top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 04, MAY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 04, MAY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀

1) 🌹. శ్రీమద్భగవద్గీత - 528 / Bhagavad-Gita - 528 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 39 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 39 🌴

2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 882 / Sri Siva Maha Purana - 882 🌹

🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 2 / The annihilation of the army of Śaṅkhacūḍa - 2 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 141 / Osho Daily Meditations  - 141 🌹

🍀 141. అసంతోషం / 141. UNHAPPINESS 🍀

4) 🌹 సిద్దేశ్వరయానం - 54 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 1 🌹

🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 1 / 544. 'Punyashravana Kirtana' - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 528 / Bhagavad-Gita - 528 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 4 🌴*


*04. సర్వయోనిషు కౌన్తేయ మూర్తయ: సమ్భవన్తి యా: |*

*తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రద: పితా: ||*


*🌷. తాత్పర్యం : ఓ కౌంతేయా! సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసికొన వలెను.*


*🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వజీవులకు ఆది జనకుడనని ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. వారు భౌతికప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగము వంటివారు. అట్టి జీవులు ఈ లోకమునందే గాక, ప్రతిలోక మందును ఉన్నారు. అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందు వారి నిలిచి యున్నారు. సర్వత్రా నిలిచియున్న అట్టి జీవులు భూమి యందును, జలము నందును, అగ్ని యందును స్థితిని కలిగి యున్నారు.*


*ఈ ఉద్భవము లన్నింటికిని ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజప్రదానములే కారణము. సారాంశమేమనగా సృష్టి సమయమున తమ పూర్వకర్మల ననుసరించి వివిధరూపములను పొందు జీవులు భౌతికప్రకృతి గర్భమున బీజరూపమున ఉంచబడుదురు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 528 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 04 🌴*


*04. sarva-yoniṣu kaunteya mūrtayaḥ sambhavanti yāḥ*

*tāsāṁ brahma mahad yonir ahaṁ bīja-pradaḥ pitā*


*🌷 Translation : It should be understood that all species of life, O son of Kuntī, are made possible by birth in this material nature, and that I am the seed-giving father.*


*🌹 Purport : In this verse it is clearly explained that the Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original father of all living entities. The living entities are combinations of the material nature and the spiritual nature.*


*Such living entities are seen not only on this planet but on every planet, even on the highest, where Brahmā is situated. Everywhere there are living entities; within the earth there are living entities, even within water and within fire. All these appearances are due to the mother, material nature, and Kṛṣṇa’s seed-giving process. The purport is that the material world is impregnated with living entities, who come out in various forms at the time of creation according to their past deeds.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 882 / Sri Siva Maha Purana - 882 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴*


*🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 2 🌻*


*ముక్కంటి, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు నగు మహారుద్రుడు కోపించి వాని అవయవములను శస్త్రపరంపరలతో కొట్టెను (10). అపుడా రాక్షసుడు పదునైన ఖడ్గమును, డాలును తీసుకొని శివుని శ్రేష్ఠవాహనమగు వృషభమును శిరస్సుపై వేగముగా కొట్టెను (11). వాహనమీ తీరున కొట్టబడగా రుద్రుడు వాని ఖడ్గమును మరియు గొప్పగా ప్రకాశించే డాలును అవలీలగా శీఘ్రమే తన క్షురప్రమనే ఆయుధముతో విరుగగొట్టెను (12). తన డాలు విరుగగానే ఆ రాక్షసుడు అపుడు శక్తిని ప్రయోగించెను. తన మీదకు వచ్చుచున్న ఆ శక్తిని హరుడు తన బాణముతో రెండు ముక్కలుగా చేసెను (13). కోపముతో మండిపడిన శంఖచూడాసురుడు చక్రమును ప్రయోగించెను. హరుడు వెంటనే దానిని కూడ తన పిడికిలితో కొట్టి చూర్ణము చేసెను (14). ఆతడు వెంటనే గదను వేగముతో శివుని పైకి విసిరెను. శంభుడు దానిని కూడ వెంటనే విరిచి బూడిద చేసెను (15).*


*అపుడు దానవచక్రవర్తి యగు శంఖచూడుడు చేతితో గొడ్డలిని పట్టుకొని క్రోధముతో వ్యాకులుడై వేగముగా శివుని పైకి పరుగెత్తెను (16). గొడ్డలి చేతియందు గల ఆ రాక్షసుని శంకరుడు వెంటనే తన బాణపరంపరలచే కప్పివేసి అవలీలగా నేలపై బడవేసెను (17). తరువాత ఆతడు క్షణములో తెలివిని దెచ్చుకొని దివ్యములగు ఆయుధములను బాణములను ధరించి మంచి రధమునెక్కి ఆకాశమునంతనూ వ్యాపించి ప్రకాశించెను (18).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 882 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴*


*🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 2 🌻*


10. Mahārudra, the odd-eyed Śiva, the punisher of the wicked and the goal of the good, angrily hit his limbs with various weapons.


11. Taking up his sharp sword and the leather shield the Dānava rushed at the sacred bull of Śiva and hit it on its head.


12. When his bull was hit, Śiva sportively cut off the sword and the shining shield by means of his Kṣurapra.


13. When the shield was split, the Asura hurled his spear. Śiva split it into two with his arrow as it came before him.


14. The infuriated Dānava, Śaṅkhacūḍa hurled a discus. Immediately Śiva smashed it into pieces with his fist.


15. He hurled his club with force at Śiva. Rapidly split by Śiva, the club was reduced to ashes.


16. Then seizing an axe with his hand, the infuriated king of Dānavas, Śaṅkhacūḍa rushed at Śiva.


17. By the volley of his arrows Śiva sportively struck the Asura with axe in his hand.


18. The Dānava quickly regained consciousness and got into his excellent chariot. With divine weapons and arrows he encompassed the whole sky and shone.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 141 / Osho Daily Meditations  - 141 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 141. అసంతోషం 🍀*


*🕉 ప్రజలు సంతోషంగా ఉండాలనుకుంటున్నారని చెబుతారు, కానీ వారు నిజంగా ఉండటానికి ఇష్టపడరు. తప్పిపోతామని భయపడతారు. 🕉*


*మీరు ఏదైనా విషయం గురించి తెలుసుకున్నప్పుడు, మీరు దాని నుండి వేరుగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటే, మీరు వేరు మరియు ఆనందం వేరు. కాబట్టి నిజంగా సంతోషంగా ఉండటం అంటే సంతోషంగా ఉండటం కంటే ఆనందంగా మారడం. మీరు క్రమంగా కరిగిపోతారు. మీరు అసంతోషంగా ఉన్నప్పుడు, మరీ ఎక్కువ. మీరు సంతోషంగా లేనప్పుడు అహం దృష్టికి వస్తుంది. అందుకే అహంభావం గల వ్యక్తులు చాలా అసంతోషంగా ఉంటారు మరియు సంతోషంగా లేని వ్యక్తులు చాలా అహంభావంతో ఉంటారు. పరస్పర సంబంధం ఉంది. మీరు అహంభావంతో ఉండాలంటే, మీరు అసంతోషంగా ఉండవలసి ఉంటుంది.*


*అసంతోషం మీకు నేపథ్యాన్ని మరియు అహం దాని నుండి చాలా స్పష్టంగా, స్ఫటికంలా స్పష్టంగా, నల్లని నేపథ్యంలో తెల్లటి చుక్కలా వస్తుంది. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత తక్కువ అంటారు. అందుకే చాలా మంది సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ నిజంగానే భయపడతారు. నా పరిశీలన ఏమిటంటే ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టమంటారు కానీ సంతోషంగా ఉండడానికి ఇష్టపడరు. తప్పిపోతామని భయపడతారు. ఆనందం మరియు అహం కలిసి వెళ్ళలేవు. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత తక్కువ అంటారు. ఒక సమయం వస్తుంది, ఆనందం మాత్రమే ఉంటుంది మరియు మీరు ఉండరు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 141 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 141. UNHAPPINESS 🍀*


*🕉  People say they would like to be happy, but they really don't want to be. They are afraid that they will be lost. 🕉*


*Whenever you become aware of something, you are separate from it. If you are happy, you are separate and happiness is separate. So being really happy means becoming happiness rather than becoming happy. You dissolve, by and by. When you are unhappy, you are too much. The ego comes into focus when one is unhappy. That's why egoistic people remain very unhappy, and unhappy people remain very egoistic. There is an interconnection. If you want to be egoistic, you have to be unhappy.*


*Unhappiness gives you the background and the ego, comes out of it very clear,  crystal-clear, like a white dot on a black background. The happier  you are, the less you are. That's why many people want to become happy but really they are afraid to. Its my observation that people say they would like to be happy but they really don't want to be. They are afraid that they will be lost. Happiness and egos can't go together. The happier you are, the less you are. There comes a moment when only happiness is, and you are not.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 సిద్దేశ్వరయానం - 54 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*


*తూర్పు బెంగాలులోని జస్వర్ ప్రాంతానికి పరిపాలకునిగా ఉన్న ఒక జమీందారు దగ్గర కులగురువులుగా ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం వారు వేదాధ్యయన పరులుగా మంత్రోపాసకులుగా, ఆధ్యాత్మిక విద్యావేత్తలుగా పేరుగాంచారు. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి బ్రిటీష్ ప్రభుత్వం అప్పుడే, బలాన్ని పెంపొందించు కొంటున్నది. బెంగాలులో ఎక్కువ భాగం నవాబుల పరిపాలనలో ఉన్నది. ముస్లిం మతవిజృంభణం అరికట్టటం కష్టసాధ్యంగా ఉన్నకాలమది. హిందువులంతా మహమ్మదీయుల పాలనలో బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.*


*ఆరాధన మార్గాల దృష్టిలో వంగదేశంలో హిందూ సంప్రదాయాలు రెండు రకాలుగా వ్యాపించి యున్నవి. తాంత్రిక మార్గాలలో కాళీసాధన తీవ్రంగా ప్రచారంలో ఉండగా మరొక వైపు కృష్ణచైతన్య మహాప్రభువు ప్రభావం వల్ల కృష్ణభక్తి కూడా సామాన్య ప్రజల హృదయాలను ఆక్రమించుకొని ఉన్నది. మామూలు ప్రజలంతా ఉభయచరులు. అటు కాళీ ఉత్సవాలకు వెళతారు. ఇటు కృష్ణభజనలకు వెళతారు. చైతన్య మహాప్రభువు యొక్క ముఖ్య శిష్యులు, రూపగోస్వామి, సనాతన గోస్వామి అక్కడివారే. ఆ రెండు సంప్రదాయాల ప్రభావము ఈ రాజ గురువుల కుటుంబం మీద కూడా ఉన్నది. కలకత్తాలోని శక్తి పీఠమయిన కాళీదేవిని తరచుగా వారు దర్శించుటకు వెళ్తూనే ఉంటారు. అదే విధంగా కొన్ని కుటుంబాల వారు కలసి యాత్రికుల గుంపుగా బయలుదేరి భజనలు చేసుకొంటూ మధుర బృందావనాలకు వెళ్ళిరావటం కూడా తరచుగా జరుగుతున్న అంశమే.*


*ఈ రాజగురువుల కుటుంబంలో 19వ శతాబ్దం మొట్టమొదట ఒక ఆడపిల్ల పుట్టింది. చాలాకాలం సంతానం కలగక చిరకాలం కులదేవత అయిన కాళిని ఉపాసించటం వల్ల లేకలేక కలిగిన ఆ బిడ్డకు ముద్దుగా 'యోగేశ్వరి' అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుండే గృహవాతావరణంలో దైవభక్తి ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం వల్ల ఆ లక్షణాలు ఈ బాలికలోనూ నెలకొన్నవి. చిరుతప్రాయంలోనే యోగేశ్వరి భజనలలో పాల్గొనేది. పూజలు చేయటానికి ఉత్సాహం చూపేది. యోగేశ్వరికి షుమారు పదిసంవత్సరాలు వచ్చిన సమయంలో ఆమె తల్లిదండ్రులకు మరొక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయికి అయిదు ఏండ్ల వయస్సు వచ్చేసరికి, ఆయువు తీరి తండ్రి మరణించాడు. వీరి వంశంలో మగపిల్లవాడు లేకపోవటం వల్ల రాజగురువు పదవి వారి సోదరుల కుటుంబాలలో మరొకరికి వెళ్ళిపోయింది. పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉండటం వలన జరుగుబాటుకు లోటు లేదు.*


*ఇలా గడుస్తుండగా వారి గ్రామంలో ఊరి పెద్దలు ఒక పండితుని పిలిపించి భాగవత ప్రవచనం చేయించారు. ఆ పౌరాణికుడు మంచి సమర్థుడు కావటం వల్ల ఎంతో ఆకర్షణీయంగా కమ్మని కంఠంతో భాగవత కథలు వినిపిస్తున్నాడు. అందరితో పాటు యోగేశ్వరి, వాళ్ళ అమ్మ కూడా వెళ్ళేవారు. దశమస్కంధం చెప్పేటప్పుడు ఆ విద్వాంసుడు భాగవతానికి బ్రహ్మ వైవర్త పురాణాన్ని కూడ జోడించి చెప్పటంతో భాగవతంలో లేని కొత్త విశేషాలు ఎన్నో తెలిసినవి. ముఖ్యంగా రాధాదేవిని గురించి చాలా అద్భుతమైన విశేషాలు విన్నారు. తమ ప్రాంతం వారయిన రూపగోస్వామి, సనాతన గోస్వామి మొదలైనవారు చైతన్య మహాప్రభువు శిష్యులై, వైష్ణవులై, కృష్ణభక్తులై మహాప్రభువు ఆజ్ఞవల్ల బృందావనం వెళ్ళి అక్కడ రాధాభక్తులుగా మారిన విషయాలను ఆ పౌరాణికుడు విశదీకరిస్తూంటే బృందావన దర్శనాభిలాష ప్రబలంగా కలిగింది.*


*యమునా తీరానికి వెళ్ళాలని కృష్ణుడు లీలలు ప్రదర్శించిన ప్రదేశాలన్నింటినీ చూడాలని రాధాకృష్ణుల విహార భూమిలో సంచరించి జీవితాలను చరితార్థం చేసుకోవాలని బలమైన ఆకాంక్ష కలిగింది. ఆ ఊళ్ళో ఉన్న చాలామందికి కూడా అటువంటి కోరిక కలగటం వల్ల అంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ పౌరాణికుడు కూడా సకుటుంబంగా వీరితో బయలుదేరాడు.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 544 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 544 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*

*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*


*🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 1 🌻*


*పుణ్య విషయములను వినుట, ప్రశంసించుట గలది శ్రీమాత. పుణ్యమగు కథలను వినుట పుణ్య శ్రవణము. శ్రీమద్రామాయణము, శ్రీమద్భాగవతము, శ్రీమహాభారతము కథలను ప్రవచించునపుడు  అచట శ్రీమాత కూడ చేరి వినును. అట్లే తన కథలను భక్తులు ప్రవచించుకొనునపుడు శ్రీమాత వినును. శాశ్వత కీర్తివంతులగు మహాత్ముల కథలను వినునపుడు కూడ ఆమె ఉత్సాహముతో వినును. హరి కథలు, శివ కథలు, దేవతా విజయములు యిత్యాది ఉపాఖ్యానములను వినినపుడు కూడ ఉత్సాహముతో వినును. అనురక్తితో శ్రవణము చేయును. పుణ్య కథలను వినుటయందు శ్రీమాతయే ఉత్సాహపడి నపుడు వాటియం దాసక్తి లేనివారు ఎంతటి దురదృష్టవంతులు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 544 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*

*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*


*🌻 544. 'Punyashravana Kirtana' - 1 🌻*


*Shrimata is the one who listens to and praises pious things. Listening to pious stories is pious listening. Srimata also joins and listens when the stories of Srimadramayana, Srimadbhagavatam and Srimahabharata are narrated. Shrimata also listens to the devotees prophesying her stories. Even when she listens to the stories of eternally famous Mahatmas, she listens with enthusiasm. She also listens with enthusiasm Hari stories, Shiva stories, deity victories etc. she listens attentively. When Srimata herself is enthusiastic to listen to pious stories, how unfortunate are those that are not interested in them.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page