top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 18 DECEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀 🌹 18 DECEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀

1) 🌹 కపిల గీత - 3వ భాగం. - కపిల దేవహూతి సంవాదం - భగవంతుని కార్యకలాపాలను అర్థం చేసుకోవడం యోగ సాధనలో అతి ముఖ్యమైనది. 🌹

2) 🌹 Kapila Gita Part 3 - The Conversation of Kapila and Devahuti - Understanding the Lord's Activities is Important in Yoga Practice. 🌹

3) 🌹 कपिला गीता भाग 3 - कपिल और देवहूति का संवाद - योग अभ्यास में भगवान की लीलाओं को समझना सर्वोपरि है। 🌹

4) 🌹 మౌనం.. శక్తికి ఆధారం 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 581 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 581 - 1 🌹

🌻 581. 'దయామూర్తి' - 1 / 581. 'Dayamurti' - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 కపిల గీత - 3వ భాగం. - కపిల దేవహూతి సంవాదం - భగవంతుని కార్యకలాపాలను అర్థం చేసుకోవడం యోగ సాధనలో అతి ముఖ్యమైనది. 🌹*

*ప్రసాద్ భరధ్వాజ *


*భాగవతంలో పేర్కొన్న భక్తి సేవ యొక్క తొమ్మిది ప్రధాన విధానాలను కనుగొనండి. శ్రవణం (వినడం), కీర్తనం (పాడడం), మరియు స్మరణం (గుర్తుచేసుకోవడం) వంటి ప్రక్రియలు మనలను పరమాత్మ యొక్క ఆధ్యాత్మిక లీలలతో ఎలా కలుపుతాయో తెలుసుకోండి. "నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ, మిక్కిలి దృఢతతో ప్రయత్నిస్తూ, నా ముందు నమస్కరిస్తూ, అనన్య భక్తితో నన్ను పూజించే మహాత్ములు ఎప్పటికీ నా సేవలో ఉంటారు." భక్తి యోగం యొక్క ఈ సారాన్ని స్వీకరించి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని లోతుగా చేయండి! ఆధ్యాత్మిక విద్య అంటే భౌతిక జీవితపు సంక్లిష్టతల నుండి విముక్తి పొందడం. ఇది భగవంతుని ఆధ్యాత్మిక లీలల గురించి తెలుసుకొని ఆయనకు సమర్పణ చెందడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.*

*Join Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం*

🌹🌹🌹🌹🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Kapila Gita Part 3 - The Conversation of Kapila and Devahuti - Understanding the Lord's Activities is Important in Yoga Practice. 🌹*

*Prasad Bharadwaj*


*Discover the nine primary processes of devotional service as described in the Bhāgavatam. Learn how practices like Shravaṇam (hearing), keertanam (chanting), and smaraṇam (remembering) can help us connect with the divine pastimes of the Supreme Lord. “Always chanting My glories, endeavoring with great determination, bowing down before Me, the great souls perpetually worship Me with devotion.” Embrace the essence of bhakti yoga and deepen your spiritual journey! Spiritual knowledge means attaining liberation from the complexities of material life. This is possible only by understanding the Divine Activities of the Lord and surrendering to Him.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 कपिला गीता भाग 3 - कपिल और देवहूति का संवाद - योग अभ्यास में भगवान की लीलाओं को समझना सर्वोपरि है। 🌹*

*प्रसाद भारद्वाज*


*भागवत में वर्णित भक्ति सेवा की नौ प्रमुख प्रक्रियाओं को जानिए। श्रवणम (सुनना), कीर्तनम (गाना), और स्मरणम (याद करना) जैसी प्रक्रियाएँ हमें परमात्मा की दिव्य लीलाओं से कैसे जोड़ सकती हैं, इसे समझिए। “हमेशा मेरी महिमा का कीर्तन करते हुए, दृढ़ निश्चय के साथ प्रयास करते हुए, मुझे प्रणाम करते हुए, महात्मा भक्तिपूर्वक मुझे नित्य आराधना करते हैं।” भक्ति योग के सार को अपनाइए और अपने आध्यात्मिक सफर को गहराई दीजिए! आध्यात्मिक ज्ञान का अर्थ है भौतिक जीवन की जटिलताओं से मुक्ति प्राप्त करना। यह केवल भगवान की दिव्य लीलाओं को समझकर और उनके प्रति समर्पित होकर ही संभव है।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 మౌనం.. శక్తికి ఆధారం 🌹*


*భారతదేశం ఎన్నో దివ్య క్షేత్రాలకు, ఎన్నెన్నో దివ్య ధామాలకు నిలయం. ఆ సేతు శీతాచలం అసంఖ్యాకమైన పవిత్ర ఆలయాలు ఈ నేలపై కొలువై ఉన్నాయి. యుగాలు మారినా, తరాలు గడిచినా ఆ ఆలయాల శక్తి ఏ మాత్రం తరగలేదు.*


*ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడిని మొక్కుబడిగా చూసి, కోరికల చిట్టా విప్పడం అనవాయితీగా మారిపోయింది. గుడికి వెళ్లి కూడా అనేకమైన సమస్యల గురించిన చింతను వదలకుండా అదే పనిగా తలుచుకోవడం సామాన్యంగా మారింది. ఆలయాలు మహా శక్తి క్షేత్రాలు. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు శక్తిని గ్రహించాలి.*


*దేవుడిని దర్శించడంతో పాటు పరమాత్మ తత్వంతో ఏకీకృతం అయ్యే ప్రయత్నం చేయాలి. భగవద్‌ తత్వంతో లయం కావాలంటే మొదట మౌన స్థితికి చేరాలి. ఎందుకంటే భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి స్వాంతనను ఇవ్వగలిగే శక్తిని మీరు మౌనం ద్వారా పొందగలరు. మౌనం మీకు సత్య దర్శనాన్ని కలిగిస్తుంది. దివ్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసును ప్రయత్న పూర్వకంగా స్థిమిత పరిచి శక్తిని ప్రోది చేసుకోవాలి. తక్షణమే మీ చింతలు తగ్గి, మనసు మీ అదుపులోకి వస్తుంది. ఎన్ని పనులున్నా కోవెలకు వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ వదిలిపెట్టాలి. ఫోన్‌ కాల్స్‌ కానీ, మెసేజీలు కానీ, ఆఫీస్‌ విషయాలు కానీ, ఇంటి పనులు, ఇతరితర విషయాలన్నీ పక్కన పెట్టి భగవద్‌ చైతన్యంతో మమేకం కావాలి.*


*మహిమాన్విత ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడికి చేరడంతోనే మీరు ఎంతో కొంత శక్తిని స్వీకరిస్తారు. అదే గనుక మౌన స్థితిలో ఉండగలిగితే మరింత అద్భుత శక్తిని పొందుతారు. ఆలయాలలో అనేక మాధ్యమాల ద్వారా ప్రసరించే దివ్యశక్తి మీ శక్తి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శక్తి శరీరాన్ని కాంతి శరీరం అని కూడా అంటారు. శక్తి శరీరానికి దివ్య శక్తే ఆధారం. మీరు మౌన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దివ్యశక్తి మీలోనికి అధికంగా ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఋషులు, దేవతలు ప్రతిష్ఠించిన పురాతన ఆలయాల్లో దేవతా శక్తి, ఋషుల తపొశక్తులు రెండూ కలగలిసి ఉంటాయి. ఎన్నియుగాలు గడిచినా ఇటువంటి ఆలయాలలోని శక్తి సంపద చెక్కుచెదరదు. అందుకే వందల సంవత్సరాలుగా భక్తకోటి తరలి వస్తున్నా ఇంకా అదే శక్తి ప్రకంపనలతో ఈ ఆలయాలు అలరారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, భక్తి ప్రపత్తులతో మౌన స్థితో ఉండటం ఉత్తమం.*


*అవకాశం కుదిరితే కాసేపు ఆ ప్రదేశాల్లో ధ్యానసాధన కూడా చేయండి. భగవంతుడి వద్దకు వెళ్లిన ప్రతిసారీ మీ సమస్యలను గురించో, లేకపోతే మీరు పొందాలనుకుంటున్న కోరికల గురించో విన్నవించుకునే బదులుగా, మీకు భగవంతుడు ప్రసాదించిన ఎన్నో వరాలకు భక్తితో కృతజ్ఞతలు తెలిపి, మౌనస్థితికి వెళ్ళండి. మీరు అనుభవిస్తున్న బాధలు, సమస్యలు అన్నీ పరమాత్మకు తెలుసు. అలాగే మీరు ఏమి కోరుకుంటున్నారో కూడా ఆయనకు తెలుసు. భగవంతుడు సర్వాంతర్యామి. మీరు చేయవలసింది భగవంతునికి మీ భక్తిని సమర్పించడం. స్వచ్ఛమైన మనసుతో, మౌనస్థితిలో భగవంతుడి చైతన్యంలో లయమవ్వడం. ఇలా చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను క్రమక్రమంగా ఓర్పు నేర్పులతో పరిష్కరించుకోగల శక్తి మీకే లభిస్తుంది. దివ్యశక్తి మీతో కలిసి మీ ప్రగతికై పని చేస్తుంది.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 581 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 581 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*

*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*


*🌻 581. 'దయామూర్తి' - 1 🌻*


*మూర్తీభవించిన దయారూపము శ్రీమాత అని అర్ధము. భక్తుల యందు శ్రీమాతకు దయ మెండు. ఆర్తితో ఆరాధించు భక్తుల యెడల దయ కలిగియుండును. ఆర్తులను, బలహీనులను రక్షించును. అహంకారుల యందు ఉపేక్ష భావము చూపిననూ వారు నిరహంకారులై ప్రార్థించిన వెంటనే ప్రసన్న మగును. శ్రీమాతను మరచిన వారిని శ్రీమాత కూడ ఉపేక్షించును. స్మరించిన వారిపై దృష్టి సారించును. కష్టములందు దయ చూపును. ఆపదల యందు ఆదు కొనును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 581 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*

*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*


*🌻 581. 'Dayamurti' - 1 🌻*


*The term "Dayāmūrti" means the embodiment of compassion, which refers to Sri Mata (Divine Mother). Sri Mata is filled with immense compassion for her devotees. She is especially gracious towards those who worship her with heartfelt devotion and sincerity. She protects the weak and the distressed. Though she may seem indifferent towards the arrogant, she becomes pleased as soon as they shed their pride and pray to her earnestly. Sri Mata may appear to overlook those who forget her, but she immediately focuses her grace on those who remember her. She shows compassion during times of hardship and provides refuge in moments of peril.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹


#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹

Like, Subscribe and Share 👀

Comentarios


bottom of page