🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀
🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 2 🌻
పశ్యకులనగా బైటికి చూచువారు. లోపలకు బైటకు కూడ చూడగలిగిన వారిని కశ్యపులు అందురు. యోగులు, ఋషులు, తపస్విజనులు కశ్యపులు. ఇతరులు పశ్యకులు. పశ్యకులు పశుప్రాయుల వలె కేవలము ఇంద్రియముల ద్వారా ఇంద్రియార్థములను కోరుచు బాహ్యమున జీవమును నశింపజేసి కొనుచు మరణింతురు. వీరికే మరణము, జననము కలవు. అంత రంగమున చూచుట, వర్తించుట నేర్చినవారు మరణము దాటిన వారగుదురు. ఈ కారణముగ మణిపూరకము అత్యంత ప్రాముఖ్యముతో కూడిన పద్మముగ పెద్దలు వర్ణించిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻
🌻 495. Manipurabja - 2 🌻
Pashyakas means those who look outside. Those who can see inside and outside are called Kashyapas. Yogis, sages and ascetics are Kashyaps. Others are Pashyakas. Pashyakas, like animals, seek sense objects only through the senses, destroy the life outside and die. Death and birth happen to them. Those who learn to perceive and live inside, become those who have surpassed death. For this reason Manipuraka is described by elders as the most important lotus.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments