🍀🌹 11, DECEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 11, DECEMBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 470 / Bhagavad-Gita - 470 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -01 / Chapter 12 - Devotional Service - 01 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 826 / Sri Siva Maha Purana - 826 🌹
🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 7 / The Vanishing of Viṣṇu’s delusion - 7 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 83 / Osho Daily Meditations - 83 🌹
🍀 83. వినడం / 83. LISTENING 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 510-2 🌹
🌻 510. ‘మధుప్రీతా’ - 2 / 510. 'Madhupreeta' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 11, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, Masik Shivaratri 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 55 🍀*
*113. సదసద్వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |*
*స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్*
*114. నిర్వాణం హ్లాదనశ్చైవ బ్రహ్మలోకః పరాగతిః |*
*దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : చేతనాప్రవృత్తి - ఆరోహణ అవరోహణలు : చేతన అన్నమయ ప్రకృతిలోనికి క్రిందికి దిగివచ్చి మానవునిలోని తక్కిన విభాగములను తాత్కాలికంగా మరుగుపరచు కొనవచ్చును. లేక, దేహ ప్రాణ మనస్సుల కతీతంగా శిరస్సు పైకి ఆరోహించి అఖండాత్మ స్వరూపంలో విలీనం కావచ్చును. లేక. క్రియాత్మకమైన విశ్వచేతన లోనికి విస్తరిల్లి దానితో తాదాత్మ్యం చెందవచ్చును. ఏమి చేసినా ఆహం కారమని పిలువబడే దానిపై ఆధారపడ వలసిన అవసరం దానికి లేదు.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 07:11:06
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: విశాఖ 12:13:59 వరకు
తదుపరి అనూరాధ
యోగం: సుకర్మ 20:59:51 వరకు
తదుపరి ధృతి
కరణం: వణిజ 07:10:06 వరకు
వర్జ్యం: 16:11:10 - 17:46:02
దుర్ముహూర్తం: 12:31:14 - 13:15:42
మరియు 14:44:38 - 15:29:05
రాహు కాలం: 07:58:54 - 09:22:16
గుళిక కాలం: 13:32:22 - 14:55:44
యమ గండం: 10:45:38 - 12:09:00
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31
అమృత కాలం: 03:17:34 - 04:55:06
మరియు 25:40:22 - 27:15:14
సూర్యోదయం: 06:35:32
సూర్యాస్తమయం: 17:42:28
చంద్రోదయం: 04:48:00
చంద్రాస్తమయం: 16:12:43
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 12:13:59 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 470 / Bhagavad-Gita - 470 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -01 🌴*
*01. అర్జున ఉవాచ*
*ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |*
*యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా: ||*
*🌷. తాత్పర్యం : అర్జునుడు ప్రశ్నించెను : నీ భక్తియుతసేవలో సదా యుక్తముగా నియుక్తులైనవయు మరియు అవ్యక్త నిరాకారబ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు?*
*🌷. భాష్యము : సాకార, నిరాకార, విశ్వరూపముల గూర్చియు, పలురకములైన భక్తులు మరియు యోగుల గూర్చియు శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులు సాకారవాదులు మరియు నిరాకారవాదులను రెండు తరగతులుగా విభజించబడి యుందురు. రూపము నందు అనురక్తుడైన భక్తుడు తన సంపూర్ణశక్తిని వినియోగించి శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడై యుండును. కాని నిరాకారవాదియైనవాడు శ్రీకృష్ణుని ప్రత్యక్షసేవలో నిలువక అవ్యక్త నిరాకరబ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై యుండును.*
*పరతత్త్వానుభూతికి గల పలువిధములైన పద్ధతులలో భక్తియోగము అత్యంత ఉత్కృష్టమైనదని ఈ అధ్యాయనమున మనకు అవగతము కాగలదు. శ్రీకృష్ణభగవానుని సన్నిహిత సాహచర్యమును వాంచించినచో మనుజుడు ఆ దేవదేవుని భక్తియుతసేవను తప్పక స్వీకరింపవలసియున్నది. ఈ భక్తియోగము అత్యంత ప్రత్యక్షమార్గమే గాక దేవదేవుని సాహచర్యమును పొందుటకు సులభతరమైన విధానమై యున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 470 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 12 - Devotional Service - 01 🌴*
*01. arjuna uvāca*
*evaṁ satata-yuktā ye bhaktās tvāṁ paryupāsate*
*ye cāpy akṣaram avyaktaṁ teṣāṁ ke yoga-vittamāḥ*
*🌷 Translation : Arjuna inquired: Which are considered to be more perfect, those who are always properly engaged in Your devotional service or those who worship the impersonal Brahman, the unmanifested?*
*🌹 Purport : Kṛṣṇa has now explained about the personal, the impersonal and the universal and has described all kinds of devotees and yogīs. Generally, the transcendentalists can be divided into two classes. One is the impersonalist, and the other is the personalist. The personalist devotee engages himself with all energy in the service of the Supreme Lord. The impersonalist also engages himself, not directly in the service of Kṛṣṇa but in meditation on the impersonal Brahman, the unmanifested. We find in this chapter that of the different processes for realization of the Absolute Truth, bhakti-yoga, devotional service, is the highest. If one at all desires to have the association of the Supreme Personality of Godhead, then he must take to devotional service. Those who worship the Supreme Lord directly by devotional service are called personalists. Those who engage themselves in meditation on the impersonal Brahman are called impersonalists.*
*Arjuna is here questioning which position is better. There are different ways to realize the Absolute Truth, but Kṛṣṇa indicates in this chapter that bhakti-yoga, or devotional service to Him, is the highest of all. It is the most direct, and it is the easiest means for association with the Godhead. In the Second Chapter of Bhagavad-gītā, the Supreme Lord explained that a living entity is not the material body; he is a spiritual spark. And the Absolute Truth is the spiritual whole. In the Seventh Chapter He spoke of the living entity as being part and parcel of the supreme whole and recommended that he transfer his attention fully to the whole. So in practically every chapter the conclusion has been that one should be attached to the personal form of Kṛṣṇa, for that is the highest spiritual realization.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 825 / Sri Siva Maha Purana - 825 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴*
*🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 7 🌻*
*ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! కార్తీకమాసములో ధాత్రి మరియు తులసి సర్వదేవతలకు, విశేషించి విష్ణువునకు ప్రీతికరములని యెరుంగుము (53). ఓ మహర్షీ! ఆ రెండింటిలో తులసి మరింత ధన్యము, శ్రేష్ఠము. విఘ్నేశ్వరుని మినహాయించి తులసి సర్వదేవతలకు ప్రీతిని కలిగించి, కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (54). బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు ఆ దేవతలు పాపహారియగు మహావిష్ణువు వైకుంఠమునందుండుటను గాంచి ఆయనకు నమస్కరించి స్తుతించి తమ తమ ధామములకు వెళ్లిరి (55).*
*ఓ మహర్షీ! విష్ణువు కూడ మోహము తొలగి జ్ఞానమును పొందినవాడై పూర్వమునందు వలె శివుని స్మరిస్తూ తన లోకమునందు సుఖముగా నుండెను (56). పాపసందోహములను నశింపజేయునది, మానవుల సర్వకామనల నీడేర్చునది, సర్వకామవికారములను పోగొట్టునది అగు ఈ గాథ సర్వవిజ్ఞానమును వర్ధిల్లజేయును. (57). ఎవడైతే దీనిని నిత్యము భక్తితో పఠించునో లేక పఠింపజేయునో, వినునో, లేదా వినిపించునో, అట్టివాడు పరమగతిని పొందును (58). బుద్ధిమంతుడగు ఏ వ్యక్తి సర్వశ్రేష్ఠమగు ఈ గాథనుపఠించి యుద్దరంగమును ప్రవేశించునో, అట్టి వీరుడు నిస్సంశయముగా విజయమును పొందును (59). ఈ గాథ బ్రాహ్మణులకు బ్రహ్మవిద్యను, క్షత్రియులకు జయమును, వైశ్యులకు సమస్త సంపదలను, శూద్రులకు సుఖమును ఇచ్చును (60). ఓ వ్యాసా! అందరి పాపములను పోగొట్టి శంభునియందు భక్తిని కలిగించే ఈ గాథ ఇహపర లోకములలో సర్వదా సద్గతినిచ్చును (61).*
*శ్రీ శివమహాపురాణములోని రుస్రంహితయందలి యుద్ధఖండలో విష్ణు మోహవిధ్వంస వర్ణనమనే ఇరువది యారవ అధ్యాయము ముగిసినది (26).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 825 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴*
*🌻 The Vanishing of Viṣṇu’s delusion - 7 🌻*
53. O great brahmin, myrobolan and the holy basil shall be understood as the favourites of gods in the month of Kārttika, especially of Viṣṇu.
54. There too, O great sage, the holy basil is the most blessed and the most excellent. Except Gaṇeśa it delights every deity and bestows all desires.
55. On seeing Viṣṇu settled again in Vaikuṇṭha, Brahmā, Indra and other gods bowed to and eulogised him and then left for their respective abodes.
56. O excellent sage, Viṣṇu too, settled in his own world, freed from delusion and enlightened, became happy remembering Śiva as before.
57. This is the narrative that destroys sins, bestows desires to all men. It increases perfect knowledge and quells all aberrations of base lust.
58. He who reads or teaches this every day, he who hears or narrates this with devotion attains the greatest goal.
59. The intelligent man who reads this most excellent narrative and goes to war will certainly be victorious. There is no doubt about it.
60. This yields the knowledge of Vedas to the brahmins, victory to the Kṣatriyas, wealth to the Vaiśyas and happiness to the Śūdras.
61. O Vyāsa, it confers devotion to Śiva, it destroys the sins of all persons, it bestows the good goal here and hereafter.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 83 / Osho Daily Meditations - 83 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 83. వినడం 🍀*
*🕉. స్నేహితులు సలహా ఇచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి. 🕉*
*నేర్చుకోవలసిన గొప్ప విషయాలలో ఒకటి వినడం. చాలా నిశ్శబ్దంగా వినండి. ఉదాసీనంగా వినవద్దు. ఇతరులు మాట్లాడటం మానేయాలని మీరు కోరుకున్నట్లు లేక వారు మీ స్నేహితులు కాబట్టి మీరు మర్యాదగా వింటున్నట్లు వినవద్దు. అలాంటప్పుడు మీరు వినే మూడ్‌లో లేనందున ఏమీ మాట్లాడవద్దని వారికి చెప్పడం మంచిది. కానీ మీరు వింటున్నప్పుడు, నిజంగా వినండి-ఓపెన్‌గా ఉండండి, ఎందుకంటే మీ స్నేహితులు సరైనదే చెప్పవచ్చు. ఒకవేళ వారు తప్పు చేసినప్పటికీ, వాటిని వినడం మిమ్మల్ని మెరుగు పరుస్తుంది. మీరు మరిన్ని దృక్కోణాలను నేర్చుకుంటారు మరియు నేర్చుకోవడం ఎల్లప్పుడూ మంచిది. కాబట్టి బాగా వినండి, కానీ ఎల్లప్పుడూ మీరే నిర్ణయించుకోండి.*
*ఒక వ్యక్తి ఈ సాపేక్ష అవగాహనను కలిగి ఉంటే, విషయాలు చాలా స్పష్టంగా మరియు సులభంగా ఉంటాయి. లేకపోతే ప్రజలు చాలా సంపూర్ణవాదులు. వారు నిర్దిష్టంగా ఆలోచిస్తారు: ఇది నిజం మరియు దీనికి విరుద్ధంగా ఏదైనా తప్పు. ఈ వైఖరి మొత్తం భూమిని నిర్వీర్యం చేసింది - హిందువులు మరియు ముస్లింలు మరియు క్రైస్తవులు అందరూ పోరాడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణ సత్యాన్ని తమదిగా ప్రతిపాదించారు. కానీ దానిపై ఎవరికీ ఎలాంటి హక్కు లేదు, ఇది ఎవరి గుత్తాధిపత్యం కాదు. సత్యం విశాలమైనది. దానికి అనంతమైన కోణాలు మరియు అనంతమైన తెలుసుకునే మార్గాలు , మనకు తెలిసినది పరిమితం; ఇది ఒక భాగం మాత్రమే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 83 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 83. LISTENING 🍀*
*🕉. When friends offer advice, listen carefully. 🕉*
*One of the great things to be learned is listening. Listen very silently. Just don't listen indifferently. Don't listen as if you want others to stop talking and you are just listening to be polite because they are your friends. In that case it is better to tell them not to say anything because you are not in the mood to listen. But when you are listening, really listen-be open, because your friends may be right. And even if they are wrong, listening to them will enrich you. You will learn more viewpoints, and it is always good to learn. So listen well, but always decide on your own.*
*Once a person has this relative understanding, things become very clear and easy. Otherwise people are very absolutist. They think in terms of absolutes: This is truth and whatever is against it is wrong. This attitude has crippled the whole earth-Hindus and Muslims and Christians are all fighting because everybody claims the absolute truth. But nobody has any claim on it, It is nobody's monopoly. Truth is vast. Infinite are its facets and infinite are the ways to know it , Whatever we know is limited; it is just one part.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*
*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*
*🌻 510. ‘మధుప్రీతా’ - 2🌻*
*మధువు అంతరంగ రసానుభూతియేగాని, మద్యపానము చేయువారికి కలుగు అనుభూతి గాదు. కొందరు శ్రీవిద్య ఉపాసకులు తగు మాత్రము మద్యము గ్రోలి ఆరాధన చేయు ఆచార మొకటి నేటికిని వాడుకలో వున్నది. మద్యము వలన చైతన్యమునకు మైకము కలుగును గాని అది ఆనందము కాజాలదు. రసానుభూతి వేరు, మద్యపానానుభూతి వేరు. రెంటికిని చాల వ్యత్యాసమున్నది. భక్తి పరిపక్వత చెందు చుండగ, అట్టి భక్తి శ్రీమాత యందనురక్తిగ మారుచుండగ, మేదస్సు నుండి రస ముద్భవించును. తన్మయత్వము కలుగును. ఇది అంతరంగ రసాయనము. బాహ్య సాధనములగు మద్యము, కల్లు యిత్యాదివి జీవుని చైతన్యరహితునిగ చేయును గాని రసభరతుని చేయలేవు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*
*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*
*🌻 510. 'Madhupreeta' - 2🌻*
*Wine here is an inner feeling, not a feeling experienced by the drinker. There is a tradition today in some Srividya worshipers where they take wine as a part of the practice. Alcohol brings stupor to consciousness, but it does not bring bliss. This relishable state is different from the integrated state of alcoholism. There is a huge difference between the two. When Bhakti matures into anurakti or attachment towards Shrimata, Rasa emerges from the intelligence. An engrossment happens. It is an internal chemical. External tools such as wine, alcohol etc. can make the jeeva unconscious in chaitanya but cannot make him relish the bliss*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments