top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 05, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 05, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 05, JANUARY 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 482 / Bhagavad-Gita - 482 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -13 / Chapter 12 - Devotional Service - 13 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 837 / Sri Siva Maha Purana - 837 🌹

🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 3 / The previous birth of Śaṅkhacūḍa - 3 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 95 / Osho Daily Meditations  - 95 🌹

🍀 95. శక్తి / 95. POWER 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 5 🌹

🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 5 / 520. Sakinyanba Svarupini - 5 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 05, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 43 🍀*


*43. అవిద్యా శార్వరీ భుంజా జంభాసుర నిబర్హిణీ ।*

*శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మ నిర్మూలకారిణీ ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : మనోభూమికలో సచ్చిదానంద అనుభూతి : అచ్చమైన సచ్చిదానందానుభూతి అన్ని భూమికలలోనూ ఒకటే. మనస్సు తరుచుగా ఆ అనుభూతితో తృప్తిచెంది, ఆదే కేవలం సత్యంగా పరిగణించి తక్కినదంతా మహామాయా విశేషంగా త్రోసి పుచ్చడం జరుగుతూ వుంటుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసం

తిథి: కృష్ణ నవమి 23:47:25

వరకు తదుపరి కృష్ణ దశమి

నక్షత్రం: చిత్ర 19:50:05 వరకు

తదుపరి స్వాతి

యోగం: అతిగంధ్ 06:49:32

వరకు తదుపరి సుకర్మ

కరణం: తైతిల 10:58:16 వరకు

వర్జ్యం: 02:20:00 - 04:05:00

మరియు 25:47:56 - 27:30:12

దుర్ముహూర్తం: 09:00:47 - 09:45:18

మరియు 12:43:24 - 13:27:55

రాహు కాలం: 10:57:39 - 12:21:08

గుళిక కాలం: 08:10:41 - 09:34:10

యమ గండం: 15:08:06 - 16:31:35

అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43

అమృత కాలం: 12:50:00 - 14:35:00

సూర్యోదయం: 06:47:12

సూర్యాస్తమయం: 17:55:04

చంద్రోదయం: 00:49:31

చంద్రాస్తమయం: 12:44:23

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: ముసల యోగం - దుఃఖం

19:50:05 వరకు తదుపరి గద యోగం

- కార్య హాని , చెడు

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 482 / Bhagavad-Gita - 482 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము - భక్తియోగము -13 🌴*


*13. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |*

*నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||*


*🌷. తాత్పర్యం : ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును,*


*🌷. భాష్యము : విశుద్ధ భక్తియుత విషయమునకే మరల అరుదెంచి శ్రీకృష్ణభగవానుడు శుద్దభక్తుని దివ్యలక్షణములను ఈ రెండు శ్లోకములందు వివరించుచున్నాడు. శుద్ధభక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడు కలతనొందడు. అతడు ఎవ్వరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువుకు శత్రువు కావలెననియు అతడు తలపడు. పైగా అతడు “నా పూర్వపాపకర్మల కారణముగా ఇతడు నా యెడ శత్రువుగా వర్తించుచున్నాడు. కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు” అని తలపోయును.*


*ఈ విషయమే “తత్తే(నుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం” అను శ్లోకము ద్వారా శ్రీమద్భాగవతమున (10.14.8) తెలుపబడినది. అనగా భక్తుడు కలతకు గురియైనప్పుడు లేదా కష్టము సంప్రాప్తించి నప్పుడు దానిని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. “నా పూర్వపాపము వలన ఇప్పుడు అనుభవించు కష్టము కన్నను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవించ వలసి యున్నది. కాని ఆ భగవానుని కరుణ చేతనే నేను పొందవలసిన శిక్షనంతటిని పొందక, ఆ శిక్షలో కొద్దిభాగమును మాత్రమే నేను పొందుచున్నాను” అని ఆ భక్తుడు తలపోయును. కనుకనే పలు కష్టపరిస్థితుల యందైనను భక్తుడు సదా శాంతుడును, కలతనొందనివాడును, ఓర్పు కలిగినవాడును అయి యుండును. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతివారి యెడను సదా కరుణను కలిగియుండును.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 482 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 13 🌴*


*13. adveṣṭā sarva-bhūtānāṁ maitraḥ karuṇa eva ca*

*nirmamo nirahaṅkāraḥ sama-duḥkha-sukhaḥ kṣamī*


*🌷 Translation : One who is not envious but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant,*


*🌹 Purport : Coming again to the point of pure devotional service, the Lord is describing the transcendental qualifications of a pure devotee in these two verses. A pure devotee is never disturbed in any circumstances. Nor is he envious of anyone. Nor does a devotee become his enemy’s enemy; he thinks, “This person is acting as my enemy due to my own past misdeeds. So it is better to suffer than to protest.”*


*In the Śrīmad-Bhāgavatam (10.14.8) it is stated: tat te ’nukampāṁ su-samīkṣamāṇo bhuñjāna evātma-kṛtaṁ vipākam. Whenever a devotee is in distress or has fallen into difficulty, he thinks that it is the Lord’s mercy upon him. He thinks, “Thanks to my past misdeeds I should suffer far, far greater than I am suffering now. So it is by the mercy of the Supreme Lord that I am not getting all the punishment I am due. I am just getting a little, by the mercy of the Supreme Personality of Godhead.” Therefore he is always calm, quiet and patient, despite many distressful conditions.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 837 / Sri Siva Maha Purana - 837 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴*


*🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 3 🌻*


*మహావీరుడు, మహాబలశాలి యగు ఆ శంఖచూడుడు దేవ-అసుర-దానవ-రాక్షస-గంధర్వ-నాగ-కిన్నర-సర్పాదిసర్వులకు, ముల్లోకములకు ఆధీశ్వరుడాయెను (22,23). రాజరాజేశ్వరుడు, మహాత్ముడునగు ఆ శంఖచూడుడు ఈ విధముగా సకల భువనాధిపత్యమును అనేక సంవత్సరము లనుభవించెను (24). ఆతని రాజ్యములో దుర్భిక్షము, రోగములు, అమంగళ గ్రహములు, అంటు వ్యాధులు, మనోవ్యాధులు, లేక ప్రజలు సర్వదా సుఖముననుభవించిరి (25). భూమి దున్నకుండగనే అనేక సస్యముల నిచ్చెను. వివిధరకముల ఓషధులు సర్వదా రసవంతములై యుండి, సత్ఫలములనిచ్చెను (26). సముద్రములు మణులకు, రత్నములకు నిలయములై యుండెను. వృక్షములు అన్ని కాలములలో పుష్పములను ఫలములను కలిగియుండెను. నదులు స్వచ్ఛ జలములతో నిండియుండెను (27). దేవతలు తక్క మిగిలిన ప్రాణులన్నియూ వికారములు లేకుండగా సుఖముగా నుండెను. నాల్గు వర్ణముల, మరియు ఆశ్రమములకు చెందిన ప్రజలు అందరు తమతమ ధర్మములను ననుష్ఠించిరి (28).


ఆతడు ముల్లోకములను పాలించుచుండగా ఎవ్వరైననూ దుఃఖితులు కాలేదు. కాని దేవతలు మాత్రమే జ్ఞాతివైరమును పట్టుకొని దుఃఖమును పొందిరి (29). బలశాలి, శ్రీకృష్ణుని అనుంగు మిత్రుడు, సర్వదా గోలోకవాసియగు శ్రీకృష్ణుని భక్తి యందు నిష్ఠ గలవాడు, పూర్వజన్మలోని శాపముయొక్క ప్రభావముచే దానవంశములో జన్మించిన వాడు అగు ఆ శంఖచూడుడు దానవుడే అయిననూ దావనబుద్ధిని కలిగియుండలేదు. (30)*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 837 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴*


*🌻 The previous birth of Śaṅkhacūḍa - 3 🌻*


22-23. The great hero, the powerful Śaṅkhacūḍa became overlord of the gods, Asuras, Dānavas, Rākṣasas, Gandharvas, serpents, Kinnaras, Nāgas and in fact of all the people of the three worlds.


24. Thus Śaṅkhacūḍa enjoyed the kingdom of the worlds for many years. He became a great Emperor.


25. There was no famine, plague or pestilence in his realm. The planets were not inauspicious. There was no worry or sickness among the people. The subjects were happy for ever.


26. Even without being tilled, the earth yielded plenty of plants and vegetation. Many medicinal herbs grew up. Plants remained always fruitful and juicy.


27. The oceans yielded plenty of gems and jewels. Abundant flowers and fruits grew up on the Earth. Rivers flowed with pure crystal clear water.


28. Excepting the gods all living beings were happy and free from distress. The people of four castes and stages of life maintained their respective duties and activities.


29. When he ruled, none was miserable in the three worlds. Only the gods were reduced to misery and that too by their fratricidal jealousy and enmity.


30. Śaṅkhacūḍa was a close friend of Kṛṣṇa, the resident of Goloka. He was powerful, and always engaged in devotion to Kṛṣṇa.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 95 / Osho Daily Meditations  - 95 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 95. శక్తి 🍀*


*🕉 శక్తితో పాటు దుర్బలత్వం పెరిగితే. అధికారం దుర్వినియోగం అవుతుందన్న భయం లేదు. 🕉*


*ప్రజలు ఎటువంటి ప్రమాదం లేకుండా జీవించాలని నిర్ణయించుకుంటారు. మీకు అధికారం ఉన్నప్పుడు, మీరు దానిని ఉపయోగించుకునే ప్రతి ప్రమాదం ఉంది. గంటకు రెండు వందల మైళ్ల వేగంతో వెళ్లగలిగే స్పోర్ట్స్ కారు మీ వద్ద ఉన్నప్పుడు, ఏదో ఒక రోజు అంత వేగంగా వెళ్లాలని నిర్ణయించుకునే ప్రమాదం ఉంది. సాధ్యమయ్యే విషయం సవాలుగా మారుతుంది. కాబట్టి ప్రజలు అతి సామాన్యమైన జీవితాలను గడుపుతారు, ఎందుకంటే వారు ఎంత శక్తిలో ఎదగగలరో, ఎంత శక్తివంతులుగా ఉండగలరో వారికి తెలిస్తే,ఇక దానిని ఎదిరించడం కష్టం. ప్రలోభం చాలా ఎక్కువగా ఉంటుంది; వారు మొత్తం మార్గంలో వెళ్లాలని కోరుకుంటారు.*


*యోగా స్థాపకుడైన పతంజలి తన యోగ సూత్రాలలో శక్తి గురించి ఒక అధ్యాయాన్నే వ్రాసాడు,ఈ విషయంలో ప్రతి సాధకుడు చాలా జాగ్రత్తగా నడవడానికి, ఎందుకంటే గొప్ప శక్తితో బాటు గొప్ప ప్రమాదం ఉంటుంది. కానీ నా అభిప్రాయం పూర్తిగా భిన్నమైనది. శక్తితో పాటు దుర్బలత్వం పెరిగితే, భయం లేదు; బలహీనత లేకుండా కేవలం అధికారం పెరిగితే, అప్పుడు భయం ఉంటుంది, అప్పుడు ఏదో తప్పు జరగవచ్చు. పతంజలి భయపడేది అదే, ఎందుకంటే అతని పద్దతి దుర్బలత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది కానీ హాని ఉండదు. ఇది మిమ్మల్ని ఉక్కులాగా బలంగా చేస్తుంది, కానీ గులాబీలా బలంగా కాదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 95 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 95. POWER 🍀*


*🕉  If vulnerability grows along with power.  There is no fear that power will be abused.  🕉*


*People decide to live at the minimum so that there is no risk. When you have power, there is every risk that you will use it. When you have a sports car that can go two hundred miles per hour, there is a risk that one day you will decide to go that fast. The very thing that's possible becomes a challenge. So people live low-key lives, because if they know how much they can rise in power, how powerful they can be, then it will be difficult to resist. The temptation will be too much; they will want to go the whole way.*


*Patanjali, the founder of yoga, has written a whole chapter in his Yoga Sutras about power just to help every seeker to walk very carefully in this area, because great power will be available, and there will be great danger. But my view is totally different. If vulnerability grows along with power, there is no fear; if power grows alone without vulnerability, then there is fear, then something can go wrong. That's what Patanjali is afraid of, because his methodology goes against vulnerability. It gives you power but no vulnerability. It makes you stronger and stronger, like steel, but not strong like a rose.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 520 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 520 - 5 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।*

*ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀*


*🌻 520.  'సాకిన్యంబా స్వరూపిణీ' - 5 🌻*


*మాంసముకన్న మినుమే బలమైనదని ఋషులు తేల్చి చెప్పినారు. మినుము ఇనుమే అను నానుడి కలదు. మాస్టర్ సి.వి.వి. అను పరమగురువు యోగ సాధకుల కందరికినీ సాధనకు మునుపే రెండు మినుప ఇడ్లీలు భుజింపుడని శాసించినారు. భారతదేశమున ఆహార సంప్రదాయము లన్నియూ కేవల ఆరోగ్యమునకే సంబంధించినవి కాక యోగమునకు కూడ ఉపకారములుగ యేర్పరచినారు. బియ్యము, మినుము సమపాళ్ళలో రుబ్బుకొని ఆవిరి కుడుములుగ నేర్పరచుకొని వాటిపై తగు మాత్రము ఆవు నెయ్యిని వేసుకొని ప్రథమ ఆహారముగ భుజించుట ఉత్తమము. మూలాధారము నుండియే నిద్రాణమైన శ్రీమాత చైతన్యము ఉద్భవించి జీవులను చైతన్య మార్గమున ఊర్ధ్వగతికి చేర్చును. దీనినే కుండలినీ ప్రచోదనమని అందురు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 520 - 5 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini*

*aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻*


*🌻 520. Sakinyanba Svarupini - 5 🌻*


*Sages concluded that black gram is stronger than meat. There is a saying that black gram is strong as iron. Master C.V.V. a paramaguru has ruled that all yoga practitioners should eat two idlis made from black gram before practice. All the food traditions in India are not only related to health but also beneficial to yoga. It is best to grind rice and black gram evenly and make steamed dumplings and apply adequate amount of cow ghee on them and eat it as the first food. The dormant Sri Mata Chaitanya emerges from the source and guides the living beings to progress on the path of Chaitanya. This is called kundalini prachodana.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page