🌹15, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀 మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు అందరికి, Pongal, Makar Sankranti Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మకర సంక్రాంతి, పొంగలి, Pongal, Makar Sankranti 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 120 🍀
120. గుహః కాంతో నిజః సర్గః పవిత్రం సర్వపావనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అధిమనఃప్రవృత్తి : మహస్సు నందలి అవిభాజ్య తేజస్సును అంది పుచ్చుకొన్నప్పుడు అధి మనస్సు దానిని నానాప్రకారములుగా విభజిస్తూ వున్నది మనోభూమికలో చేతన మరింత సంకోచం పొందుతుంది కనుక, ఈ విభాగములలో ఏ ఒక్కదానినో మాత్రమే ముఖ్యసత్యంగా భావించి తక్కిన వాటిని ఆముఖ్యములుగా పరిగణించడాని కవకాశమున్నది. 'హిరణ్మయేనపాత్రేణ సత్యన్య ఆపిహితం ముఖం' 'ఋతేన ఋతం అపిహితం' అనెడి శ్రుతు లలో సూచితమైనది ఈ అధిమనః ప్రవృత్తియే యని చెప్పవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: శుక్ల పంచమి 26:18:13
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: శతభిషం 08:07:31
వరకు తదుపరి పూర్వాభద్రపద
యోగం: వరియాన 23:10:28
వరకు తదుపరి పరిఘ
కరణం: బవ 15:38:52 వరకు
వర్జ్యం: 14:00:04 - 15:28:20
దుర్ముహూర్తం: 12:47:39 - 13:32:27
మరియు 15:02:03 - 15:46:51
రాహు కాలం: 08:13:15 - 09:37:15
గుళిక కాలం: 13:49:15 - 15:13:15
యమ గండం: 11:01:15 - 12:25:15
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 01:35:48 - 03:02:44
మరియు 22:49:40 - 24:17:56
సూర్యోదయం: 06:49:14
సూర్యాస్తమయం: 18:01:15
చంద్రోదయం: 10:01:13
చంద్రాస్తమయం: 22:07:20
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది
08:07:31 వరకు తదుపరి ముసల
యోగం - దుఃఖం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
תגובות