top of page
Writer's picturePrasad Bharadwaj

'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు - Good Wishes on Sri Shob


🍀🌹. 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🌹🍀



🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹


సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |

శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్ ||


🌻. 'శోభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం. భగవంతుడు తన ప్రేమపూర్వక సృష్టిలో ఈ ప్రపంచాన్ని యుగాది నాడు సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలి ఆకాంక్షిస్తూ, ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. 🌻


🌴. ఉగాది విశిష్టత : 🌴


‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.


ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.


🪷. ఉగస్య ఆది ఉగాది : 🪷


ఉగమంతా, నక్షత్ర గమనం. నక్షత్రముల నడవడిక ఆరంభమైన కాలమే అనగా సృష్టి మొదలైన కాలము యొక్క ఆది - ఉగాది. వేదములను తస్కరించిన సోమకాసురుని చెంత నుడి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి మత్స్యావతారాన్ని దాల్చిన రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది రోజు అని, పురాణములు పేర్కొన్నాయి.


🪷. ఉగాది నాడు పాటించే ప్రధానాంశములు 🪷


ఉగాది పండుగ నాడు ప్రధానంగా ఆచరించే విషయములు: అభ్యంగన స్నానము, ఇష్ట దేవతారాధన, సంవత్సర దేవతారాధన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.


🪷. పంచాంగ శ్రవణం - చేకూరు లాభములు🪷


తిథి వార నక్షత్రయోగ కరణములతో కూడినది - పంచాంగం.


‘‘తిథేశ్చ, శ్రీయమాప్నోతి వారాదాయుష్య వర్థనమ్


నక్షత్రాత్థరతాపాపం, యోగార్రోగ నివారణమ్


కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్


కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రహం లభౌత్’’


తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాపపరిహారం, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కార్యానుకూలత, పంచాంగ శ్రవణము వలన నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి.



🪷 🍯🥭🥣. ఉగాది పచ్చడి 🪷🍯🥭🥣


ఇది షడ్రుచులతో కూడిన భక్షణం. వేపపువ్వు (చేదు), మామిడి పిందె (వగరు), క్రొత్త చింతపండు (పులుపు), మిరియాల పొడి (కారం) ఇప్పుడు పచ్చి మిర్చి ముక్కలు వేస్తున్నారు. కొద్దిగా సైంధవ లవణం (ఉప్పు). మానవజీవిత వైవిధ్యం అంతా, ఉగాది పచ్చడిలో ప్రతిబింబిస్తుంది. జీవితంలో అంతా మాధుర్యము- సుఖమే ఉండదు. చేదు, పులుపు, వగరు లాంటి కష్టనష్టములతో, ఒడుదుడుకులతో కూడికొని ఉంటుంది. ఉప్పు ఉంటుంది, బెల్లము ఉంటుంది. జీవితంలోనూ సుఖదుఃఖాలుంటాయి. అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్థైర్యం ఉండాలన్నది, ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.



🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :


1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ


సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం



2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు"


ఉగాదినాడు ఈ శ్లోకములను చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


bottom of page