top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 13, DECEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 13, DECEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 13, DECEMBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -02 / Chapter 12 - Devotional Service - 02 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 827 / Sri Siva Maha Purana - 827 🌹

🌻. శంఖచూడుని జననము - 1 / The birth of Śaṅkhacūḍa - 1 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 84 / Osho Daily Meditations  - 84 🌹

🍀 84. బహుశా / 84. PERHAPS 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 511 / Sri Lalitha Chaitanya Vijnanam - 511 🌹

🌻 511. 'బందిన్యాది సమన్వితా' / 511. 'Bandinyadi Samanvita' 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 13, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 01 🍀*


*స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |*

*షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే ||*

*ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ |*

*ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే ||*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : చేతనయే మూలవస్తువు : చేతనయే మూలవస్తువు. ఈ విశ్వమును, అందలి సర్వమును సృజించెడి శక్తి అదే. విశ్వమే కాక, అందలి ప్రత్యణువూ చేతన రూపొందించు కున్న వ్యవస్థా విశేషమే కాని వేరు కాదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మృగశిర మాసం

తిథి: శుక్ల పాడ్యమి 27:10:01 వరకు

తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: జ్యేష్ఠ 11:06:04 వరకు

తదుపరి మూల

యోగం: శూల 16:18:32 వరకు

తదుపరి దండ

కరణం: కింస్తుఘ్న 16:05:32 వరకు

వర్జ్యం: 18:39:40 - 20:10:24

దుర్ముహూర్తం: 11:47:44 - 12:32:10

రాహు కాలం: 12:09:56 - 13:33:15

గుళిక కాలం: 10:46:38 - 12:09:57

యమ గండం: 08:00:00 - 09:23:19

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31

అమృత కాలం: 02:37:04 - 04:09:36

మరియు 27:44:04 - 29:14:48

సూర్యోదయం: 06:36:41

సూర్యాస్తమయం: 17:43:11

చంద్రోదయం: 06:51:02

చంద్రాస్తమయం: 18:01:18

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని 11:06:04 వరకు

తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -02 🌴*


*02. శ్రీ భగవానువాచ*

*మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |*

*శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతా: ||*


*🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను: నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణములని నేను భావింతును.*


*🌷. భాష్యము : అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు తన స్వీయరూపమును ధ్యానించుచు శ్రద్ధాభక్తులను గూడి తనను పూజించువాడు యోగము నందు పరిపూర్ణుడని స్పష్టముగా పలుకుచున్నాడు. సర్వము కృష్ణుని కొరకే ఒనరింపబడుచున్నందున అట్టి కృష్ణభక్తిభావనలో నున్నవానికి ఎట్టి భౌతికకర్మలను ఉండవు. అటువంటి కృష్ణభక్తిరసభావనలో భక్తుడు సంతతమగ్నుడై యుండును.*


*కొన్నిమార్లు అతడు జపమును గావించును. కొన్నిమార్లు కృష్ణుని గూర్చిన శ్రవణము లేదా పఠనమును కొనసాగించును. మరికొన్నిసార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. ఇంకొన్నిమార్లు కృష్ణుని నిమిత్తమై అవసరమైనదేదియో ఖరీదు చేయుటకు అంగడికేగును. ఇంకను మందిరమును శుభ్రము చేయుట, భగవానుని భోజనపాత్రులను కడుగుట వంటి కార్యముల నొనరించును. ఈ విధముగా ఆతడు కృష్ణపరకర్మలకు అంకితము కాకుండా క్షణకాలమును వృథాచేయడు. అటువంటి కర్మ సంపూర్ణముగా సమాధిగతమై యుండును.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 471 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 02 🌴*


*02. śrī-bhagavān uvāca*

*mayy āveśya mano ye māṁ nitya-yuktā upāsate*

*śraddhayā parayopetās te me yukta-tamā matāḥ*


*🌷 Translation : The Supreme Personality of Godhead said: Those who fix their minds on My personal form and are always engaged in worshiping Me with great and transcendental faith are considered by Me to be most perfect.*


*🌹 Purport : In answer to Arjuna’s question, Kṛṣṇa clearly says that he who concentrates upon His personal form and who worships Him with faith and devotion is to be considered most perfect in yoga. For one in such Kṛṣṇa consciousness there are no material activities, because everything is done for Kṛṣṇa.*


*A pure devotee is constantly engaged. Sometimes he chants, sometimes he hears or reads books about Kṛṣṇa, or sometimes he cooks prasādam or goes to the marketplace to purchase something for Kṛṣṇa, or sometimes he washes the temple or the dishes – whatever he does, he does not let a single moment pass without devoting his activities to Kṛṣṇa. Such action is in full samādhi.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 826 / Sri Siva Maha Purana - 826 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴*


*🌻. శంఖచూడుని జననము - 1 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! మరియొక శంభుగాథను ప్రేమతో వినుము. దీనిని విన్నంతమాత్రాన శివుని యందలి భక్తి దృఢమగును (1). వీరుడు, దేవతలను పీడించువాడు అగు శంఖచూడుడనే రాక్షసుని సంగ్రామములో శివుడు త్రిశూలముతో సంహరించిన గాథను వినుము (2). ఓ వ్యాసా! దివ్యము, పవిత్రము, పాపనాశనము అగు ఆ శంభుగాథను నీయందు గల స్నేహభావము వలన మిక్కిలి ప్రీతితో చెప్పు చున్నాను. వినుము (3). మరీచి ప్రజాపతి యొక్క కుమారుడగు కశ్యపమహర్షి ధర్మాత్ముడు. ఆయన బ్రహ్మచే ఆజ్ఞాపించబడిన వాడై సృష్టిని గావించిన ప్రజాపతి (4). దక్షుడు ఆయనకు తన పదముగ్గురు కుమార్తెలనిచ్చి ప్రీతితో వివాహమును చేసెను. మిక్కిలి విస్తరించిన వారి సంతానమును గూర్చి విపులముగావర్ణించుట సంభవము కాదు (5). దేవతలు మొదలగు సమస్త స్థావర జంగమాత్మకమగు జగత్తు వారిసంతానమే. దానిని విస్తరముగా చెప్పగల సమర్థుడు ముల్లోకములలో ఎవరుగలరు? (6) శంభుని లీలలతో గూడినది, భక్తిని వర్ధిల్ల జేయునది అగు ప్రస్తుత గాతను మాత్రమే ఇప్పుడు చెప్పెదను వినుము (7).*


*ఆ కశ్యపుని భార్యలలో దనువు అను ఒక సుందరి గలదు. ఆమె గొప్ప రూపవతి, పతివ్రత, మరియు భర్తయొక్క సౌభాగ్యమును వృద్ధి చేయునది (8). ఆ దనువునకు మహాబలశాలురగు అనేక పుత్రులు గలరు. ఓ మునీ! విస్తారభయముచే వారి పేర్లను నేను చెప్పుట లేదు (9).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 826 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴*


*🌻 The birth of Śaṅkhacūḍa - 1 🌻*


Sanatkumāra said:—

1. O sage, now listen to another story of Śiva lovingly, by listening to which the devotion to Śiva is stabilised.


2. The story narrates how the heroic Dānava Śaṅkhacūḍa who harassed the gods was killed by Śiva in the battle by means of his trident.


3. O Vyāsa, listen lovingly to the story of Śiva, divine, holy and destructive of sins. I shall narrate the same because of my affection to you.


4. The sage Kaśyapa son of Marīci and grandson of Brahmā was a virtuous Prajāpati engaged in creation. He possessed great learning.


5. Dakṣa gave him his thirteen daughters in marriage. The descendants of these women are many and they cannot be enumerated easily.


6. The whole universe consisting of gods and others the mobile and immobile is born of them. Who in the three worlds can mention this in detail?


7. Listen to what is relevant to the context wherein the divine sports of Śiva too can be seen. It is conducive to the increase of devotion. I am narrating the same.


8. Among the wives of Kaśyapa the excellent lady Danu was one. She was very beautiful, chaste and tenderly nurtured by her husband with all devotion and love.


9. Many powerful sons were born to that lady Danu. Their names are not mentioned O sage, by the fear of dilation.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 84 / Osho Daily Meditations  - 84 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 84. బహుశా 🍀*


*🕉. బహుశా మరియు లేకపోతే వంటి మరిన్ని పదాలను ఉపయోగించి నప్పుడు మరింత సంకోచించండి. మరియు ఇతరులు తమ స్వంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను అనుమతించండి. 🕉*


*మీరు మాట్లాడే ప్రతి మాటను గమనించండి. మన భాష అలాంటిది, మన మాట్లాడే పద్ధతులు అలాంటివి, తెలిసో తెలియకో మనము నిర్దిష్ట ప్రతిపాదనలు చేస్తాము. అలా ఎప్పుడూ చేయవద్దు. 'బహుశా' అని మరింత ఎక్కువగా అనండి. మరింత సంకోచించండి. 'బహుశా'ని ఎక్కువగా వాడి ఇతరులు వారి స్వంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను అనుమతించండి.*


*ఇలా ఒక నెల పాటు ప్రయత్నించండి. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే నిర్దిష్టంగా మాట్లాడటం అనేది లోతుగా పాతుకుపోయిన అలవాటు, కానీ జాగ్రత్తగా ఉంటే, ఈ అలవాటును వదిలివేయవచ్చు. అప్పుడు వాదనలు తగ్గుముఖం పడతాయని, సమర్థించాల్సిన అవసరం ఉండదని మీరు చూస్తారు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 84 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 84. PERHAPS 🍀*


*🕉.  Hesitate more. Use the words maybe and perhaps more, and allow others the freedom to decide on their own.  🕉*


*Watch every word that you speak. Our language is such, our ways of speaking are such, that knowingly and unknowingly, 'we make absolute statements. Never do that. Say "perhaps" more. Hesitate more. Say "maybe" more, and allow others the freedom to decide on their own.*


*Try it for one month. You will have to be very alert, because speaking in absolutes is a deep-rooted habit, but if one is watchful, this habit can be dropped. Then you will see that arguments will drop and there will be no need to defend.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 511 / Sri Lalitha Chaitanya Vijnanam  - 511 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*

*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*


*🌻 511. 'బందిన్యాది సమన్వితా'🌻*


*బందిని మొదలగు ఆరుగురు దేవతలతో నుండునది శ్రీమాత అని అర్థము. పాశము, త్రిశూలము యిత్యాది ఆరు ఆయుధములతో శ్రీమాత యిచట సుప్రతిష్ఠయై యున్నదని 504వ నామమున వివరించుట జరిగినది. స్వాధిష్ఠానమున ఆరు దళములు శిష్టులకు సుమేదస్సును కలిగించి ఆనందము నీయగ, శిష్టులు కాని వారికి అరిషడ్వర్గములను పుట్టించును. అసూయ, గర్వము, కామము, కోపము, రాగము, ద్వేషము యిత్యాదివి కలుగును. వాటితో జీవుడు దేహమున బందీ అగును. బంధమునకు ప్రథమ కారణము అసూయ, మిగిలిన వన్నియూ అసూయతో పుట్టు వికారములు. ఈ వికారముల కారణముగ జీవుడు బంధములకు గురి యగును. అప్పుడు బందిని ఆదిగా గల దేవతలు దేహమున బంధించి రోగపీడితునిగ చేసి దుఃఖ పరంపరలో ముంచెత్తును. అసూయ లేనివారే నిజమగు అదృష్టవంతులు. అసూయ దాటుట ప్రధానమగు పురుషకారము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 511 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*

*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*


*🌻 511. 'Bandinyadi Samanvita'🌻*


*Shrimata is the one with the six deities including Bandini. It is explained in the 504th name that Srimata is glorified with six weapons like Pasha and Trisula. In Swadhisthana, the six petals give rise to wisdom and happiness for the virtuous, and give birth to Arishadvargas for the non-virtuous. Jealousy, pride, lust, anger, love, hatred etc. With them, jeeva becomes a prisoner of the body. Jealousy is the first cause of bondage, all other distortions is born of jealousy. Because of these distortions jeeva is subject to attachments. Then Bandini and following deities captivate the jeeva in the body, bring maladies and subject him to sorrows. Those who are free of jealousy are truly fortunate. Overcoming jealousy is the main effort to be made.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Commentaires


bottom of page