🍀🌹 08, JULY 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 549 / Bhagavad-Gita - 549 🌹
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 25 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 25 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 96 🌹
🏵 జిల్లెళ్ళమూడి అమ్మ 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 2 🌹
🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 2 / 551. 'Sarvavyadhi Prashamani' - 2 🌻
*అనంతం వైపు మనిషి చేసే ప్రయాణం వీరోచితమైనది*
*ప్రసాద్ భరద్వాజ*
?si=jGHYGUqm-HdWVdrH
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 549 / Bhagavad-Gita - 549 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 25 🌴*
*25. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|*
*సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే*
*🌷. తాత్పర్యం : మానావమానములందు సమచిత్తముతో నుండి, శత్రుమిత్రులందు సముడై సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.*
*🌷. భాష్యము :*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 549 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 25 🌴*
*25. mānāpamānayos tulyas tulyo mitrāri-pakṣayoḥ*
*sarvārambha-parityāgī guṇātītaḥ sa ucyate*
*🌷 Translation : The same in honour and dishonour, the same to friend and foe, abandoning allundertakings — he is said to have crossed the qualities.*
*🌹 Purport :*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 96 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 జిల్లెళ్ళమూడి అమ్మ 🏵*
*నేను ఎంతో గౌరవంతో చూచే కృష్ణ భిక్షువు బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అనే గ్రామం వెళ్ళి వచ్చి అక్కడ అనసూయాదేవి అనే ఒక గొప్ప యోగిని ఉందని చెప్పారు. ఆ తరువాత కొద్దిరోజులకు నేను, కృష్ణభిక్షు, మరికొందరు కలసి ఆ గ్రామం వెళ్ళి ఆమె దర్శనం చేసుకొన్నాము. ఆమె చూపిన వాత్సల్యానికి అందరమూ వశులమై పోయినాము. కృష్ణభిక్షు కొంతకాలం అక్కడే ఉండిపోయినాడు కూడా. నాకూ ఆ మాతృమూర్తితో అనుబంధం పెరిగింది. ఆమెను గూర్చి అంబికాసాహస్రి అనే వెయ్యి పద్యాల కావ్యాన్ని రచించాను. మా బృందంలోని కవులు చాలామంది ఆమెను స్తుతిస్తూ రచనలు చేశారు.*
*అవతారమూర్తిగా ప్రసిద్ధిచెందిన ఆమె భౌతికశరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఇటీవల నేనొక సిధ్ధమంత్ర ప్రయోగం చేశాను. ఆమె పరమపదించిన రోజు వచ్చినపుడు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆత్మాకర్షణ విద్య ద్వారా ఆమెను ఆహ్వానించాను. ఆమె వచ్చి నిల్చొన్నది. తపస్సాధనకు సంబంధించి నేనడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానములు చెపుతున్నది. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన సంభవించింది. మా ఇంటి మేడమీద మా చెల్లెలి కుటుంబం ఉంటున్నది. ఆమె మనమరాలు సంవత్సరం బిడ్డ. ఆ బాలిక మేడమెట్ల మీద నుండి దిగి క్రిందకి వచ్చి నా ధ్యానమందిరంలోకి ప్రవేశించి అమ్మకు నమస్కరించింది. నిద్రపోతున్న సంవత్సరం పిల్ల భౌతికంగా క్రిందకి దిగిరావడం సాధ్యం కాదు. ఆ అమ్మాయి సూక్ష్మశరీరం అక్కడకు వచ్చింది.*
*"నువ్వెందుకు వచ్చావు" ? అని నే నడిగాను. ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. "నేను పూర్వజన్మలో (జిల్లెళ్ళమూడి) అమ్మ భక్తురాలను. ఆయువుతీరి మరణించాను. మళ్ళీ అమ్మ భక్తుల కుటుంబంలో పుట్టే అవకాశం కల్గింది. అమ్మ ఇక్కడకు రావడం నాకు తెలిసింది. దర్శనం చేసుకొని నమస్కరిద్దామని వచ్చాను" అన్నది. ఈ తెలిసింది ఎవరికి ? చిన్నపిల్ల శరీరంలోని మనస్సు వైద్యశాస్త్ర రీత్యా అపరిణతమయినది. ఆలోచించే శక్తి ఇంకా రాలేదు. అప్పుడే రాదు. కనుక సూక్ష్మశరీరాశ్రితమైన మనస్సు వేరే ఇంకొకటి ఉన్నది. ఆ మనస్సుకు తాను ఎక్కడ నుండి వచ్చినది తెలుసు. తన పూర్వజన్మ తెలుసు. దేవతామూర్తిగా అనసూయాదేవి దిగిరావటం తెలుసు. అంటే ఈ మనస్సు భౌతిక శరీరాశ్రితమైన మనస్సు కంటే శక్తి కలది. మళ్ళీ అది ఎవరిదో కాదు. ఈ జీవిదే. ఈ విధంగా ఆనాటి సంఘటన ఒక విచిత్రమైన అనుభవాన్ని మిగిల్చింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 2 🌻*
*మనస్సు నిర్మలమైనచో వ్యాధులు శమించును. మనసు నిర్మల మగుటకు కూడ శ్రీమాత ఆరాధనము విశేషముగ ఉపకరించును. నిత్యమూ శ్రద్ధా భక్తులతో శ్రీసూక్త పారాయణ చేయువారికి శ్రీమాతయే వ్యాధి శమనము గావించ గలదు. ఆమె ప్రశమని, అనగా ప్రశస్తమైన శమమును ప్రసాదింప గలదు. మనస్సున, దేహమున వ్యాధులు ప్రబలి దీనుడైన జీవునకు శ్రీమాత ఆరాధనము దివ్యౌషధము. ఆర్తులను బ్రోచుటలో తల్లికన్న దయకలవా రెవ్వరు? కేవలము ఒక్క పిలుపుతో శ్రీమాత పిలుచువాని హృదయము నుండి స్పందించి శమనము కలిగింప గలదు. అందరి హృదయములలో నుండునది ఆమెయే. సమస్త జగత్తు ఆమె హృదయము నుండియే యేర్పడినది. కావున ఒక్క పిలుపుతో పలుకు శ్రీమాత వ్యధల నుండి జీవులకు పరిష్కార మీయగలదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 551. 'Sarvavyadhi Prashamani' - 2 🌻*
*If the mind is pure, diseases will subside. Worshiping Sri Mata is also very helpful in making the mind clear. Shree Mata is able to heal those who recite Shree Sukta daily with devotion and diligence. She is prasmani, i.e. she can bestow great peace. Worship of Sri Mata is a divine medicine for a soul afflicted with diseases in mind and body. Who is more benevolent than a Mother for the afflicted? With just one call, Srimata can respond from the heart of the caller and bring relief. She is the one who is in everyone's heart. The whole world is made up of her heart. Therefore, with a single call, Srimata can cure the living beings of their afflictions.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments