🍀🌹 09, APRIL 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
🌹. 'క్రోధి నామ తెలుగు నూతన సంవత్సర' మరియు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరికి / 'Krodhi' Telugu New Year and Ugadi Greetings to All. 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 29 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 29 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 872 / Sri Siva Maha Purana - 872 🌹
🌻. దేవాసుర సంగ్రామము - 4 / Mutual fight - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 131 / Osho Daily Meditations - 131 🌹
🍀 131. శబ్దం / 131. NOISE 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 34🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-8 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-8 🌹
🌻 539. 'శ్రుతిః' - 8 / 539. 'Shrutih' - 8 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. 'క్రోధి నామ తెలుగు నూతన సంవత్సర' మరియు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరికి / 'Krodhi' Telugu New Year and Ugadi Greetings to All. 🌹*
*🌻ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ 🌻*
*ప్రసాద్ భరధ్వాజ*
*🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀*
*ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది.*
*ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు.*
*🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀*
*చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.*
*శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.*
*🍀. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత.. 🍀*
*ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.*
*🌻. బెల్లం - తీపి - ఆనందానికి ప్రతీక*
*🌻. ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం*
*🌻. వేప పువ్వు - చేదు- బాధకలిగించే అనుభవాలు*
*🌻. చింతపండు - పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన *పరిస్థితులు*
*🌻. పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు*
*🌻. కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 29 🌴*
*29. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |*
*న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||*
*🌷. తాత్పర్యం : సర్వత్ర ప్రతిజీవి యందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు.*
*🌷. భాష్యము : జీవుడు భౌతికస్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మికస్థితికి భిన్నముగా నిలిచియుండును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియున్నాడని అతడు అవగాహనము చేసికొనినచో, అనగా అతడు ప్రతిజీవి యందును ఆ భగవానుని దర్శింపగలిగినచో తన విధ్వంసక మన:ప్రవృత్తిచే తనను తాను హీనపరచుకొనక క్రమముగా ఆధ్యాత్మికజగము వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియప్రీతి కార్యములకు అలవాటు పడియుండును. కాని దానిని పరమాత్మ వైపునకు మళ్ళించినచో మనుజుడు ఆధ్యాత్మికావగాహనలో పురోగతిని పొందగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 518 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 29 🌴*
*29. samaṁ paśyan hi sarvatra samavasthitam īśvaram*
*na hinasty ātmanātmānaṁ tato yāti parāṁ gatim*
*🌷 Translation : One who sees the Supersoul equally present everywhere, in every living being, does not degrade himself by his mind. Thus he approaches the transcendental destination.*
*🌹 Purport : The living entity, by accepting his material existence, has become situated differently than in his spiritual existence. But if one understands that the Supreme is situated in His Paramātmā manifestation everywhere, that is, if one can see the presence of the Supreme Personality of Godhead in every living thing, he does not degrade himself by a destructive mentality, and he therefore gradually advances to the spiritual world. The mind is generally addicted to sense gratifying processes; but when the mind turns to the Supersoul, one becomes advanced in spiritual understanding.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 131 / Osho Daily Meditations - 131 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 131. శబ్దం 🍀*
*🕉 జీవితం సందడిగా ఉంది మరియు ప్రపంచం చాలా రద్దీగా ఉంది. కానీ శబ్దంతో పోరాడటం దానిని వదిలించుకోవడానికి మార్గం కాదు; దాన్ని వదిలించుకోవడానికి మార్గం పూర్తిగా అంగీకరించడమే. 🕉*
*మీరు ఎంత ఎక్కువ పోరాడితే, మీరు మరింత భయాందోళనలకు గురవుతారు, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ పోరాడితే, అది మీకు మరింత ఆందళన కలిగిస్తుంది. హృదయాన్ని తెరవండి, అంగీకరించండి; శబ్దం కూడా జీవితంలో ఒక భాగం. మరియు మీరు దానిని అంగీకరించడం ప్రారంభించిన తర్వాత, మీరు ఆశ్చర్యపోతారు: ఇది మీకు అంతరాయం కలిగించదు. ఆటంకం శబ్దం నుండి రాదు; ఇది శబ్దం పట్ల మన వైఖరి నుండి వస్తుంది. శబ్దం భంగం కాదు; అది శబ్దం పట్ల మన వైఖరితో వస్తుంది. మీరు దానికి వ్యతిరేకులైతే, మీరు కలవరపడతారు; మీరు దానికి వ్యతిరేకం కాకపోతే, మీరు కలవరపడరు. అయినా ఎక్కడికి వెళతారు? మీరు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక రకమైన శబ్దం తప్పనిసరిగా ఉంటుంది; ప్రపంచం మొత్తం సందడిగా ఉంది.*
*హిమాలయాల్లో గుహ కనిపెట్టి కూర్చున్నా కూడా జీవితం లోటుగా ఉంటుంది. శబ్దం ఉండదు, కానీ జీవితం అందుబాటులోకి తెచ్చే అన్ని వృద్ధి అవకాశాలూ ఉండవు, త్వరలో నిశ్శబ్దం నిస్తేజంగా మరియు జీవం లేనట్లు కనిపిస్తుంది. నిశ్శబ్దాన్ని ఆస్వాదించవద్దని నేను అనడం లేదు. నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి; కానీ నిశ్శబ్దం శబ్దానికి వ్యతిరేకం కాదని తెలుసుకోండి. శబ్దంలో నిశ్శబ్దం ఉండవచ్చు. వాస్తవానికి, అది శబ్దంలో ఉన్నప్పుడు-అప్పుడే అది నిజమైన నిశ్శబ్దం. హిమాలయాల్లో మీరు అనుభవించే నిశ్శబ్దం మీ నిశ్శబ్దం కాదు; అది హిమాలయాలకు చెందినది. కానీ మార్కెట్‌లో మీరు నిశ్శబ్దాన్ని అనుభవించగలిగితే, మీరు పూర్తిగా నిశ్చింతగా మరియు ప్రశాంతంగా ఉండవచ్చు, అది మీదే. అప్పుడు నీ హృదయంలో హిమాలయాలు ఉన్నాయి, అదే నిజం!*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 131 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 131. NOISE 🍀*
*🕉 Life is noisy, and the world is too crowded. But to fight with noise is not the way to get rid of it; the way to get rid of it is to accept it totally. 🕉*
*The more you fight, the more nervous you will be, because the more you fight, the more it will disturb you. Open up, accept it; noise too is part of life. And once you start accepting it, you will be surprised: it will no longer disturb you. Disturbance does not come from the noise; it comes from our attitude toward the noise. The noise is not the disturbance; it is the attitude that is the disturbance. If you are antagonistic to it, you are disturbed; if you are not antagonistic to it, you are not disturbed. And where will you go? Wherever you go some kind of noise is bound to be there; the whole world is noisy.*
*Even if you can find a cave in the Himalayas and sit there, you will miss life. Noise will not be there, but all the growth possibilities that life makes available will not be there, either, and soon the silence will look dull and dead. I am not saying don't enjoy silence. Enjoy silence; but know that silence is not against noise. Silence can exist in noise. In fact, when it exists in noise-only then is it real silence. The silence that you feel in the Himalayas is not your silence; it belongs to the Himalayas. But if in the marketplace you can feel silence, you can be utterly at ease and relaxed, it is yours. Then you have the Himalayas in your heart, and that's the true thing!*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 34 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*పురోహితుడు “వీరయువకుడా! రాజాజ్ఞ వల్ల ఆస్థానమాంత్రికులు నీ జీవితగమనాన్ని దివ్యదృష్టితో చూచారు. ఈ కలియుగారంభములో నీవు మాజాతివాడివి. పదిహేనువందల సంవత్సరాలు జీవించావు. తరువాత వచ్చిన జన్మలలోను తపస్సు చేసి దేవతానుగ్రహం వల్ల, మహాకార్యాలు చేశావు. శరీరం పతనమైతే పుణ్యపాపాలు వెంటవస్తవి గాని సిద్ధులు శక్తులు వెంటరావు. మళ్ళీ వచ్చిన జన్మలో కొద్ది తపస్సుకే పూర్వజన్మలో అనుగ్రహించిన దేవతలు కరుణిస్తారు. ప్రస్తుతం ఈ జన్మలో సంస్కారం వచ్చింది కాని శక్తులేవీ ప్రస్తుతం నీకు లేవు. గత జన్మ విశేషాలు ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుపుతున్నాము. ప్రస్తుతం నిన్ను ఇక్కడకు రావించిన కారణం మంత్రిగారు తెలియజేస్తారు" అని కూర్చున్నాడు.*
*మంత్రి : హరసిద్ధా! పరిస్థితి కొంత నీకు అవగతమై ఉంటుంది. లోకదృష్టిలో ఒక మహారాజు కుమార్తెను పెండ్లి చేసుకొనే అర్హత, స్థాయి, నీకు లేవు. కానీ రాజకుమారి నిన్ను ప్రేమించింది. నీ కోసం ఎంత త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉంది. కనుక కొన్ని నిబంధనలు పెడుతున్నాము. వాటిలో నీవు విజయాన్ని సాధిస్తే రాజకుమారి నీ భార్య అవుతుంది. సమ్మతమేనా?*
*హర : హిరణ్మయి కోసం ఏమైనా చేస్తాను. ఆ నిబంధనలు చెప్పండి. అయితే ఎట్టి పరిస్థితులలోను ధర్మవిరుద్ధమైన పని చేయను.*
*మంత్రి : మేమూ చెప్పము. ఇప్పుడు ప్రధానమైన అంశం చెపుతున్నాను. నాగజాతికి అసురజాతికి కొంతకాలం నించి ఘర్షణలు జరుగుతున్నవి. అవి పరిమిత యుద్ధాలకు దారితీస్తున్నవి. వాటిని విస్తరించకుండా జాగ్రత్తలు. పడుతున్నాము. త్వరలో మహాయుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నవి. వారికి వలెనే నాగజాతికి కూడా మహాసైన్యము లున్నవి. కాని జ్యోతిశ్శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని బట్టి ఇది మాకు అనుకూల కాలం కాదు. వారితో పోరాడి గెలవలేము. మా కోసం నీవు యుద్ధం చేసి జయము తెచ్చిపెట్టాలి. నీవు యోగపురుషుడవు నీకు అపజయం లేదని మా మాంత్రికులు చెపుతున్నారు. అంతేకాదు. మా రాజకుమారిని తన కుమారుని కిచ్చి పెండ్లి చేయమని రాక్షస రాజు కోరుతున్నాడు. మహారాజు కది యిష్టం లేదు. రాజకుమారికి ఎలానూ ఇష్టం లేదు. నిన్ను ప్రేమించింది. మీ వివాహం జరిగితే అసుర రాజుతో యుద్ధం తప్పదు.*
*హర : రాజకుమారికోసం మీకోసం నేను యుద్ధం చేస్తాను.*
*మంత్రి : బ్రహ్మక్షత్ర వీరా ! చాలా సంతోషం. కానీ ఇప్పుడున్న శక్తి చాలదు. రాక్షసజాతిలో కొందరు మంత్రవేత్తలున్నారు. వారు కాళీదేవిని తీవ్రమార్గంలో ఉపాసించి భయంకరశక్తులు సాధించారు. శత్రురాజ్యముల మీదకు దాడిచేసి వందల వేలమందిని బంధించి నరబలులిచ్చి క్రూరశక్తులు పొందారు. రణరంగంలోనూ సైన్యాధిపతుల శరీరములు స్తంభింప జేస్తారు.కదలలేని వారిని సంహరిస్తున్నారు. మా శక్తి యుక్తులు వారి ముందు చాలటం*
*హర : మరి మార్గమేమిటి?*
*మంత్రి : నీవు కారణజన్ముడవు. వారిని మించిన శక్తులు నీవు సాధించాలి.*
*హర : నేను తపస్సు చేస్తాను. కాళీదేవి అనుగ్రహం పొంది మన పని సానుకూలం కావటానికి ప్రయత్నిస్తాను.*
*మంత్రి : మహావీరుడా! ఈ విషయాలలో, శీఘ్రమార్గాలు అన్వేషించాలి. ఇందరుండగా కాదు. మహారాజా! మీరు అనుమతిస్తే నేను, పురోహితుడు హరసిద్ధుడు కలిసి ఆలోచించి మీకు నివేదిస్తాము. తుది నిర్ణయం మీరు తీసుకుందురు గాని! సభ ముగిసింది.*
*రాజు : అలానే కానివ్వండి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 8 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*
*🌻 539. 'శ్రుతిః' - 8 🌻*
*ఉపనిషత్తులు బ్రహ్మమును చేరుటకు తెలుపబడిన మార్గములు. వేద వేదాంగములను, ఉపనిషత్తులను వివరించునవే పురాణ ములు, ఇతిహాసములు. పదునెనిమిది పురాణములు, రెండు ఇతిహాసములు కలవు. ఈ మొత్తమును వేద వాఙ్మయ మందురు. ఇదియే శ్రుతి. ఇది ప్రమాణమగు వాఙ్మయము. ఈ శ్రుతియే వేద ప్రమాణము. ఈ మొత్తము శ్రుతిని గురుముఖముగ విని నేర్చుకొనుట శ్రుతి విద్య అనబడుచున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 8 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*
*🌻 539. 'Shrutih' - 8 🌻*
*The Upanishads are the prescribed ways to reach Brahman. Puranas and itihasas explain the Vedas, Vedangas and Upanishads. There are eighteen Puranas and two Itihasas. This put together is called Veda Vajmaya. This is the Shruti. This is a standard Vajmaya. This shruti is the Vedic standard. Learning this entire Shruti by listening to it from a Guru is called Shruti Vidya.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments