top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 16, FEBRUARY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 16, FEBRUARY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀

1) 🌹 16, FEBRUARY 2024 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

*🌹🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Greetings to all 🍀🌹*

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 502 / Bhagavad-Gita - 502 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 13 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 13 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 857 / Sri Siva Maha Purana - 857 🌹

🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 2 / March of The Victorious Lord Śiva - 2 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 115 / Osho Daily Meditations  - 115 🌹

🍀 115. అవగాహన / 115. UNDERSTANDING 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 535 / Sri Lalitha Chaitanya Vijnanam - 535 🌹

🌻 535. 'యాకిన్యంబా స్వరూపిణీ' / 535. 'Yakinyamba Swarupini' 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 16, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*🍀. రథ సప్తమి - సూర్య జయంతి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు అందరికి, Ratha Saptami - Surya Jayanthi, Narmada Jayanti, Bhishma Ashtami Greetings to All. 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రథ సప్తమి - సూర్య జయంతి, నర్మదా జయంతి, బీష్మాష్టమి, Ratha Saptami - Surya Jayanthi, Narmada Jayanti, Bhishma Ashtami 🌻*

*🍀. శ్రీ సూర్య స్తోత్రం 🍀*


*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*

*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*

*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*

*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అతీత మనస్సు : ఈశ్వర ప్రకృతి యొక్క సత్యచేతనయే అతీత మనస్సు, లేక విజ్ఞానం. అజ్ఞానానికి, విభాగకల్పనకూ అందు తావులేదు. సకల మనః ప్రవృత్తులకూ అతీతమైన జ్ఞాన తేజస్సుతో నిత్యమూ నిండారి యుండెడి దివ్య చేతన ఆది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శిశిర ఋతువు, ఉత్తరాయణం,

మాఘ మాసము

తిథి: శుక్ల-సప్తమి 08:56:50

వరకు తదుపరి శుక్ల-అష్టమి

నక్షత్రం: భరణి 08:48:15

వరకు తదుపరి కృత్తిక

యోగం: బ్రహ్మ 15:17:25 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: వణిజ 08:56:50 వరకు

వర్జ్యం: 20:47:00 - 22:23:00

దుర్ముహూర్తం: 09:01:36 - 09:47:57

మరియు 12:53:24 - 13:39:46

రాహు కాలం: 11:03:18 - 12:30:14

గుళిక కాలం: 08:09:26 - 09:36:22

యమ గండం: 15:24:05 - 16:51:01

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 04:06:48 - 05:40:12

మరియు 30:23:00 - 31:59:00

సూర్యోదయం: 06:42:30

సూర్యాస్తమయం: 18:17:57

చంద్రోదయం: 11:22:04

చంద్రాస్తమయం: 00:48:56

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: ముద్గర యోగం - కలహం

08:48:15 వరకు తదుపరి ఛత్ర

యోగం - స్త్రీ లాభం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Greetings to all 🍀🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹*


*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*

*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*


*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.*


*సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,*

*అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.*

*మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,*

*కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.*


*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.*


*రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.*


*🌻. సూర్య స్తోత్రం 🌻*

*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*

*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*

*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*

*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*


*🌻. పాలు పొంగించే విధానం 🌻*


*సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.*


*ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం సూర్యునికి ఎంతో ప్రీతి.*


*🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹*


*ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.*


*భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.*


*🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀*


*వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |*

*గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే ౧*

*భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |*

*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్ ౨*

*వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |*

*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే ౩*

*భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 502 / Bhagavad-Gita - 502 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 13 🌴*


*13. జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్ జ్ఞాత్వామృతమశ్నుతే |*

*అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||*


*🌷. తాత్పర్యం : దేనిని తెలిసికొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అనాదియును, నాకు ఆధీనమును అగు బ్రహ్మము(ఆత్మ) ఈ భౌతికజగపు కార్యకారణములకు అతీతమై యుండును.*


*🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రమును గూర్చి మరియు కర్మక్షేత్రము నెరిగిన క్షేత్రజ్ఞుని గూర్చి వివరించియున్నాడు. అలాగుననే క్షేత్రజ్ఞుని యెరుంగు విధానమును సైతము అతడు విశదీకరించియున్నాడు. ఇక తెలియదగినదానిని గూర్చి వివరింపనెంచి తొలుత ఆత్మను గూర్చియు, పిమ్మట పరమాత్మను గూర్చియు వివరించుట నారంభించుచున్నాడు. అట్టి ఆత్మ, పరమాత్మల జ్ఞానముచే మనుజుడు అమృతతత్త్వమును ఆస్వాదింపగలడు. ఆత్మ నిత్యమని ద్వితీయాధ్యాయమున తెలుపబడిన విషయమే ఇచ్చతను నిర్ధారింపబడుచున్నది. వాస్తవమునకు జీవుడు ఎన్నడు జన్మించెనో ఎవ్వరును తెలుపలేరు. అదే విధముగా అతడు భగవానుని నుండి ఉద్భవించిన వైనమునకు సంబంధించిన చరిత్రను సైతము ఎవ్వరును ఎరుంగరు. కనుకనే అతడు అనాది యని పిలువబడినాడు. ఈ విషయమే “న జాయతే మ్రియతే వా విపశ్చిత్” అని కఠోపనిషత్తు (1.2.18) నిర్ధారించుచున్నది. అనగా దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు అజుడును, అమృతుడును, జ్ఞానపూర్ణుడును అయియున్నాడు.*


*భగవానుడు పరమాత్ముని రూపమున ప్రధాన క్షేత్రజ్ఞునిగాను (దేహము నెరిగిన ప్రధాన జ్ఞాత) మరియు త్రిగుణములకు ప్రభువుగాను ఉన్నాడని శ్వేతాశ్వతరోపనిషత్తు (6.16) నందును తెలుపబడినది (ప్రధాన క్షేత్రజ్ఞపతి: గుణేశ).*


*అట్టి శ్రీకృష్ణభగవానుని సేవలో జీవులు సర్వదా నిలిచియుందురని “స్మృతి” యందు తెలుపబడినది (దాసభూతో హరేరేవ నాన్యస్యైవ కదాచన). ఈ విషయమునే శ్రీచైతన్యమహాప్రభువు తన బోధనల యందును నిర్ధారించియున్నారు. కావుననే ఈ శ్లోకమునందు తెలుపబడిన బ్రహ్మము యొక్క వర్ణనము ఆత్మకు సంబంధించినది. బ్రహ్మమను పదమును జీవునికి అన్వయించినపుడు అది జీవుడు విజ్ఞానబ్రహ్మమనియే సూచించును గాని ఆనందబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణభగవానుడే ఆనందబ్రహ్మము.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 502 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 13 🌴*


*13. jñeyaṁ yat tat pravakṣyāmi yaj jñātvāmṛtam aśnute*

*anādi mat-paraṁ brahma na sat tan nāsad ucyate*


*🌷 Translation : I shall now explain the knowable, knowing which you will taste the eternal. Brahman, the spirit, beginningless and subordinate to Me, lies beyond the cause and effect of this material world.*


*🌹 Purport : The Lord has explained the field of activities and the knower of the field. He has also explained the process of knowing the knower of the field of activities. Now He begins to explain the knowable, first the soul and then the Supersoul. By knowledge of the knower, both the soul and the Supersoul, one can relish the nectar of life. As explained in the Second Chapter, the living entity is eternal. This is also confirmed here. There is no specific date at which the jīva was born. Nor can anyone trace out the history of the jīvātmā’s manifestation from the Supreme Lord.*


*Therefore it is beginningless. The Vedic literature confirms this: na jāyate mriyate vā vipaścit (Kaṭha Upaniṣad 1.2.18). The knower of the body is never born and never dies, and he is full of knowledge. The Supreme Lord as the Supersoul is also stated in the Vedic literature (Śvetāśvatara Upaniṣad 6.16) to be pradhāna-kṣetrajña-patir guṇeśaḥ, the chief knower of the body and the master of the three modes of material nature. In the smṛti it is said, dāsa-bhūto harer eva nānyasvaiva kadācana. The living entities are eternally in the service of the Supreme Lord. This is also confirmed by Lord Caitanya in His teachings. Therefore the description of Brahman mentioned in this verse is in relation to the individual soul, and when the word Brahman is applied to the living entity, it is to be understood that he is vijñāna-brahma as opposed to ānanda-brahma. Ānanda-brahma is the Supreme Brahman Personality of Godhead.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 857 / Sri Siva Maha Purana - 857 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴*


*🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 2 🌻*


*10. శత్రువులను అణచివేసే శంఖకర్ణుడు కోటి గణాలతో కలిసి వెళ్ళాడు; కేకరాక్షుడు పది కోట్లతో, వికృత ఎనిమిది కోట్లతో వెళ్ళారు.*


*11. అరవై నాలుగు కోట్లతో విశాఖ; తొమ్మిది కోట్లతో పారియాత్రిక; ఆరు కోట్లతో సర్వాంతకుడు, ఆరు కోట్లతో మహిమాన్వితమైన వికృతాన్నుడు కూడా.*


*12. గణాల అధిపతి, జాలక పన్నెండు కోట్లతో వెళ్ళాడు; దివ్యమైన సమదా ఏడు మరియు ఎనిమిది కోట్లతో దుందుభ వెళ్ళాడు.*


*13. కరాలాక్షుడు ఐదు కోట్లతో వెళ్ళాడు; ఆరు కోట్లతో అద్భుతమైన సందారక; కుందుక మరియు కుండక ఒక్కొక్కరు కోట్లాది గణాలతో వెళ్లారు.*


*14. గణాల నాయకుడు, అందరికంటే శ్రేష్ఠుడు, విష్టంభుడు ఎనిమిది కోట్ల పిప్పలతో వెళ్ళాడు మరియు సన్నదుడు వెయ్యి కోట్లతో వెళ్ళాడు.*


*15. ఆవేశన ఎనిమిది కోట్లతో వెళ్ళింది; ఎనిమిది కోట్లతో చంద్రతాపన; వెయ్యి కోట్లతో గణాలకు అధిపతి మహాకేశుడు వెళ్ళాడు.*


*16. వీర కుండకుడు మరియు మంగళకరమైన పర్వతుడు ఒక్కొక్కరు పన్నెండు కోట్లతో వెళ్ళారు; కాళ, కాలక, మహాకాలాలు ఒక్కొక్కటి వంద కోట్లతో వెళ్ళాడు.*


*17. అగ్నిక వంద కోట్లతో, అగ్నిముఖం కోటి మందితో, ఆదిత్యుడు మరియు ఘనవాహుడు అరకోటితో వెళ్లారు.*


*18. సన్నాహ మరియు కుముద ఒక్కొక్కరు వంద కోట్లతో వెళ్లారు; వంద కోట్లతో అమోఘ, కోకిల, సుమంత్రక వెళ్ళారు.*


*19. కాకపద మరియు సంతానక ఒక్కొక్కరు అరవై కోట్లతో వెళ్లారు: తొమ్మిది కోట్లతో మహాబల మరియు ఐదు కోట్లతో మధు పింగళ వెళ్ళారు.*


*20. నీల, దేవేశ మరియు పూర్ణభద్ర ఒక్కొక్కరు తొంభై కోట్లతో వెళ్లారు; ఏడు కోట్లతో శక్తివంతమైన చతుర్వక్త్ర వెళ్ళారు.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 857 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴*


*🌻 March of The Victorious Lord Śiva - 2 🌻*


10. Śaṅkhakarṇa the suppressor of enemies went, accompanied by a crore Gaṇas; Kekarākṣa went with ten crores and Vikṛta with eight crores.


11. Viśākha with sixty four crores; Pāriyātrika with nine crores; Sarvāntaka with six crores and the glorious Vikṛtānana too with six crores.


12. The chief of Gaṇas, Jālaka went with twelve crores; the glorious Samada seven and Dundubha with eight crores.


13. Karālākṣa went with five crores; the excellent Sandāraka with six crores; Kunduka and Kuṇḍaka each went with crores of Gaṇas.


14. The leader of Gaṇas, the most excellent of all, Viṣṭambha, went with eight crores Pippala and Sannāda went with a thousand crores.


15. Āveśana went with eight crores; Candratāpana with eight crores; Mahākeśa the chief of Gaṇas with a thousand crores.


16. The heroic Kuṇḍin and the auspicious Parvataka went with twelve crores each; Kāla, Kālaka and Mahākāla with a hundred crores each.


17. Agnika went with a hundred crores, Agnimukha with a crore, Āditya and Ghanāvaha with half a crore.


18. Sannāha and Kumuda went with a hundred crores each; Amogha, Kokila and Sumantraka with a hundred crores each.


19. Kākapāda and Santānaka went with sixty crores each: Mahābala with nine crores and Madhu Piṅgala with five crores.


20. Nīla, Deveśa and Pūrṇabhadra each went with ninety crores; the powerful Caturvaktra with seven crores.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 115 / Osho Daily Meditations  - 115 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 115. అవగాహన 🍀*


*🕉 మీరు మీ ఉనికి యొక్క అంతర్భాగానికి చేరుకున్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారనే ప్రాథమిక సమస్య అదృశ్యమవుతుంది, అంతకు ముందు కాదు. 🕉*


*లోతుగా ధ్యానం చేస్తే తప్ప, అవగాహన ఏర్పడదు. మరెవరూ మీకు ఇవ్వలేరు; మీరు దానిని సంపాదించాలి. కఠోర ప్రయత్నం, పోరాటం, త్యాగం ద్వారా దాన్ని సంపాదించుకోవాలి, అప్పుడే సమస్యలు తొలగిపోతాయి. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారనే ప్రాథమిక సమస్య మీరు మీ ఉనికి యొక్క అంతర్భాగానికి చేరుకున్నప్పుడు మాత్రమే అదృశ్యమవుతుంది, అంతకు ముందు కాదు. అంతర్భాగంలో మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నారని మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేది ప్రశ్న కాదు. మీరు ఎల్లప్పుడూ వివిధ రూపాల్లో ఇక్కడ ఉన్నారు. రూపం మారుతోంది, కానీ మీరు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నారు. రూపం మారుతూనే ఉంటుంది కానీ మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటారు.*


*మీరు ఈ మొత్తంలో భాగం. నది సముద్రంలో కలిసిపోతుంది, మళ్ళీ సముద్రం పైకి లేచి మేఘాలుగా మారుతుంది. మళ్లీ అది నదిగా మారి సముద్రంలో కలిసి మళ్లీ మేఘాలుగా మారుతుంది. ఇది కొనసాగుతుంది ... ఇది ఒక చక్రం. మీరు చాలా సార్లు ఇక్కడకు వచ్చారు. మీరు చాలా సార్లు ఇక్కడ ఉంటారు. నిజానికి మీరు శాశ్వతత్వంగా ఇక్కడ ఉన్నారు, మరియు మీరు శాశ్వతత్వంగా ఇక్కడ ఉంటారు. ఉనికికి తుది మొదలు లేదు: ఇది శాశ్వతమైనది. నేను మీకు అలా చెప్పవచ్చు, కానీ అది అర్థం కాదు. మీరు మీ అంతరంగంలోకి వెళ్లి, మీ అంతర్భాగంలోని మందిరాన్ని తెరిచినప్పుడు, మీరు ఆ మందిరంలోకి ప్రవేశించినప్పుడు, మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నారని అకస్మాత్తుగా మీరు గ్రహిస్తారు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 115 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 115. UNDERSTANDING 🍀*


*🕉  The basic problem of why you are here will disappear only when you have reached to the very core of your being, never before.  🕉*


*Unless you meditate deeply, understanding will not arise. nobody else can give it to you; you have to earn it. Through arduous effort, struggle, sacrifice, you have to earn it, only then problems will disappear. The basic problem of why you are here will disappear only when you have reached to the very core of your being, never before. At the core you will know that you have always been here. It is not a question of why you are here. You have always been here in different forms. The form has been changing, but you have always been here. The form will go on changing but you will always remain here.*


*You are part of this whole. The river falls into the ocean, and again the ocean rises and becomes clouds. Again it becomes a river and falls into the ocean, then becomes clouds again. It goes on ... it is a wheel. You have been here many times. You will be here many times. In fact you have been here for eternity, and you will be here for eternity. There is no beginning and no end to existence: It is eternal. I can say that to you, but it will not bring understanding. When you go deep within yourself and you open the  innermost shrine of your being, when you enter into that shrine, suddenly you will realize that you have always been here.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 535 / Sri Lalitha Chaitanya Vijnanam  - 535 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*

*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*


*🌻 535. 'యాకిన్యంబా స్వరూపిణీ' 🌻*


*యాకినీ దేవి అని పిలువబడునది శ్రీమాత అని అర్థము. సర్వదిక్కులను శాసించుచు, పోషించుచు, దర్శించుచు, అనుగ్రహించుచూ వుండు మాత, ఈ  పద్మమున ఆసీనురాలై యున్నదని తెలియనగును. 'యం' అనునది ఈ పద్మమున ఆరాధింపబడు బీజాక్షరము. షట్ పద్మములను వర్ణించినపుడు వివిధ అన్నాహారములు తెలుపబడినవి. అవి నేతి అన్నము, గుడాన్నము, పాయసాన్నము, దధ్యాన్నము, పప్పు అన్నము, చిత్రాన్నము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 535 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*

*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi  ॥109 ॥ 🌻*


*🌻 535. 'Yakinyamba Swarupini' 🌻*


*Sri Mata is known as Yakini Devi. Know that the Mother who rules, nurtures, sees and blesses all the directions, sits in this lotus. 'Yam' is the letter worshiped on this lotus. Various Annaharas are mentioned when the six Padmas are described. They are ghee rice, jaggery rice, sweet rice, curd rice, Dal rice, Chitranna.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page