top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 06, APRIL 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀 🌹 06, APRIL 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀

🌹 06, APRIL 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

1) 🌹. శ్రీమద్భగవద్గీత - 517 / Bhagavad-Gita - 517 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 28 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 28 🌴

2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 872 / Sri Siva Maha Purana - 872 🌹

🌻. దేవాసుర సంగ్రామము - 4 / Mutual fight - 4 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 130 / Osho Daily Meditations  - 130 🌹

🍀 130. విశ్లేషణ / 130. INTERPRETATION 🍀

4) 🌹 సిద్దేశ్వరయానం - 32🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-7 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-7 🌹

🌻 539. 'శ్రుతిః' - 7 / 539. 'Shrutih' - 7 🌻

🌹 గురువుపై విశ్వాసం / Faith in Master 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 517 / Bhagavad-Gita - 517 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 28 🌴*


*28. సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్ |*

*వినశ్యత్స్వవినశ్యన్తం య: పశ్యతి స పశ్యతి ||*


*🌷. తాత్పర్యం : సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ, పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపరానివారుగా తెలిసికొనగలిగినవాడు యథార్థదృష్టిని కలిగినవాడు.*


*🌷. భాష్యము : దేహము, దేహయజమానియైన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు అనెడి మూడు విషయములను సత్సాంగత్యముచే దర్శింపగలిగినవాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థజ్ఞానము కలిగినవాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరును దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు. వారు కేవలము దేహమునే గాంచుచు, దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని తలతురు. కాని వాస్తవమునకు అట్టి భావన సరియైనది కాదు. దేహము నశించిన పిమ్మటయు ఆత్మ, పరమాత్మ లిరువురు నిలిచియుందురు. అంతియేగాక వారు అనంతముగా పలువిధములైన స్థావర, జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు.*


*జీవాత్మ దేహమునకు యజమానియైనందున “పరమేశ్వర” అను పదమునకు కొన్నిమార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కాని కొందరు “పరమేశ్వర” అను పదమునకు పరమాత్ముడని అర్థము చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచువారే. వారెన్నడును నశింపరు. ఈ విధముగా ఆత్మ, పరమాత్మలను దర్శించువాడు జరుగుచున్నదానిని యథార్థముగా గాంచగలడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 517 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 28 🌴*


*28. samaṁ sarveṣu bhūteṣu tiṣṭhantaṁ parameśvaram*

*vinaśyatsv avinaśyantaṁ yaḥ paśyati sa paśyati*


*🌷 Translation : One who sees the Supersoul accompanying the individual soul in all bodies, and who understands that neither the soul nor the Supersoul within the destructible body is ever destroyed, actually sees.*


*🌹 Purport : Anyone who by good association can see three things combined together – the body, the proprietor of the body, or individual soul, and the friend of the individual soul – is actually in knowledge. Unless one has the association of a real knower of spiritual subjects, one cannot see these three things. Those who do not have such association are ignorant; they simply see the body, and they think that when the body is destroyed everything is finished. But actually it is not so. After the destruction of the body, both the soul and the Supersoul exist, and they go on eternally in many various moving and nonmoving forms.*


*The Sanskrit word parameśvara is sometimes translated as “the individual soul” because the soul is the master of the body and after the destruction of the body he transfers to another form. In that way he is master. But there are others who interpret this parameśvara to be the Supersoul. In either case, both the Supersoul and the individual soul continue. They are not destroyed. One who can see in this way can actually see what is happening.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 872 / Sri Siva Maha Purana - 872 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴*


*🌻. దేవాసుర సంగ్రామము - 4 🌻*


*ఆ యుద్ధములో గొప్ప బల పరాక్రమములు గల వీరులు మిక్కుటముగా గర్జిస్తూ అనేకరకముల శస్త్రాస్త్రములతో ద్వంద్వ యుద్ధములను చేయుచుండిరి (29). కొందరు బంగరు అగ్రములు గల బాణములతో యుద్ధమునందు భటులను సంహరించి వర్షాకాలమేఘముల వలె వీరగర్జనలను చేయుచుండిరి (30). ఒక వీరుడు మరియొక వీరుని, ఆతని రథము మరియు సారథితో సహా, వర్షాకాల మేఘము సూర్యుని వలె, అన్నివైపులనుండి బాణపరంపరలతో కప్పివేసెను (31).*


*ద్వంద్వయుద్ధవీరులు పరస్పరము దాడిచేసుకొనుచూ, ఆహ్వానిస్తూ, ముందుకు దుముకుతూ, ఒకరి నొకరు మర్మస్థానములయందు గాయపరుస్తూ యుద్ధమునుచేసిరి (32). ఆ మహాయుద్ధములో వీరుల గుంపులు తమ చేతులతో ధ్వజములను, ఆయుధములను ధరించి సింహనాదములను చేయుచూ అంతటా కానవచ్చిరి (33). ఆ యుద్ధమునందు మహావీరులు మహానందము గలవారై గొప్ప ధ్వనిని చేయు తమ శంఖములను వేర్వేరుగా మ్రోయించి బిగ్గరగా కేకలను వేయుచుండిరి (34). ఈ విధముగా దేవదానవుల మధ్య చాలకాలము గొప్ప భయంకరమైన బీభత్సకరమైన యుద్ధము జరిగి వీరులకు ఆనందమును కలిగించెను (35). పరమాత్మ, మహాప్రభుడు అగు శంకరుని ఈ లీలచే దేవ, దావన, మనుష్యులతో సహా సర్వప్రాణులు మోహింప చేయబడుచున్నవి (36).*


*శ్రీ శివమహాపురాణములో రుద్రసంహిత యందలి యుద్ధఖండలో దేవదానవ యుద్ధ వర్ణనమనే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 872 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴*


*🌻 Mutual fight - 4 🌻*


29. With different kinds of miraculous and ordinary weapons and missiles, the heroes of great strength and valour fought one another shouting and leaping.


30. Some heroes killed the soldiers with their arrows fitted with goden tips and roared like water-laden rumbling clouds.


31. One hero fully encompassed another hero as well as his chariot and charioteer, by discharging heaps of arrows like the rainy season covering up the sun under the clouds.


32. Fighters of duel rushed against one another, challenging, thrusting and diving in at the vulnerable points.


33. Everywhere groups of heroes were seen in that


terrible war roaring like lions with various weapons displayed in their hands.


34. The heroes in their joy shouted and leapt blowing on their conches of loud sound severally.


35. Thus for a long time the great combat between the gods and Dānavas continued, terrible and tumultuous but delightful to the heroes.


36. Such was the divine sport of the great lord Śiva, the great soul. Everyone including the gods, Asuras and human beings was deluded by it.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 130 / Osho Daily Meditations  - 130 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 130. విశ్లేషణ 🍀*


*🕉 ఆలోచించడం విశ్లేషించే అలవాటు తప్ప మరొకటి కాదు. ఆలోచన మాయమైనప్పుడు మనస్సు యొక్క సరస్సు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఎక్కువ అలలు లేవు-ఏదీ వక్రీకరించబడలేదు, చంద్రుడు సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. 🕉*


*ఆలోచించడం సరస్సులోని అలల వంటిది, మరియు అలల కారణంగా ప్రతిబింబం నిజం కాదు; చంద్రుడు ప్రతిబింబిస్తుంది, కానీ అలలు దానిని వక్రీకరిస్తాయి. భగవంతుడు ప్రతి ఒక్కరిలో ప్రతిబింబిస్తాడు, మనం భగవంతుడిని ప్రతిబింబిస్తాము, కానీ మన మనస్సు చాలా ఆలోచనలు, అలలు, మబ్బులతో నిండి ఉంది, కనుక మనం చూడడానికి వచ్చినవన్నీ ఇకపై ఒకేలా ఉండవు; అది ఉన్నది కాదు. మనస్సు దాని స్వంత ఆలోచనలను దానిపై విధించింది, అది దానిని అర్థం చేసుకుంది మరియు అన్ని వివరణలు ఒక వక్రీకరణయే. వాస్తవికతకు వివరణ అవసరం లేదు; దానికి ప్రతిబింబం మాత్రమే అవసరం.*


*అర్థం చేసుకోవడంలో అర్థం లేదు; వ్యాఖ్యాత పాయింట్‌ను కోల్పోతాడు. మీరు గులాబీని చూస్తే, అది ఉంది: దానిని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు, దానిని విడదీయవలసిన అవసరం లేదు, దాని అర్థం గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇది దాని అర్థం. ఇది రూపకం కాదు; అది వేరొకదాని కోసం నిలబడదు. ఇది కేవలం ఉంది! ఇది వాస్తవం, ఇది చిహ్నం కాదు. ఒక చిహ్నాన్ని అర్థం చేసుకోవాలి, ఒక కలను అర్థం చేసుకోవాలి. కాబట్టి మనోవిశ్లేషణ సరైనది, ఎందుకంటే ఇది కలలను వివరిస్తుంది, కానీ తత్వవేత్తలు సరైనవారు కాదు, ఎందుకంటే వారు వాస్తవికతను అర్థం చేసుకుంటారు. ఒక కల ప్రతీకాత్మకమైనది, అది వేరొకదానిని సూచిస్తుంది. ఇది దేనిని సూచిస్తుందో తెలుసుకోవడానికి ఒక వివరణ సహాయకరంగా ఉండవచ్చు. కానీ గులాబీ ఒక గులాబీ; అది తనకు మాత్రమే నిలుస్తుంది. ఇది స్వయంప్రకాశం.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 130 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 130. INTERPRETATION 🍀*


*🕉 Thinking is nothing but a habit if interpreting. When thinking disappears the lake of the mind is silent, calm, and quiet. Then there are no more waves, no more ripples-nothing is distorted, the moon is reflected perfectly.  🕉*


*Thinking is like ripples in a lake, and because of the ripples, the reflection cannot be true; the moon is reflected, but the ripples distort it. God is reflected in everybody, we mirror God, but our mind is so full of thoughts, waverings, clouds, that whatever we come to see is no longer the same; it is not that which is. The mind has imposed its own thoughts on it, it has interpreted it, and all interpretation is a distortion. Reality needs no interpretation; it needs only reflection.*


*There is no point in interpreting; the interpreter goes on missing the point. If you see a rose, it is there: there is no need to interpret it, there is no need to dissect it, there is no need to know about its meaning. It is its meaning. It is not a metaphor; it does not stand for something else. It is simply there! It is reality, it is not a symbol. A symbol needs to be interpreted, a dream needs to be interpreted. So psychoanalysis is right, because it interprets dreams, but philosophers are not right, because they interpret reality. A dream is symbolic, it stands for something else. An interpretation may be helpful to find out what it stands for. But a rose is a rose; it stands only for itself. It is self-evident.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 సిద్దేశ్వరయానం - 32 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 5వ శతాబ్దం నుండి 🏵*


*హిరణ్య- హర సిద్ద ఈ పాట వింటుంటే ఆర్తితో హృదయం ద్రవిస్తున్నది. ఇటువంటి అద్భుతమైన పాట ఎప్పుడూ వినలేదు.*

*యువకుడు - చెల్లీ ! నీవు కూడా మంచి గాయకురాలివి గదా! ఒకపాట పాడు.*

*హిరణ్మయి - అమ్మో! ఇప్పుడు కాదు. ఇంకోసారి ఎప్పుడైన పాడుతానులే. అందరూ ఇంటిలోకి వెళ్ళి దేవతా పూజలో పాల్గొని భోజనాలు చేశారు.*


*హరసిద్ధుడు ఇంటికి వెళ్ళాడు. అతని ఆహ్వానం మీద అన్నా చెల్లెళ్ళు వాళ్ళ యింటికి రాకపోకలు పెరిగినవి. హిరణ్మయి, హరసిద్ధుడు పరస్పరం ఆకర్షణకు లోనైనారు. అప్పుడప్పుడు ఉత్సవాల పేరుతో క్షేత్రదర్శనాల పేరుతో ఇతరప్రదేశాలకు కలసి వెళ్ళేవారు. సాన్నిహిత్యం పెరిగింది. అక్కడక్కడ నాగయువకుడు పనిమీద అవతలికో, బయటకో వెళ్ళినప్పుడు వారికి ఏకాంతం దొరికేది. ప్రేమ సంభాషణలు మొదలైనవి. అతనికి కొన్ని కొత్త విశేషాలు తెలిసినవి. ఆ అమ్మాయి నాగయువకుని సొంత చెల్లెలు కాదు. వరుస మాత్రమే. వాళ్ళ ఊరు చాలదూరం. క్షేత్రదేవతయైన కాళీదేవిని చూడటానికి పూజలు చేయించుకోటానికి తరచుగా ఇక్కడకు వచ్చేది. హరసిద్ధుడా అమ్మాయి మీద కవిత్వం చెప్పేవాడు. ఆ కన్య చాలా ఆనందించేది. పొంగిపోయేది. తాను కూడా మధురంగా మంజులంగా పాటలు పాడేది. అలా అలా ప్రేమ పెరిగింది.*


*హిరణ్మయి - హరసిద్ధా! నీ ప్రేమకు నేను వశమైపోతున్నాను. నన్నొకదేవతగా ఆరాధిస్తున్న నీ మహత్వాన్ని నేను అందుకోలేకపోతున్నాను.*

*హిరణ్మయి - మహావీరా! అంతమాట అనకండి. నేనే మీ పదాశ్రితురాలిని మిమ్ము విడిచి ఉండలేను. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా నాగయువకుడు వచ్చాడు. "హిరణ్యా! మీ యింటినించి వార్త వచ్చింది. పనియేదో ఉందిట. నిన్ను రమ్మన్నారు. నిన్ను తీసుకొని నన్ను కూడా రమ్మని తెలియజేశారు. అవును ! ఈసారి హరసిద్ధుని కూడా తీసుకువెళ్లామా?"*

*హిరణ్య - ఎలా ? నాన్నగారి అనుమతి కావాలి గదా!*

*నాగ - అది నేను చూచుకొంటాను. నా మిత్రునిగా వస్తాడు.*

*హిరణ్య -నీ యిష్టం నాకూ ఇష్టమే. కానీ జాగ్రత్త. నాకు భయంగా ఉంది.*

*నాగ - ఏమీ భయపడవలసిన పనిలేదు. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. హరసిద్ధా! నీవు మాతో తప్పక రావాలి. హిరణ్య స్వస్థలంలో చాలా అద్భుతాలున్నవి. వాటిని నీకు చూపించాలని నాకు కోరికగా ఉంది.*

*హర - అలా అయితే నాకూ ఇష్టమే.*

*నాగ- మీ అమ్మా నాన్నలతో చెప్పిరా. రేపుదయమే ప్రయాణం.*


*మరునాడు ప్రాతఃకాలములో ముగ్గురూ ఒక రథం మీద బయలుదేరి ఊరిప్రక్కనే బ్రహ్మపుత్రానదీతీరంలోని కొండదగ్గరికి వెళ్ళారు. ఆ కొండ కొంత ఎక్కిన తర్వాత అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక గుహ ఉన్నది. దట్టంగా చెట్లుండటం వల్ల ఆ కొండలోని గుహ ఎవ్వరికీ కనపడదు. నాగయువకుడు ఆ కందరంలోకి దారితీశాడు. హిరణ్మయి నడిచింది. హరసిద్ధునకు ఆశ్చర్యం వేసింది. దూరంగా ఉన్న ఊరికి వెళ్ళవలసిన వాళ్ళు ఈ గుహలోకి దారితీస్తున్నా రేమిటి? అర్థం కాలేదు. అయినా ఏమీ అడుగకుండా వాళ్ళ వెంట నడిచాడు. గుహలో అలవాటు పడ్డవాళ్ళవలె వారు ముందుకు వెళ్తున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద శిలాఫలకం కనిపించింది. ఎదురుగా అంధకారం. ఆ ఫలకం మీద నిల్చున్నారు ముగ్గురు. అది కొంచెం ముందుకు కదలి వేగంగా భూమిలోకి వెళ్ళటం మొదలు పెట్టింది. చాలా సమయం పోయిన తర్వాత ఒక చోట ఆగింది. అక్కడ పెద్ద వెలుతురు అది సూర్యకాంతికాదు. చంద్రుని వెన్నెల కాదు. ఏదో ధగధగమని మణులు మెరిసినట్లుగా పెద్దవెలుగు అలరారుతున్నది. ఇంతలో వీళ్ళ దగ్గరకు సాయుధులైన రాజభటులు వచ్చారు.*


*వారి కవచములమీద శిరస్త్రాణముల మీద సర్పచిహ్నములున్నవి. వారు వచ్చి హిరణ్మయికి నమస్కారం చేసి వీరిని ముందుకు తీసుకువెళ్ళారు. రెండు నిమిషాలలో నాగాభరణాలంకృతలైన కన్యకాగణం వచ్చి రాజకుమారీ! లోపలకు దయ చేయండి అన్నారు. హిరణ్మయి నాగయువకునితో అన్నయ్యా! వీరికిక్కడి విషయాలు చెప్పి నీవు దగ్గరఉండి నాన్నగారి దగ్గరకు తీసుకురా! అని హరసిద్ధునివైపు స్నిగ్ధ వీక్షణములతో చూచి కదిలింది. నాగయువకుడు "మిత్రుడా ! ఈ పాటికి నీవు గ్రహించే ఉంటావు. ఇది నాగలోకం. హిరణ్మయి నాగరాజైన ఐరావతుని కుమార్తె. పెద్దల అనుమతి లేక ఇన్నాళ్ళు విషయం నీకు చెప్పలేదు. ఏర్పాటు చేయబడిన వసతికి వెళ్ళి అక్కడ నుండి మహారాజుగారి దర్శనానికి వెళదాము. వారి సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నేను నీకు చెప్పవలసినపనిలేదు. నీవు ప్రతిభావంతుడవు. నాకూ అన్ని విషయాలు తెలియవు. కాని మనం ఊహించని కొన్ని కొత్తవి ఇక్కడ ప్రస్తావనకు వస్తవి. జాగ్రత్త!" అని వసతికి వెళ్ళి తయారైనారు. రాజప్రతినిధి ఒకరు సైనికులతో వచ్చి వీరిని చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్ళారు.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 గురువుపై విశ్వాసం / Faith in Master 🌹*

*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*


*మీకు గురువుపై పూర్తి విశ్వాసం ఉండాలి మరియు దానిని భంగం పరిచే అవకాశం ఎవ్వరికి మనం ఇవ్వకూడదు. మీరు గురువును ఎందుకు నమ్ముతారని ఒక నాస్తికుడు మిమ్మల్ని అడిగితే, శిష్యుల నమ్మకాన్ని ప్రశ్నించడం అతని పని కాదని, ఇది పూర్తిగా అతని మరియు అతని గురువు మధ్య వ్యక్తిగత విషయం అని మీరు అతనికి గట్టిగా చెప్పాలి. మరొకరి నమ్మకాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. గురువుల మార్గాలు అర్థం చేసుకోవడం సులభం కాకపోవచ్చు. కానీ గురువు ఏ పని చేసినా శిష్యుడికి సహాయం చేయాలనే అపరిమితమైన ప్రేమతో మాత్రమే చేస్తాడు. కొందరు దీనిని అర్థం చేసుకోలేరు మరియు గురువుకు పక్షపాతాన్ని ఆపాదిస్తారు. ఇది అజ్ఞానం వల్లనే. నిజమైన శిష్యులు అలాంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకూడదు మరియు వారి విశ్వాసాన్ని దెబ్బతీసుకోకూడదు. వారు ఎల్లవేళలా అనేకానేకాల్లో ఒకే దైవాన్ని వెతకడానికి ప్రయత్నించాలి.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Faith in Master 🌹*


*You must have full faith in master and should not let anyone disturb it. If an atheist asks you why you believe in Masters you should firmly tell him that it is none of his business to question the disciples belief which is purely a personal matter between him and his Master. No one has a right to question another man's belief. Masters ways may not be easy to comprehend. But whatever master does is only out of His boundless love to help the disciple. Some do not understand this and attribute partiality to Master. This is due to ignorance. True disciples should not give room for such doubts and undermine their faith in Mster. They should always try to strive to seek the One Divine in the many.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 539 - 7  / Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 7 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*

*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*


*🌻 539. 'శ్రుతిః' - 7 🌻*


*కల్మషములు యొక్క హెచ్చుతగ్గులను బట్టి వైవిధ్యము లేర్పడు చుండును. ఇట్లు నాలుగు వేదములు సృష్టి యందు, జీవుల యందు నిర్వహింప బడుచున్నవి.  దీనిని తెలియుట వేదములను తెలియుట.  ఇవి ఎచ్చటి నుండి పుట్టుచున్నవో తెలియుట వేదము తెలియుట.  ఈ వేదమునే శ్రుతి యందురు. ఈ మాత శ్రుతిరూపిణి. ఈ వేదములను వివరించుటకే వేదాంగములు, ఉపనిషత్తులు యేర్పడినవి. వేదాంగములు ఆరు. అవి వరుసగా 1) ఛందస్సు, 2) కల్పము. 3) శిక్ష, 4) వ్యాకరణము, 5) నిరుక్తము, 6) జ్యోతిషము. వీని వలన సృష్టి స్వరూప స్వభావములు కొంత తెలియ వచ్చును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 7 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*

*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*


*🌻 539. 'Shrutih' - 7 🌻*


*Fluctuations in impurities will cause variations. Thus the four Vedas are administered in the world and living beings. To know this is to know the Vedas. To know from where these are born is to know the Vedas. This Veda is called shruti. This mother is in the form of shruti. Vedangas and Upanishads are composed to explain these Vedas. Vedangams are six. They are respectively 1) Chandasu, 2) Kalpa. 3) Shiksha, 4) Grammar, 5) Nirukta, 6) Astrology. Because of this, the nature of creation can be known to some extent.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page