🌹17, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వివాహ పంచమి, Vivah Panchami 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 36 🍀
69. మంగల్యచారుచరితః శీర్ణః సర్వవ్రతో వ్రతీ |
చతుర్ముఖః పద్మమాలీ పూతాత్మా ప్రణతార్తిహా
70. అకించనః సతామీశో నిర్గుణో గుణవాఞ్ఛుచిః |
సంపూర్ణః పుండరీకాక్షో విధేయో యోగతత్పరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బహిర్ముఖ అంతర్ముఖత్వాలు : చేతన మనలో బహిర్ముఖంగా కేంద్రీకృతమై వుంటున్నందు వల్లనే బాహ్యసత్త యందు మనం నివసించడం జరుగుతూ వున్నది. బాహ్య సత్తలో కలగాపులగపు స్థితిలో ఉండే అన్న, ప్రాణ, మనో, హృక్పురుష చేతనల నిజస్థితిని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే, బహిర్ముఖ చేతనను అంతర్ముఖ మొనర్చి అంతస్సత్త యందు కేంద్రీకరించడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: శుక్ల పంచమి 17:34:51
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ధనిష్ట 26:55:05
వరకు తదుపరి శతభిషం
యోగం: హర్షణ 24:35:10
వరకు తదుపరి వజ్ర
కరణం: బవ 06:46:31 వరకు
వర్జ్యం: 08:20:50 - 09:49:58
దుర్ముహూర్తం: 16:16:02 - 17:00:25
రాహు కాలం: 16:21:35 - 17:44:49
గుళిక కాలం: 14:58:21 - 16:21:35
యమ గండం: 12:11:52 - 13:35:07
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:33
అమృత కాలం: 17:15:38 - 18:44:46
సూర్యోదయం: 06:38:56
సూర్యాస్తమయం: 17:44:49
చంద్రోదయం: 10:38:46
చంద్రాస్తమయం: 22:17:36
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 26:55:05 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments