🍀🌹 18, JULY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 553 / Bhagavad-Gita - 553 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 02 / Chapter 15 - Purushothama Yoga - 02 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 104 🌹
🏵 కాళీసాధన - 2 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 3 / 552. 'Sarvamrutyu Nivarini' - 3 🌻
🌹 శ్రీ వారాహీ దేవి ధ్యానములు 🌹
🌹🎥 ఆత్మ యొక్క ప్రయాణం అంతిమ సాహసం 🎥🌹
🌹 🎥 The Soul Journey is an Ultimate Adventure 🎥🌹
Like, Subscribe and share 👀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹🎥 ఆత్మ యొక్క ప్రయాణం అంతిమ సాహసం 🎥🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*Like, Subscribe and share 👀*
*ఈ ఆకర్షణీయమైన వీడియోలో ఆత్మ యొక్క లోతుల్లోకి శక్తివంతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి. ఆత్మ యొక్క దివ్య ప్రయాణాన్ని ప్రతిబింబించే రహస్యాలు మరియు మలుపులు, సవాళ్లు మరియు విజయాలను అన్వేషించండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 🎥 The Soul Journey is an Ultimate Adventure 🎥🌹*
*Prasad Bharadwaj*
*Like, Subscribe and share 👀*
*Embark on a profound and powerful journey through the depths of the soul in this captivating video. Explore the twists and turns, the challenges and victories, that shape the epic journey of a soul.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 553 / Bhagavad-Gita - 553 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 02 🌴*
*02. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్దా విషయప్రవాలా: |*
*అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే ||*
*🌷. తాత్పర్యం : ఈ వృక్షశాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్థ్వ, అధోముఖములుగా వ్యాపించియున్నవి. దీని చిగుళ్ళే ఇంద్రియార్థములు, అధోముఖముగను ఉన్నత ఈ వృక్షపు వ్రేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై యున్నవి.*
*🌷. భాష్యము : ఈ శ్లోకమునందు అశ్వత్థవృక్ష వర్ణనము మరికొంత ఒసగబడినది. సర్వదిక్కుల యందు వ్యాపించియున్న దాని శాఖల అధోభాగమున మానవులు మరియు అశ్వములు, గోవులు, శునకములు మొదలగు జంతువులు స్థితిని కలిగియున్నవి. జీవులు ఈ విధముగా అధోభాగమున నిలిచియుండగా, వృక్షపు ఊర్థ్వభాగమున దేవతలు, గంధర్వులవంటి ఉన్నతజీవులు స్థితిని కలిగియున్నారు. వృక్షము నీటిచే పోషింపబడునట్లు, ఈ సంసారవృక్షము త్రిగుణములచే పోషింపబడును.*
*తగినంత నీరు లేనందున కొంత భూభాగము బీడుపడుటయు, వేరొక భూభాగము పచ్చగా నుండుటయు మనకు గోచరమగునట్లు, ప్రకృతిగుణముల పరిమాణము మరియు ప్రాబల్యము ననుసరించి వివిధములైన జీవజాతులు వ్యక్తమగుచుండును. సంసారవృక్షపు చిగుళ్ళే ఇంద్రియార్థములుగా పరిగణింపబడినవి. వివిధగుణముల వృద్ది వలన వివిధ ఇంద్రియములు కలుగుచుండ, ఆ ఇంద్రియముల ద్వారా మనము వివిధ ఇంద్రియార్థముల ననుభవింతురు. ఈ విధముగా ఇంద్రియార్థములను కూడియుండెడి కర్ణములు, నాసిక, నయనాది ఇంద్రియములే సంసారవృక్షశాఖాగ్రములు.*
*శబ్ద, రూప, స్పర్శాది ఇంద్రియార్థములే చిగుళ్ళు. వృక్షపు ఉపమూలములే వివిధ దుఃఖములు, ఇంద్రియభోగముల ఫలములైన ఆసక్తి, అనాసక్తులు. సర్వదిక్కులా వ్యాపించియుండు ఈ ఉపమూలముల నుండియే ధర్మాధర్మములకు సంబంధించిన ప్రవృత్తులు కలుగుచున్నవి. ఈ వృక్షపు యథార్థమూలము బ్రహ్మలోకము నందుండగా, ఇతర ఉపమూలములు మర్త్యలోకము నందున్నవి. ఊర్థ్వలోకములందు పుణ్యకర్మల ఫలముల ననుభవించిన పిదప జీవుడు ఈ మర్త్యలోకమున కరుదెంచి, తిరిగి ఊర్థ్వలోకములకు ఉద్ధరింపబడుటకు తన కర్మల నారంభించును. కనుకనే ఈ మర్త్యలోకము కర్మక్షేత్రముగ పరిగణింపబడుచున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 553 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 02 🌴*
*02. adhaś cordhvaṁ prasṛtās tasya śākhā guṇa- pravṛddhā viṣaya-pravālāḥ*
*adhaś ca mūlāny anusantatāni karmānu bandhīni manuṣya-loke*
*🌷 Translation : The branches of this tree extend downward and upward, nourished by the three modes of material nature. The twigs are the objects of the senses. This tree also has roots going down, and these are bound to the fruitive actions of human society.*
*🌹 Purport : The description of the banyan tree is further explained here. Its branches spread in all directions. In the lower parts, there are variegated manifestations of living entities – human beings, animals, horses, cows, dogs, cats, etc.*
*These are situated on the lower parts of the branches, whereas on the upper parts are higher forms of living entities: the demigods, Gandharvas and many other higher species of life. As a tree is nourished by water, so this tree is nourished by the three modes of material nature.*
*Sometimes we find that a tract of land is barren for want of sufficient water, and sometimes a tract is very green; similarly, where particular modes of material nature are proportionately greater in quantity, the different species of life are manifested accordingly.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 104 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 కాళీసాధన 🏵*
*గుంటూరు జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్గా చేసిన ఒక ఐ.పి.యస్. అధికారి పూర్వాశ్రమంలో నాకు ఆప్తుడు. అతడు పూర్వజన్మలో కళింగ రాష్ట్రంలో రాజవంశానికి చెందినవాడు. తీవ్రమైన అనారోగ్యంపాలై నూటయాభై సంవత్సరాల క్రింద భువనేశ్వర్ ప్రాంత అరణ్యంలోని నా ఆశ్రమానికి వచ్చి 40 రోజులు ఉండి కాళీపూజ చేసి ఆరోగ్యాన్ని పొంది వెళ్ళాడు. అప్పటి అనుబంధం ఇప్పుడూ వచ్చింది. అతడు శ్రీకాకుళం జిల్లాకు పోలీసు సూపరింటెండెంట్గా ఉన్నపుడు ఒరిస్సాలో వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతని నేతృత్వంలో ఒక సహాయ బృందాన్ని పంపించింది. తెలియకుండానే తన పూర్వజన్మ ప్రాంతానికి అతడు సేవచేయకలిగాడు. జన్మాంతర బంధాలు మనుష్యులను అలా లాక్కువెడుతుంటాయి.*
*18వ శతాబ్దంలోని మరొక సంఘటన కూడా ఆ మధ్య కనిపించింది. నేను కుటుంబంతో పరివారంతో శిష్యులతో కలసి తమిళనాడులో బయలుదేరి కళింగారణ్యాలలో ఉన్న కాళీదేవిని చూడటానికి వెళుతున్నాను. ఆంధ్రభూమిలో కొంతదూరం ప్రయాణం చేసి విశాఖపట్నం దాటి విజయనగరం చేరుకొని అక్కడి ఒక రెండంతస్థుల భవనంలో విడిది చేశాము. నేను మేడమీద ఉండగా అర్ధరాత్రి గందరగోళంగా కేకలు వినిపించినవి. లేచి చూస్తే దోచుకోటానికి దొంగలు సాయుధులై వచ్చారు. నా పరివారంలోని వారు వారిని తరిమి వేయటానికి పోరాడుతున్నారు. చివరికా దొంగలు పారిపోయినారు. ఆనాడు దొంగలతో పోరాడిన వారిలో ఒక వ్యక్తి ఇప్పుడు జన్మమారి నాకు ఎంతో సేవచేశాడు.*
*అదే విధంగా అప్పటి శిష్యులలో మరొక వ్యక్తి ఇప్పుడు పోలీసుశాఖలో అత్యున్నత పదవిలో ఉన్నాడు. సామాన్యంగా ఉన్నతోద్యోగాలలో ఉన్నవారు అధికార గర్వితులై ఉంటారు. దైవసాధన తీవ్రంగా చేసే లక్షణం అరుదుగా ఉంటుంది. ఆస్తికులుగా ఉండవచ్చు, దేవాలయాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేకమర్యాదలు పొందవచ్చు. కాని కష్టపడి జపహోమాలు సాధనదృష్టితో చేయటం విశేషం. ఆ విశేషమే ఈ అధికారికి అబ్బింది. ఆనాడు నా ఆశ్రమంలో చేసిన సాధన, నా రక్షణకై చూపిన సాహసం. చేసిన పుణ్యకార్యములు ఉన్నత పదవినివ్వటమేకాక తీవ్రసాధక లక్షణాన్ని కూడా పెంపొందించినవి.*
*ఆనాటి నా ప్రయాణ సమయంలో తెలుగుదేశంలో ఒకచోట వరదలు వచ్చినవి. ఆ ప్రాంతానికి చెందిన ఒక జమీందారిణి ఆ కష్టంలో ప్రజలను ఎంతో ఆదుకొన్నది. తనపరివారంతో ఆహార ధనాది వస్తువులతో ఎంతో సేవ చేసింది. నాయందు భక్తి కలిగి మంత్రోపదేశం స్వీకరించింది. శ్రద్ధాభక్తులతో ఆ దేవతాసాధన చేసింది. ఈ రెండింటివల్ల లభించిన పుణ్యఫలితంగా ఈ జన్మలో చదువు సంస్కారము దేవాదాయ శాఖలో ఉన్నతోద్యోగము లభించినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఉపదేశం పొంది శ్రద్ధగా మంత్రసాధన చేస్తున్నది.*
*కాళి యొక్క ఒక తీవ్రరూపం ప్రత్యంగిరా భద్రకాళి హైదరాబాదులో ఈ దేవతకు ఆలయం నిర్మించాము. అక్కడ ఉండగా ఒక రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నరు నుండి ఆహ్వానం వచ్చింది. వారి అధికారులు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నరు పాదపూజ చేసుకొన్నాడు. అప్పుడు నేను వారితో "ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజభవన్లో ఇంతవరకు ఏ పీఠాధిపతికైనా పాదపూజ జరిగిందా" అన్నాను. 'లేదు' అన్నారు వారు. “మీరెవరికైనా పూర్వం చేశారా ?" అన్నాను. ఆయన "నేను మా రాష్ట్రంలో ఉండగా ద్వారకాపీఠాధిపతికి చేశాను. మీకు ఇప్పుడు చేశాను. నాకు రెండవ అవకాశం ఇది" అన్నారు. ఆయన వ్యక్తిగతమైన కోరిక ఒకటి కోరారు. ఆశీర్వదించాను. కొద్దిరోజుల్లో అది జరిగి ఇంకా ఉన్నతమైన ఆయన కోరిన పదవికి వెళ్ళిపోయినాడు. ఆయనకు ఒకటే సందేశమిచ్చాను "ఎక్కడ ఉన్నా మీ శక్తిని ధర్మ రక్షణకు వినియోగించండి” చేతనైనంత తప్పక చేస్తాను అన్నాడతడు. ఒక యతికి గౌరవాగౌరవాలతో పని లేదు కాని కాళీదేవి ఈ సంప్రదాయ కీర్తికి చేసిన లీల ఇది. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాదపూజ చేసుకొన్నప్పుడు కూడ కాళీదేవి ఇలానే ఆయన అభీష్టం తీర్చి తన దివ్యలీలను ప్రదర్శించింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 3 🌻*
*ఉత్తరాయణ దక్షిణాయనములు, కృష్ణ శుక్ల పక్షములు, తిథులు, నక్షత్రములు వీని ననుసరించి కూడ అకాల మృత్యువును నిర్ధారణ చేయుదురు. అశుభ సమయములలో దేహము విడిచినపుడు, ఆ దేహియు మరియు ఆ కుటుంబము వారు చాల కష్టనష్టములకు గురి అగుదురు. పై తెలిపిన రెండునూ గాక మృత్యువు అనునది అజ్ఞాన కారణము. మృత్యువు స్వరూప స్వభావములు నెఱిగి స్వచ్చందముగా దేహమును విడచుట వేరు, దేహమున బంధింపబడి భయముతో, బాధతో, వేదనలతో అపస్మారక స్థితిలో మరణించుట వేరు. ఇందు రెండవ సంఘటనను మరణించుట లేక చచ్చుట అందురు. మొదటి విధానమును దేహమును త్యజించుట, పరిత్యజించుట, విడచుట అందురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 3 🌻*
*Uttarayana Dakshinayanams, Krishna Shukla Pakshas, Tithi and Nakshatra these also determine premature death. When the body leaves during inauspicious times, the body and the family suffer great losses. Apart from the above, ignorance is the cause of death. It is one thing to leave the body voluntarily while knowing the nature of death, and another to die in an unconscious state with fear, pain and agony while bound to the body. The second event is death. The first method is to renounce, relinquish or separate the body.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శ్రీ వారాహీ దేవి ధ్యానములు 🌹*
*🍀 శ్రీ వార్తాళి వారాహీ ధ్యానం 🍀*
చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్ I
సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్ II
*🍀 శ్రీ బృహద్వారాహీ ధ్యానం 🍀*
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్ II
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹📽️SpiritualWisdomChaitanyam Channel 📽️🌹*
*Like, Subscribe and Share 👀*
*🌹📽️SpiritualWisdomChaitanyam Channel 📽️🌹*
*Like, Subscribe and Share 👀*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments