top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 04, APRIL 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 04, APRIL 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀

1) 🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 27 🌴

2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 871 / Sri Siva Maha Purana - 871 🌹

🌻. దేవాసుర సంగ్రామము - 3 / Mutual fight - 3 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 129 / Osho Daily Meditations  - 129 🌹

🍀 129. బాధ / 129. SUFFERING🍀

4) 🌹 సిద్దేశ్వరయానం - 30🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-6 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-6 🌹

🌻 539. 'శ్రుతిః' - 5 / 539. 'Shrutih' - 6 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 🌴*


*27. యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |*

*క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ ||*


*🌷. తాత్పర్యం : ఓ భరతవంశశ్రేష్టుడా! స్థితిని కలిగియున్నట్టి స్థావర, జంగమములలో నీవు గాంచునదేదైనను క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలిసికొనుము.*


*🌷. భాష్యము : జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతికప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకమున వివరింపబడినది. సృష్టింపబడిన ప్రతిదియు జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది. జగత్తులో వృక్షములు, పర్వతములు, కొండలవంటి అచరసృష్టి కలదు. అదేవిధముగా పలువిధములైన చరసృష్టి కూడా కలదు.*


*అవియన్నియు భౌతికప్రకృతి మరియు ఉన్నతప్రకృతియైన జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉన్నతప్రకృతికి సంబంధించిన జీవుని కలయిక లేక స్పర్శ లేనిదే ఏదియును వృద్ధినొందదు. ఈ విధముగా భౌతికప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనంతముగా సాగుచున్నది. వారి నడుమ సంయోగమనునది శ్రీకృష్ణభగవానునిచే ప్రభావితమగు చున్నందున ఆ భగవానుడే ఉన్నత, న్యూనప్రకృతులను నియమించువాడై యున్నాడు. అనగా భౌతికప్రకృతి భగవానునిచే సృష్టింపబడి, ఉన్నతప్రకృతియైన జీవుడు దాని యందుంచబడగా సర్వకార్యములు, సృష్టి ఒనగూడుచున్నవి.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 516 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 27 🌴*


*27. yāvat sañjāyate kiñcit sattvaṁ sthāvara-jaṅgamam*

*kṣetra-kṣetrajña-saṁyogāt tad viddhi bharatarṣabha*


*🌷 Translation : O chief of the Bhāratas, know that whatever you see in existence, both the moving and the nonmoving, is only a combination of the field of activities and the knower of the field.*


*🌹 Purport : Both material nature and the living entity, which were existing before the creation of the cosmos, are explained in this verse. Whatever is created is but a combination of the living entity and material nature. There are many manifestations like trees, mountains and hills which are not moving, and there are many existences which are moving, and all of them are but combinations of material nature and the superior nature, the living entity. Without the touch of the superior nature, the living entity, nothing can grow.*


*The relationship between material nature and spiritual nature is eternally going on, and this combination is effected by the Supreme Lord; therefore He is the controller of both the superior and inferior natures. The material nature is created by Him, and the superior nature is placed in this material nature, and thus all these activities and manifestations take place.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 871 / Sri Siva Maha Purana - 871 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴*


*🌻. దేవాసుర సంగ్రామము - 3 🌻*


*అపుడు దేవాసుర వినాశకరమగు గొప్ప యుద్ధము జరిగెను. ఆ మహా యుద్ధములో దివ్యములగు అనేక ఆయుధములు ప్రయోగింపబడెను (20). గదలు, చురకత్తులు, పట్టిశములు, చక్రములు, భుశుండీలు, ప్రాసలు, ముద్గరములు, బల్లెములు, గడ్డపారలు, పరిఘలు, శక్తులు, శత్రువుపైకి ప్రయోగించుటకు సిద్ధముగా నున్న గొడ్డళ్లు (21). బాణములు, తోమరములు, కత్తులు, వేలాది ఫిరంగులు, భిందిపాలములు, మరియు ఇతరములగు ఆయుధములు వీరుల చేతులలో ప్రకాశించుచుండెను (22).*


*ఆ యుద్ధములో వీరులు వాటితో తలలను నరుకుచుండిరి. యుద్ధములో రెండు సైన్యములలోని వీరుల గర్జనలతో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను (23). ఆ యుద్ధమునందు ఏనుగులు, గుర్రములు, వాటిపై ఉపవిష్టులైన వీరులు, అనేకరథములలోని రథికులు, సారథులు, పదాతులు అనేక మంది తెగిన దేహములతో పడియుండిరి (24). తెగిన చేతులు, బాహువులు, తొడలు, నడుములు, చెవులు మరియు కాళ్లు, మరియు విరిగిన ధ్వజములు, బాణములు, కత్తులు, కవచములు, శ్రేష్ఠమగు అలంకారములు పడియుండెను (25).*


*ఆ యుద్ధములో సంహరింపబడిన సైనికుల తలలు కుండలములతో గూడి నేలపై చెల్లాచెదరుగా పడియుండెను. ఎగురగొట్టబడిన కిరీటములు నేలపై బడి యుండెను. తెగి పడిన ఏనుగు తుండములు వంటి తొడలతో నిండి భూమి ప్రకాశించెను (26). ఆయుధములతో అలంకారములతో గూడి తెగి పడిన గొప్ప భుజములు మరియు ఇతర అవయవములు తేనెపట్టులవలె నేలపైబడి యుండెను (27). యుద్ధములో పరుగెత్తుచున్న భటులకు మొండెముల కానవచ్చెను. ఆ మొండెములు తమ చేతులలో ఆయుధములను ఎత్తి పట్టుకొని ఎగురుచుండెను (28).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 871 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴*


*🌻 Mutual fight - 3 🌻*


20. Then ensued a great war in which both gods and Asuras were crushed. In that great war many divine and miraculous weapons were hurled.


21-22. Maces, long and short swords, Paṭṭiśas, Bhuśuṇḍis, Mudgaras (different kinds of iron clubs), javelins, spears, Parighas, Śaktis, axes, arrows, Tomaras, Śataghnīs, and other weapons shone in the hands of the heroes.


23. Using these weapons, the heroes severed the heads of each other. It was a jubilant occasion for the roaring heroes of the armies.


24. Elephants, horses, chariots and foot soldiers along with their drivers and riders were hit and split up.


25. The arms, thighs, hands, hips, ears and feet were cut off. The banners, arrows, swords, coats of mail and excellent ornaments were slit and split.


26. The earth shone with heads divested of coronets but with earrings retained, strewn about and with thighs resembling trunks of elephants broken off during the tussle.


27. Severed arms with the ornaments and weapons still retained and other limbs too were lying scattered about like honeycombs.


28. The soldiers running in the battle field saw several headless bodies that jumped with many weapons lifted in their hands.

Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 129 / Osho Daily Meditations  - 129 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 129. బాధ 🍀*


*🕉 ఎవరూ బాధపడాలని కోరుకోరు, కానీ మనలో బాధల బీజాలను మనం మోసుకొస్తాము. మన సాధన మొత్తం పాయింట్ ఆ విత్తనాలను కాల్చడం. దహనం కొంచెం బాధను కలిగించవచ్చు, కానీ ఇది మొత్తం జీవితంతో పోలిస్తే ఏమీ కాదు. 🕉*


*బాధ బీజాలు నాశనమైతే, మీ జీవితమంతా ఆనందమయమైన జీవితం అవుతుంది. కాబట్టి మీరు కేవలం బాధలకు దూరంగా ఉంటే మరియు మీ లోపల ఉన్న బాధలను ఎదుర్కోకుండా ఉంటే, మీరు మీ జీవితమంతా బాధలతో నిండిపోయే పరిస్థితిని సృష్టిస్తున్నారు. మీరు మోస్తున్న గాయాలు ఉపరితలంపైకి వచ్చిన తర్వాత అవి నయం అవుతాయి. ఇది ఒక వైద్యం ప్రక్రియ.*


*కానీ మీకు గాయమైనప్పుడు దాన్ని ఎవరూ తాకకూడదని అకుంటారని నాకు తెలుసు. మీకు అది ఉందని మీరు నిజంగా తెలుసుకోవాలను కోవడం లేదు. మీరు దానిని దాచాలనుకుంటున్నారు, కానీ దాచడం ద్వారా అది నయం కాదు. ఇది సూర్యకిరణాలకు, గాలులకు తెరవబడాలి. ఇది మొదట్లో నొప్పిగా ఉండవచ్చు, కానీ అది నయం అయినప్పుడు, మీరు అర్థం చేసుకుంటారు. మరియు దానిని నయం చేయడానికి వేరే మార్గం లేదు. దీనికి చైతన్యం తీసుకురావాలి. చైతన్యంలోకి తీసుకురావడమే స్వస్థత ప్రక్రియ.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 129 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 129. SUFFERING 🍀*


*🕉 Nobody wants to suffer, but we carry the seeds of suffering within us. The whole point if working on ourselves is to burn those seeds. The burning itself may cause a little suffering, but it is nothing compared to a whole life of misery.  🕉*


*Once the seeds of suffering are destroyed, your whole life will become a life of delight. So if you are just avoiding suffering, and avoiding facing suffering that is inside you, you are creating a situation in which you will be full of suffering your whole life. Once the wounds you are carrying come to the surface they start healing. It is a healing process.*


*But I know that when you have a wound you don't want anybody to touch it. You don't really want to know that you have it. You want to hide it, but by hiding it, it is not going to heal. It has to be opened to the sunrays, to the winds.  It may be painful in the beginning, but when it heals, you will understand. And there is no other way to heal it. It has to be brought to consciousness. Just the very bringing to consciousness is the process of healing.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 30 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 5వ శతాబ్దం నుండి 🏵*


*సీ || గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయోం నమశ్శివాయ

కాద్ర వేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖా యోన్నమశ్శివాయ*

*కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపా యోన్నమశ్శివాయ*


*గీ || గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంధి వాహినీ నిబిడవర్గ బంధుఘోరాంధకారాఙ్ఞ బంధుకిరణ మాలినే శాశ్వతాయో న్నమశ్శివాయ ..(శ్రీనాథుడు)*


*జయఫాలనయన ! శ్రితలోలనయన ! సీతశైలశయన శర్వా ! జయకాలకాల ! జయమృత్యు మృత్యు ! జయదేవదేవశంభో!*


*అని గొంతెత్తి ఆర్తితో పిలుస్తుంటే సదస్యుల, కన్నులు చెమ్మగిల్లేవి. ఆ బాలుని అందరూ ఎంతో ప్రేమతో అభిమానంతో చూచేవారు. అలా చూస్తున్నవారిలో అస్సాం ప్రాంతంలోని నాగభూమి నుండి వచ్చిన దంపతులు మరీ వాత్సల్యంతో చూచేవారు. పౌరాణిక దంపతులకు శ్రద్ధతో సేవలు చేస్తూ వారికి కావలసినవన్నీ సమకూర్చటంతో పాటు ఈ పిల్లవాని విషయంలో ప్రత్యేక ప్రేమ చూపించేవారు. బాలునకు కూడా వారంటే ఇష్టం ఏర్పడింది. వారు తన కోసం చేసిన మధుర భక్ష్యాలు తీసుకొనేవాడు. వారి భాష కూడా హిందీకి దగ్గరగా ఉండటం వల్ల నిత్య సాన్నిహిత్యం వల్ల ఇతనికి కూడా బాగా వచ్చింది. అతని స్నానపానములు, భోజన శయనములు అన్నీ వారే చూచుకొనేవారు. సంతానం లేకపోవటం వల్ల ఇతనినే తమ స్వంతబిడ్డగా భావించేవారు.*


*ఈ విధంగా నాలుగు నెలలూ కైలాసనాధుని సన్నిధిలో తపస్సు లాగా గడచిపోయినవి. దీక్షా విరమణానంతరం అందరూ స్వస్థలాలకు బయలుదేరారు. వెళ్ళే ముందు కొందరు కైలాస పరిక్రమ చేద్దామని అనుకొని యాత్ర ప్రారంభించారు. శివానందశర్మ దంపతులు కూడా వాళ్ళతో కలిశారు. అస్సాం దంపతులు అనారోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఉండి పోయారు. హరసిద్ధశర్మ అంతకు కొద్ది రోజుల ముందే కొందరితో కలసి వెళ్ళి రావటం వల్ల వీళ్ళకు తోడుగా ఉంటాను అన్నాడు. పరిక్రమ యాత్రికులు బయలుదేరారు. సగంపైన వెళ్ళిన తర్వాత మంచు వర్షం విపరీతంగా కురిసి ద్రోవ సరిగా కనపడక కొందరు కాళ్ళు జారి లోయలో పడిపోయినారు. జారిపోయిన వారిలో శివానందశర్మ దంపతులు కూడా ఉన్నారు. నిస్సహాయులైన మిగతావారు దుఃఖంతోనూ బాధపడుతూ పరిక్రమ పూర్తి చేసుకొని విడిదికి చేరారు. పౌరాణిక దంపతుల మరణానికి అందరూ శోక నిమగ్నులైనారు. ఏడుస్తున్న బాలుని చాతుర్మాస్యదీక్షలో ఉన్న వారంతా ఓదార్చారు. అస్సాం దంపతులు క్షణక్షణమూ తోడుగా ఉండి కర్మ చేయించారు. పన్నెండు రోజులు గడచిన తర్వాత ఈ పిల్లవానిని ఏం చేయాలన్న ప్రశ్న ఉదయించింది. కొందరు తెలుగువాళ్ళు ఇతనిని స్వగ్రామానికి తీసుకెళ్ళి అతని బంధువులకు అప్పగిస్తామన్నారు. విచారించిన మీద వీరి కుటుంబానికి ఆస్తిపాస్తులేమీ లేవని ఒకరిద్దరు బంధువులున్నా ఇతనిని పోషించి పెంచి పెద్ద చేసే పరిస్థితి లేదని తేలింది. అస్సాం దంపతులు ఇతని మీద మమకారం పెంచుకొని ఉన్నారు. మేము తీసుకెళ్ళి చదువు చెప్పించి పెంచి పెద్ద చేస్తామని అన్నారు. పిల్లవాడు కూడా వాళ్ళతో వెళ్ళటానికే ఇష్టపడ్డాడు. మిగతా వారూ సరేనన్నారు.*


*అక్కడ నుండి బయలుదేరి అస్సాం చేరటానికి కొంత దీర్ఘకాలం పట్టింది. వారి స్వస్థలం గౌహతి. ఒకప్పుడు దానికే ప్రాగ్జ్యోతిషపురమని పేరు. నరకాసురుని రాజధాని. ఆ వంశం వారు ఎవరూ లేరు. ఇప్పుడెవరో పరిపాలిస్తున్నారు. అష్టాదశ మహాశక్తి పీఠాలలోని కామాఖ్యకాళి అక్కడ ఉన్నది. సతీదేవి శరీర ఖండాలలో యోనిపడిన ప్రదేశం యిది. లలితాదేవి కామేశ్వరి ఆమె కరుణవల్ల పునర్జీవితుడైన మన్మథుడు ఆ దేవిని ఆ ప్రదేశములో ప్రతిష్ఠించాడు. లలితాదేవి చేతులలోని పాశాంకుశములను పెట్టకుండా పుష్పబాణములు, చెరుకు విల్లు మాత్రం కామచిహ్నంగా ఉంచి కామదేవి అని పేరు పెట్టాడు. ఆ దేవి ఎప్పుడు ఎవరి వల్ల మారిందో గాని కాళీదేవిగా మారింది. ఇప్పుడిక్కడ నిత్యము జంతుబలులిస్తారు. అంతా రక్త ప్రవాహముగా ఉంటుంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనుండి భక్తులు వస్తారు. చీనభూముల నుండి కూడా ఎక్కువమంది వస్తారు. అటువంటి పట్టణంలో ఈ దంపతులు నివసిస్తున్నారు. వారు బాగా సంపన్నులు.*


*హరసిద్ధునకు కోరిన విద్యలు నేర్పిస్తున్నారు. వేదశాస్త్రముల మీది కంటే హరసిద్ధునకు పురాణములమీద కావ్యములమీద అభిరుచి ఎక్కువగా ఉంది. కవిత్వం చెప్పటం శ్లోకాలు అల్లటం చేస్తున్నాడు. దానికి తోడు శారీరక విద్యల మీద కూడా ఇష్టంఏర్పడింది. వ్యాయామశాలకు వెళ్ళి మల్లముష్టియుద్ధాలలో నైపుణ్యం సంపాదించాడు. ఆ యుద్ధపాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉండేవారు. మగధ ప్రాంతీయులు గదావిద్యలో, పాంచాలురు మల్లవిద్యలో, ఆంధ్రులు ధనుర్విద్యలో, కాళింగులు, మహారాష్ట్రులు ఖడ్గవిద్యలో ఎక్కువ ప్రావీణ్యం ఆసక్తి చూపేవారు. అయితే ఖడ్గవిద్య సర్వసామాన్యం. నాగజాతివారు కరవాలం తిప్పటంలో అసామాన్య ప్రజ్ఞ చూపేవారు. వారు కత్తి తిప్పుతుంటే మెరుపు తీగ చలిస్తున్నట్లుండేది. హరసిద్ధశర్మ వారిని మించిపోయినాడు. వారిలో కొందరు ఇతనికి ఆప్తమిత్రులైనారు. ఈ సాధన అంతా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడతనికి పదునెనిమిది సంవత్సరాలు వచ్చినవి.*

*(సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 539 - 6  / Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 6 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*

*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*


*🌻 539. 'శ్రుతిః' - 6 🌻*


*జీవుల యందు కూడ సంకల్పము లేర్పడును. అది ఋగ్వేద ఫలము. ప్రాణ స్పందనముగ సామగానము సాగుచుండును. అది జీవుల యందలి సామవేదము. జీవులు క్రియాధీనులై కార్యములు చేయుచుందురు. ఇది వారొనర్చు యజుర్వేదము. ఇట్లు మూడు వేదములు నిత్యము నిర్వర్తింపబడుతున్నవి. ఈ మూడింటి నిర్మలత్వమును బట్టి అధర్వ వేదముగ వారి జీవితము లేర్పడుచుండును. మూడునూ నిష్కల్మషము లైనపుడు, జీవితము దివ్య వైభవముతో కూడి యుండును. కల్మషములు హెచ్చుతగ్గులను బట్టి వైవిధ్యము లేర్పడు చుండును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 6 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*

*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*


*🌻 539. 'Shrutih' - 6 🌻*


*Will also forms in living beings. It is the fruit of Rigveda. The samagana goes on as the response of prana. It is the Samaveda of living beings. Living beings are driven and perform actions. This is the Yajurveda that they perform. Thus the three Vedas are performed all the time. According to the purity of these three, their lives form Atharva Veda. When all three are pure, life is full of divine splendor. Fluctuations in impurities will cause variation.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Komentarze


bottom of page