top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 01, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 01, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 01, JANUARY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

*🌹🍀 ఆంగ్ల నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు అందరికి, English New Year 2024 Good Wishes to All 🍀🌹*

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 480 / Bhagavad-Gita - 480 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -11 / Chapter 12 - Devotional Service - 11 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 836 / Sri Siva Maha Purana - 836 🌹

🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 1 / The previous birth of Śaṅkhacūḍa - 1 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 93 / Osho Daily Meditations - 93 🌹

🍀 93. అచేతన / 93. THE UNCONSCIOUS 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 3 🌹

🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 3 / 520. Sakinyanba Svarupini - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 01, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*🍀 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి, English New Year Good Wishes to All 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆంగ్ల నూతన సంవత్సరం, English New Year 🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 58 🍀*


*118. ఉద్భిత్త్రివిక్రమో వైద్యో విరజో నీరజోఽమరః |*

*ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : పరమ సచ్చిదానందం : విశ్వాతీతమగు పరమసచ్చిదానందం సకలమునకూ అతీతం. అతీమానస విజ్ఞాన మనునది దాని శక్తియే, ఆత్మజ్ఞాన, విశ్వ జ్ఞానములతో కూడిన శక్తి అది. అందు విశ్వం తనకు వెలిగాగాక, తనలోనిదిగనే తెలియ బడుతుంది. పరమ సచ్చిదానంద అనుభూతి యందు నిమగ్నుడు కాగోరువాడు, ఈ అతిమానస విజాన భూమికను దాటియే పోవలసి యున్నది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: కృష్ణ పంచమి 14:29:33

వరకు తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: మఘ 08:37:30

వరకు తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: ఆయుష్మాన్ 28:36:36

వరకు తదుపరి సౌభాగ్య

కరణం: తైతిల 14:29:33 వరకు

వర్జ్యం: 17:39:00 - 19:27:24

దుర్ముహూర్తం: 12:41:30 - 13:25:57

మరియు 14:54:51 - 15:39:18

రాహు కాలం: 08:09:14 - 09:32:35

గుళిక కాలం: 13:42:37 - 15:05:58

యమ గండం: 10:55:56 - 12:19:17

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41

అమృత కాలం: 05:55:36 - 07:43:12

మరియు 28:29:24 - 30:17:48

సూర్యోదయం: 06:45:53

సూర్యాస్తమయం: 17:52:40

చంద్రోదయం: 22:28:45

చంద్రాస్తమయం: 10:34:37

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధననాశనం,

కార్య హాని 08:37:30 వరకు తదుపరి

ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹🍀 ఆంగ్ల నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు అందరికి, English New Year 2024 Good Wishes to All 🍀🌹*


*🪷 It's not the destination, it's the journey. May you enjoy each day of your adventure. Wishing You A Year Filled With Great Joy Peace And Prosperity 🪷*

*🌻 Prasad Bharadwaj*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 480 / Bhagavad-Gita - 480 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -11 🌴*


*11. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత: |*

*సర్వకర్మఫలత్యాగం తత: కురు యతాత్మవాన్ ||*


*🌷. తాత్పర్యం : అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో త్యాగము చేసి ఆత్మస్థితుడవగుట యత్నింపుము.*


*🌷. భాష్యము : సాంఘిక, కుటుంబ, ధర్మపరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమ కార్యక్రమములందు సహాయానుభూతిని చూప సమర్థుడు కాకపోవచ్చును. అట్టి కార్యక్రమములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబసభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు సంప్రాప్తింపవచ్చును. అటువంటి కష్టము కలిగినవాడు తన కర్మల ద్వారా ప్రోగైన ధనమును ఏదేని ఓక మంచి కార్యమునకై ఉపయోగించవచ్చునని ఉపదేశింపబడినది. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి. వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్యకార్యములు (పూర్వకర్మఫలములను వినియోగించుటకు వీలు కలిగించెడి కొన్ని ముఖ్యకర్మలు) వాని యందు పెక్కుగలవు.*


*ఆ విధముగా మనుజుడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపగలడు. కృష్ణపరకర్మల యందు అభిరుచి లేనివాడు సైతము కొన్నిమార్లు వైద్యశాలకో లేదా సాంఘికసంస్థకో తన కష్టార్జితమును దానము చేయుటను మనము గాంచుచుందుము. ఇట్టి దానము కూడ ఇచ్చట సమర్థింపబడినది. ఏలయన తన కర్మఫలములను త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా మనస్సును పవిత్రమొనర్చు కొనగలడు. అట్టి మనోపవిత్రత కలిగిన స్థితిలో అతడు కృషభక్తిరసభావనను అవగాహన చేసికొనుటకు సమర్థుడు కాగలడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 480 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 11 🌴*


*11. athaitad apy aśakto ’si kartuṁ mad-yogam āśritaḥ*

*sarva-karma-phala-tyāgaṁ tataḥ kuru yatātmavān*


*🌷 Translation : If, however, you are unable to work in this consciousness of Me, then try to act giving up all results of your work and try to be self-situated.*


*🌹 Purport : It may be that one is unable even to sympathize with the activities of Kṛṣṇa consciousness because of social, familial or religious considerations or because of some other impediments. If one attaches himself directly to the activities of Kṛṣṇa consciousness, there may be objections from family members, or so many other difficulties. For one who has such a problem, it is advised that he sacrifice the accumulated result of his activities to some good cause. Such procedures are described in the Vedic rules. There are many descriptions of sacrifices and special functions for the full-moon day, and there is special work in which the result of one’s previous action may be applied. Thus one may gradually become elevated to the state of knowledge.*


*It is also found that when one who is not even interested in the activities of Kṛṣṇa consciousness gives charity to some hospital or some other social institution, he gives up the hard-earned results of his activities. That is also recommended here because by the practice of giving up the fruits of one’s activities one is sure to purify his mind gradually, and in that purified stage of mind one becomes able to understand Kṛṣṇa consciousness. Of course, Kṛṣṇa consciousness is not dependent on any other experience, because Kṛṣṇa consciousness itself can purify one’s mind, but if there are impediments to accepting Kṛṣṇa consciousness, one may try to give up the results of his actions. In that respect, social service, community service, national service, sacrifice for one’s country, etc., may be accepted so that some day one may come to the stage of pure devotional service to the Supreme Lord. In Bhagavad-gītā (18.46) we find it is stated, yataḥ pravṛttir bhūtānām: if one decides to sacrifice for the supreme cause, even if he does not know that the supreme cause is Kṛṣṇa, he will come gradually to understand that Kṛṣṇa is the supreme cause by the sacrificial method.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 835 / Sri Siva Maha Purana - 835 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴*


*🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 1 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను - ఆ శంఖచూడుడు తపస్సుచేసి వరమును పొంది వివాహమాడి తన ఇంటికి తిరిగి వచ్చినందులకు దానవులు, ఇతరులు సంతసించిరి (1). రాక్షసులందరు కలసి తమ లోకమునుండి వెంటనే బయల్వెడలి తమ గురువును వెంట బెట్టుకొని ఆతని వద్దకు వచ్చిరి (2). వారు ఆతనికి సవినయముగా ప్రణమిల్లి వివిధస్తోత్రములను చేసి ఆదరముతో మిక్కిలి ప్రీతితో అచటనే ఉండిరి. ఆతడు తేజస్వి, సమర్థుడుఅని వారు భావించిరి (3). దంభుని కుమారుడగు ఆ శంఖచూడుడు కూడ విచ్చేసిన కులగురువును గాంచి ఆయనకు మహాదరముతో పరమభక్తితో సాష్టాంగ ప్రణామమును చేసెను (4). అపుడు కులగురువగు శుక్రాచార్యుడు సర్వశ్రేష్ఠమగు ఆశీస్సును ఇచ్చి, తరువాత దేవదానవుల వృత్తాంతమును చెప్పెను (5). రాక్షసులకు దేవతలతో గల సహజవైరము, రాక్షసులకు జరిగిన పరాభవము, దేవతల విజయము, బృహస్పతి చేసిన సాహాయ్యము అను విషయములను వివరించెను (6). అపుడాతడు రాక్షసులందరి అనుమతిని తీసుకొని ఆయనను దానవులకు, అనుచరులకు, మరియు తజ్జాతీయులకు అధిపతిగా, గురువుగా నియమించెను. అపుడు గొప్ప ఉత్సవము జరిగెను (7).*


*అప్పుడు ఆనందముతో నిండిన మనస్సుగల రాక్షసులు గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి. వారందరు ఆతనికి గొప్ప ప్రీతితో బహుమతుల నందజేసిరి (8). అపుడు దంభుని పుత్రుడు వీరుడు, ప్రతాపశీలియగు శంఖచూడుడు రాజ్యాభిషిక్తుడై రాక్షసరాజపదవిని పొంది ప్రకాశించెను (9). ఆతడు దైత్యదానవ రాక్షసులతో గూడిన పెద్ద సేన వెంటరాగా రథము నెక్కి వేగముగా ఇంద్రుని నగరమునకు జైత్రయాత్రకై బయల్వెడలెను (10).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 835 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴*


*🌻 The previous birth of Śaṅkhacūḍa - 1 🌻*


Sanatkumāra said:—

1. When Śaṅkhacūḍa returned home duly married, after performing the penance and receiving the boons, Dānavas and others rejoiced.


2. Leaving their world and accompanied by their preceptor, the Asuras assembled and approached the Dānava.


3. They bowed to that resplendent Dānava their lord, humbly and eulogised him with love and respect. They stayed with him alone.


4. On seeing the family preceptor, Śaṅkhacūḍa, son of Dambha bowed to him with devotion and prostrated before him with respect.


5. After conferring his excellent benediction, Śukra, the family preceptor, narrated the tales of the gods and Dānavas.


6. He expatiated on the natural enmity of the two, the invariable defeat of the Asuras, the victory of the gods and the help rendered by Bṛhaspati.


7. With the consent of the Asuras, the preceptor Śukra made him the emperor of Dānavas, Asuras and others with jubilant festivities.


8. The delighted Asuras were highly joyous. They offered him presents lovingly.


9. The son of Dambha, the heroic and valorous Śaṅkhacūḍa shone as the Emperor of Asuras.


10. Taking a vast army of Daityas, Dānavas and Rākṣasas and seated in his chariot, he marched quickly to the city of Indra[1] with the intention to conquer it.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 93 / Osho Daily Meditations - 93 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 93. అచేతన 🍀*


*🕉. అచేతన స్పృహ కంటే తొమ్మిది రెట్లు పెద్దది, కాబట్టి అచేతన నుండి వచ్చేది అఖండమైనది. అందుకే ప్రజలు తమ భావోద్వేగాలకు, భావాలకు భయపడతారు. వారు వాటిని ఆపుకుంటారు, వారు గందరగోళం సృష్టిస్తామేమోనని భయపడతారు. అది చేస్తారు, కానీ గందరగోళం అందంగా ఉంటుంది! 🕉*


*క్రమం అవసరం, గందరగోళం కూడా అవసరం. ఆర్డర్ అవసరమైనప్పుడు, క్రమాన్ని ఉపయోగించండి, చేతన మనస్సును ఉపయోగించండి; గందరగోళం అవసరమైనప్పుడు, అచేతనను ఉపయోగించుకోండి మరియు గందరగోళంగా ఉండనివ్వండి.ఒక పరిపూర్ణ వ్యక్తి, రెండింటినీ ఉపయోగించగల సామర్థ్యం ఉన్నవాడు, అతను అచేతనలోకి చేతనను లేదా చేతనలోకి అచేతనను ఎటువంటి జోక్యాన్ని అనుమతించడు. మీరు చేతనతో మాత్రమే చేయగలిగే పనులు ఇవి.*


*ఉదాహరణకు, మీరు అంకగణితం లేదా శాస్త్రీయ పని చేస్తుంటే, మీరు దానిని చేతన నుండి మాత్రమే చేయగలరు. కానీ ప్రేమ అలా కాదు, కవిత్వం అలా కాదు; అవి అచేతన నుండి వస్తాయి. కాబట్టి మీరు మీ చేతనను పక్కన పెట్టాలి. చేతన భయపడుతుంది కాబట్టి విషయాలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. దానికి ఏదో పెద్ద అల వస్తున్నట్లుంటుంది; అది మనుగడ సాగించగలదా? అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, తప్పించుకోవాలని కోరుకుంటుంది, ఎక్కడో దాక్కోవాలని. కానీ అది సరికాదు. అందుకే జనం నిస్తేజంగా, జీవం కొల్పోయారు. జీవితంలోని అన్ని వసంతాలు అచేతనలో ఉన్నాయి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 93 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 93. THE UNCONSCIOUS 🍀*


*🕉 The unconscious is nine times bigger than the conscious, so whatever comes from the unconscious is overwhelming. That's why people are afraid of their emotions, feelings. They hold them back, they are afraid they will create chaos. They do, but chaos is beautiful!. 🕉*


*There is a need for order, and there is a need for chaos too. When order is needed, use order, use the conscious mind; when chaos is needed, use the unconscious and let chaos be. A whole person, a total person, is one who is capable of using both, who does not allow any interference of the conscious into the unconscious or of the unconscious into the conscious. There are things that you can only do consciously.*


*For example, if you are doing arithmetic or scientific work, you can do it only from the conscious. But love is not like that, poetry is not like that; they come from the unconscious. So you have to put your conscious aside. It is the conscious that tries to hold things because it is afraid. It seems to it that something big is coming, a tidal wave; will it be able to survive? It tries to avoid it, it wants to escape, hide somewhere. But that is not right. That's why people have become dull and dead. All springs of life are in the unconscious.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।*

*ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀*


*🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 3 🌻*


*ఏమియూ లేనట్టుగా వున్న స్థితి నుండి అన్నియూ వున్నట్లుగా గోచరమగుట అంతయూ శ్రీమాత మహిమ. మూలాధారము నందు బీజమునగల అక్షరము కారణముగ అందలి యోగినీ మాతను 'లాకినీ' అందురు. మరికొందరు ‘డాకినీ' అందురు. లలితా సహస్రములో 'సాకినీ' అని తెలుపబడినది. ఇందు గల నాలుగు దళములయందు వరదా, అభయ, దాక్షాయణి, సరస్వతి త్యా .దేవతలను పూజించు సంప్రదాయ మున్నది. డాకినీ అన్నను దాక్షాయణి అన్ననూ ఒకటియే అని కొందరి మతము. నిరుక్తమాధారముగ ఈ సమన్వయము తెలుపుదురు. దాక్షిణ్యా, దక్షిణా, దక్కనూ, డాకినీ- యివి అన్నియూ దాక్షాయని పదమునుండి పుట్టినట్లు నిరుక్త శాస్త్రజ్ఞులు తెలుపుదురు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini*

*aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻*


*🌻 520. Sakinyanba Svarupini - 3 🌻*


*From the state of nothingness to the state of everything as if everything is there, is the glory of Shrimata. Because of the letter in the seed of Mooladhara, the yogini Mata in there is called 'Lakini'. Others call her 'Dakini'. In Lalita sahasranama she is described as 'Sakini'. There is a tradition of worshiping the deities Varada, Abhaya, Dakshayani and Saraswati among the four petals here. Some believe that Dakini and Dakshayani are the same. This coordination is explained through Nirukta sastra. Dakshinya, Dakshina, Dakkanu, Dakini - All these are derived from the word Dakshayani according to Nirukta scholars.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


bottom of page