🍀🌹 11, APRIL 2024 THURSDAY ALL MESSAGES గురువారం, భృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 519 / Bhagavad-Gita - 519 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 30 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 30 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 873 / Sri Siva Maha Purana - 873 🌹
🌻. స్కందశంఖచూడుల ద్వంద్వ యుద్ధము - 1 / Śaṅkhacūḍa fights with the full contingent of his army - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 132 / Osho Daily Meditations - 132 🌹
🍀 132. మారుతున్న వాతావరణాలు / 132. CHANGING CLIMATES 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 36🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 540-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 540-1 🌹
🌻 540. 'స్మృతి' - 1 / 540. 'Smruti' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 519 / Bhagavad-Gita - 519 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 30 🌴*
*30. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశ: |*
*య: పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ||*
*🌷. తాత్పర్యం : భౌతికప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు ఒనరింపబడు చున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగినవాడు యథార్థదృష్టి కలిగినట్టివాడు.*
*🌷. భాష్యము : ఈ దేహము పరమాత్ముని నిర్దేశములో భౌతికప్రకృతిచే తయారుచేయబడును. అట్టి దేహపరమగు సమస్త కార్యములకు ఆత్మ కర్త కాదు. దేహస్మృతి కారణముననే చేయవలసిన కార్యములన్నియును మనుజునిచే బలవంతముగా చేయింపబడుచున్నవి. అట్టి కార్యములు సుఖము కొరకైనను లేదా దుఃఖము కొరకైనను సరియే. కాని వాస్తవమునకు ఆత్మ అట్టి సర్వదేహకార్యములకు పరమైనది. జీవుని పూర్వపు కోరికల ననుసరించి అతనికి దేహమొసగబడుచుండును.*
*కోరికలను తీర్చుకొనుటకు ఒసగబడిన దేహముతో జీవుడు ఆ కోరికల ననుసరించి వర్తించుచుండును. అనగా ఈ దేహము జీవుడు తన కోరికలను పూర్ణము చేసికొనుటకు భగవానునిచే రూపొందించబడిన యంత్రము వంటిది. అట్టి కోరికల కారణముననే మనుజుడు సుఖదుఃఖముల ననుభవించు కొరకై వివిధ పరిస్థితుల యందుంచబడును. ఇట్టి ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధినొందినంతనే మనుజుడు తనను తన దేహకార్యముల నుండి అన్యముగా గాంచును. అట్టి ఆధ్యాత్మికదృష్టి కలిగినవాడే నిజమైన ద్రష్ట.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 519 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 30 🌴*
*30. prakṛtyaiva ca karmāṇi kriyamāṇāni sarvaśaḥ*
*yaḥ paśyati tathātmānam akartāraṁ sa paśyati*
*🌷 Translation : One who sees the Supersoul equally present everywhere, in every living being, does not degrade himself by his mind. Thus he approaches the transcendental destination.*
*🌹 Purport : This body is made by material nature under the direction of the Supersoul, and whatever activities are going on in respect to one’s body are not his doing. Whatever one is supposed to do, either for happiness or for distress, one is forced to do because of the bodily constitution. The self, however, is outside all these bodily activities. This body is given according to one’s past desires. To fulfill desires, one is given the body, with which he acts accordingly.*
*Practically speaking, the body is a machine, designed by the Supreme Lord, to fulfill desires. Because of desires, one is put into difficult circumstances to suffer or to enjoy. This transcendental vision of the living entity, when developed, makes one separate from bodily activities. One who has such a vision is an actual seer.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 873 / Sri Siva Maha Purana - 873 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴*
*🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 1 🌻*
*సనత్కుమారుడిట్లు పలికెను- అపుడు దేవగణములన్నియు దానవులచే ఓడింపబడి శస్త్రాస్త్రములచే గాయపడిన దేహములు గలవారై భయభీతులై పారిపోయిరి (1). వారు విశ్వేశ్వరుడగు శంకరుని వద్దకు తిరిగి వచ్చి దుఃఖముతో నిండిన వాక్కుతో 'ఓ సర్వేశ్వరా! రక్షింపుము, రక్షింపుము'అని పలుకుతూ శరణుజొచ్చిరి (2). ఆ దేవాదుల పరాజయమును గాంచి భయపూరితములగు వారి మాటలను విని ఆ శంకరుడు గొప్ప క్రోధమును పొందెను (3). ఆయన దేవతలపై దయాదృష్టిని బరపి అభయమునిచ్చి తన తేజస్సుతో తన గణముల బలమును వర్ధిల్ల జేసెను (4). అపుడు మహావీరుడు, శివపుత్రుడు అగు స్కందుడు శివుని ఆజ్ఞను పొంది యుద్ధములో భయములేని వాడై దానవగణములతో పోరు సలిపెను (5). తారకాంతకుడగు ఆ స్కందుడు సింహనాదమును చేసి కోపించినవాడై యుద్ధములో వంద అక్షౌహిణీల సైన్యమును మట్టుబెట్టెను (6). పద్మములవంటి కన్నులు గల కాళి వారి శిరస్సులను దునిమి శీఘ్రమే రక్తమును త్రాగి మాంసమును భక్షించెను (7).*
*ఆమె అన్నివైపుల నుండి ఆ దానవుల రక్తమును త్రాగుచూ, దేవతలకు దానవులకు కూడ భయమును గొల్పు వివిధరకముల యుద్ధమును చేసెను (8). ఆమె కోటి శ్రేష్ఠమగు ఏనుగులను మరియు కోటి మంది మానవులను ఒకే చేతితో పట్టుకొని అవలీలగా నోటిలో పారవైచుకొనెను (9).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 873 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 37 🌴*
*🌻 Śaṅkhacūḍa fights with the full contingent of his army - 1 🌻*
Sanatkumāra said:—
1. Then the gods were defeated by the Dānavas. Their bodies were wounded by weapons and missiles. Terrified, they took to flight.
2. Returning to Śiva, the lord of the universe, they sought refuge in him. In agitated words they cried “O Lord of all, save, O save us.”
3. On seeing the defeat of the gods and others and on hearing their cries of fear, Śiva was greatly infuriated.
4. He glanced at the gods sympathetically and assured them of his protection. With his brilliance he enhanced the strength of his Gaṇas.
5. Commanded by śiva, the great hero Kārttikeya, son of Śiva fought fearlessly with the hosts of Dānavas in the battle.
6. Shouting angrily and roaring like a hero, the lord, the slayer of Tāraka killed a hundred Akṣauhiṇīs[1] in the battle.
7. Clipping off their heads, Kālī with eyes like a red lotus, drank off the blood and devoured the flesh rapidly.
8. She fought in diverse ways terrifying both the gods and the Dānavas. She drank the blood of the Dānavas all round.
9. Seizing ten million elephants and an equal number of men with a single hand she playfully thrust them into her mouth.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 132 / Osho Daily Meditations - 132 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 132. మారుతున్న వాతావరణాలు 🍀*
*🕉 రుతువులు మారుతాయి. కొన్నిసార్లు శీతాకాలం, కొన్నిసార్లు వేసవి. మీరు ఎల్లప్పుడూ ఒకే వాతావరణంలో ఉంటే, మీరు ఇబ్బంది పడతారు. 🕉*
*జరుగుతున్న దాన్ని ఇష్టపడటం నేర్చుకోవాలి. దానినే నేను పరిపక్వత అంటాను. ఇప్పటికే ఉన్నదాన్ని ఇష్టపడాలి. అపరిపక్వత అనేది ఎల్లప్పుడూ 'ఉండాలి' మరియు 'ఉండి తీరాలి' లలో జీవిస్తుంది తప్ప 'ఉంది'లో ఎప్పుడూ జీవించదు. ఉన్నదే అసలు. 'ఉండాలి' అనేది ఒక కల మాత్రమే. ఏది జరిగినా మంచిదే. దీన్ని ప్రేమించండి, ఇష్టపడండి, ఇందులో ప్రశాంతంగా ఉండండి. కొన్నిసార్లు తీవ్రత వచ్చినప్పుడు, దానిని ఇష్టపడండి. అది వెళ్ళినప్పుడు, వీడ్కోలు చెప్పండి. పరిస్థితులు మారుతూ ఉంటాయి... జీవితం ప్రవాహం. ఏదీ ఒకేలా ఉండదు, కాబట్టి కొన్నిసార్లు ఖాళీగా ఉంటుంది మరి కొన్నిసార్లు ఎక్కడా చోటుండదు. కానీ రెండూ మంచివే. రెండూ ఉనికి నుండి వచ్చిన బహుమతులే.*
*ఎంత కృతజ్ఞతతో ఉండాలంటే ఏమి జరిగినా కృతజ్ఞతతో ఉండాలి. కేవలం ఆస్వాదించండి. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. రేపు అది మారవచ్చు; అప్పుడు దాన్ని ఆస్వాదించండి. ఎల్లుండి ఇంకేదో జరగవచ్చు. దాన్ని ఆస్వాదించండి. గతాన్ని వ్యర్థమైన భవిష్యత్తు కల్పనలతో పోల్చవద్దు. ఈ క్షణం జీవించండి. కొన్నిసార్లు వేడిగా ఉంటుంది, కొన్నిసార్లు చల్లగా ఉంటుంది, కానీ రెండూ అవసరం; లేకుంటే జీవితం మాయమవుతుంది. ఇది ధ్రువణతలలో ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 132 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 132. CHANGING CLIMATES 🍀*
*🕉 Seasons change. Sometimes it is winter, sometimes it is summer. If you are always in the same climate, you will feel stuck. 🕉*
*One has to learn to like that which is happening. That is what I call maturity. One has to like that which is already there. Immaturity is living always in "oughts" and "shoulds" and never living in the “is” –and “is” is the case. “Should” is just a dream. Whatsoever is the case is good. Love it, like it, and relax into it. When sometimes intensity comes, love it. When it goes, say goodbye. Things change ... life is in flux. Nothing remains the same, so sometimes there are great spaces and sometimes nowhere to move. But both are good. Both are gifts from existence.*
*One should be so grateful that whatever happens, one is grateful, thankful. Just enjoy it. This is what is happening right now. Tomorrow it may change; then enjoy that. The day after tomorrow something else may happen. Enjoy that. Don't compare the past with futile future fantasies. Live the moment. Sometimes it is hot, sometimes very cold, but both are needed; otherwise life will disappear. It exists in polarities.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 36 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*మహాపురుషుడు గోరఖ్నాథ్ తన గుహలో శిష్యులతో కలిసి ఉన్నాడు. మధుకైటభ సంహారకారిణి, రక్తబీజ వినాశిని యైన మహాకాళి దేవి అవతరించినరోజు కావటం వల్ల ఆ దేవి పూజ జరుగుతున్నది. పూజానంతరం దర్బారు సేవ ప్రారంభమైంది. చతుర్వేద పారాయణం, రామాయణ భారత భాగవత ప్రవచనం తర్వాత ప్రధానార్చకుడు కాళీదేవిని గూర్చి ఎవరైనా శ్లోకములు పాటలు పాడవచ్చునన్నాడు. ఎవరూ లేవలేదు. హరసిద్ధుడు లేచి నిల్చుండి కమనీయ కంఠంతో ప్రారంభించాడు.*
*శ్లో మత్స్యేంద్రనాధశిష్యాయ సాక్షాత్ కాళీ స్వరూపిణే సిద్ధానాం గురునాధాయ గోరక్షాయ నమోనమః*
*శ్లో ఆ రక్త జిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం
కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతంభజామి.*
*ఇలా కొన్ని శ్లోకాలు స్తుతులు పాడాడు.*
*ఎవరీ కొత్త యువకుడని అందరూ ఆశ్చర్యంతో చూచారు. మంత్రపుష్పం పూర్తియై అందరూ బయటకు వెళ్ళిన తర్వాత హరసిద్ధుడు గోరఖ్నాథ్ దగ్గరకు వెళ్ళి "భార్గవ చ్యవన ఆప్నువాన ఔర్వ జామదగ్న్య పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్ర: ఆపస్తంబ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ హరసిద్ధశర్మా అహంభో అభివాదయే" అని ప్రవర చెప్పుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ మహాయోగి వాత్సల్యంతో చూచి "హరసిద్ధా! నీ మధుర కవితాగానంతో మనస్సు స్పందిచేలా చేశావు. సంతృప్తి కలిగింది. "అని నాగపురోహితా! రా!- అంటూ పిలిచాడు. అతడు వచ్చి తాము వచ్చిన పని నివేదించాడు. గోరక్షుడు "మీరు చెప్పినది, రాక్షస భూమిలో జరిగిన ప్రయత్నాలు అన్నీ నాకు తెలుసు. మీకు నేను సహకరిస్తాను. ఎందుకంటే హరసిద్ధుడు సిద్ధాశ్రమయోగి. అతనిని గురించి మీరింతకుముందే తెలుసుకొన్నారు. దైత్యులను జయించటానికి కావలసిన శక్తిని సాధించటం చాలా రహస్యంగా జరగాలి. పాతాళంలో మైరావణుడు పూజించిన కాళిని ఆరాధించి వారు అద్భుత శక్తుల్ని పొందగలిగారు. అంతటి క్షేత్రం కామాఖ్య. కాని ఇతడు ఏ సాధన చేసినా మీ శత్రువులు తెలుసుకొంటారు. కనుక ఆ స్థలం కుదరదు. ఇప్పుడున్న పరిస్థితులలో కాళీదేవిని ప్రసన్నం చేసుకోటం సులభం కాదు. నేనొక ప్రణాళిక ఆలోచిస్తున్నాను. ఈ రోజు రాత్రి మొదలుపెట్టి మూడు రోజులు ఇక్కడి గుహలో ధ్యానం చేయాలి. ఆహార నిద్రాదులేమి ఉండకూడదు. హస్తమస్తక సంయోగంతో నా శక్తిని హరసిద్ధునిలోనికి ప్రవేశ పెడుతున్నాను.*
*శ్లో॥ పతంతుమూర్తి ప్రకృతాస్తరంగాః విద్యున్మయాద్యు స్థలశక్తి శృంగాః*
*తేజో విశేషాః పరితో విమోహాః తే వీర్యవాహాః మమదృక్సమూహాః*
*నాలుగవరోజు ఉదయం ఏమిజరిగిందో అతడు చెపుతాడు. దానిని బట్టి ఏం చేయాలన్నది నిర్ణయించబడుతుంది.” ధ్యాన రాత్రులు పూర్తి అయిన తర్వాత హరసిద్ధుడు గోరఖ్నాథుని సన్నిధికి వచ్చి గురువందనం చేశాడు. నాగ పురోహితుడు కూడా వచ్చాడు. గురు సూచన అందుకొని హరసిద్ధుడు జరిగినది నివేదించాడు.*
*"గురుదేవా! మీ ఆజ్ఞతో మీరుపదేశించిన సిద్ధగురుమంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాను. కాసేపటికి హిమాలయాలలో టిబెట్ ప్రాంతంలోని ఒక గుహలో ఉన్నాను. ఎదురుగా వజ్రభైరవుని విగ్రహం ఉన్నది. దానిలోనుండి నాలోకి వైద్యుతశక్తి ప్రవహిస్తున్నది. విద్యాధర గంధర్వకాంతలు వచ్చి ఆ స్వామిముందు నాట్యం చేస్తున్నారు. వారందిస్తున్న మద్యాన్ని స్వీకరిస్తూ ఆయన ఆనందిస్తున్నాడు. తెల్లవారు జామున మళ్ళీ ఉజ్జయినీ గుహకు వచ్చాను. పగలంతా ఇక్కడే జపం సాగుతున్నది. రాత్రి మొదటి జాము కాగానే శ్రీశైలం మీద ఇంకొక గుహలో ఉన్నాను. అక్కడ అభౌతిక శరీరాలతో కొందరు యోగులున్నారు. వారు వాత్సల్యంతో దీవించారు. గుహ బయట శివలింగాకారంలో ఒక శిల ఉన్నది. దాని ముందు దీపాలు వెలుగుతున్నవి. ఆ శిల భైరవప్రతీక, బోయవారు కొందరు వచ్చి మేకలు నరికి బలియిస్తున్నారు. అక్కడ బలియిచ్చి నిద్ర చేస్తే ఆ రాత్రి భైరవుడు కలలో కనిపించి వరమిస్తాడట! మొదటిరోజు కనబడకపోతే రెండో రోజుమరొక మేకను బలియిస్తే ఆ రాత్రికి కనిపించి తీరతాడుట! ఆ రాత్రంతా ఆ గుహలో ఉండి మళ్ళీ పగలిక్కడ గడిపి మూడవ రాత్రి కుర్తాళంలో పొదిగై కొండల మీద గుహలో ఉన్నాను. ఎదురుగా ఉన్న చంపకాదేవిని సేవించి జలపాతం చూస్తూ నీళ్ళు పడుతున్నప్పుడు వినిపిస్తున్న నాదంలో మనస్సు లయం జేస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్ళాను. జటాజూటధారి అగస్త్య మహర్షి దర్శనమిచ్చి అభయముద్రతో ఆశీర్వదించి నా శిష్యుడు భోగనాథుని దగ్గరకు వెళ్ళు మార్గదర్శనం చేస్తాడు అని పలికి అదృశ్యమైనాడు. తెల్లవారుజామున బయలుదేరుతుంటే కొందరు యోగులు వచ్చి ఆ జలపాతంలో స్నానం చేస్తున్నారు. ఇక్కడ భైరవుడు జలరూపంలో ఉన్నాడు. నీవుకూడా స్నానం చెయ్యి అనివారు నన్ను ఆదేశించారు. ఆ ప్రకారమే చేశాను. కాసేపటికి ఇక్కడ ఉన్నాను. ఆ భోగనాధుడెవరో నేనేమి చేయాలో నిర్దేశించవలసినదిగా ప్రార్థిస్తున్నాను."*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 540 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 540 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*
*🌻 540. 'స్మృతి' - 1 🌻*
*శ్రవణము, స్మరణము వలన యేర్పడు జ్ఞానము శ్రీమాత అని అర్ధము. ముందు నామములో తెలిపిన వాఙ్మయమును వినుట వలన, మరల మరల స్మరించుట వలన జీవులయందు మేధోవికాసము కలుగును. ఇట్లు వికాసము కలిగించు జ్ఞాన రూపమున శ్రీమాత యున్నది. ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది గాథలు, వేదాంగ ములు వినుచూ, స్మరించుచూ నేర్చుకొనుట స్మృతి విద్య. శ్రుతిని స్మృతి ద్వారా నేర్చుకొనుట సదాచారము. నేర్చిన వానివద్ద నేర్చుట విదితమగు విషయమే కదా! నేటికినీ వేదములు మంత్రములు, స్తోత్రములు నేర్చినవారు పలుకుచుండగా విని నేర్చుకొనుట సదాచారముగ జరుగుచున్నది. స్వంతముగ నేర్చుకొనుట సదాచారము కాదు. అది స్వతంత్ర బుద్ధికి చిహ్నము. అట్టి వారియందు విద్య రాణించుట కష్టము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 540 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutir anuttama ॥110 ॥ 🌻*
*🌻 540. 'Smruti' - 1 🌻*
*It means that Srimata is knowledge composed of listening and remembering. By listening to the discourse mentioned in the previous name, and by remembering it again and again, intellectual development is brought about in living beings. Srimata is in the form of knowledge that causes development like this. Listening to Upanishads, Ramayana, Mahabharata stories, Vedanga and learning and memorizing is the education of smruti. It is good practice to learn Sruti by memory. It is a wonderful thing to learn from someone who has learned! Even today it is a good practice to listen and learn while those who have learned Vedas, Mantras and Stotras recite them. Self-learning is not a good practice. It is a symbol of independent mind. It is difficult for them to excel in education.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments