🍀🌹 09, DECEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 09, DECEMBER 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 469 / Bhagavad-Gita - 469 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 55 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 55 🌴
11వ అధ్యాయము సమాప్తము. End of 11th Chapter.
🌹. శ్రీ శివ మహా పురాణము - 825 / Sri Siva Maha Purana - 825 🌹
🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 6 / The Vanishing of Viṣṇu’s delusion - 6 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 82 / Osho Daily Meditations - 82 🌹
🍀 82. సరైనది మరియు తప్పు / 82. RIGHT AND WRONG 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 510-1 🌹
🌻 510. ‘మధుప్రీతా’ - 1 / 510. 'Madhupreeta' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 09, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 26 🍀*
*48. వైయాఘ్రనఖభూషశ్చ వత్సజిద్వత్సవర్ధనః |*
*క్షీరసారాశనరతో దధిభాండప్రమర్దనః*
*49. నవనీతాపహర్తా చ నీలనీరదభాసురః |*
*ఆభీరదృష్టదౌర్జన్యో నీలపద్మనిభాననః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఆత్మజ్ఞాన భూమికలకు అధిరోహణం - ఎచ్చోట ఆత్మ తన స్వేచ్ఛా విశాలతల ఎరుకను స్వతస్సిద్ధంగా కలిగి వుంటుందో అట్టి భూమికలలోనికి చేతన ఈ దేహంలో నుండి అధిరోహించ గలిగినప్పుడు తాను ఆత్మననీ, దేహ ప్రాణ మనస్సులు కాననీ అది తెలుసుకో గలుగుతుంది. కనుక చేతన ఎచ్చట కేంద్రీకరించ బడుతున్న దనేదే సాధనలో ప్రధానాంశం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 31:14:24
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: చిత్ర 10:44:13 వరకు
తదుపరి స్వాతి
యోగం: శోభన 23:37:44 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: కౌలవ 18:53:09 వరకు
వర్జ్యం: 16:35:24 - 18:15:48
దుర్ముహూర్తం: 08:03:22 - 08:47:52
రాహు కాలం: 09:21:14 - 10:44:40
గుళిక కాలం: 06:34:22 - 07:57:48
యమ గండం: 13:31:32 - 14:54:58
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:30
అమృత కాలం: 03:50:56 - 05:34:12
మరియు 26:37:48 - 28:18:12
సూర్యోదయం: 06:34:22
సూర్యాస్తమయం: 17:41:50
చంద్రోదయం: 02:59:34
చంద్రాస్తమయం: 14:49:10
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: కాల యోగం - అవమానం
10:44:13 వరకు తదుపరి సిద్ది
యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 469 / Bhagavad-Gita - 469 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 55 🌴*
*55. మత్కర్మకృన్మత్పరమో మద్భక్త: సఙ్గవర్జిత: |*
*నిర్వైర: సర్వభూతేషు య: స మామేతి పాణ్డవ ||*
*🌷. తాత్పర్యం : ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలనెడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడును, నన్నే తన జీవితపరమగమ్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును, సర్వజీవుల యెడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.*
*🌷. భాష్యము : ఆధ్యాత్మికాకాశము నందలి కృష్ణలోకములో దివ్యపురుషుడు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలెనని అభిలషించువాడు ఆ భగవానుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అంగీకరింపవలెను. కనుకనే ఈ శ్లోకము గీతాసారముగా పరిగణింప బడుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనను ప్రయోజనముచే భౌతికజగత్తునందు మగ్నులైనవారును, నిజమైన ఆధ్యాత్మికజీవనమును గూర్చి తెలియనివారును అగు బద్దజీవుల కొరకే భగవద్గీత ఉద్దేశింపబడియున్నది.*
*మనుజుడు ఏ విధముగా తన ఆధ్యాత్మికస్థితిని, భగవానునితో తనకు గల నిత్య సంబంధమును అవగతము చేసికొనగలడో చూపి, ఏ విధముగా భగవద్దామమునకు అతడు తిరిగి చేరగలడో ఉపదేశించుటకే భగవద్గీత ఉద్దేశింపబడినది. మనుజుడు తన ఆధ్యాత్మిక కర్మమున (భక్తియుతసేవ) విజయమును సాధించు విధానమును ఈ శ్లోకము స్పష్టముగా వివరించుచున్నది. కర్మకు సంబంధించినంతవరకు మనుజుడు తన శక్తినంతటిని కృష్ణభక్తిభావన కర్మలకే మరల్చవలెను.*
*శ్రీమద్భగవద్గీత యందలి “విశ్వరూపము” అను ఏకాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 469 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 55 🌴*
*55. mat-karma-kṛn mat-paramo mad-bhaktaḥ saṅga-varjitaḥ*
*nirvairaḥ sarva-bhūteṣu yaḥ sa mām eti pāṇḍava*
*🌷 Translation : My dear Arjuna, he who engages in My pure devotional service, free from the contaminations of fruitive activities and mental speculation, he who works for Me, who makes Me the supreme goal of his life, and who is friendly to every living being – he certainly comes to Me.*
*🌹 Purport : Anyone who wants to approach the supreme of all the Personalities of Godhead, on the Kṛṣṇaloka planet in the spiritual sky, and be intimately connected with the Supreme Personality, Kṛṣṇa, must take this formula, as stated by the Supreme Himself. Therefore, this verse is considered to be the essence of Bhagavad-gītā. The Bhagavad-gītā is a book directed to the conditioned souls, who are engaged in the material world with the purpose of lording it over nature and who do not know of the real, spiritual life.*
*The Bhagavad-gītā is meant to show how one can understand his spiritual existence and his eternal relationship with the supreme spiritual personality and to teach one how to go back home, back to Godhead. Now here is the verse which clearly explains the process by which one can attain success in his spiritual activity: devotional service.*
*Thus end the Bhaktivedanta Purports to the Eleventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Universal Form.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 824 / Sri Siva Maha Purana - 824 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴*
*🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 6 🌻*
*దేవీమూర్తులు ఇట్లు పలికిరి - ఈ బీజములను విష్ణువు ఉన్న స్థానమునందు నాటుడు. అట్లు చేయుట వలన మీ పని సిద్ధించగలదు (42).*
*సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! బ్రహ్మ విష్ణురుద్రుల శక్తులు, త్రిగుణస్వరూపులు అగు ఆ దేవీమూర్తులు ఇట్లు పలికి పిదప అంతర్ధానమును చెందిరి (43). అపుడు బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందరు సంతసిల్లి ఆ బీజములను శ్రద్ధగా స్వీకరించి విష్ణువు ఉన్న స్థానమునకు వెళ్లిరి (44). ఆ దేవతలు వాటిని బృందాదేవియొక్క చితభూమియందు నాటిరి. ఓ మునీ! వారు శివుని శక్తియొక్క అంశలగు ఆ దేవీమూర్తులను స్మరిస్తూ అచట నిలబడియుండిరి (45). ఓ మహర్షీ! నాటిన బీజములనుండి ధాత్రి, మల్లె మరియు తులసి అను మూడు మొక్కలు ఉద్భవించెను (46). సరస్వతినుండి ధాత్రి, లక్ష్మీదేవి నుండి మల్లె, మరియు గౌరీదేవి నుండి తులసి తమస్సత్త్వరజో గుణరూపములై పుట్టినవి (47). ఓ మునీ! స్త్రీ రూపములో నున్న ఆ మొక్కలను చూడగానే విష్ణువు మోహముచే వాటియందు అతిశయించిన రాగము గలవాడై లేచి నిలబడెను (48). ఆతడు మోహమువలన కామనతో మిక్కిలి రాగయుక్తమైన మనస్సుతో వారిపై ఇచ్ఛను కలిగియుండెను. తులసి మరియు ధాత్రి కూడా ఆతనిని ప్రేమతో చూచిరి (49).*
*పూర్వము ఏ బీజము లక్ష్మీదేవి యొక్క శక్తిచే సమర్పింపబడినదో, దాని నుండి ఉద్భవించిన యువతి ఆ కారణముచేతనే ఆతనియందు ఈర్ష్య గలది ఆయెను (50). కావుననే మల్లె మిక్కిలి నిందించదగిన 'బర్బరి' అను పేరును గాంచెను. ధాత్రి మరియు తులసి మొక్కలు విష్ణువునందు ప్రేమను చూపుటచే ఆయనకు సర్వదా ప్రీతిపాత్రములాయెను (51). అపుడు ఆ విష్ణువు తన దుఃఖమును విస్మరించి వారిద్దరితో గూడి దేవతలందరు నమస్కరించుచుండగా సంతోషముతో వైకుంఠమును చేరెను (52).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 824 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴*
*🌻 The Vanishing of Viṣṇu’s delusion - 6 🌻*
The goddesses said:—
42. “Sow these seeds in the place where Viṣṇu is standing. Then your task will be fulfilled.”
Sanatkumāra said:—
43. O sage, after saying this, the goddesses, the Śaktis of Śiva, Viṣṇu and Brahmā, possessed of the three attributes, vanished.
44. Then Brahmā and other gods including Indra took the seeds and went to the place where Viṣṇu was standing.
45. The gods sowed those seeds in the ground where the pyre of Vṛndā had been lit. O sage, they stayed there thinking these as parts of Śiva’s Śakti.
46. Out of the seeds sown, O great sage, three plants shot up—the Myrobalan, the Jasmine and the holy basil.
47. The Myrobalan is born of the creator’s Śakti, the jasmine of Lakṣmī and holy basil of Gaurī, born of the attributes Tamas, Sattva and Rajas.
48. O sage, on seeing the plants in the forms of ladies Viṣṇu stood up with excitement of infatuation over them.
49. On seeing them he was deluded and his mind became overwhelmed by lust. The two plants—the holy basil and Myrobalan looked at him lovingly.
50. The womanlike plant born out of the seed by the Śakti of Lakṣmī became jealous of him.
51. Hence the plant came to be called Varvarī[2] (a kind of wild basil) and was despised by all. The Dhātrī and the Tulasī are always pleasing to him due to their love and affection.
52. Then Viṣṇu forgot his sorrow. Accompanied by them he went to Vaikuṇṭha fully satisfied. He was bowed to by all the gods.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 82 / Osho Daily Meditations - 82 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 82. సరైనది మరియు తప్పు 🍀*
*🕉. సరైనది లేదా తప్పు ఏమీ లేదు. ఇది మీ దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది. 🕉*
*అదే విషయం ఒకరికి సరైనది మరియు మరొకరికి తప్పు కావచ్చు, ఎందుకంటే అది ఇంచు మించు ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి అదే విషయం ఒక క్షణంలో సరైనది కావచ్చు మరియు మరొక క్షణంలో అది తప్పు కావచ్చు, ఎందుకంటే ఇది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు అరిస్టాటల్ వర్గాల్లో బోధించబడ్డారు. ఇది సరైనది మరియు ఇది తప్పు. ఇది తెలుపు మరియు అది నలుపు. ఇది దేవుడు మరియు అది దెయ్యం. ఈ వర్గాలు తప్పు. జీవితం నలుపు మరియు తెలుపుగా విభజించబడలేదు. చాలా భాగం బూడిద రంగులో ఉంటుంది. మరియు మీరు చాలా లోతుగా చూస్తే, తెలుపు అనేది బూడిద రంగు యొక్క ఒక విపరీతమైన, మరియు నలుపు మరొక తీవ్రత, కానీ విస్తీర్ణం బూడిద రంగులో ఉంటుంది. రియాలిటీ బూడిద రంగు. ఎక్కడా విభజించబడలేదు కాబట్టి ఇది అలా ఉండాలి.*
*ఎక్కడా వాటర్‌టైట్ కంపార్ట్‌మెంట్లు లేవు. ఇది మూర్ఖమైన వర్గీకరణ, కానీ ఇది మన మనస్సులలో నాటబడింది. కాబట్టి ఒప్పు మరియు తప్పు నిరంతరం మారుతూ ఉంటాయి. అప్పుడు ఏమి చేయాలి? ఎవరైనా ఖచ్చితంగా నిర్ణయించుకోవాలనుకుంటే స్తంభించి పోతారు. ముందుకి సాగ లేరు. ఏది సరైనది అనే విషయంలో మీకు ఖచ్చితమైన నిర్ణయం ఉన్నప్పుడే మీరు చర్య తీసుకోవాలని అనుకుంటే, మీరు ఎటువంటి చర్య తీసుకోలేరు. మీరు పని చెయ్యాలి మరియు సాపేక్ష ప్రపంచంలో చెయ్యాలి. ఖచ్చితమైన నిర్ణయం ఉండదు, కాబట్టి దాని కోసం వేచి ఉండకండి. చూడండి, చూడండి మరియు మీకు ఏది సరైనదనిపిస్తే అది చేయండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 82 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 82. RIGHT AND WRONG 🍀*
*🕉. There is nothing right or wrong. It all depends on your standpoint. 🕉*
*The same thing can be right to one person and wrong to another, because it more or less depends on the person. The same thing can be right in one moment for a person, and in another moment it can be wrong, because it depends on the situation. You have been taught in Aristotelian categories. This is right and that is wrong. This is white and that is black. This is God and that is the devil. These categories are false. Life is not divided into black and white. Much of it is more like gray. And if you see very deeply, white is one extreme of gray, and black is another extreme, but the expanse is of gray. Reality is gray. It has to be so, because it is not divided anywhere.*
*There are no watertight compartments anywhere. This is a foolish categorization, but it has been implanted in our minds. So right and wrong go on changing continuously. Then what is there to do? If somebody wants to decide absolutely, he will be paralyzed; he will not be able to act. If you want to act only when you have an absolute decision about what is right, you will be paralyzed. You will not be able to act. One has to act, and to act in a relative world. There is no absolute decision, so don't wait for it. Just watch, see, and whatever you feel is right, do it.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*
*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*
*🌻 510. ‘మధుప్రీతా’ - 1🌻*
*మధువు నందు ప్రీతి గలది శ్రీమాత అని అర్థము. మధువనగా మేదస్సు నందు జీవుడు అనుభవించు ఆనందము. అనగా చైతన్యానందము. శ్రీమాత చైతన్య స్వరూపిణి. ఆమె ఆనందమునకు కారణము, శివునితో తాదాత్మ్యత చెందుట వలననే. శ్రీకృష్ణుడు కూడా మధురానాథుడుగ వర్ణింపబడినాడు. మధుర యందలి కృష్ణ భక్తులు అంతరంగమున కృష్ణుని భావించుచు అమితమగు చైతన్యా నందమును పొందిరి. బాహ్యముతో సంబంధము లేక అంతరంగమున కృష్ణానుభూతితో పరవశులై ఆడిపాడిరి. వీరందరును మధురావాసులే. స్వాధిష్ఠానమున గల శ్రీమాత యిట్టి అనుభూతితో జీవుల యందుండి జీవులకు కూడ మధురానుభూతిని పంచుటకు సంసిద్ధమై యున్నది. ఆమె మధుప్రీత. ఆమెను ఆరాధించువారు కూడ అట్టి అనుభూతిని పొందగలరు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*
*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*
*🌻 510. 'Madhupreeta' - 1🌻*
*Shrimata is known to love nectar. Nectar here is joy experienced by the living being in the sweet intellect. That is the joy of consciousness. Srimata is the personification of Chaitanya. The reason for her happiness is her immersion with Lord Shiva. Lord Krishna is also described as Madhuranatha. The Krishna devotees of Mathura realized Krishna within themselves and experienced great bliss of consciousness. They sang and danced with the ecstacy of feeling Krishna Consciousness internally without any connection with the outside. All of them are residents of Madhura. Sri Mata in Swadhishthana is with this ecstacy in the living beings and is ready to give them this ecstacy. She is a lover of nectar or bliss. Thus her worshippers also enjoy the same.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
コメント