top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 11, FEBRUARY 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 11, FEBRUARY 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 11, FEBRUARY 2024 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 500 / Bhagavad-Gita - 500 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 11 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 11 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 855 / Sri Siva Maha Purana - 855 🌹

🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 4 / The Emissary is sent - 4 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 113 / Osho Daily Meditations  - 113 🌹

🍀 113. నిర్భయం / 113. BRAVERY 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 534 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 534 - 1 🌹

🌻 534. 'సర్వౌదన ప్రీత చిత్తా' - 1 / 534. 'Sarvaudana Preeta Chitta' - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 11, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻*


*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 78 🍀*


*78. విచిత్రరథ ఏకాకీ సప్తసప్తిః పరాత్పరః |*

*సర్వోదధిస్థితికరః స్థితిస్థేయః స్థితిప్రియః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : విశ్వ, తైజస, ప్రాజ్ఞులు : మాండూక్య ఉపనిషత్తులో చెప్పబడిన విశ్వుడు బాహ్యచేతన. తైజసుడు అంతశ్చేతన. ప్రాజ్ఞుడు పరాచేతన. జాగ్రత్, స్వప్న, సుషుప్తులకు వీటిని వర్తింప జెయ్యడానికి కారణం: జాగ్రదావస్థలో సామాన్యంగా మానవుని బాహ్యచేతన మాత్రమే మేల్కొని వుండగా, అంతశ్చేతన ప్రచ్ఛన్నమై వుండి, నిద్రలో మాత్రమే స్వప్నాలుగా దర్శనాలుగా అనుభూత మవుతూ వుంటుంది. పరాచేతన (అతీతమనస్సు, అధిమనస్సు ఇత్యాది) ఈ అంతఃశ్చేతన కంటె అతీతమైనది. మనోదృష్టి కది గాఢ నిద్ర వంటిది మాత్రమే. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శిశిర ఋతువు, ఉత్తరాయణం,

మాఘ మాసము

తిథి: శుక్ల విదియ 21:10:37 వరకు

తదుపరి శుక్ల తదియ

నక్షత్రం: శతభిషం 17:40:16

వరకు తదుపరి పూర్వాభద్రపద

యోగం: పరిఘ 10:38:07 వరకు

తదుపరి శివ

కరణం: బాలవ 10:58:39 వరకు

వర్జ్యం: 02:53:48 - 04:18:12

మరియు 23:20:32 - 24:45:40

దుర్ముహూర్తం: 16:43:43 - 17:29:47

రాహు కాలం: 16:49:29 - 18:15:51

గుళిక కాలం: 15:23:06 - 16:49:29

యమ గండం: 12:30:20 - 13:56:43

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 11:20:12 - 12:44:36

సూర్యోదయం: 06:44:49

సూర్యాస్తమయం: 18:15:51

చంద్రోదయం: 07:52:23

చంద్రాస్తమయం: 19:51:32

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: రాక్షస యోగం - మిత్ర

కలహం 17:40:16 వరకు తదుపరి

చర యోగం - దుర్వార్త శ్రవణం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 500 / Bhagavad-Gita - 500 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 11 🌴*


*11. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |*

*వివిక్త దేశ సేవిత్య మరతిర్జన సంసది*


*🌷. తాత్పర్యం : నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసము నందు అనాసక్తి.,*


*🌷. భాష్యము : ఇచ్చట తెలుపబడిన జ్ఞానము అనునది అతడు దాని నుండి బయటపడుటకు మార్గమై యున్నది. ఈ జ్ఞానవిధాన వర్ణనలలో అత్యంత ముఖ్యమైనది పదునొకండవ శ్లోకపు మొదటి పాదమునందు వివరింపబడినది.*


*అదియే “మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ” యనునది. అనగా జ్ఞానమనునది శ్రీకృష్ణభగవానుని విశుద్ధ భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 500 🌹*

*✍️ Sri Prabhupada. 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 11 🌴*


*11. mayi cānanya-yogena bhaktir avyabhicāriṇī*

*vivikta-deśa-sevitvam aratir jana-saṁsadi*


*🌷 Translation : Constant and unalloyed devotion to Me; Aspiring to live in a solitary place; detachment from the general mass of people;*


*🌹 Purport : The knowledge given here is the way for him to get out of it. The most important of these epistemological descriptions is that described in the first pada of the eleventh verse.*


*That is “My Chananyayogena Bhaktiravyabhi charini”. That is, knowledge is the culmination of pure devotional service to Lord Krishna.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 855 / Sri Siva Maha Purana - 855 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 32 🌴*


*🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 4 🌻*


*ఓ రాజశ్రేష్ఠా! ఇన్ని మాటలేల? మనస్సులో చక్కగా ఆలోచించుము. రుద్రుడే మహేశ్వరుడు, పరబ్రహ్మ, చైతన్యస్వరూపుడు అని తెలుసుకొనుము (29). దేవతలకు రాజ్యమును, సర్వాధికారములను అప్పజెప్పుము. కుమారా! ఈ తీరున చేసినచో నీకు క్షేమము కలుగ గలదు. అట్లు గానిచో, నీకుభయము తప్పదు (30).*


*సనత్కుమారుడిట్లు పలికెను- ప్రతాపశాలి, దావనశ్రేష్టుడు అగు శంఖచూడుడు ఈ పలుకులను విని విధిచే సమ్మోహితుడై ఆ శివుని దూతతో ఇట్లనెను (31).*


*శంఖచూడుడిట్లు పలికెను- మహేశ్వరునితో యుద్ధము చేయకుండగా నా అంతట నేను నిశ్చయించుకొని రాజ్యమును, అధికారములను అప్పజెప్పుట కల్ల. నేను సత్యమును పలుకు చున్నాను (32). ఈ స్థావరజంగమాత్మకమగు జగత్తు అంతయూ కాలమునకు వశమై యున్నది. సర్వము కాలమునందు పుట్టి, కాలమునందు గిట్టును (33). నీవు మంగళకరుడగు రుద్రుని వద్దకు వెళ్లి నా సందేశమును యథాతధముగా చెప్పుము. ఆయన ఏది యోగ్యమో దానిని చేయగలడు. నీవు అధికప్రసంగమును చేయకుము (34).*


*సనత్కుమారుడిట్లు పలికెను- ఆతడిట్లు పలుకగా శివుని దూతయగు పుష్పదంతుడు తన ప్రభువు వద్దకు వెళ్లెను. ఓ మహర్షీ! ఆతడు యథాతథముగా జరిగిన సంభాషణను రుద్రునకు చెప్పెను (35).*


*శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి యుద్ధఖండలో శివదూత శంఖచూడ సంవాదమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 855 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 32 🌴*


*🌻 The Emissary is sent - 4 🌻*


28. He is the overlord of Brahmā. He is lord Śiva even into Viṣṇu. O excellent Dānava, his behest should never be slighted.


29. Of what avail is an unnecessary digression, O great king. Ponder deeply. Know him to be great lord, the great Brahman, the knowledge-formed.


30. Return their kingdoms to the gods as well as their positions of authority. O dear, thus you will fare well. Otherwise, terror will strike you.


Sanatkumāra said:—

31. On hearing this, the valorous king of the Dānavas, deluded by his fate spoke to the emissary of Śiva thus.


Śaṅkhacūḍa said:—

32. I shall neither give up kingdom nor the positions of authority, without a fight with him. This is certain. I tell you the truth.


33. The entire universe whether mobile or immobile is subject to the vagaries of time. Everything originates in time and everything merges into time.


34. Go and tell Śiva exactly what I have said to you. Let him do what is proper. Do not talk much.

Sanatkumāra said:—


35. O good sage, Puṣpadanta the emissary of Śiva when thus addressed by the Asura returned to lord Śiva and told him everything duly.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 113 / Osho Daily Meditations  - 113 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 113. నిర్భయం 🍀*


*🕉 మీకు చాలా అహంభావ సంబంధమైన ఆదర్శాలు బోధించబడ్డాయి. 'ధైర్యంగా ఉండండి.' ఎంత మూర్ఖత్వం! తెలివైన వ్యక్తి భయాన్ని ఎలా నివారించగలడు? 🕉*


*ప్రతి ఒక్కరూ భయపడతారు - భయపడాలి. జీవితం అంటేనే అలా ఉండాలి. నిర్భయంగా మారే వ్యక్తులు ధైర్యవంతులుగా మారడం ద్వారా నిర్భయంగా మారరు-ఎందుకంటే ధైర్యవంతులు తమ భయాన్ని అణచివేశారు, అంతే; వారు నిజంగా నిర్భయులు కాదు. ఒక వ్యక్తి తన భయాలను అంగీకరించడం ద్వారా నిర్భయుడు అవుతాడు. ఇది ధైర్యం గురించిన ప్రశ్న కాదు. ఇది కేవలం జీవితంలోని వాస్తవాలను చూసి భయాలు సహజమని గ్రహించడం. వాటిని మీరు అంగీకరిస్తారు! మీరు వాటిని తిరస్కరించాలి అనుకున్నప్పుడు సమస్య తలెత్తుతుంది. మీకు చాలా అహంభావ సంబంధమైన ఆదర్శాలు బోధించబడ్డాయి - 'ధైర్యంగా ఉండండి.' ఎంత మూర్ఖత్వం! తెలివిగల వ్యక్తి భయాన్ని ఎలా నివారించగలడు?*


*బస్సు డ్రైవరు హారన్ మోగిస్తూ వెళుతున్నాడు, మీరు రోడ్డు మధ్యలో భయపడకుండా నిలబడతారు, లేదా ఒక ఎద్దు మీపైకి దూసుకు వస్తుంది, మీరు భయపడకుండా అక్కడ నిలబడండి - ఇది మూర్ఖత్వం! ఒక తెలివైన వ్యక్తి ప్రక్కకు దూకాలి. అలా కాక రోడ్డుపై ఎవరూ లేనప్పుడు కూడా మీరు భయపడి పరుగెత్తడం ప్రారంభించినట్లయితే, ఏదో సమస్య ఉంది; లేకుంటే భయం అనేది సహజం. జీవితంలో భయాలు ఉండవని కాదు. మీ భయాలలో తొంభై శాతం కేవలం ఊహ మాత్రమే అని మీరు తెలుసుకుంటారు. దాదాపు పది శాతం వాస్తవమే కాబట్టి వాటిని అంగీకరించాల్సిందే. మరింత ప్రతిస్పందించండి, సున్నితంగా మరియు అప్రమత్తంగా ఉండండి ఇది సరిపోతుంది. మీ భయాలను మీరు సోపానాలుగా ఉపయోగించుకోవచ్చని మీరు తెలుసుకుంటారు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 113 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 113. BRAVERY 🍀*


*🕉  You have been taught very egoistical ideals--“Be brave." What nonsense! How can an intelligent person avoid fear?  🕉*


*Everybody is afraid-they have to be. Life is such that one has to be. And people who become fearless become fearless not by becoming brave-because brave people have only repressed their fear; they are not really fearless. A person becomes fearless by accepting his or her fears. It is not a question of bravery. It is simply seeing into the facts of life and realizing that fears are natural. One accepts them! The problem arises when you want to reject them. You have been taught very egoistical ideals-"Be brave." What nonsense! How can an intelligent person avoid fear?*


*The bus driver goes on honking, and you stand in the middle of the road unafraid, or a bull comes charging at  you, and you stand there unafraid-this would be stupid! An intelligent person has to jump out of the way. Or if there is nobody on the road, and then too you are afraid and start running, there is a problem; otherwise, fear is natural. It is not that there will be no fears in life. You will come to know that ninety percent of your fears are just imagination. About ten percent are real, so one has to accept them. Become more responsive, sensitive, and alert, and this will be enough. You will become aware that you can use your fears as stepping stones.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 534 -1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 534 -1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*

*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*


*🌻 534. 'సర్వౌదన ప్రీత చిత్తా' - 1 🌻*


*పాయస్నానము మొదలుగ హరిద్రాన్నము వరకు గల అన్ని రకముల అన్నాహారములయందు ప్రీతి కలది శ్రీమాత అని అర్థము. షట్ పద్మములను వర్ణించినపుడు వివిధ అన్నాహారములు తెలుపబడినవి. నేతి అన్నము, గుడాన్నము, పాయసాన్నము, దధ్యాన్నము, పప్పు అన్నము, చిత్రాన్నము.  ఈ అన్నము లన్నిటియందు ప్రీతిగలది ఈ పద్మమందలి శ్రీమాత. అందులకే అన్నమందు అన్ని కూరగాయలు, అన్ని పప్పులు, బెల్లము, నెయ్యి వేసి సర్వాదనమును తయారుచేసి నైవేద్యము పెట్టుట ఆచారముగ వచ్చినది. దీని రూపాంతరమే ప్రస్తుతము వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనుచూ భుజించుచున్నారు. ఇది సమగ్రము కాదు. ఏదెట్లున్ననూ ఆహారము నందు ప్రీతి యుండుట ఆరోగ్యమునకు సంకేతము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 534 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*

*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi  ॥109 ॥ 🌻*


*🌻 534. 'Sarvaudana Preeta Chitta' - 1 🌻*


*It means that Sri Mata is fond of all types of rice recipes from Payasaannam to Haridrannam. Various rice foods are mentioned when the six padmas are described. Ghee rice, Jaggery rice, sweet rice, Curd rice, Dal rice, chitraanna. The Sri Mata in this lotus likes all these rice recipes. Hence it is customary to prepare Sarvadanam by adding all the vegetables, all pulses, jaggery and ghee to them and offering it to Her. Its variant is currently eaten as vegetable fried rice. It is not comprehensive. Love for any kind of food is a sign of health.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page