదివరకే వివరించియున్నాడు. వివిధ దేవతలచే గానము చేయబడు శ్రావ్యగేయభరితమైన ఆ సామవేదమునందు “బృహత్సామము” అనునది ఒకటి. అసాధారణ మధురిమను కలిగియుండెడి ఆ బృహత్సామము నడిరేయి యందు గానము చేయబడు చుండును. సంస్కృతమున కవిత్వమునకు అనేక నియమములుండును. ఆధునిక కవిత్వములలో జరుగురీతి దానియందు ప్రాస మరియు ఛందములు తోచినరీతిని వ్రాయుబడవు. అట్లు నియమబద్ధముగా వ్రాయబడిన కవిత్వములలో గాయత్రీమంత్రము శ్రీమద్భావతమునందు పేర్కొనబడినది. ఈ మంత్రము భగవదనుభూతికై ప్రత్యేకముగా నిర్ణయింప బడియున్నందున దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.
ఆధ్యాత్మిక పురోగతినొందిన మహాత్ముల కొరకై నిర్దేశింపబడియున్న దీనిని జపించుచు ఆధ్యాత్మికజయము నొందెడివారు భగవానుని దివ్యస్థానమున ప్రవేశింపగలరు. కాని ఈ మహామంత్రము జపించుటకు పూర్వము మనుజుడు పూర్ణత్వమునొందిన మనుజుని లక్షణములను (సత్వగుణమును) అలవరచుకొనవలెను. పరబ్రహ్మము యొక్క ధ్వని అవతారముగా భావింపబడు ఈ గాయత్రీమంత్రము వైదికజీవన విధానమున అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడిన ఈ మంత్రము పరంపర రూపముగా వ్యాప్తినొందినది. మార్గశీర్షమాసము (నవంబర్ – డిసంబర్) అన్ని మాసముల యందును ఉత్తమమైనదిగా పరిగణింపబడును. ఏలయన ఆ సమయమున జనులు పొలముల నుండి ధ్యానమును సేకరించి ఆనందముతో నుందురు. అలాగుననే ఋతువుల యందు వసంతఋతువు ప్రపంచమంతటికిని అత్యంత ప్రియమైనది. వాతావరణము అతివేడి, అతిశీతలముగా లేకుండ వృక్షములు ఫల, పుష్పభరితమై యండుటయే అందులకు కారణము. ఈ వసంతఋతువు నందే శ్రీకృష్ణుని పలులీలలను గుర్తుచేసికొను పలు ఉత్సవములు జరుపబడు చుండును. కనుకనే ఋతువులన్నింటిని యందును వసంతఋతువు అత్యంత ఆనందదాయకమైనదిగా పరిగణింపబడును. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 407 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 35 🌴
35. bṛhat-sāma tathā sāmnāṁ gāyatrī chandasām aham
māsānāṁ mārga-śīrṣo ’ham ṛtūnāṁ kusumākaraḥ
🌷 Translation : Of the hymns in the Sāma Veda I am the Bṛhat-sāma, and of poetry I am the Gāyatrī. Of months I am Mārgaśīrṣa [November-December], and of seasons I am flower-bearing spring.
🌹 Purport : It has already been explained by the Lord that amongst all the Vedas, He is the Sāma Veda. The Sāma Veda is rich with beautiful songs played by the various demigods. One of these songs is the Bṛhat-sāma, which has an exquisite melody and is sung at midnight. In Sanskrit, there are definite rules that regulate poetry; rhyme and meter are not written whimsically, as in much modern poetry. Amongst the regulated poetry, the Gāyatrī mantra, which is chanted by the duly qualified brāhmaṇas, is the most prominent. The Gāyatrī mantra is mentioned in the Śrīmad-Bhāgavatam. Because the Gāyatrī mantra is especially meant for God realization, it represents the Supreme Lord. This mantra is meant for spiritually advanced people, and when one attains success in chanting it, he can enter into the transcendental position of the Lord.
One must first acquire the qualities of the perfectly situated person, the qualities of goodness according to the laws of material nature, in order to chant the Gāyatrī mantra. The Gāyatrī mantra is very important in Vedic civilization and is considered to be the sound incarnation of Brahman. Brahmā is its initiator, and it is passed down from him in disciplic succession. The month of November-December is considered the best of all months because in India grains are collected from the fields at this time and the people become very happy. Of course spring is a season universally liked because it is neither too hot nor too cold and the flowers and trees blossom and flourish. In spring there are also many ceremonies commemorating Kṛṣṇa’s pastimes; therefore this is considered to be the most joyful of all seasons, and it is the representative of the Supreme Lord, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Comments