🍀🌹 02, MAY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 527 / Bhagavad-Gita - 527 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 38 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 38 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 881 / Sri Siva Maha Purana - 881 🌹
🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 1 / The annihilation of the army of Śaṅkhacūḍa - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 140 / Osho Daily Meditations - 140 🌹
🍀 140. అవగాహన ముఖ్యం / 140. AWARENESS FIRST 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 52 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 543 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 2 🌹
🌻 543. 'పుణ్యలభ్య’' - 2 / 543. 'Punyalabhya' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 527 / Bhagavad-Gita - 527 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 3 🌴*
*03. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |*
*సమ్భవ: సర్వభూతానాం తతో భవతి భారత ||*
*🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! బ్రహ్మముగా పిలువబడు మహతత్త్వము సమస్త జననమునకు ఆధారమై యున్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మము నందు బీజప్రదానము కావించుచున్నాను.*
*🌷. భాష్యము : ఇదియే విశ్వమునందు జరుగుచున్న సమస్తమునకు వివరణము. ప్రతిదియు క్షేత్రము (దేహము) మరియు క్షేత్రజ్ఞుని (ఆత్మ) కలయికచే ఒనగూడుచున్నది. ఇట్టి ప్రకృతి, ఆత్మల కలయిక శ్రీకృష్ణభగవానునిచే సాధ్యము కావింపబడును. వాస్తవమునకు “మహతత్త్వము” సమస్త విశ్వమునకు సర్వ కారణమై యున్నది. త్రిగుణపూర్ణమైన ఆ మహతత్త్వమే కొన్నిమార్లు బ్రహ్మముగా పిలువబడును. దానియందే శ్రీకృష్ణభగవానుడు బీజప్రదానము చేయగా అసంఖ్యాకమగు విశ్వములు ఉత్పత్తి యగును.*
*అట్టి మహతత్త్వము ముండకోపనిషత్తు (1.1.9) నందు బ్రహ్మముగా వర్ణింపబడినది. “తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే”. అట్టి బ్రహ్మము నందు భగవానుడు జీవులను బీజరూపమున ఉంచును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల చతుర్వింశతి మూలకములన్నియును భౌతికశక్తిగా పరిగణింపబడును మరియ అవియే మహద్భ్రహ్మమనబడును భౌతికప్రకృతిని రూపొందించును. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు దీనికి పరమైన దివ్య ప్రకృతియే జీవుడు. దేవదేవుని సంకల్పముచే భౌతికప్రకృతి యందు ఉన్నతప్రకృతి మిశ్రణము కావింపబడును. తదనంతరము జీవులందరును భౌతికప్రకృతి యందు జన్మింతురు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 527 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 03 🌴*
*03. mama yonir mahad brahma tasmin garbhaṁ dadhāmy aham*
*sambhavaḥ sarva-bhūtānāṁ tato bhavati bhārata*
*🌷 Translation : The total material substance, called Brahman, is the source of birth, and it is that Brahman that I impregnate, making possible the births of all living beings, O son of Bharata.*
*🌹 Purport : This is an explanation of the world: everything that takes place is due to the combination of kṣetra and kṣetra-jña, the body and the spirit soul. This combination of material nature and the living entity is made possible by the Supreme God Himself. The mahat-tattva is the total cause of the total cosmic manifestation; and that total substance of the material cause, in which there are three modes of nature, is sometimes called Brahman. The Supreme Personality impregnates that total substance, and thus innumerable universes become possible.*
*This total material substance, the mahat-tattva, is described as Brahman in the Vedic literature (Muṇḍaka Upaniṣad 1.1.19): tasmād etad brahma nāma-rūpam annaṁ ca jāyate. The Supreme Person impregnates that Brahman with the seeds of the living entities. The twenty-four elements, beginning from earth, water, fire and air, are all material energy, and they constitute what is called mahad brahma, or the great Brahman, the material nature. As explained in the Seventh Chapter, beyond this there is another, superior nature – the living entity. Into material nature the superior nature is mixed by the will of the Supreme Personality of Godhead, and thereafter all living entities are born of this material nature.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 881 / Sri Siva Maha Purana - 881 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴*
*🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 1 🌻*
*వ్యాసుడిట్లు పలికెను- కాళి యొక్క వచనములను విని ఈశానుడు ఏమనినాడు? ఏమి చేసినాడు? ఓ మహాబుద్ధి శాలీ! నీవా విషయమును చెప్పుము. నాకు చాల కుతూహలముగ నున్నది (1).*
*సనత్కుమారుడిట్లు పలికెను - కాళి యొక్క మాటలను విని, పరమేశ్వరుడు, గొప్ప లీలలను చేయువాడు, మంగళకరుడు నగు శంభుడు నవ్వి ఆమెను ఓదార్చెను (2). ఆకాశవాణి యొక్క పలుకులను తెలుసుకొని, తత్త్వ జ్ఞాన పండితుడగు శంకరుడు తన గణములతో గూడి స్వయముగా యుద్ధమునకు వెళ్లెను (3). మహేశ్వరుడు గొప్ప వృషభము నెక్కి, వీరభద్రాదులు తోడు రాగా, తనతో సమానమైన భైరవులు, క్షేత్రపాలురు చుట్టువారి యుండగా, వీరరూపమును దాల్చి రణరంగమును చేరెను. అచట ఆ రుద్రుడు మూర్తీభవించిన మృత్యువువలె అధికముగా ప్రకాశించెను (4, 5). ఆ శంఖచూడుడు శివుని గాంచి విమానమునుండి దిగి పరమభక్తితో శిరస్సును నేలపై ఉంచి సాష్టాంగ నమస్కారమును చేసెను (6). ఆతడు శివునకు ప్రణమిల్లిన పిదప యోగశక్తిచే విమానము నధిష్ఠించి వెంటనే ధనుర్బాణములను గ్రహించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను (7).*
*వారిద్దరు అపుడు వర్షించే రెండు మేఘముల వలె భయంకరమగు బాణవర్షమును కురిపిస్తూ వందసంవత్సరములు చేసిరి (8). మహావీరుడగు శంఖచూడుడు భయంకరములగు బాణములను ప్రయోగించగా, శంకరుడు వాటిని తన బాణపరంపరలచే అవలీలగా చీల్చివేసెను (9).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 881 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴*
*🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 1 🌻*
Vyāsa said:—
1. O intelligent one, on hearing the narrative of Kālī what did Śiva say? What did he do? Please narrate to me. I am eager to know it.
Sanatkumāra said:—
2. On hearing the words of Kālī, lord Śiva, the actor of great divine sports, laughed. Śiva consoled her.
3. On hearing the celestial voice, Śiva, an expert in the knowledge of principles, went himself to the battle along with his Gaṇas.
4. He was seated on his great bull and surrounded by Vīrabhadra and others, the Bhairavas and the Kṣetrapālas all equal in valour to him.
5. Assuming a heroic form, lord Śiva entered the battle ground. There Śiva shone well as the embodied form of the annihilator.
6. On seeing Śiva, Śaṅkhacūḍa got down from the aerial chariot, bowed with great devotion and fell flat on the ground.
7. After bowing to him he immediately got into his chariot. He speedily prepared for the fight and seized the bow and the arrows.
8. The fight between Śiva and the Dānava went on for a hundred years and they showered arrows fiercely like clouds pouring down incessantly.
9. The heroic Śaṅkhacūḍa discharged terrible arrows playfully. Śiva split all of them by means of his arrows.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 140 / Osho Daily Meditations - 140 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 140. అవగాహన ముఖ్యం 🍀*
*🕉 అవగాహన పెరిగినప్పుడు మరియు మీరు స్పష్టంగా అప్రమత్తంగా మారినప్పుడు, అంగీకరించడం అనేది సహజ పరిణామం. 🕉*
*అంగీకారం అనేది అవగాహన యొక్క పెరుగుదల. దురాశ ఉంది; ... గమనించండి. ఆశయం ఉంది; గమనించండి. అధికారం కోసం తృష్ణ ఉంది; గమనించండి. ప్రస్తుతం దాన్ని అంగీకరించాలనే ఆలోచనతో విషయాలను క్లిష్టతరం చేయవద్దు, ఎందుకంటే మీరు అంగీకరించడానికి ప్రయత్నించి, మీరు అంగీకరించకపోతే, మీరు అణచివేయడం ప్రారంభిస్తారు. అలా ప్రజలు అణచివేశారు. వారు అంగీకరించలేరు, కాబట్టి విషయాలను మరచిపోయి చీకటిలో ఉంచడమే ఏకైక మార్గం అనుకున్నారు. అప్పుడు మనకి అంతా బాగున్నట్లు, సమస్య లేనట్లు అనిపిస్తుంది.*
*మొదట, అంగీకారం గురించి మరచిపోండి. కేవలం తెలుసుకోండి. అవగాహన పెరిగినప్పుడు మరియు మీరు స్పష్టంగా అప్రమత్తంగా మారినప్పుడు, అంగీకారం సహజ పరిణామం. వాస్తవాన్ని చూస్తే, ఇంకెక్కడికీ వెళ్లలేనందున దానిని అంగీకరించాలి. నీవు ఏమి చేయగలవు? ఇది కేవలం ఉంది - మీ రెండు కళ్లలాగా. అవి నాలుగు కాదు, రెండు మాత్రమే. మీరు దేనినైనా అంగీకరించిన తర్వాత, అది నిజమైతే మాత్రమే మిగిలి ఉంటుంది. అవాస్తవమైతే కరిగిపోతుంది. ప్రేమ ఉంటుంది; ద్వేషం కరిగిపోతుంది. కరుణ ఉంటుంది; కోపం కరిగిపోతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 140 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 140. AWARENESS FIRST 🍀*
*🕉 When awareness grows, and you become clearly alert, acceptance is a natural consequence. 🕉*
*Acceptance is an outgrowth of awareness. Greed is there; ... watch it. Ambition is there; watch it. A lust for power is there; watch it. Right now don't complicate things by the idea of accepting it, because if you try to accept and you cannot, you will start repressing. That's how people have repressed. They cannot accept, so the only way is to forget about things and put them in the dark. Then one is okay, one feels that there is no problem.*
*First, forget about acceptance. Just be aware. When awareness grows, and you become clearly alert, acceptance is a natural consequence. Seeing the fact, one has to accept it because there is nowhere else to go. What can you do? It is there just like your two eyes. They are not four, only two. Once you accept something, if it is real, only then can it remain. If it is unreal, it will dissolve. Love will remain; hate will dissolve. Compassion will remain; anger will dissolve.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 52 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 16వ శతాబ్దం 🏵*
*కొంత కాలం కాళీయోగి కాశీలో ఉన్నాడు. అక్కడ త్రైలింగస్వామి అనే యతి కాళీ సాధన చేసి ఇతనివలె మూడు వందల యేండ్లు జీవించే వరం పొందాడు. అతడూ ఈ కాళీ దేవతామూర్తిని అర్చించాడు. అక్కడి నుండి యోగి కొన్నాళ్ళు దక్షిణాపధంలో తిరిగాడు. చిత్రానదీ తీరంలోని కుర్తాళం అతనిని ఆకర్షించింది. ఆ పవిత్రస్థలంలో కొన్ని నెలలు ధ్యానం చేసుకుంటూ అక్కడి ఆర్తుల కష్టాలు తీరుస్తూ గడిపాడు. తిరిగి ఉత్తర భారతానికి బయలుదేరగా దోవలో ఆంధ్ర ప్రాంతంలో శ్రీనాధుడనే కవివర్యునితో పరిచయం కలిగింది. చింతామణి మంత్రసిద్ధుడై రాజ పూజితుడైన ఆ విద్వాంసుని కవిత్వ పాండిత్య ప్రాభవానికి అతడు ముగ్ధుడైనాడు. ఆ కవి-అతిథిగా తన భవనంలో కొంతకాలమైనా ఉండవలసినదిగా ప్రార్థించాడు. ఆతని ఆత్మీయ భావానికి సంతోషించి కొన్నాళ్ళున్నాడు. విపరీతంగా స్త్రీలోలుడు అయిన ఆ కవి చిత్తవృత్తి చాలా చిత్రమనిపించింది. ఆనన్యమైన అతని శివభక్తి, తనకెంతో నచ్చింది. కాళీయోగి అక్కడినుండి బయలుదేరే రోజు ఆ కవిరాజు తన భవిష్యత్తును గూర్చి చెప్పమని ప్రార్ధించాడు.*
*ధ్యానంలో చూచి ఇలా చెప్పాడు. “మహాకవీ!” మీది చాలా గొప్ప జన్మ. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక సిద్ధగురువు నీకు దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ సమయంలో అతడు నీకు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ మహామహుని దయ వల్ల నీకు వాక్సిద్ధి లభించింది. నీ రంగంలో నీ ముందు నిలువగల వారుండరు. దిగ్విజయం చేసి సమ్రాట్టులచే కనకాభిషేకాలు పొందుతావు. ఎంతటి రాజులయినా నీ వశులవుతారు. మహాభోగాలు అనుభవిస్తావు. కానీ నీ స్త్రీలోలత నిన్ను దెబ్బతీస్తుంది. నీ పతనానికి దారి తీస్తుంది. ఇప్పుడే కాదు ఇంకా చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నీ ప్రభజగజ్జేగీయ మానంగా వెలుగుతోంది. ఏనాడు నీ సిద్ధగురువు పెట్టిన నియమాన్ని ఉల్లంఘిస్తావో ఆనాడు నీ శకం ముగుస్తుంది.
*మరపు వల్ల, కామం వల్ల, నీవు దోషం చేస్తావని, తదనంతరం నీవు హత్య చేయబడి ప్రేతమై కొన్ని వందల సంవత్సరాలు గాలిలో తిరుగుతుంటావని తోస్తున్నది. నీ పురుషకారం వల్ల, దైవభక్తి వల్ల నీ భవిష్యత్తు నేమైనా మార్చుకోగలవేమో ఆలోచించుకో” శ్రీనాధుడు “యోగిశేఖరా! కాళీదేవి అనుగ్రహపాత్రులైన మీరు ఎన్నో విశేషాలు తెలియజేశారు. మీరు చెప్పిన ప్రయత్నం చేస్తాను. కానీ ఎంత కృతకృత్యుడనవుతానో! ముక్కుకుత్రాడు వేసి గంగిరెద్దును దానిని ఆడించువాడు లాక్కువెళ్ళి ఆడించే విధంగా విధినాతో అడుకుంటున్నది. నాకు మనశ్శాంతి లేదు. చిన్నప్పుడే నా తల్లి దండ్రులు మరణించారు. నా స్వగ్రామం క్రాల పట్టణం ఉప్పెన వచ్చి సముద్రంలో కొట్టుకుపోయింది. నా మేనమామ సనత్కుమారభట్టు నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయన కూతురును నాకు పెండ్లి చేయాలని ఆశించాడు. ఆ అమ్మాయి చాలా వికారంగా ఉంటుంది.*
*నా జీవలక్షణం సౌందర్యోపాసన. ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోనని తిరస్కరించాను. కృతఘ్నుడవని నన్ను దూషించాడు. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. ఆయన పెద్ద అధికారపదవిలో ఉండడం వల్ల నా కెవ్వరూ ఆశ్రయమివ్వలేదు. ఆగమ్మకాకినై ఊళ్ళు పట్టుకు తిరిగాను. ఒక సిద్ధుడైన మహానుభావుడు కరుణించి మంత్రోపదేశం చేశాడు. అది సిద్ధించింది. దాని వల్ల వాగ్దేవి అనుగ్రహించింది. మహా కవియైన మా తాతగారు కమలనా భామాత్యుని వారసత్వంగా కవిత్వం వచ్చింది. సరస్వతీ చింతామణీదేవి ఇచ్చిన శక్తి వల్ల సాహిత్యరంగంలో అప్రతిహత పరాక్రమంతో ప్రకాశిస్తున్నాను. దాని వల్ల సిరిసంపదలు లభించినవి. మీ వంటి మహానుభావులకు ఆతిధ్యమిచ్చి పూజించుకోగల అవకాశం లభించింది. అయితే మీరు నా భవిష్యత్తును గూర్చి చెప్పిన విషయాలు విన్నప్పుడు దిగులు కలుగుతున్నది. నా సాధనశక్తి చాలా పరిమితమైనది. దానివల్ల విధిని మార్చగలనని నాకు నమ్మకం లేదు. నన్ను మీరే రక్షించాలి. బ్రతుకు బాటలో ముండ్ల మీద ఉండవలసి వచ్చింది. ఎన్నో మలుపులు వచ్చినవి. వాటిని మీ ముందు ఏకరువుపెట్టను. ఆ పరిస్థితులలో స్త్రీలోలుడనైనాను. అయితే యే పతివ్రత జోలికి పోలేదు. నా మంత్ర గురువులు మీకు తటస్థించవచ్చు. నేను ఎప్పుడైనా తప్పుచేస్తే నన్ను దయతో క్షమించమని వారికి చెప్పండి. వారిని మళ్ళీ చూచే అవకాశం ఉన్నదో, లేదో వా రెక్కడ ఉన్నారో ? ఏదైనా నన్ను మీరు కాపాడాలి అని ప్రార్ధించాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 543 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*
*🌻 543. 'పుణ్యలభ్య’' - 2 🌻*
*పుణ్యముల వలన క్రమముగ సాయుజ్య మేర్పడును.చివరకు సారూప్య మేర్పడును. సారూప్య మేర్పడుటయే లభ్యమగుట. తన రూపమున శ్రీమాతయే యున్నదని తెలిసి ఆనంద పరవశుడై కీర్తించుచు, దర్శించుచు, సేవించుచూ తాదాత్మ్యము చెందును. ఇది పరాకాష్ఠ. ఈ విధముగ పుణ్యము వలన శ్రీమాత లభించును. కనుక ఆమె పుణ్యలభ్య. ముందు తెలిపిన మూడు నామములు, ఈ నామము ఒక పూర్ణమగు సాధనక్రమము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*
*🌻 543. 'Punyalabhya' - 2 🌻*
*Due to virtues, one gradually takes the form of the deity and then merges into the deity. Awareness is nothing but sarupya. Knowing that Sri Mata is in his form, he sings her glories, takes her darshan and serves her in a state of bliss and oneness. This is the pinnacle. Hence by virtue, Srimata is obtained. So she is virtuous. Of the three namas mentioned earlier, this nama is a complete sequence of sadhana.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments