🍀🌹 09, FEBRUARY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 09, FEBRUARY 2024 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 499 / Bhagavad-Gita - 499 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -30 / Chapter 12 - Devotional Service - 30 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 854 / Sri Siva Maha Purana - 854 🌹
🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 3 / The Emissary is sent - 3 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 112 / Osho Daily Meditations - 112 🌹
🍀 112. విజ్ఞానం / 112. KNOWLEDGE 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 533 / Sri Lalitha Chaitanya Vijnanam - 533 🌹
🌻 533. 'సర్వతోముఖీ' / 533. 'Sarvatomukhi' 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 09, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చొల్లంగి అమావాస్య, Chollangi Amavasya 🌻*
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 48 🍀*
*48. బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్ర భుజ పాదుకా ।*
*సంధ్యావలిస్త్రి సంధ్యాఖ్యా బ్రహ్మాండ మణిభూషణా ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అపరార్ధ విశ్వపు జగత్ప్రయం : మనం చూచే భౌతిక జగత్తుకు పై న ప్రాణమయ జగత్తు వున్నది. ఈ రెండింటికీ పైన మనోమయ జగత్తు వున్నది. మూడింటినీ మొత్తము మీద అపరార్ధ విశ్వపు జగత్ప్రయంగా పేర్కొన్నారు. సృష్టి వికాసక్రమంలో పృథ్వీ చేతన యందీ మూడునూ ప్రతిష్ఠితములై వున్నవి. కాని, సృష్టి వికాసమునకు పూర్వమందు కూడా పృథ్వీ చేతనకు పైన వీనికి స్వతస్సిద్ధమైన ఉనికి కలదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పౌష్య మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 08:03:16 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: శ్రవణ 23:30:36 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వ్యతీపాత 19:07:35
వరకు తదుపరి వరియాన
కరణం: శకుని 08:02:16 వరకు
వర్జ్యం: 05:47:30 - 07:12:30
మరియు 27:00:40 - 28:24:56
దుర్ముహూర్తం: 09:03:29 - 09:49:26
మరియు 12:53:16 - 13:39:14
రాహు కాలం: 11:04:07 - 12:30:18
గుళిక కాలం: 08:11:47 - 09:37:57
యమ గండం: 15:22:38 - 16:48:48
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 14:17:30 - 15:42:30
సూర్యోదయం: 06:45:36
సూర్యాస్తమయం: 18:14:59
చంద్రోదయం: 06:14:45
చంద్రాస్తమయం: 17:42:17
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: ధూమ్ర యోగం - కార్యభంగం,
సొమ్ము నష్టం 23:30:36 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 499 / Bhagavad-Gita - 499 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 10 🌴*
*10. అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు |*
*నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ||*
*🌷. తాత్పర్యం : అనాసక్తి, పుత్రకళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖదుఃఖ సమయము లందు సమభావము.,*
*🌷. భాష్యము : వాస్తవమైన ఆధ్యాత్మిక జీవనము ఆధ్యాత్మిక గురువును పొందిన పిమ్మటయే ఆరంభమగును గనుక భక్తియోగము నందున్నవారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞానవిధానమే నిజమైన మార్గమని పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడునదంతయు అర్థరహితమే.*
*పుత్ర, కళత్ర, గృహములందు అసంగత్వముగా వారియెడ ఎట్టి ప్రేమను కలిగియుండరాదని భావముకాదు. వాస్తవమునకు ప్రేమకు అవియన్నియును సహజ లక్ష్యములు. కాని ఆధ్యాత్మికపురోగతికి వారు అనుకూలము గాకున్నచో మనుజుడు వారియెడ ఆసక్తిని కలిగియుండరాదు.*
*సుఖదుఃఖములనునవి భౌతిక జీవనమునకు అనుబంధమైన విషయములు. కనుక గీత యందు ఉపదేశింప బడినట్లు వాటిని సహించుటను అలవరచు కొనవలెను. సుఖదుఃఖముల రాకపోకలను నిరోధించుట అసాధ్యము గనుక మనుజుడు భౌతిక జీవన విధానమునందు ఆసక్తిని విడనాడ వలెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 499 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 10 🌴*
*10. asaktir anabhiṣvaṅgaḥ putra-dāra-gṛhādiṣu*
*nityaṁ ca sama-cittatvam iṣṭāniṣṭopapattiṣu*
*🌷 Translation : Detachment; freedom from entanglement with children, wife, home and the rest; even-mindedness amid pleasant and unpleasant events;*
*🌹 Purport : The principle of accepting a spiritual master, as mentioned in the eighth verse, is essential. Even for one who takes to devotional service, it is most important. Transcendental life begins when one accepts a bona fide spiritual master. The Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, clearly states here that this process of knowledge is the actual path. Anything speculated beyond this is nonsense.*
*As for detachment from children, wife and home, it is not meant that one should have no feeling for these. They are natural objects of affection. But when they are not favorable to spiritual progress, then one should not be attached to them.*
*Happiness and distress are concomitant factors of material life. One should learn to tolerate.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 32 🌴*
*🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 3 🌻*
*శంఖచూడుడిట్లు పలికెను- దేవతలకు రాజ్యము నీయను. రాజ్యము (భూమి) వీరులు అనుభవింప దగినది. ఓ రుద్రా! దేవపక్షపాతివగు నీకు యుద్ధమును ఇచ్చెదను. (18) శత్రువునకు తనపై దండెత్తే అవకాశము నిచ్చు వీరుడు ఈ లోకములో అధముడు. ఓరుద్రా! కావున నేను ముందుగా నీపై దండెత్తెదను. దీనిలో సందేహము లేదు (19). నా జైత్రయాత్రను పరిశీలించినచో, నేను రేపు తెల్లవారు సరికి అచటకు చేరగలను. నీవు వెళ్లి నా ఈ వచనమును రుద్రునకు చెప్పుము (20). శంభుని దూతయగు పుష్పదంతుడు గర్వితుడగు శంఖచూడుని ఈ వచనములను విని నవ్వి ఆ రాక్షసరాజుతో నిట్లనెను (21). ఓ రాజశేఖరా! శంకరుని గణముల యెదుట నైననూ నిలువగలిగే యోగ్యత నీకు లేదు. ఇక శంకరుని ఎదుట నిలబడుట గురించి చెప్పునదేమున్నది? (22). కావున నీవు అధికారములనన్నిటినీ దేవతలకు అప్పజెప్పుము. ఓరీ! నీకు జీవించు కోరిక ఉన్నచో, పాతాళమునకు పొమ్ము (23). ఓ రాక్షసశ్రేష్ఠా! శంకరుడు సామాన్య దేవతయని తలంచుకుము. ఆయన సర్వులకు, మరియు ఈశ్వరులకు కూడ ఆధీశ్వరుడగు పరమాత్మ (24).*
*ఇంద్రాది సమస్త దేవతలు, ప్రజాపతులు, సిద్ధులు, మునులు, మరియు నాగశ్రేష్ఠులు ఆయన ఆజ్ఞకు నిత్యము వశవర్తులై ఉందురు (25). బ్రహ్మ విష్ణువులకు ప్రభువగు ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా అగుచున్నాడు. ఆయన కనుబొమను విరిచినంతమాత్రాన సర్వలోకములకు ప్రళయము వాటిల్లును (26). లోకములను సంహరించే రుద్రుడు శివుని పూర్ణస్వరూపుడు. వికారములు లేని ఆ పరాత్పరుడు దుష్టులను సంహరించి సత్పురుషులకు శరణు నొసంగును (27). ఆ మహేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు కూడ అధీశ్వరుడు. ఓ దానవశ్రేష్ఠా! ఆయన శాసనమును తిరస్కరించుట తగదు (28).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 854 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 32 🌴*
*🌻 The Emissary is sent - 3 🌻*
Śaṅkhacūḍa said:—
18. I will never return the kingdom to the god. The earth shall be enjoyed by heroic warriors. O Śiva, I shall fight with you who are a partisan of the gods.
19. The hero who allows another to supercede him is the basest in the world. Hence O Śiva I shall certainly march towards you just now.
20. I reach there in the morning in the course of my victorious campaign. O messenger, go and tell all this to Siva.
Samtkumāra said:—
21. On hearing these words of Śaṅkhacūḍa, the emissary of Śiva laughed aloud and then spoke haughtily to the lord of the Asuras.
Puṣpadanta said:—
22. O Great king, you cannot face the Gaṇas of Śiva. Then how can you face lord Śiva himself?
23. So return their positions of authority to the gods entirely. Move immediately to Pātāla if you wish to live.
24. O excellent Dānava, do not regard Śiva an ordinary deity. He is indeed the great soul, the lord of the lord of all.
25. Indra and other gods abide by his commands. The Siddhas, the patriarchs, the sages and the serpent lords all follow suit.
26. He is the overlord of Viṣṇu and Brahmā. He is both possessed and devoid of attributes. By a mere twitch of his knitted eyebrow everything is dissolved.
27. Śiva is the perfect form of gods, the cause of the annihilation of the worlds, the goal of the good, the destroyer of the wicked. He is free from aberrations. He is greater than the greatest.
28. He is the overlord of Brahmā. He is lord Śiva even into Viṣṇu. O excellent Dānava, his behest should never be slighted.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 112 / Osho Daily Meditations - 112 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 112. విజ్ఞానం 🍀*
*🕉 గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, విజ్ఞానం (నాలెడ్జ్) జ్ఞానం కాదు, అలా ఉండదు కూడా; అంతే కాదు, ఇది జ్ఞానానికి వ్యతిరేకం, ఇది వివేకం తలెత్తకుండా నిరోధించే అవరోధం. 🕉*
*విజ్ఞానం అబద్ధపు నాణెం, కపటి. అది తెలిసినట్లు నటిస్తుంది. దానికి ఏమీ తెలియదు, కానీ అది ప్రజలను మోసం చేస్తుంది-ఇది కోట్ల మంది ప్రజలను మోసం చేస్తుంది-మరియు ఇది చాలా సూక్ష్మమైనది, ఒక వ్యక్తి నిజంగా తెలివితేటలు కలిగి ఉంటే తప్ప ఈ వాస్తవం గురించి ఎప్పటికీ తెలుసుకోలేడు. మరియు అది చాలా లోతుగా పాతుకుపోయింది, ఎందుకంటే మన చిన్ననాటి నుండి మనం దానిలో నిబంధన చేయబడుతున్నాము. తెలుసుకోవడం అంటే కూడబెట్టడం, సమాచారాన్ని సేకరించడం, డేటాను సేకరించడం. ఇది మిమ్మల్ని మార్చదు-మీరు అలాగే ఉంటారు; మీ సమాచార సేకరణ మరింత పెద్దదిగా మారుతుంది.*
*జ్ఞానం మిమ్మల్ని మారుస్తుంది. ఇది నిజంగా సమాచారం, కేవలం 'సమాచారం' మాత్రమే కాదు - ఇది మీ అంతరంగాన్ని కొత్త మార్గంలో ఏర్పరుస్తుంది. ఇది పరివర్తన. ఇది చూడటం, తెలుసుకోవడం, ఉండటం లో కొత్త కోణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి అస్సలు విషయ జ్ఞానం లేనివాడు కానీ జ్ఞ్యాని కావడం సాధ్యమే. ఒక వ్యక్తి చాలా సమాచారం, విషయ జ్ఞానం ఉన్నప్పటికీ అజ్ఞానంలో ఉండటం కూడా సాధ్యమే. నిజానికి, ప్రపంచంలో జరిగింది అదే: ప్రజలు మరింత విద్యావంతులుగా, మరింత అక్షరాస్యులుగా మారారు. సార్వత్రిక విద్య అందుబాటులో ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులయ్యారు మరియు జ్ఞానం కోల్పోయింది. పుస్తకాల నుండి విజ్ఞానం చాలా తేలికగా అందుబాటులోకి వచ్చింది - జ్ఞానం గురించి ఎవరు పట్టించుకుంటారు? జ్ఞానానికి సమయం, శక్తి, భక్తి, అంకితభావం అవసరం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 112 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 112. KNOWLEDGE 🍀*
*🕉 The most important thing to remember is that knowledge is not wisdom, and it cannot be; not only that, but it is anti wisdom, it is the barrier that prevents wisdom from arising. 🕉*
*Knowledge is the false coin, the pretender. It pretends to know. It knows nothing, but it can befool people-it is befooling millions of people-and it is so subtle, that unless one is really intelligent one never becomes aware of this fact. And it is so deep-rooted, because from our childhoods we have been conditioned in it. To know means to accumulate, to collect information, to collect data. It does not change you-you remain the same; just your collection of information becomes bigger and bigger.*
*Wisdom transforms you. It is really information, not just "information"--it forms your inner being in a new way. It is transformation. It creates a new quality of seeing, knowing, being. So it is possible for a person to be not at all informed and yet be wise. It is also possible for a person to be very much informed and still be very unwise. In fact, that's what has happened in the world: People have become more educated, more literate. Universal education is available, so everybody has become knowledgeable, and wisdom has been lost. Knowledge has become so easily available from paperbacks--who bothers about wisdom? Wisdom takes time, energy, devotion, dedication.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 533 / Sri Lalitha Chaitanya Vijnanam - 533 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*
*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*
*🌻 533. 'సర్వతోముఖీ' 🌻*
*అన్ని దిక్కుల యందు ముఖము కలది శ్రీమాత అని అర్థము. సహస్రమను సంఖ్యను 10 x 10 × 10గ గుర్తించవచ్చును. పదిమార్లు ఆరోహణము చేసినపుడు ఒక పూర్ణమగు స్థితి లభించును. అట్టిది నూరుమార్లు పూర్ణ స్థితిగ ఊహించినచో వేయి సంఖ్య అనగా ఎంతటి పరిపూర్ణమో తెలియును. వేయి దళములు, వేయి శబ్దములు, వేయి రంగులు, వేయి అక్షరములు, వేయి ఆయుధములు యిట్లు ఊహించినపుడు, ఊహించు వాడు కరగిపోవుటయే జరుగును. ఇచ్చట పది దిక్కుల యందును, ఉన్ముఖముగ నున్న శ్రీమాత ముఖములు వర్ణింపబడినవి. అనగా విశ్వమునంతనూ ఒక్కమారుగ దర్శనము చేయు శక్తి అని తెలియవలెను. అన్ని దిక్కులను ఏక కాలమున అనుగ్రహించు మాత అని తెలియ వలెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 533 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*
*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻*
*🌻 533. 'Sarvatomukhi' 🌻*
*Shrimata has a face in all directions. The number Sahasra can be identified as 10 x 10 x 10. After ascending ten times one attains a perfect state. If you imagine it as a perfect state a hundred times, you will know how perfect the number of thousand is. When one imagines a thousand petals, a thousand sounds, a thousand colors, a thousand spells, a thousand weapons, the imaginer melts away. Here, the faces of Sri Mata are depicted in ten directions. In other words, it should be known as the power to see the entire universe in a single look. It is to be known that she is the mother who blesses all directions at the same time.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
留言