🌹. శ్రీమద్భగవద్గీత - 440 / Bhagavad-Gita - 440 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 26 🌴
26. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా: సర్వే సహైవావనిపాలసఙ్ఘై: |
భీష్మో ద్రోణ: సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై: ||
🌷. తాత్పర్యం : ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు.
🌷. భాష్యము : అర్జునుడు చెప్పే ఈ భగవంతుని యొక్క దంతములు అంటే ఏంటి? ఇంతకు క్రితం శ్లోకంలో కూడా వీటిని గురించి చెప్పాడు. మనం మన పళ్ళను ఆహారాన్ని నమలటానికి వాడుతాము. భగవంతుని దంతములు అంటే, అవి అందరినీ కాల క్రమంలో మృత్యువు దిశగా చూర్ణం చేసే శక్తి స్వరూపములు.
గొప్పగొప్ప కౌరవ యోధులు — భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు — మరియు మరెందరో పాండవ పక్షయోధులు కూడా, భగవంతుని నోటిలోనికి తలకిందులుగా త్వరగా వేగగతిన పోయి, ఆయన పళ్ళ మధ్య నలిగి పోవటం అర్జునుడు గమనించాడు. అతి త్వరలో జరగబోయే పరిణామాలని ఆ భగవంతుని యొక్క విశ్వరూపములో దర్శిస్తున్నాడు. భగవంతుడు కాల పరిమితికి అతీతుడు కాబట్టి, భూత-వర్తమాన-భవిష్యత్తులన్నీ ఆయన యందు ఇప్పుడే కనిపిస్తుంటాయి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 440 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 26 🌴
26. amī ca tvāṁ dhṛtarāṣṭrasya putrāḥ sarve sahaivāvani-pāla-saṅghaiḥ
bhīṣmo droṇaḥ sūta-putras tathāsau sahāsmadīyair api yodha-mukhyaiḥ
🌷 Translation : All the sons of Dhṛtarāṣṭra, along with their allied kings, and Bhīṣma, Droṇa, Karṇa are rushing into Your fearful mouths.
🌹 Purport : What are the teeth of God that Arjun is referring to? He mentioned them in the previous verse as well. We use our teeth to grind our food. God’s teeth are his force of destruction that grinds everyone to death with the passage of time.
Arjun sees the great Kaurava generals—Bheeshma, Dronacharya, and Karn—and also many of the Pandava generals rushing headlong into the mouth of the Lord, to be ground between his teeth. He is beholding the imminent future in the cosmic form of God. Since God is beyond the limits of time, so the past, present, and future are visible within him in the present.
🌹 🌹 🌹 🌹 🌹
Комментарии