🍀🌹 10, JULY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 550 / Bhagavad-Gita - 550 🌹
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 26 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 26 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 98 🌹
🏵 రాధాసాధన 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 3 🌹
🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 3 / 551. 'Sarvavyadhi Prashamani' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 550 / Bhagavad-Gita - 550 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 26 🌴*
*26. మాం చ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే |*
*స గుణేన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||*
*🌷. తాత్పర్యం : అన్ని పరిస్థితుల యందును అకుంటితముగా నా పూర్ణముగు భక్తియుతసేవ యందు నిమగ్నుమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును.*
*🌷. భాష్యము : త్రిగుణరాహిత్యమును దివ్యస్థితిని పొందుటకు సాధనమేమనెడి అర్జునుని తృతీయప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. పూర్వమే వివరింపబడినట్లు భౌతికజగమంతయు ప్రకృతిత్రిగుణ ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది. కావున మనుజుడు త్రిగుణముల కార్యకలాపములచే ప్రభావితుడు గాక, తన చైతన్యమును ఆ త్రిగుణముల కర్మల యందుంచుటకు బదులు కృష్ణసంబంధకర్మల యందే దానిని నియుక్తము కావింపవలెను.*
*కృష్ణపరకర్మలే భక్తియోగముగా తెలియబడుచున్నవి. అనగా కృష్ణుని కొరకు కర్మ చేయుటయే భక్తియోగము. ఇట్టి భక్తియోగమున కృష్ణసేవయేగాక, ఆ శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములైన రామ, నారాయణాది రూపముల సేవయు ఇమిడియున్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాక రూపములను కలిగియున్నాడు.*
*ఏ రూపము యొక్క (లేదా ప్రధానవిస్తారము యొక్క) సేవ యందు నిలిచినను మనుజుడు దివ్యస్థితిలో స్థితుడైనట్లుగానే భావింపబడును. అనగా శ్రీకృష్ణుని అన్ని రూపములు ఆధ్యాత్మికములనియు మరియు సచ్చిదానంద మాయములనియు ప్రతియొక్కరు ఎరుగవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 550 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 26 🌴*
*26. māṁ ca yo ’vyabhicāreṇa bhakti-yogena sevate*
*sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate*
*🌷 Translation : One who engages in full devotional service, unfailing in all circumstances, at once transcends the modes of material nature and thus comes to the level of Brahman.*
*🌹 Purport : This verse is a reply to Arjuna’s third question: What is the means of attaining to the transcendental position? As explained before, the material world is acting under the spell of the modes of material nature.*
*One should not be disturbed by the activities of the modes of nature; instead of putting his consciousness into such activities, he may transfer his consciousness to Kṛṣṇa activities. Kṛṣṇa activities are known as bhakti-yoga – always acting for Kṛṣṇa. This includes not only Kṛṣṇa, but His different plenary expansions such as Rāma and Nārāyaṇa. He has innumerable expansions.*
*One who is engaged in the service of any of the forms of Kṛṣṇa, or of His plenary expansions, is considered to be transcendentally situated. One should also note that all the forms of Kṛṣṇa are fully transcendental, blissful, full of knowledge and eternal. Such personalities of Godhead are omnipotent and omniscient, and they possess all transcendental qualities.*
*So if one engages himself in the service of Kṛṣṇa or His plenary expansions with unfailing determination, although these modes of material nature are very difficult to overcome, one can overcome them easily. This has already been explained in the Seventh Chapter.*
*One who surrenders unto Kṛṣṇa at once surmounts the influence of the modes of material nature.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 98 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 రాధాసాధన 🏵*
*దాదాపు 35 సంవత్సరాల క్రింద జీవితంలో ఒక క్రొత్త మలుపు తిరిగింది. రసయోగి రాధికాప్రసాద్ మహరాజ్ గారి (శ్రీ రాళ్ళబండి వీరభద్రరావు) యోగశక్తుల చేత, ప్రవచనముల చేత ఆకర్షింపబడి రాధాసాధన వైపు మనసు మళ్ళింది. ఆ మహానుభావుడు శ్రీమతి రాధామహాలక్ష్మి అనే యోగిని శరీరంలోకి ఆవాహన చేయగా రాధాదేవి సఖి అయిన రాధామహాలక్ష్మి (ఉపరాధ) అనే దేవత వచ్చి నాకు రాధాషడక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్ర జపధ్యానఫలితంగా ఎన్నో దివ్యానుభూతులు కల్గినాయి. శ్రీకృష్ణుని మురళీనాదాన్ని వినే భాగ్యం కలిగింది. కొంతకాలానికి రాధాదేవి సాక్షాత్కరించి తన అష్టాక్షరీ మంత్రాన్ని స్వయంగా అనుగ్రహించి తన భక్తురాలయిన దుర్గాదేవి సఖి 'భద్ర' అనే దేవతను నాకు నిత్యరక్షగా నియమించింది.*
*నెమ్మది నెమ్మదిగా పూర్వజన్మల యవనికలు తొలగి అనేక విషయాలు తెలియడం మొదలైనవి. రాధికాప్రసాద్మహారాజ్గరితో ఉన్న అనుబంధం కొంత తెలిసింది. అయిదువందల సంవత్సరాల క్రింద వారు కృష్ణచైతన్య మహా ప్రభువు యొక్క గృహస్థశిష్యులు. తరచుగా బృందావనానికి వచ్చి చైతన్యుల వారి శిష్యులయిన 'రూపగోస్వామి' ఆశ్రమంలో ఉండేవారు. ఆ సమయానికి నేనూ అక్కడ ఉండటం తటస్థించింది. ఆ జన్మలో నేను హిమాలయాలలో కాళీసాధన చేసి ఆమహాశక్తి అనుగ్రహం వల్ల కొన్ని సిద్ధశక్తులు సాధించి మూడువందల ఏండ్లు జీవించే వరం పొందాను. కాళీమాత తన గుర్తుగా ఇచ్చిన ఆమె జీవత్ విగ్రహము ఒకటి నాతో ఉండేది. రూపగోస్వామికి నాకు గాఢమైన అనుబంధము ఏర్పడింది.*
*నేను చేసిన ఆ జప నిర్గుణ సాధనలు ఆయనకు నచ్చి ఆ మార్గంలో ఆయన సాధన చేశాడు. దాని ఫలితంగా అంతరిక్ష చరుడయిన ఒక యోగితో ఆత్మీయత కలిగింది. ఆ యోగి శాకంభరీ పీఠమునకు చెందినవాడు కావడం చేత ఆయనను 'శాకంభరీ యోగి' అనేవారు. అతడు కూడా కాళీమంత్రసిద్ధుడే. ఆ మహాత్ముడు గోస్వామికి కొన్ని అద్భుత శక్తులను ప్రసాదించాడు. అతడే దివ్యభూమికలలో చాలా కాలం ఉండి తరువాత రామకృష్ణపరమహంసగా పుట్టి తీవ్ర తపస్సు చేసి కాళీమాత కృపను సాధించి వివేకానంద మొదలయిన తన శిష్యులద్వారా భారతదేశ చరిత్ర గమనం మారడానికి దోహదం చేశాడు.*
*ఆ రోజులలో రాధికాప్రసాద్మహారాజ్ గారితో ఏర్పడ్డ అనుబంధమే ఈ జన్మలోనూ పెంపొందింది. రాధాదేవిని గూర్చి బృందావన యోగులు భావించే విశేషాలు అక్కడి యోగుల చరిత్రలు ఆంధ్రావనికి ఆంధ్రభాషలో ఎనిమిది సంపుటాలుగా వారు అందించారు. రాధాదేవి సర్వేశ్వరీత్వాన్ని గురించి అవగాహన సరిగా లేని తెలుగు వారికి కనువిప్పు కలిగించారు. ఆయన ప్రభావంలోపడి వివిధ గ్రంధాలలోని, వివిధ పురాణాలలోని అంశాలను సేకరించి 'ప్రజభాగవతము' అన్న గ్రంథం రచించి 2002 సెప్టెంబరులో రాధాష్టమి నాడు వారికి అంకితం చేశాను.*
*తరువాత 2006 సంవత్సరంలో రాధాకృష్ణుల గాధను బృందావనభాగవతం అన్న పేరుతో కథాకథన మార్గంలో నవలవలె రచించాను. మహిమాన్వితయైన రాధాదేవి సేవలో భాగంగా ఈ రచన ఒకటి - మరొకటి గుంటూరులోని మా పీఠంలో రాధామందిర నిర్మాణం. ఆ తర్వాత కుర్తాళంలో కూడా రాధాకృష్ణమందిర నిర్మాణం జరిగింది. హైదరాబాదులోని మా ప్రత్యంగిరా భద్రకాళీ మందిరంలోను విశాఖలోని మా లలితపీఠంలోనూ కూడా రాధాకృష్ణమందిరాలు నిర్మితమైనవి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 3 🌻*
*ప్రకృతి సహజమగు భావము, భాషణము, ఆచరణము గల వారికి వ్యాధులంతగ సోకవు. కాలము, దేశము, సంఘములను బట్టి ఒక వేళ వ్యాధులు సోకిననూ అట్టి వారిని ఆ వ్యాధులు కృశింపజేయవు. వికృత భావములు, భాషణములు, చేష్టలు కలవారిని వ్యాధులు లొంగ దీసుకొని కృశింపజేయును. ఇది సత్యము. ధర్మపరులకు ప్రకృతిగను, అధర్మపరులకు వికృతిగను శ్రీమాత వారి స్వభావము నుండి వర్తించును. ఇది ఆమె శిష్ట రక్షణము, దుష్ట శిక్షణము కార్యములలో నొకటి. అవసరమగుచో తల్లి బిడ్డకు శిక్షణ నిచ్చుట కద్దుయే కదా! ఆమె సర్వభూతహిత రతి కలిగినది. ఎట్లైననూ జీవులను రక్షించును. శిక్షించుట ఆమె రక్షణలోని అంతర్భాగమే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 551. 'Sarvavyadhi Prashamani' - 3 🌻*
*People who have natural feelings, speech and practice are not usually inflicted with ailments. Depending on the time, space and community, even if they are inflicted with ailments, those diseases do not weaken them. Those who have perverted feelings, speech and behavior will be subdued by diseases and become weak. This is the truth. Srimata applies appropriately upon the righteous and perverse. This is one of her ways of protecting the noble and punishing the evil. Shouldn't the mother train the child if necessary? She wishes well on everyone. At any cost, she saves the living beings. Punishment is an integral part of her protection.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments