top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 409: 10వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 409: Chap. 10, Ver. 37


🌹. శ్రీమద్భగవద్గీత - 409 / Bhagavad-Gita - 409 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 37 🌴


37. వృష్ణీనాం వాసుదేవో(స్మి పాణ్డవానాం ధనంజయ: |

మునీనామప్యహం వ్యాస: కవీనాముశనా కవి: ||


🌷. తాత్పర్యం : నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.


🌷. భాష్యము : శ్రీకృష్ణుడు ఆద్యదేవదేవుడు కాగా, బలదేవుడు అతని అవ్యవహిత విస్తృతాంశయై యున్నాడు. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి యున్నందున వారిరువురిని వాసుదేవులుగా పిలువవచ్చును. వేరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడును బృందావనమును వీడడు కనుక, బృందావనమునకు అన్యమైన స్థలములలో దర్శితమైన కృష్ణుని రూపములు అతని విస్తృతాంశములై యున్నవి. అనగా శ్రీకృష్ణుని విస్తృతాంశయైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాదు. భగవద్గీత యందలి ఈ శ్లోకమున గల వాసుదేవ పదము బలరామునే సూచించుచున్నదని అవగతము చేసికొనవలెను. ఏలయన బలరాముడే సర్వవతారములకు మూలమై యున్నందున వాసుదేవ అంశములకు సైతము అతడే మూలమై యున్నాడు. ఈ విధమైన శ్రీకృష్ణభగవానుని అవ్యవహిత విస్తారములు “స్వాంశములు” (వ్యక్తిగత రూపములు) అని పిలువబడును. ఇవియేగాక “విభిన్నాంశములు” అని పిలువబడు విస్తృతరూపములును కలవు.


పాండురాజు తనయులలో ధనంజయునిగా పేరొందిన అర్జునుడు నరులలో శ్రేష్టుడు గనుక శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేదజ్ఞానపారంగతులైన మనుజులలో వ్యాసుడు శ్రేష్టుడు. ఏలయన ఆయన ఈ కలియుగ జనులకు అవగతమగునట్లు భిన్నపద్దతులలో వేదజ్ఞానమును వివరించెను. అంతియేగాక వ్యాసుడు శ్రీకృష్ణుని అవతారమై యున్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. ఎట్టి విషయమును గూర్చియైనను సమగ్రముగా ఆలోచింప సమర్థులైన వారిని కవులందురు. అట్టి కవులలో దానవుల గురువైన ఉశనుడు(శుక్రాచార్యుడు) అసాధారణ మేధాసంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజనీతినిపుణుడు కనుక శ్రీకృష్ణుని విభూతికి ప్రతినిధియై యున్నాడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 409 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 10 - Vibhuti Yoga - 37 🌴


37. vṛṣṇīnāṁ vāsudevo ’smipāṇḍavānāṁ dhanañ-jayaḥ

munīnām apy ahaṁ vyāsaḥ kavīnām uśanā kaviḥ


🌷 Translation : Of the descendants of Vṛṣṇi I am Vāsudeva, and of the Pāṇḍavas I am Arjuna. Of the sages I am Vyāsa, and among great thinkers I am Uśanā.


🌹 Purport : Kṛṣṇa is the original Supreme Personality of Godhead, and Baladeva is Kṛṣṇa’s immediate expansion. Both Lord Kṛṣṇa and Baladeva appeared as sons of Vasudeva, so both of Them may be called Vāsudeva. From another point of view, because Kṛṣṇa never leaves Vṛndāvana, all the forms of Kṛṣṇa that appear elsewhere are His expansions. Vāsudeva is Kṛṣṇa’s immediate expansion, so Vāsudeva is not different from Kṛṣṇa. It is to be understood that the Vāsudeva referred to in this verse of Bhagavad-gītā is Baladeva, or Balarāma, because He is the original source of all incarnations and thus He is the sole source of Vāsudeva. The immediate expansions of the Lord are called svāṁśa (personal expansions), and there are also expansions called vibhinnāṁśa (separated expansions).


Amongst the sons of Pāṇḍu, Arjuna is famous as Dhanañjaya. He is the best of men and therefore represents Kṛṣṇa. Among the munis, or learned men conversant in Vedic knowledge, Vyāsa is the greatest because he explained Vedic knowledge in many different ways for the understanding of the common mass of people in this Age of Kali. And Vyāsa is also known as an incarnation of Kṛṣṇa; therefore Vyāsa also represents Kṛṣṇa. Kavis are those who are capable of thinking thoroughly on any subject matter. Among the kavis, Uśanā, Śukrācārya, was the spiritual master of the demons; he was an extremely intelligent and far-seeing politician. Thus Śukrācārya is another representative of the opulence of Kṛṣṇa.


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Comentarios


bottom of page