top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 14, FEBRUARY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 14, FEBRUARY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 14, FEBRUARY 2024 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

*🌹🍀 వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి శుభాకాంక్షలు అందరికి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi Greetings to All. 🍀🌹*

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 12 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 12 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 856 / Sri Siva Maha Purana - 856 🌹

🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 1 / March of The Victorious Lord Śiva - 1 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 114 / Osho Daily Meditations  - 114 🌹

🍀 114. మార్చడము / 114. CHANGE 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 534 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 534 - 2 🌹

🌻 534. 'సర్వౌదన ప్రీత చిత్తా' - 2 / 534. 'Sarvaudana Preeta Chitta' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 14, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*🍀 వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి శుభాకాంక్షలు అందరికి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi Greetings to All. 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi 🌻*


*🍀. సరస్వతి ప్రార్థన 🍀*


*సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |*

*విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా *

*సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |*

*శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః *


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : విశ్వుడు - విరాట్టు ఇత్యాది జంటపదాలు : విశ్వుడు - విరాట్టు, తైజసుడు - హిరణ్యగర్భుడు, ప్రాజ్ఞుడు - ఈశ్వరుడు, ఇత్యాది జంటపదాల ఆంతర్యం ఒక్కటే. బాహ్యజగత్ చైతన్యం విశ్వుడు, లేక విరాట్. అంతరజగత్ చైతన్యం తైజసుడు, లేక హిరణ్యగర్భుడు. ఈ ఉభయ జగతీత చైతన్యం ప్రాజ్ఞుడు, లేక ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడే సర్వాధారుడు, సర్వనియామకుడు అయిన పరమాత్మ. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శిశిర ఋతువు, ఉత్తరాయణం,

మాఘ మాసము

తిథి: శుక్ల పంచమి 12:11:59

వరకు తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: రేవతి 10:44:02 వరకు

తదుపరి అశ్విని

యోగం: శుభ 19:58:13 వరకు

తదుపరి శుక్ల

కరణం: బాలవ 12:13:59 వరకు

వర్జ్యం: 29:59:40 - 44:16:12

దుర్ముహూర్తం: 12:07:11 - 12:53:26

రాహు కాలం: 12:30:19 - 13:57:01

గుళిక కాలం: 11:03:36 - 12:30:19

యమ గండం: 08:10:11 - 09:36:54

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 25:26:36 - 39:43:08

సూర్యోదయం: 06:43:29

సూర్యాస్తమయం: 18:17:09

చంద్రోదయం: 09:56:25

చంద్రాస్తమయం: 22:50:15

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 10:44:02 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹🍀 వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి శుభాకాంక్షలు అందరికి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi Greetings to All. 🍀🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. శ్రీ సరస్వతీ దేవి జయంతి - వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి విశిష్టత 🌻*


*🌷. సరస్వతి ప్రార్థన :*

*సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |*

*విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా *

*సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |*

*శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః *


*మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*.


*యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*.


*యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*.


*శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*


*మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ*

*పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః ॥*


*వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీ దేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి*.


*చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం*.


*పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది*.


*సరస్వతీ కటాక్షం:*


*బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు*.


*గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృప వలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడు అయ్యాడు. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు*.

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 12 🌴*


*12. అధ్యాత్మ జ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ |*

*ఏతజ్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా ||*


*🌷. తాత్పర్యం : ఆధ్యాత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్త్వము యొక్క తాత్త్వికాన్వేషణము అనునవి అన్నియును జ్ఞానమని నేను ప్రకటించు చున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే.*


🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 501 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 12 🌴*


*12. adhyātma-jñāna-nityatvaṁ tattva-jñānārtha-darśanam*

*etaj jñānam iti proktam ajñānaṁ yad ato ’nyathā *


*🌷 Translation : Accepting the importance of self-realization; and Philosophical search for the Absolute Truth – all these I declare to be knowledge, and besides this whatever there may be is ignorance.*


🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 856 / Sri Siva Maha Purana - 856 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴*


*🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 1 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను - ఆతని ఆ మాటలను విని అపుడా దేవదేవుడు, కైలాసవాసి యగు రుద్రుడు వీరభద్రుడు మొదలగు గణములతో కోపపూర్వముగా నిట్లనెను (1).*


*రుద్రుడిట్లు పలికెను - ఓ వీరభద్రా! నందీ! క్షేత్రపాలా! అష్టభైరవులారా! బలశాలురగు గణములందరు ఆయుధములను దాల్చి సన్నద్ధులు కండు (2). భద్రకాళి తన సేనను దోడ్కొని నా యాజ్ఞ కుమారులిద్దరితో కలిసి ఈ నాడే యుద్ధము కొరకు బయల్వెడలును గాక! నేను ఈ నాడే శీఘ్రముగా శంఖచూడుని వధించుట కొరకై బయలు దేరుచున్నాను (3).*


*సనత్కుమారుడిట్లు పలికెను - మహేశ్వరుడు ఇట్లు ఆజ్ఞాపించి సైన్యముతో గూడి బయలుదేరెను. వీరులైన ఆయన గణములందరు మహానందముతో వెంట నడిచిరి (4). ఇంతలో సర్వసైన్యాధ్యక్షులైన కుమారస్వామి, గజాననుడు ఆయుధములను దాల్చి యుద్ధసన్నద్ధులై ఆనందముతో శివుని వద్దకు వచ్చిరి (5). వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగలాక్షుడు, వికంపనుడు (6).విరూపుడు, వికృతి, మణిభద్రుడు, బాష్కలుడు, కపిలుడు, దీర్ఘదంష్ట్రుడు, వికరుడు, తామ్రలోచనుడు (7). కాలంకరుడు, బలీభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘ్యుడు, దుర్జయుడు, మరియు దుర్గముడు (8) మొదలగు శ్రేష్ఠసేనాపతులైన గణాధ్యక్షులు బయలు దేరిరి. వారి సైన్యములు సంఖ్యను చెప్పుచున్నాను. సావధానుడవై వినుము(9).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 856 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴*


*🌻 March of The Victorious Lord Śiva - 1 🌻*


Sanatkumāra said:—

1. On hearing those words of the emissary, the infuriated emperor of the gods, Śiva spoke to Vīrabhadra and other Gaṇas.

Śiva said.


2-3. “O Vīrabhadra, O Nandin, O eight Bhairavas,[1] the frontier guards,[2] let the Gaṇas start along with my sons. at my bidding. Let those strong ones be ready and fully equipped with weapons. Let Bhadrakālī start with her army for the war. I start just now for slaying Śaṅkhacūḍa”.


Sanatkumāra said:

4. Having ordered thus, lord Śiva started along with his army. His delighted heroic Gaṇas followed him.


5. In the meantime Kārttikeya and Gaṇeśa, the overall generals of the army, came near Śiva joyously, fully equipped with weapons and ready for war.


6-9. The leading chiefs of the Gaṇas were Vīrabhadra, Nandin, Mahākāla, Subhadraka, Viśālākṣa, Bāṇa, Piṅgalākṣa, Vikampana, Virūpa, Vikṛti, Maṇibhadra, Bāṣkala, Kapila Dīrghadaṃṣṭra, Vikara, Tāmralocana, Kālaṅkara, Balībhadra, Kālajihva, Kuṭīcara, Balonmatta, Raṇaślāghya, Durjaya, Durgama and others. I shall enumerate the number of Gaṇas they had. Listen attentively.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 114 / Osho Daily Meditations  - 114 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 114. మార్చడము 🍀*


*🕉 ఇది నా పరిశీలన, ఎవరూ కూడా దేనినీ మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు, ఎందుకంటే ఆ ప్రయత్నం విషయాన్ని సులభం చేయకపోగా కష్టతరం చేస్తుంది. 🕉*


*మీ మనస్సు ఏదో ఒకదానితో ముడిపడి ఉంది మరియు ఇప్పుడు అదే మనస్సు తనను తాను విడిపోవడానికి ప్రయత్నిస్తుంది. మహా అయితే అది అణచివేయగలదు, కానీ అది ఎప్పటికీ నిజమైన నిర్లిప్తతగా మారదు. అసలైన నిర్లిప్తత రావాలంటే, ఆ అనుబంధం ఎందుకు ఉందో మనస్సు అర్థం చేసుకోవాలి. దానిని వదలడానికి ఆతురుతలో ఉండవలసిన అవసరం లేదు; అంతకంటే, అది ఎందుకు ఉందో చూడండి. దాని విధానాన్ని పరిశీలించండి, అది ఎలా పని చేస్తుంది, ఎలా వచ్చింది: ఏ పరిస్థితులు, ఏ అజ్ఞానం దాన్ని ఉండటానికి సహాయపడ్డాయి. దాని చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి.*


*దాన్ని వదలడానికి తొందరపడకండి, ఎందుకంటే విషయాలను వదలడానికి ఆతురుతలో ఉన్న వ్యక్తులు వాటిని అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఇవ్వరు. మీరు అర్థం చేసుకున్న తర్వాత, అకస్మాత్తుగా అది మీ చేతుల నుండి జారిపోతున్నట్లు మీరు చూస్తారు; కాబట్టి దానిని వదలవలసిన అవసరం లేదు. అపార్థం తప్ప మరే ఇతర కారణాల వల్ల ఏమీ లేదు. ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు; అందుకే అది అక్కడ ఉంది. సరిగ్గా అర్థం చేసుకోండి ఇక అది అదృశ్యమవుతుంది. కష్టాలు సృష్టిస్తున్నదంతా చీకటి లాంటిదే. దానికి కాంతిని తీసుకురండి అంటే కేవలం కాంతిని తీసుకురండి ఎందుకంటే కాంతి ఉనికితో చీకటి ఉనికిలో ఉండదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 114 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 114. CHANGE 🍀*


*🕉  This is my observation, that one should never make an effort to change anything, because that effort is going to make things difficult rather than easy.  🕉*


*Your mind is attached to something, and now the same mind tries to detach itself. At the most it can repress, but it can never become a real detachment. For the real detachment to happen, the mind has to understand why the attachment is there. There is no need to be in a hurry to drop it; rather, see why it is there. Just look into the mechanism, how it works, how it has come in: what circumstances, what unawareness has helped it to be there. Just understand everything around it.*


*Don't be in a hurry to drop it, because people who are in a hurry to drop things don't give themselves enough time to understand them. Once you understand, suddenly you see that it is slipping out of your hands; so there is no need to drop it. Nothing is there for any reason other than a misunderstanding. Something has been misunderstood; hence it is there. Understand it rightly and it disappears. All that is creating trouble is just like darkness. Bring light to it and simply light because with the very presence of light, darkness no longer exists.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 534 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 534 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*

*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*


*🌻 534. 'సర్వౌదన ప్రీత చిత్తా' - 2 🌻*


*పరిపూర్ణ ఆరోగ్యము లేనివారు ఆహారమునందు కొన్ని మాత్రమే భుజించు చుందురు. కొన్నింటిని వర్ణింతురు. నిజమునకు ఆహారమునం దాసక్తి, రుచి కలిగి సమగ్రముగ భుజించువారు దేహ పుష్టి కలిగి యుందురు. సృష్టి రూపము శ్రీమాత దేహము. ఆమె తన దేహమును పుష్టికరమగు ఆహారముచే పోషించు చుండును. ఆహారము బ్రహ్మ స్వరూపము అని తెలిసి భక్తి శ్రద్ధలతో భుజించుట సదాచారము. అన్న బ్రహ్మమును బ్రహ్మమునకు సమర్పణగ భుజించవలెనని భగవద్గీత యందు కూడ సూచింపబడినది. అట్లు భుజించు వారియందు బ్రహ్మమే అగ్ని స్వరూపుడై సమస్తమును భక్షించి పుష్టికరమగు దేహమును అనుగ్రహించును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 534 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*

*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi  ॥109 ॥ 🌻*


*🌻 534. 'Sarvaudana Preeta Chitta' - 2 🌻*


*People who are not in perfect health eat only some types of food. Some, they only describe. In truth, people who have interest in food, good taste and a balanced diet, will have good health. Srimata's body is the form of creation. She nourishes her body with nutritious food. Knowing that food is the form of Brahma, it is good to eat it with devotion. It is also indicated in the Bhagavad Gita that food or annabrahma should be offered to Brahma before eating. Brahma in the form of fire consumes everything and blesses those who eat this way, with a healthy body.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page