🍀🌹 15, DECEMBER 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹15, DECEMBER 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. ధనుర్మాసం విశిష్ఠత - ధనుర్మాస వ్రతం 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 472 / Bhagavad-Gita - 472 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -03 / Chapter 12 - Devotional Service - 03 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 828 / Sri Siva Maha Purana - 828 🌹
🌻. శంఖచూడుని జననము - 2 / The birth of Śaṅkhacūḍa - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 85 / Osho Daily Meditations - 85 🌹
🍀 85. తోబుట్టువుల శత్రుత్వం / 85. SIBLING RIVALRY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 512-1 🌹
🌻 512. 'దధ్యన్నాసక్త హృదయా' - 1 / 512. 'Dadhyannasakta Hrudaya' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 15, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధనుర్మాసం ప్రారంభం, Danur masam starts. 🌻*
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 21 🍀*
*39. మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ ।*
*రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ ॥*
*40. దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ ।*
*సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : క్రమవికాస పూర్వకమైన రూపధారణ : పైకి అచేతనంగా కనిపించెడి శక్తి యందు పని చేసేదీ, రూపమును నిర్ణయించి తద్వికాసమునకు దోహదం చేసేదీ వాస్తవానికి చేతనయే. రూప ధారణ ద్వారముననే క్రమ వికాస పూర్వకంగా జడత్వము నుండి ఆత్మ విముక్తి సాధించుకొన గోరినప్పుడు ఆ చేతనయే ప్రాణిగా, జంతువుగా, మానవుడుగా రూపు గైకొనడం జరుగుతూ వున్నది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసం
తిథి: శుక్ల తదియ 22:31:06 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: పూర్వాషాఢ 08:11:15
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వృధ్ధి 10:17:16 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 11:43:59 వరకు
వర్జ్యం: 15:35:40 - 17:04:36
దుర్ముహూర్తం: 08:51:04 - 09:35:29
మరియు 12:33:07 - 13:17:31
రాహు కాలం: 10:47:38 - 12:10:54
గుళిక కాలం: 08:01:07 - 09:24:23
యమ గండం: 14:57:26 - 16:20:42
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32
అమృత కాలం: 03:42:24 - 05:11:56
మరియు 24:29:16 - 25:58:12
సూర్యోదయం: 06:37:51
సూర్యాస్తమయం: 17:43:59
చంద్రోదయం: 08:54:29
చంద్రాస్తమయం: 20:10:01
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 08:11:15 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ధనుర్మాసం విశిష్ఠత - ధనుర్మాస వ్రతం 🌹*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
ధనుర్మాస ప్రారంభం 15-12-2023
*శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం* *విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం* *లక్ష్మికాంతం కమల నయనం యోగి హృధ్యాన గమ్యం* *వందే విష్ణుమ్ భవ భయహరం సర్వలోకైక నాదం.*
*దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.*
*భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.*
*ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.*
*🌻. ధనుర్మాస వ్రతం 🌻*
*ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, కృష్ణుని లేదా శ్రీ రంగనాథులను అర్చిస్తారు. తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. ఈ మాసంలో ఒంటి పూట భోజనం ఆచరించాలి. బ్రహ్మచర్యం ఉత్తమం. భగవంతుని నామాన్ని కీర్తిస్తూ, పలు రకాల పువ్వులతో స్వామిని పూజించింది గోదాదేవి. శ్రీ రంగనాథులు, గోదాదేవి కల్యాణం చేయాలి. మనస్సు, మాట, శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం, సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారట. ఈ మాసంలో స్వామి వారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి.*
*ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి.*
*ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూ గానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెల రోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేని వారు 15 రోజులు గానీ, 8 రోజులు గానీ, 6 రోజులు గానీ, 4 రోజులు గానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు*
*ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాల ముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంభారాలతో పల్లెలు “సంక్రాంతి “పండుగ కోసం యెదురు చూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వస్తుంది. ఆరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వ్రచనం.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 472 / Bhagavad-Gita - 472 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -03 🌴*
*03. యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |*
*సర్వత్రగమచిన్త్యం చ కూటస్థమచలం ద్రువమ్ ||*
*🌷. తాత్పర్యం : ఇంద్రియాతీతమును, సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్త్వమును (పరతత్త్వపు నిరాకార భావనను) ఆరాధించు వారును..,*
*🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా పూజింపక అదే గమ్యమును పరోక్షమార్గమున సాధింప యత్నించువారు సైతము అంత్యమున ఆ పరమగమ్యమైన శ్రీకృష్ణుని చేరగలరు. “బహుజన్మల పిదప జ్ఞానియైనవాడు వాసుదేవుడే సర్వస్వమని తెలిసి నన్ను శరణువేడుచున్నాడు.” అనగా బహుజన్మల పిదప సంపూర్ణజ్ఞానము ప్రాప్తించనంతనే మనుజుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చును. ఈ శ్లోకమునందు తెలుపబడిన విధానము ద్వారా మనుజుడు దేవదేవుని చేరగోరినచో ఇంద్రియనిగ్రహము కలిగి, సర్వులకు సేవను గూర్చుచు, సర్వజీవుల హితకార్యములందు నియుక్తుడు కావలసియుండును. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణుని దరిచేరవలసియున్నదనియు, లేని యెడల పూర్ణానుభావమునకు ఆస్కారమే లేదనియు గ్రహింపవచ్చును. అట్టి భగవానునికి శరణాగతిని పొందుటకు పూర్వము మనుజుడు తీవ్రతపస్సును నొనరించ వలసి యుండును.*
🌹🌹🌹🌹🌹
*🌹 Bhagavad-Gita as It is - 472 🌹*
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 03 🌴*
*03. ye tv akṣaram anirdeśyam avyaktaṁ paryupāsate*
*sarvatra-gam acintyaṁ ca kūṭa-stham acalaṁ dhruvam*
*🌷 Translation : But those who fully worship the unmanifested, that which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable..*
*🌹 Purport : Those who do not directly worship the Supreme Godhead, Kṛṣṇa, but who attempt to achieve the same goal by an indirect process, also ultimately achieve the same goal, Śrī Kṛṣṇa. “After many births the man of wisdom seeks refuge in Me, knowing that Vāsudeva is all.” When a person comes to full knowledge after many births, he surrenders unto Lord Kṛṣṇa. If one approaches the Godhead by the method mentioned in this verse, he has to control the senses, render service to everyone and engage in the welfare of all beings.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 827 / Sri Siva Maha Purana - 827 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴*
*🌻. శంఖచూడుని జననము - 2 🌻*
*వారిలో ఒకడు మహాబలపరాక్రమశాలి యగు విష్ణుచిత్తుడు. ఆతని పుత్రుడగు దంభుడు ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు మరియు ఇంద్రియ జయము గలవాడు (10). ఆతనికి పుత్రసంతానము లేకుండెను. ఆ కారణము వలన ఆ వీరుడు దుఃఖితుడై శుక్రాచార్యుని గురువుగా చేసుకొని కృష్ణమంత్రమును స్వీకరించి (11), పుష్కరతీర్థమునందు లక్ష సంవత్సరములు గొప్ప తపస్సును చేసెను. ఆతడు ఆసనమును దృఢముగా బంధించి చిరకాలము కృష్ణ మంత్రమును మాత్రమే జపించెను (12). తపస్సును చేయుచున్న ఆతని శిరస్సునుండి సహింప శక్యము కానిది, జ్వాలలతో కూడి యున్నది అగు తేజస్సు ఉద్భవించి సర్వత్రా వ్యాపించెను (13). దానిచే పీడితులైన సర్వదేవతలు, మునులు మరియు మనువులు ఇంద్రుని ముందిడుకొని బ్రహ్మను శరణు వేడిరి (14).*
*దుఃఖితులై యున్న వారు సమస్తసంపదలను ఇచ్చే బ్రహ్మను నమస్కరించి స్తుతించి తమ వృత్తాంతమును విశేషముగా వివరించి చెప్పిరి (15). ఆ వృత్తాంతమును విని బ్రహ్మ వారితో గూడి, అదే వృత్తాంతమును సమమ్రుగా విష్ణువునకు విన్నవించుటకొరకై వైకుంఠమును వెళ్లెను (16). వారందరు అచటకు వెళ్లి ముల్లోకములకు అధిపతి, రక్షకుడు, పరమాత్మయగు విష్ణువునకు ప్రణమల్లి వినయముతో చేతులు కట్టుకొని స్తుతించిరి (17).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 827 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴*
*🌻 The birth of Śaṅkhacūḍa - 2 🌻*
10. One of them is Vipracitti who was very powerful and valorous. His virtuous son Dambha of self-control was a great devotee of Viṣṇu.
11-12. No son was born to him. Hence the hero became worried. He made the preceptor Śukra his initiator and learnt the mantra of Kṛṣṇa. He performed a great penance in the holy centre Puṣkara[1] for a hundred thousand years. Seating himself in a stable pose he performed the Japa of Kṛṣṇa mantra for a long time.
13. While be was performing the penance, an unbearable refulgence sprang up blazing from his head and spread everywhere.
14. All the gods, sages and Manus were scorched by that. With Indra ahead they sought refuge in Brahmā.
15. Bowing to Brahmā, the bestower of riches, they eulogised him and narrated to him this event.
16. On hearing that, Brahmā accompanied them to Vaikuṇṭha in order to tell the same to Viṣṇu in its entirety.
17. After going there they stood humbly joining their palms in reverence. After bowing to him they eulogised Viṣṇu the lord of the three worlds, the great saviour.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 85 / Osho Daily Meditations - 85 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 85. తోబుట్టువుల శత్రుత్వం 🍀*
*🕉. తల్లి ఒక బిడ్డను ఎక్కువగా, మరొకరిని కొంచెం తక్కువగా ప్రేమించవచ్చు. ఆమె ఖచ్చితంగా సమానంగా ప్రేమించాలని మీరు ఆశించలేరు; ఇది సాధ్యం కాదు. 🕉*
*పిల్లలు చాలా అవగాహన కలిగి ఉంటారు. ఒకరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇంకొకరిని తక్కువగా ఇష్టపడుతున్నారని వారు వెంటనే చూడగలరు. తల్లి తమను సమానంగా ప్రేమిస్తున్నదనే ఈ నెపం కేవలం బూటకమని వారికి తెలుసు. కాబట్టి అంతర్గత సంఘర్షణ, పోరాటం, ఆశయం పుడుతుంది. ప్రతి బిడ్డ భిన్నంగా ఉంటుంది. ఒకరికి సంగీత ప్రతిభ ఉంది, మరొకరికి లేదు. ఒకరికి గణితా ప్రతిభ ఉంది, మరొకరికి లేదు. ఒకరు శారీరకంగా మరొకరి కంటే అందంగా ఉంటారు లేదా ఒకరికి నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది, మరొకరికి అది లోపిస్తుంది. అప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తుతాయి మరియు మనం నిజం చెప్పడంకంటే మంచిగా ఉండమని బోధిస్తాము. పిల్లలకు నిజాన్ని బోధిస్తే, వారు దానితో పోరాడుతారు మరియు వారు దానిని పోరాడతారు. వారు కోపంగా ఉంటారు, వారు ఒకరితో ఒకరు పోరాడుతారు మరియు పరుషంగా మాట్లాడతారు, ఆపై వారు అక్కడతో ఆపేస్తారు, ఎందుకంటే పిల్లలు చాలా సులభంగా దేన్నైనా వదిలించుకుంటారు.*
*కోపంగా ఉంటే కోపంగా, వేడిగా, దాదాపు అగ్నిపర్వతంగా ఉంటుంది, కానీ మరుసటి క్షణం ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అంతా మర్చిపోతారు. పిల్లలు చాలా సరళంగా ఉంటారు, కానీ తరచుగా వారిచే ఆ సరళత అనుమతించ బడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుండాలని చెప్పారు. వారు ఒకరిపై ఒకరు కోపంగా ఉండటం నిషేధించబడింది: 'ఆమె మీ సోదరి, అతను మీ సోదరుడు. నీకు కోపం ఎలా వస్తుంది?' ఈ కోపాలు, ఈర్ష్యలు, వెయ్యికోట్లు సేకరిస్తూనే ఉంటాయి. కానీ మీరు నిజమైన కోపంతో, అసూయతో ఒకరినొకరు ఎదుర్కోగలిగితే, మీరు దానితో పోరాడగలిగితే, వెంటనే, పోరాటం నేపథ్యంలో, లోతైన ప్రేమ మరియు కరుణ పుడుతుంది. మరియు అది అసలు విషయం అవుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 85 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 85. SIBLING RIVALRY 🍀*
*🕉 . The mother may love one child more, another a little less. You cannot expect that she should love absolutely equally; it is not possible. 🕉*
*Children are very perceptive. They can immediately see that somebody is liked more and somebody is liked less. They know that this pretension of the mother's loving them equally is just bogus. So an inner conflict, fight, ambition arises. Each child is different. Somebody has a musical talent, somebody does not. Somebody has. a mathematical talent and somebody has not. Somebody is physically more beautiful than another or one has a certain charm of personality and the other is lacking it. Then more and more problems arise, and we are taught to be nice, never to be true. If children are taught to be true, they will fight it out, and they will drop it by fighting. They will be angry, they will fight and say hard things to one another, and then they will be finished, because children get rid of things very easily.*
*If they are angry, they will be angry, hot, almost volcanic, but the next moment they will be holding each other's hands and everything will be forgotten. Children are very simple, but often they are not allowed that simplicity. They are told to be nice, whatever the cost. They are prohibited from being angry at each other: "She is your sister, he is your brother. How can you be angry?" These angers, jealousies, and a thousand and one wounds go on collecting. But if you can face each other in true anger, jealousy, if you can fight it out, immediately afterward, in the wake of the fight, a deep love and compassion will arise. And that will be the real thing.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*
*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*
*🌻 512. 'దధ్యన్నాసక్త హృదయా' - 1 🌻*
*పెరుగుతో కూడిన అన్నమునందు ఆసక్తిగలది శ్రీమాత అని పెరుగుతో కూడిన అన్నము స్వాధిష్ఠాన కేంద్రమందలి దేహ ధాతువుల అభివృద్ధికి తోడ్పడును. ఆరోగ్యకరము. ఉప్పు, పులుపు, తీపి, కారము యిత్యాది ఆహారముల యందలి హెచ్చుతగ్గులను పెరుగన్నము సరిదిద్ది సమన్వయ పరచును. పెరుగన్నము తినని వారికి కడుపున ప్రకోపము లెక్కువగ నుండును. రకరకముల ఆమ్లములు, క్షారములు సమన్వయపడక జీర్ణకోశమంతయూ అస్తవ్యస్తమై నీరసము, విసుగు, చిరాకు, కోపము యిత్యాదివి యేర్పడి దేహమునకు అస్వస్థతను కలిగించును. స్వాధిష్ఠానము సమవర్తనము కోల్పోయినచో ఆరోగ్యము అస్తవ్యస్థ మగును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*
*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*
*🌻 512. 'Dadhyannasakta Hrudaya' - 1🌻*
*Srimata likes rice with curd, rice with curd helps in the development of body minerals in Swadhishthana centre. It is healthy. Salt, sour, sweet, spicy and other fluctuations in food are corrected and coordinated by curd rice. For those who do not eat curdrice, stomach irritation is inevitable. Different types of acids and alkalis are not coordinated and the entire digestive system is disturbed and it causes the body to feel unwell including dullness, boredom, irritation, anger etc. If Swadhishthana is out of balance, health will be disturbed.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments