top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 15, JULY 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🍀🌹 15, JULY 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀

1) 🌹. శ్రీమద్భగవద్గీత - 552 / Bhagavad-Gita - 552 🌹

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 01 / Chapter 15 - Purushothama Yoga - 01 🌴

3) 🌹 సిద్దేశ్వరయానం - 102 🌹

🏵 హనుమదుపాసన 🏵

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 2 🌹

🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 2 / 552. 'Sarvamrutyu Nivarini' - 2 🌻

5) 🌹🎥 అత్యుత్తమ ఆత్మ ప్రయాణం యొక్క పరివర్తన - నమ్మశక్యం కాని అనుభవం! 🌹🎥

6) 🌹🎥 The Ultimate SOULS JOURNEY Transformation - Unbelievable Experience! 🌹🎥

Like, Subscribe and Share. 👀


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹🎥 అత్యుత్తమ ఆత్మ ప్రయాణం యొక్క పరివర్తన - నమ్మశక్యం కాని అనుభవం! 🌹🎥*

*ప్రసాద్‌ భరధ్వాజ*



*🌹🎥 The Ultimate SOULS JOURNEY Transformation - Unbelievable Experience! 🌹🎥*

*Prasad Bharadwaj*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీమద్భగవద్గీత - 552 / Bhagavad-Gita - 552 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 01 🌴*


*01. శ్రీ భగవానువాచ*

*ఊర్థ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |*

*ఛన్దాంసి యస్య పర్ణాణి యస్తం వేద స వేదవిత్ ||*


*🌷. తాత్పర్యం : పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : వ్రేళ్ళు ఊర్థ్వముగను, శాఖలు క్రిందుగను, వేదఋక్కులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థవృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడే వేదముల నెరిగినవాడు.*


*🌷. భాష్యము : భక్తియోగపు ప్రాముఖ్యమును చర్చించిన పిమ్మట ఎవరైనను “వేదముల ప్రయోజనమేమిటి?” యని ప్రశ్నించవచ్చును. అందుకు సమాధానముగా వేదాధ్యయన ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుగుటయేనని ఈ అధ్యాయమున వివరింపబడినది. అనగా కృష్ణభక్తిరసభావితుడై భక్తియోగమునందు నియుక్తుడైనవాడు వేదములను ఎరిగియే యుండును.*


*భౌతికజగత్తు బంధము ఇచ్చట అశ్వత్థవృక్షముతో పోల్చబడినది. కామ్యకర్మల యందు రతుడైనవాడు ఈ అశ్వత్థవృక్షపు తుదిని తెలియక ఒకకొమ్మ నుండి వేరొకకొమ్మకు సదా మారుచుండును. అనగా భౌతికజగమను ఈ అశ్వత్థవృక్షమునకు అంతమనునది లేదు. అట్టి ఈ వృక్షమునందు ఆసక్తుడైనవానికి ముక్తి లభించు నవకాశమే లేదు.*


*ఆత్మోద్దారమునకై ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షపు ఆకులుగా పేర్కొనబడినవి. విశ్వము యొక్క అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుటుచే దీని వ్రేళ్ళు ఊర్థ్వముగా నున్నవి. అవ్యయమైన ఈ మాయావృక్షమును అవగతము చేసికొనినచో మనుజుడు దాని నుండి బయటపడగలడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 552 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 15 - Purushothama Yoga - 01 🌴*


*01. śrī-bhagavān uvāca*

*ūrdhva-mūlam adhaḥ-śākham aśvatthaṁ prāhur avyayam*

*chandāṁsi yasya parṇāni yas taṁ veda sa veda-vit*


*🌷 Translation : The Supreme Personality of Godhead said: It is said that there is an imperishable banyan tree that has its roots upward and its branches down and whose leaves are the Vedic hymns. One who knows this tree is the knower of the Vedas.*


*🌹 Purport : After the discussion of the importance of bhakti-yoga, one may question, “What about the Vedas?” It is explained in this chapter that the purpose of Vedic study is to understand Kṛṣṇa. Therefore one who is in Kṛṣṇa consciousness, who is engaged in devotional service, already knows the Vedas.*


*The entanglement of this material world is compared here to a banyan tree. For one who is engaged in fruitive activities, there is no end to the banyan tree. He wanders from one branch to another, to another, to another. The tree of this material world has no end, and for one who is attached to this tree, there is no possibility of liberation. The Vedic hymns, meant for elevating oneself, are called the leaves of this tree.*


*This tree’s roots grow upward because they begin from where Brahmā is located, the topmost planet of this universe. If one can understand this indestructible tree of illusion, then one can get out of it.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 సిద్దేశ్వరయానం - 102 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 హనుమదుపాసన 🏵*


*సన్యాసస్వీకారం తరువాత బృందావనంలో నేను ఏకాంతంగా గదిలో కూర్చుని ఉండగా ఉదయం 11 గంటలకు ఎదురుగా ఉన్న కుర్చీలో హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు. బృందావనంలో కోతులు బాగా ఉన్నమాట వాస్తవమే కాని లోపల తలుపు గడియవేసి ఉన్నది. కూర్చున్నది చాలా పెద్ద ఆకారము. వెంటనే హనుమంతుడు అన్న స్ఫురణకల్గి నమస్కరించాను. ఆ ఆకృతి కాసేపటికి అదృశ్యమయినది. ఆ అనుగ్రహ సూచన అందుకొని హనుమాన్ మంత్రసాధన మొదలు పెట్టాను. మరునాడు అదే సమయానికి మళ్లీ దర్శనం కలిగింది. ఆ కరుణ అలా ప్రసరిస్తూనేఉన్నది. కుర్తాళంలోని మా పీఠంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. ఈ అనుగ్రహం ప్రారంభ మయినప్పటి నుండి అక్కడ నేనే స్వయంగా పూజ చేస్తున్నాను. పూజా సందర్భంలో కూడా అప్పుడప్పుడు వింతలు జరుగుతున్నాయి.*


*ఒకనాడు నా గదిలో భక్తులకు ఇవ్వగా అరటిపండ్లలో 10 పండ్లు మిగిలి ఉన్నవి. నేను గుడ్డలు మార్చుకోవడానికి లోపలకి వెడుతూ ఈ పండ్లలో ఒక అరడజనుస్వామి నివేదనకు సిద్ధం చేయండి అని చెప్పి లోపలకు వెళ్ళాను. ఈ లోపు ఒక పెద్దకోతి లోపలికి వచ్చి పళ్ళెంలో ఉన్నవాటిలో నుండి ఆరుపండ్లు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది. నేను లోపలి నుండి ఇవతలకు వచ్చేసరికి పళ్ళెంలో నాలుగు పండ్లు మాత్రమే ఉన్నవి. జరిగిన సంగతి విన్నాను. ఇస్తానన్నది అరడజనే కనుక అంతవరకు మాత్రమే తీసుకొని వెళ్ళాడు వానరేంద్రుడు. 'మిగతావి కూడా ఇవ్వండి' అన్నాను. అప్పుడు మిగతావి కూడా అందిస్తుంటే తీసుకొని వెళ్ళింది వానరం. అప్పుడప్పుడు పీఠంలో కూర్చున్నప్పుడు ఎదురుగా ఇతరులకు కనపడక నాకు మాత్రమే కనపడతూ ఒక వానరం వచ్చి కూర్చొనటం చాలాసార్లు జరిగింది. ఎన్నో ఆపదలను ఉపద్రవాలను తప్పిస్తున్నాడు. ఆ హనుమంతుడు. తిరుపతి నుండి ఒకసారి కారులో వస్తూ ఉంటే బయలుదేరగానే మనోనేత్రం ముందు హనుమంతుడు కన్పించాడు. ఎందుకా! అనుకొన్నాను. త్రోవలో ఒక పెద్ద ప్రమాదం ఒక్క క్షణంలో తప్పిపోయింది. హనుమంతుడు అక్కడ నిలబడి ఆ ఆపదను తప్పించటం ప్రత్యక్షంగా కన్పించింది.*


*హైదరాబాదులో ఉన్న ఒక సన్యాసిని తీవ్ర వ్యాధిగ్రస్తురాలయింది. తన బాధ తొలగించమని ఆమె అర్థించింది. ధ్యానంలో చూస్తే హనుమంతుడు కన్పించి ఈమె పూర్వజన్మలో నా భక్తురాలు. కర్మవశాన వచ్చిన ఈ వ్యాధిని పోగొట్టుకోవటానికి ఆమె శక్తిచాలదు. సహాయం చేయమని ఆదేశించాడు. ఆమె చేత హనుమాన్ మంత్రసాధన చేయించాను. ప్రయోజనం సిద్ధించింది. ఈ విధంగా అనుకోకుండా హనుమత్సాధన చిన్నతనం తరువాత మళ్ళీ ఇప్పుడు నా జీవితంలోకి ప్రవేశించింది. ఆంజనేయస్వామి నేడు నాకు నిత్యరక్షకుడు.*


*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 552 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 552 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*

*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*


*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 2 🌻*


*బాల్యము, విద్యాభ్యాసము, సంఘమునందు బాధ్యత, గృహస్తు ధర్మము పరిపూర్ణముగ నిర్వర్తించుటకు పెద్దలు ఈ సమయమును నిర్ణయించిరి. ఇట్టి బాధ్యతలను పూర్తిగ నిర్వర్తింపకయే మరణించుట అపమృత్యువు అనబడును.  అట్లే అకాల మృత్యువు కూడ తెలియవచ్చును. బాధ్యతా నిర్వహణము పూర్ణము గాక అరువది సంవత్సరముల లోపలనే మరణించుట అకాల మృత్యువు. అంతియే గాక దుర్ఘటనల యందు, ప్రమాదముల యందు మరణించుట కూడ అకాల మృత్యువే. అంతియే గాక మరణమునకు పుణ్య తిథులు, పాప తిథులు కూడ యున్నవి. సరియగు తిథి వార నక్షత్రములలో దేహము విడువనిచో అదియును అకాల మృత్యువే.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 552 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*

*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*


*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 2 🌻*


*Elders have fixed this time for perfecting childhood, education, responsibility in society, household dharma. Dying without fulfilling these responsibilities is called untimely death.  Likewise premature death may also be known. Death within sixty years without completion of responsibilities is premature death. Moreover, death due to mishaps and accidents is also premature death. Moreover, there are holy days and unholy days for death. If one does not leave the body in the right combination of the day, week and start, it is premature death.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹


Comments


bottom of page