17 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Feb 17, 2024
- 1 min read

🌹 17, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : బీష్మాష్టమి, మాసిక దుర్గాష్టమి, Bhishma Ashtami, Masik Durgashtami 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 59 🍀
59. మత్తమాతంగపంచాస్యః కంసగ్రీవానికృంతనః |
ఉగ్రసేనప్రతిష్ఠాతా రత్నసింహాసనస్థితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అభేద జ్ఞానం నుండి అవతరణ ప్రారంభం : మానవ మనస్సుకూ అతీతమనస్సుకు నడుమ ఎన్నో చేతనా భూమికలున్నవి. పైకి పోయిన కొలదీ మనఃప్రవృత్తులకు మరింత తేజస్సునూ, శక్తినీ, విశాలతనూ సంతరింప గలుగుచుండెడి భూమికలివి. వీటికి శిఖర ప్రాయమై బహుళ తేజశ్శక్తి సంపన్నమై యుండునదే అధిమనస్సు. అయితే, దానికంటే పైనిదగు అతీతమనస్సు దృష్ట్యా చూచినప్పుడు మాత్రం, పూర్ణమైన అభేదజ్ఞానం నుండి అజ్ఞానం వైపు అవతరణకు ఆదియే ప్రారంభం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల-అష్టమి 08:17:35 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: కృత్తిక 08:47:33 వరకు
తదుపరి రోహిణి
యోగం: ఇంద్ర 13:43:39 వరకు
తదుపరి వైధృతి
కరణం: బవ 08:17:35 వరకు
వర్జ్యం: 25:11:00 - 26:49:24
దుర్ముహూర్తం: 08:14:50 - 09:01:16
రాహు కాలం: 09:36:05 - 11:03:07
గుళిక కాలం: 06:42:00 - 08:09:02
యమ గండం: 13:57:12 - 15:24:15
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 06:23:00 - 07:59:00
మరియు 30:06:12 - 31:44:36
సూర్యోదయం: 06:42:08
సూర్యాస్తమయం: 18:18:20
చంద్రోదయం: 12:09:27
చంద్రాస్తమయం: 00:48:56
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
08:47:33 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments