top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 11, JANUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 11, JANUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 11, JANUARY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 485 / Bhagavad-Gita - 485 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -16 / Chapter 12 - Devotional Service - 16 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 840 / Sri Siva Maha Purana - 840 🌹

🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 6 / The previous birth of Śaṅkhacūḍa - 6 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 98 / Osho Daily Meditations  - 98 🌹

🍀 98. కదలిక మరియు నిశ్చలత / 98. MOVEMENT AND STILLNESS 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 🌹

🌻 521 to 528 నామ వివరణము - 1 / 521 to 528 Names Explanation - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 11, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మార్గశీర్ష అమావాస్య, హనుమత్‌ జయంతి, Margasirha Amavasya, Hanumath Jayanthi 🌻*


*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 70 🍀*


*70. చండికేశః ప్రచండశ్చ ఘంటా నాదరతః ప్రియః |*

*వీణాధ్వనిర్వైనతేయో నారదస్తుం బరుర్హరః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : మనస్సు - విజ్ఞానం : తెలుసుకోడం కోసం ప్రయత్నించే అవిద్యా సాధనం మనస్సు. తెలియబడేదీ తెలివీ తానేయైన జ్ఞాత అతిమానస విజ్ఞానం. కనుకనే తన నిజతత్వపు వెలుగులో సకల వస్తువులనూ చూడగలుగుతుంది. అయ్యది అచల శక్తియే గాక సచల శక్తి, జ్ఞానమే గాక జ్ఞాన మూలకమైన ఇచ్ఛ, సంకల్పం. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసం

తిథి: అమావాశ్య 17:25:18 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పూర్వాషాఢ 17:39:03

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: వ్యాఘత 17:49:17

వరకు తదుపరి హర్షణ

కరణం: చతుష్పద 06:52:25 వరకు

వర్జ్యం: 04:28:12 - 05:56:04

మరియు 24:52:20 - 26:19:00

దుర్ముహూర్తం: 10:32:02 - 11:16:42

మరియు 15:00:05 - 15:44:45

రాహు కాలం: 13:47:29 - 15:11:15

గుళిక కాలం: 09:36:11 - 10:59:57

యమ గండం: 06:48:39 - 08:12:25

అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45

అమృత కాలం: 13:15:24 - 14:43:16

సూర్యోదయం: 06:48:39

సూర్యాస్తమయం: 17:58:46

చంద్రోదయం: 06:38:03

చంద్రాస్తమయం: 17:51:08

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: ధాత్రి యోగం - కార్య

జయం 17:39:03 వరకు తదుపరి

సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 485 / Bhagavad-Gita - 485 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -16 🌴*


*16. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య: |*

*హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||*


*🌷. తాత్పర్యం : ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.*


*🌷. భాష్యము : భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును.*


*వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును. ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 485 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 16 🌴*


*16. anapekṣaḥ śucir dakṣa udāsīno gata-vyathaḥ*

*sarvārambha-parityāgī yo mad-bhaktaḥ sa me priyaḥ*


*🌷 Translation : My devotee who is not dependent on the ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains, and not striving for some result, is very dear to Me.*


*🌹 Purport : Money may be offered to a devotee, but he should not struggle to acquire it. If automatically, by the grace of the Supreme, money comes to him, he is not agitated. Naturally a devotee takes a bath at least twice in a day and rises early in the morning for devotional service. Thus he is naturally clean both inwardly and outwardly. A devotee is always expert because he fully knows the essence of all activities of life and he is convinced of the authoritative scriptures. A devotee never takes the part of a particular party; therefore he is carefree.*


*He is never pained, because he is free from all designations; he knows that his body is a designation, so if there are some bodily pains, he is free. The pure devotee does not endeavor for anything which is against the principles of devotional service. For example, constructing a big building requires great energy, and a devotee does not take to such business if it does not benefit him by advancing his devotional service. He may construct a temple for the Lord, and for that he may take all kinds of anxiety, but he does not construct a big house for his personal relations.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 840 / Sri Siva Maha Purana - 840 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴*


*🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 6 🌻*


*ఓ బ్రహ్మా! సత్త్వరజస్తమో గుణ ప్రధానులై క్రమముగా సృష్టిస్థితిలయములను చేయు బ్రహ్మవిష్ణు హరులనే త్రిమూర్తులు ఆయన దేహమునుండి పుట్టినవారే (49). ఆయనయే పరమాత్మ నిత్య, అనిత్యవస్తువులను కల్పించే ఆయన మాయా సంబంధము లేని వాడై ఉమాదేవితో గూడి విహరించుచున్నాడు (50). ఆ శివలోకమునకు సమీపములో గోలోకము, శంకరుని గోశాల గలవు. నా అవతారమగు శ్రీకృష్ణుడు శంకరుని ఇచ్ఛచే ఆ గోలోకమునందు నివసించుచున్నాడు (51).*


*శివుడు శ్రీకృష్ణుని తన గోవుల రక్షణ కొరక నియోగించెను. శ్రీ కృష్ణుడు శివుని నుండి లభించిన సుఖమును అనుభవిస్తూ అచట సర్వదా క్రీడించుచుండును. ఆయన విహారకుశలుడు (52). జగన్మాత, ప్రకృతి కంటే ఉత్కృష్టమైన స్వరూపము గల అయిదవ మూర్తి, విహారప్రియురాలు అగు రాధ ఆతని ప్రియురాలు అని చెప్పబడినది (53). ఆమె నుండి జన్మించిన గోపాలకులు, గోపికలు చాలమంది అచట రాధాకృష్ణులను సేవిస్తూ నిత్యము చక్కని విహారమునందు నిమగ్నులే యుందురు (54). ఆ సుదాముడు శంభుని లీలచే రాధాదేవిని చూచి మోహితుడయ్యెను ఆమె శపించగా ఆతడు తనకు దుఃఖమును కలుగజేసే దానవరూపమును వ్యర్థముగా పొందియున్నాడు (55). ఆతడు రుద్రుని శూలముచే వధింపబడునని పూర్వము శ్రీకృష్ణుడు నిర్ణయించి యున్నాడు. ఆతడు తన దేహమును విడిచిన పిదప శ్రీకృష్ణుని అనుచరుడు కాగలడు (56). ఓ ఇంద్రా! ఈ సత్యము నెరింగి భయమును విడనాడుము. మనము శంకరుని శరణు జొచ్చెదము. ఆయన వెంటనే మంగళమును చేయగలడు (57). నేను, నీవు, మరియు సర్వదేవతలు భయమును విడి ఇచట నున్నాము (58).*


*సనత్కుమారుడిట్లు పలికెను - ఇట్లు పలికి విష్ణువు బ్రహ్మతో గూడి సర్వేశ్వరుడు, భక్త వత్సలుడునగు శంభుని మనస్సులో స్మరిస్తూ శివలోకమునకు వెళ్లెను (59).*


*శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండములో శంఖచూడ పూర్వభవవృత్త వర్ణనమనే ఇరువది తొమ్మిదవ ఆధ్యాయము ముగిసినది (29).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 840 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴*


*🌻 The previous birth of Śaṅkhacūḍa - 6 🌻*


49, 50. O Brahmā, the three deities bringing about creation etc. are born of him.[3] They are Viṣṇu, Brahmā and Śiva endowed with Śāttvika and other attributes. He alone is the supreme soul. He sports there with Pārvatī. He is free from illusion. He is the formulator of the eternal and the non-eternal.


51. The Goloka is near it. Śiva’s cowshed is situated there. Kṛṣṇa having my form stays there at Śiva’s behest.


52. It is to tend his cows and bulls that he has been ordered by him. Deriving happiness from him he too sports there.


53. His wife Rādhā[4] is the mother of the universe. Her form is greater than Prakṛti. It is the fifth[5] sportive form.


54. Many cowherds and cowherdesses born of her live there. They are sportively inclined and follow Rādhā and Kṛṣṇa.


55. That very same (Sudāmā, now born as Śaṅkhacūḍa) has been fascinated by her by Śiva’s illusion. Cursed by Rādhā he is born as a Dānava to his distress.


56. Kṛṣṇa has already ordained that the death of Śaṅkhacūḍa will be by Rudra’s trident. Casting off his body he will become his comrade again.


57. O lord of gods, knowing this you need not have any fear. Let us seek refuge in Śiva. He will do everything conducive to our good.


58. You, I and the gods stand here fearless (due to that only).


Sanatkumāra said:—

59. After saying this and mentally thinking upon Śiva who, the lord of all, is favourably disposed to his devotees Viṣṇu went to Śivaloka accompanied by Brahmā.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 98 / Osho Daily Meditations  - 98 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 98. కదలిక మరియు నిశ్చలత 🍀*


*🕉 పరిధి పైన నృత్యం ఉంటుంది మరియు మధ్యలో సంపూర్ణ నిశ్చలత ఉంటుంది. 🕉*


*ధ్యానం అనేది మీరు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, వాస్తవానికి, లోతుగా, బుద్ధుడు తన బోధి వృక్షం క్రింద నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, అస్సలు కదలకుండా అతనిలో లోతైన నృత్యం ఉంటుంది-చైతన్య నృత్యం. ఇది ఖచ్చితంగా కనిపించదు, కానీ నృత్యం ఉంది' ఎందుకంటే ఏదీ నిశ్చలంగా ఉండదు. నిశ్చలత అనేది అవాస్తవమైన పదం; వాస్తవానికి నిశ్చలత లేదు. ఇది మనపై ఆధారపడి ఉంటుంది: మనం మన జీవితాన్ని కేవలం చంచలత్వం లేదా నృత్యంగా మార్చుకోవచ్చు. నిశ్చలత అనేది విషయాల స్వభావంలో లేదు, కానీ మనం చాలా అస్తవ్యస్తమైన చంచలతను కలిగి ఉండవచ్చు-అంటే దుఃఖం, అది న్యూరోసిస్, అది పిచ్చి. లేదా ఈ శక్తితో మనం సృజనాత్మకంగా ఉండవచ్చు; అప్పుడు చంచలత్వం ఇకపై అశాంతి కాదు.*


*ఇది మృదువుగా, మనోహరంగా మారుతుంది-ఇది నృత్యం మరియు పాట రూపం తీసుకుంటుంది. మరియు వైరుధ్యం ఏమిటంటే, నర్తకి పూర్తిగా నృత్యంలో ఉన్నప్పుడు, నిశ్చలత ఉంటుంది - అసాధ్యమైనది జరుగుతుంది, తుఫాను యొక్క కేంద్రం. అయితే ఆ నిశ్చలత మరే విధంగానూ సాధ్యం కాదు. నాట్యం పరిపూర్ణం అయినప్పుడు మాత్రమే నిశ్చలత వస్తుంది. మరియు ఈ మొత్తం నృత్యానికి కేంద్రం ఉంది. కేంద్రం లేకుండా ఇది సాగదు. పరిధి నృత్యం చేస్తోంది, చుట్టుకొలత నృత్యం చేస్తోంది-కేంద్రాన్ని తెలుసుకోవడం, మొత్తం నృత్యంగా మారడమే ఏకైక మార్గం. అప్పుడే, నృత్యానికి భిన్నంగా, అకస్మాత్తుగా చాలా నిశ్శబ్దమైనది మరియు చాలా నిశ్చలమైనది తెలుస్తుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 98 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 98. MOVEMENT AND STILLNESS 🍀*


*🕉  On the circumference is a dance, and at the center is absolute stillness.  🕉*


*Meditation is not just when you close your eyes and sit silently In fact, deep down, when Buddha is sitting silently  under his bodhi tree, not moving at all, there is a dance deep inside him-the dance of consciousness. It is invisible of course, but the dance is there" because nothing remains at rest. Rest is an unreal word; nothing corresponds to rest in reality. It depends on us: We can make our life just a restlessness or a dance. Rest is not in the nature of things, but we can have a very chaotic restlessness-that is misery, that is neurosis, that is madness. Or we can be creative with this energy; then restlessness is no longer restless.*


*It becomes smooth, graceful-it starts taking the form of a dance and a song. And the paradox is that when the dancer is totally in dance, there is rest-the impossible happens, the center of the cyclone. But that rest is not possible in any other way. When the dance is total, only then does that rest happen. And there is a center to this whole dance. It cannot go on without a center. The periphery is dancing, the circumference is dancing-to know the center, the only way is to become a total dance. Only then, in contrast to the dance, does one suddenly become aware of something very quiet and very still.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 521 - 528 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥

*108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।*

*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀*


*🌻 521 to 528 నామ వివరణము - 1 🌻*


*అత్యంత ప్రధానము, మహిమాన్వితము, సౌందర్యమగు ఆజ్ఞా పద్మమందలి శ్రీమాత వర్ణింపబడుచున్నది. ఆజ్ఞా పద్మము రెండు దళములు గలదియై యున్నది. ఇడ పింగళ ప్రజ్ఞలు రెండు దళములుగ వికసింపగ దాని మధ్యమున అమితమగు తెల్లని ప్రకాశముతో శ్రీమాత యుండును. వజ్ర సమానమైన ప్రకాశమది. సూర్యుని కాధారమై సూర్యుని నుండి దిగివచ్చు వెలుగు. అమిత కాంతివంతము, అత్యాకర్షణ వంతము - ఇచ్చటి శ్రీమాత రూపము. మిగిలిన ఐదు పద్మములకు ఆధార మీ పద్మము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥*

*108. Majasansdha hansavati mukhyashakti samanvita*

*haridranai karasika hakinirupa dharini  ॥ 108 ॥ 🌻*


*🌻 521 to 528 Names Explanation - 1🌻*


*The most important, glorious and beautiful Srimata in the Ajna Padma is described. Ajna Padma has two petals. Where the Ida Pingala forces bloom as two petals Srimata resides in the middle with a dazzling white residence. It is equivalent to the radiance of a diamond. It is the Light that supports the Sun and coming from the Sun. Immensely radiant and immensely beautiful is the form of Srimata here. This lotus is the basis for the remaining five lotuses.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comentarios


bottom of page