top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 09, JANUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 09, JANUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 09, JANUARY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 484 / Bhagavad-Gita - 484 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -15 / Chapter 12 - Devotional Service - 15 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 839 / Sri Siva Maha Purana - 839 🌹

🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 5 / The previous birth of Śaṅkhacūḍa - 5 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 97 / Osho Daily Meditations  - 97 🌹

🍀 97. ప్రేమించడం / 97. MAKING LOVE 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 🌹

🌻 525. 'హంసవతీ', 526. 'ముఖ్యశక్తి సమన్వితా' - ప్రధ, 527. ‘హరిద్రాన్నైక రసికా', 528. 'హాకినీ రూపధారిణీ', 524. 'Majjasanstha', 525. 'Hamsavati', 526. 'Mukhyashakti Samanvita', 527. 'Haridrannaika Rasika', 528. 'Hakkini Roopadharini', 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 09, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*


*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 35 🍀*


*68. నఖదంష్ట్రాయుధో విష్ణుభక్తో భక్తాభయప్రదః |*

*దర్పహా దర్పదో దంష్ట్రాశతమూర్తిరమూర్తిమాన్*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సచ్చిదానందంలో రెండు తరగతులు లేవు : సచ్చిదానందంలో రెండు తరగతులు ఉన్నవనుటకు వీలులేదు. అది ఎల్లప్పుడూ ఒక్కటిగానే వుండే సిద్ధవస్తువు. దానిని గురించిన జానం మాత్రం అనుభూతి పొందే చేతనా భూమికను బట్టి మారుతూ వుంటుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: కృష్ణ త్రయోదశి 22:26:46

వరకు తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: జ్యేష్ఠ 21:11:59

వరకు తదుపరి మూల

యోగం: వృధ్ధి 24:22:55

వరకు తదుపరి ధృవ

కరణం: గార 11:14:05 వరకు

వర్జ్యం: 03:27:52 - 05:00:24

మరియు 28:41:40 - 30:11:36

దుర్ముహూర్తం: 09:02:06 - 09:46:43

రాహు కాలం: 15:10:12 - 16:33:52

గుళిక కాలం: 12:22:53 - 13:46:33

యమ గండం: 09:35:34 - 10:59:13

అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44

అమృత కాలం: 12:43:04 - 14:15:36

సూర్యోదయం: 06:48:14

సూర్యాస్తమయం: 17:57:32

చంద్రోదయం: 04:31:32

చంద్రాస్తమయం: 15:43:37

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు: ముద్గర యోగం - కలహం

21:11:59 వరకు తదుపరి ఛత్ర యోగం

- స్త్రీ లాభం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 484 / Bhagavad-Gita - 484 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -15 🌴*


*15. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ య: |*

*హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||*


*🌷. తాత్పర్యం : ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.*


*🌷. భాష్యము : భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించి యుండును.*


*వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును. ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 484 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 15 🌴*


*15. yasmān nodvijate loko lokān nodvijate ca yaḥ*

*harṣāmarṣa-bhayodvegair mukto yaḥ sa ca me priyaḥ*


*🌷 Translation : He by whom no one is put into difficulty and who is not disturbed by anyone, who is equipoised in happiness and distress, fear and anxiety, is very dear to Me.*


*🌹 Purport : A few of a devotee’s qualifications are further being described. No one is put into difficulty, anxiety, fearfulness or dissatisfaction by such a devotee. Since a devotee is kind to everyone, he does not act in such a way as to put others into anxiety. At the same time, if others try to put a devotee into anxiety, he is not disturbed. It is by the grace of the Lord that he is so practiced that he is not disturbed by any outward disturbance. Actually because a devotee is always engrossed in Kṛṣṇa consciousness and engaged in devotional service, such material circumstances cannot move him.*


*Generally a materialistic person becomes very happy when there is something for his sense gratification and his body, but when he sees that others have something for their sense gratification and he hasn’t, he is sorry and envious. When he is expecting some retaliation from an enemy, he is in a state of fear, and when he cannot successfully execute something he becomes dejected. A devotee who is always transcendental to all these disturbances is very dear to Kṛṣṇa.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 839 / Sri Siva Maha Purana - 839 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴*


*🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 5 🌻*


*విష్ణువు ఇట్లు పలికెను- యోగులకైననూ పొంద శక్యము కాని వైకుంఠమునకు నీవేల వచ్చితివి? నీకు వచ్చిన కష్టమేమి? నా ఎదుట సత్యమును పలుకుము (41).*


*సనత్కుమారుడిట్లు పలికెను- విష్ణువు యొక్క ఈమాటను విని బ్రహ్మ పలుమార్లు ప్రణమిల్లి చేతులు జోడించి తల వంచి వినయముతో నమస్కరించి, అపుడు శంఖచూడుడు చేసిన పనిని, దేవతలకు సంప్రాప్తమైన ఆపదను విష్ణుపరమాత్మ యెదుట వివరముగా చెప్పెను (42, 43). ఆ వృత్తాంతమునంతనూ విని అందరి మనోభావనలనెరింగే హరి భగవానుడు ఆ శంఖచూడుని రహస్యము నెరింగి నవ్వి బ్రహ్మతో నిట్లనెను (44).*


*శ్రీవిష్ణుభగవానుడిట్లు పలికెను- ఓ పద్మసంభవా! నా భక్తుడు, గొప్ప తేజశ్శాలి, పూర్వజన్మలో గోపాలకుడు అగు శంఖచూడని వృత్తాంతమునంతనూ నేను ఎరుంగుదును (45). పూర్వము జరిగిన ఈ వృత్తాంతము నంతనూ వినుడు. శంకరుడు మంగళమును చేయగలడు. సందేహము వలదు (46). ఆ శివుని లోకము సర్వలోకములకు పైన గలదు. పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు అగు శంభుడు ఆ లోకములో అతిశయించి ప్రకాశించుచున్నాడు (47). ప్రకృతి పురుషులిద్దరికీ అధిష్టానమగు ఆయన ఇచ్ఛా క్రియా జ్ఞానములను మూడు శక్తులను ధరించి యున్నాడు. ఆయన నిర్గుణుడైననూ సగుణుడు కూడా. సరవోత్కృష్ట స్వయం ప్రకాశమే ఆయన స్వరూపము (48).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 839 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴*


*🌻 The previous birth of Śaṅkhacūḍa - 5 🌻*


Viṣṇu said:—

41. Why have you come to Vaikuṇṭha inaccessible even to Yogins. What distress has befallen you. Tell me just here.


Samtkumāra said:—

42-43. On hearing the words of Viṣṇu and bowing to him with palms joined in reverence he narrated to him the activities of Śaṅkhacūḍa and the distress suffered by the gods.


44. On hearing that Viṣṇu who knew everything laughed. The lord then told Brahmā the secret of Śaṅkhacūḍa.


Lord Viṣṇu said:—

45. O lotus-born Brahmā, I know everything about Śaṅkhacūḍa, a great devotee of mine, of great splendour and who had been formerly a cowherd.


46. Hear all the details about him, the old narrative. There is nothing to be suspected. Śiva will necessarily perform what is good.


47-48. His region called Śivaloka is greater than the greatest. It is above everything. Śiva, the supreme Brahman, the great god shines there. He is the presiding deity of Prakṛtī and Puruṣa. He wears three Śaktis. He is both devoid and possessed of attributes. He has the great splendour for his form.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 97 / Osho Daily Meditations  - 97 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 97. ప్రేమించడం 🍀*


*🕉 ప్రేమను ఆదరించాలి, చాలా నెమ్మదిగా రుచి చూడాలి, తద్వారా అది మీ ఉనికిని నింపుతుంది మరియు మీరు ఇక లేరు అనేంత స్వాధీన అనుభవం అవుతుంది. మీరు ప్రేమించటం లేదు - మీరే ప్రేమ. 🕉*


*ప్రేమ మీ చుట్టూ పెద్ద శక్తిగా మారుతుంది. ఇది మిమ్మల్ని మరియు మీ ప్రేమికుడిని అధిగమించగలదు, తద్వారా మీరు ఇద్దరూ దానిలో లీనమైపోతారు. అయితే దాని కోసం మీరు వేచి ఉండాలి. ఆ క్షణం కోసం వేచి ఉంటే త్వరలో మీరు దాని నైపుణ్యాన్ని పొందుతారు. శక్తి కూడుకొని దానిని స్వయంగా జరగనివ్వండి. క్రమంగా, ఆ క్షణం తలెత్తినప్పుడు మీరు తెలుసుకుంటారు. మీరు దాని లక్షణాలు, ముందస్తు లక్షణాలు చూడటం ప్రారంభిస్తారు, ఆపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు సహజంగా ప్రేమలో పడే క్షణం తలెత్తకపోతే, వేచి ఉండండి;తొందర లేదు. పాశ్చాత్య మనస్సు చాలా హడావిడిగా ఉంటుంది--ప్రేమించేటప్పుడు కూడా, అది పూర్తి చేయవలసిన పనిగా ఉంటుంది.*


*అది పూర్తిగా తప్పుడు వైఖరి. మీరు ప్రేమను మార్చలేరు. ఇది జరిగినప్పుడు జరుగుతుంది, ఇది జరగకపోతే, చింతించాల్సిన పని లేదు. ఎలాగైనా ప్రేమించాలి అనే అహంకార ప్రక్రియగా చేసుకోకండి. పాశ్చాత్య మనస్సులో ఇది కూడా ఉంది; మనిషి తాను ఎలాగైనా ప్రదర్శించాలని అనుకుంటాడు. అతను నిర్వహించకపోతే,తగినంత పౌరుషం లేదనుకుంటాడు. ఇది మూర్ఖత్వం. ప్రేమ అనేది అతీతమైనది. మీరు దానిని నిర్వహించలేరు. ప్రయత్నించిన వారు దాని అందమంతా మిస్ అయ్యారు. అప్పుడు గరిష్టంగా అది లైంగిక విడుదల అవుతుంది, కానీ అన్ని సూక్ష్మ మరియు లోతైన ప్రభావాలు తాకబడవు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 97 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 97. MAKING LOVE 🍀*


*🕉  Love has to be cherished, tasted very slowly, so that it suffuses your being and becomes such a possessing experience that you are no more. It. is not that you are making love--you are love.  🕉*


*Love can become a bigger energy around you. It can transcend you and your lover so that you are both lost in it. But for that you will have to wait. Wait for the moment, and soon you will have the knack of it. Let the energy accumulate, and let it happen on its own. By and by, you will become aware when the moment arises. You will start seeing the symptoms of it, the presymptoms, and then there will be no difficulty. If the moment does not arise in which you naturally fall into lovemaking, then wait; there is no hurry. The Western mind is in too much hurry--even while making love, it is something that has to be done with and finished.*


*That is a completely wrong attitude. You cannot manipulate love. It happens when it happens, if it is not happening, there is nothing to be worried about. Don't make it an ego trip that somehow you have to make love. That is also there in the Western mind; the man thinks he has to perform somehow. If he is not managing, he is not manly enough. This is foolish, stupid. Love is something transcendental. You cannot manage it. Those who have tried to have missed all its beauty. Then at the most it becomes a sexual release, but all the subtle and deeper realms remain untouched.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 524 - 528 / Sri Lalitha Chaitanya Vijnanam  - 524 - 528 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।*

*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀*


*🌻 524 to 528 నామములు 🌻*


*524. 'మజ్జాసంస్థా' - మజ్జ యందుండునది శ్రీమాత అని అర్ధము.*


*525. 'హంసవతీ' - హంసవలె స్వచ్ఛమై, విహంగ గమనము కలది శ్రీమాత అని అర్ధము.*


*526. 'ముఖ్యశక్తి సమన్వితా' - ప్రధానమగు తన శక్తులతో కూడి యున్నటువంటిది శ్రీమాత అని అర్ధము.*


*527. ‘హరిద్రాన్నైక రసికా' - హరిద్రాన్నము నందు ఆసక్తి కలది శ్రీమాత అని అర్థము.*


*528. 'హాకినీ రూపధారిణీ' - హాకినీ అనే రూపమును, నామమును ధరించి యున్నది శ్రీమాత అని అర్థము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 524 - 528 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻108. Majasansdha hansavati mukhyashakti samanvita*

*haridranai karasika hakinirupa dharini  ॥ 108 ॥ 🌻*


*🌻 524 to 528 Nmaes 🌻*


*524. 'Majjasanstha' - Meaning that Srimata resides in the marrow.*


*525. 'Hamsavati' - means Srimata who is as pure as a swan and has graceful gait.*


*526. 'Mukhyashakti Samanvita' - means Srimata who is with the consolidation of all her supreme powers.*


*527. 'Haridrannaika Rasika' - means Srimata likes rice cooked with turmeric.*


*528. 'Hakkini Roopadharini' - Srimata who takes the form and name of Haakini.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Commentaires


bottom of page