top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 422: 11వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 422: Chap. 11, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 08 🌴


08. న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షు: పశ్య మే యోగమైశ్వరమ్ ||


🌷. తాత్పర్యం : కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్య నేత్రములను ఒసగుచున్నాను. నా యోగ వైభావమును వీక్షింపుము!


🌷. భాష్యము : శుద్ధభక్తుడైన వాడు శ్రీకృష్ణుని అతని ద్విభుజరూపమున కన్నను అన్యమైన ఏ రూపమునందు గాంచగోరడు. విశ్వరూపమును అతడు మనస్సుతోగాక, ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా గాంచవలెను. కనుకనే విశ్వరూప దర్శనమునకు మనస్సునుగాక, దృష్టిని మార్చుకొనమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. రాబోవు శ్లోకములందు స్పష్టపరుపబడినట్లు శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రాధాన్యమైనది కాదు. అయినను అర్జునుడు కోరియున్నందున దాని దర్శనము కొరకై భగవానుడు అతనికి దివ్యదృష్టి నొసగినాడు. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమున చక్కగా నెలకొనిన భక్తులు అతని ప్రేమలక్షణములతోనే ఆకర్షితులగుదురు కాని విభూతిప్రదర్శచే కాదు.


శ్రీకృష్ణునితో ఆటలాడుకొను వారు, మిత్రులు, అతని తల్లితండ్రులు ఎన్నడును అతడు విభూతులను మరియు వైభవములను ప్రదర్శించవలెనని కోరియుండలేదు. శుద్ధప్రేమలో వారెంత మునిగియుండిరనగా అతడు దేవదేవుడనియు వారెరుగకుండిరి. తమ ప్రేమపూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును సైతము మరచిపోయిరి. శ్రీకృష్ణునితో ఆటలాడిన బాలురు కృతపుణ్య పుంజులనియు (ఘన పుణ్యాత్ములని) మరియు బహుజన్మల పిదపనే వారు ఆ విధముగా కృష్ణునితో క్రీడింప గలిగిరనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఆ బాలురు శ్రీకృష్ణుని దేవదేవునిగా నెరుగక, తమ సన్నిహిత మిత్రునిగా భావించిరి.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 422 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 08 🌴


08. na tu māṁ śakyase draṣṭum anenaiva sva-cakṣuṣā

divyaṁ dadāmi te cakṣuḥ paśya me yogam aiśvaram


🌷 Translation : But you cannot see Me with your present eyes. Therefore I give you divine eyes. Behold My mystic opulence!


🌹 Purport : A pure devotee does not like to see Kṛṣṇa in any form except His form with two hands; a devotee must see His universal form by His grace, not with the mind but with spiritual eyes. To see the universal form of Kṛṣṇa, Arjuna is told not to change his mind but his vision. The universal form of Kṛṣṇa is not very important; that will be clear in subsequent verses. Yet because Arjuna wanted to see it, the Lord gives him the particular vision required to see that universal form.


Devotees who are correctly situated in a transcendental relationship with Kṛṣṇa are attracted by loving features, not by a godless display of opulences. The playmates of Kṛṣṇa, the friends of Kṛṣṇa and the parents of Kṛṣṇa never want Kṛṣṇa to show His opulences. They are so immersed in pure love that they do not even know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. In their loving exchange they forget that Kṛṣṇa is the Supreme Lord. In the Śrīmad-Bhāgavatam it is stated that the boys who play with Kṛṣṇa are all highly pious souls, and after many, many births they are able to play with Kṛṣṇa. Such boys do not know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. They take Him as a personal friend.


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Comments


bottom of page