🍀🌹 19, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 19, JANUARY 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 489 / Bhagavad-Gita - 489 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -20 / Chapter 12 - Devotional Service - 20 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 844 / Sri Siva Maha Purana - 844 🌹
🌻. దేవదేవ స్తుతి - 4 / Prayer to the lord of gods - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 102 / Osho Daily Meditations - 102 🌹
🍀 102. వివరించకుండా ఉండండి / 102. REMAIN UNEXPLAINED 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 - 5 🌹
🌻 521 to 528 నామ వివరణము - 5 / 521 to 528 Names Explanation - 5 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 19, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 45 🍀*
*45. మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా ।*
*నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాశికా క్షమా ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానసిక జ్ఞానపరిమితి : సత్య వస్తువునకు ఆధిమనస్సు కల్పించే విభాగములు అసంఖ్యాకములు. వాటిని బట్టియే, తత్వదర్శనములు, మతములు కూడ అసంఖ్యాకములు కావడానికి వీలున్నది. కనుకనే, మానసిక జ్ఞానం ఏ చరమ పరిష్కారానికి సాధనం కానేరదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పౌష్య మాసం
తిథి: శుక్ల-నవమి 19:53:56
వరకు తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: భరణి 26:52:15
వరకు తదుపరి కృత్తిక
యోగం: సద్య 12:45:58 వరకు
తదుపరి శుభ
కరణం: బాలవ 08:16:02 వరకు
వర్జ్యం: 12:31:12 - 14:06:44
దుర్ముహూర్తం: 09:04:21 - 09:49:17
మరియు 12:49:04 - 13:34:01
రాహు కాలం: 11:02:20 - 12:26:36
గుళిక కాలం: 08:13:47 - 09:38:03
యమ గండం: 15:15:09 - 16:39:25
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 22:04:24 - 23:39:56
మరియు 24:44:06 - 26:21:22
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:03:42
చంద్రోదయం: 12:40:32
చంద్రాస్తమయం: 00:58:15
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముద్గర యోగం - కలహం
26:52:15 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 489 / Bhagavad-Gita - 489 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -20 🌴*
*20. యే తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే |*
*శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే(తీవ మే ప్రియా: ||*
*🌷. తాత్పర్యం : నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.*
*🌷. భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుక్తసేవా కార్యములు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియములై యున్నవి. వాని యందు నియుక్తుడైన మనుజుని అతడు ప్రేమతో అనుగ్రహించును.*
*నిరాకార బ్రహ్మ మార్గము నందు నిమగ్నుడైనవాడు ఉత్తముడా లేక పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రత్యక్షసేవలో నియుక్తుడైనవాడు ఉత్తముడా అను ప్రశ్నను అర్జునుడు లేవదీసియుండెను. అర్జునుని అట్టి ప్రశ్నకు శ్రీకృష్ణుడు తన భక్తియుతసేవయే ఆత్మానుభవమునకు గల వివిధపద్ధతులలో అత్యంత శ్రేష్టమైనదనుటలో ఎట్టి సందేహము లేదని స్పష్టముగా సమాధానమొసగినాడు. అనగా సత్సంగము ద్వారా మనుజుడు శుద్ధ భక్తియోగము నెడ అభిరుచిని వృద్ధిచేసికొనుననియు, తద్ద్వారా అతడు ఆధ్యాత్మికగురువును స్వీకరించి ఆయన నుండి శ్రవణ, కీర్తనములను చేయుటను ఆరంభించి శ్రద్ధ, అనురాగము, భక్తిభావములతో భక్తియోగమందలి నియమనిబంధనలను పాటించుచు శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడు కాగలడనియు ఈ అధ్యాయమున నిర్ణయింపబడినది.*
*శ్రీమద్భగవద్గీత యందలి “భక్తియోగము” అను ద్వాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 489 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 20 🌴*
*20. ye tu dharmāmṛtam idaṁ yathoktaṁ paryupāsate*
*śraddadhānā mat-paramā bhaktās te ’tīva me priyāḥ*
*🌷 Translation : Those who follow this imperishable path of devotional service and who completely engage themselves with faith, making Me the supreme goal, are very, very dear to Me.*
*🌹 Purport : In this chapter, from verse 2 through the end – from mayy āveśya mano ye mām (“fixing the mind on Me”) through ye tu dharmāmṛtam idam (“this religion of eternal engagement”) – the Supreme Lord has explained the processes of transcendental service for approaching Him. Such processes are very dear to the Lord, and He accepts a person engaged in them. The question of who is better – one who is engaged in the path of impersonal Brahman or one who is engaged in the personal service of the Supreme Personality of Godhead – was raised by Arjuna, and the Lord replied to him so explicitly that there is no doubt that devotional service to the Personality of Godhead is the best of all processes of spiritual realization.*
*In other words, in this chapter it is decided that through good association one develops attachment for pure devotional service and thereby accepts a bona fide spiritual master and from him begins to hear and chant and observe the regulative principles of devotional service with faith, attachment and devotion and thus becomes engaged in the transcendental service of the Lord. This path is recommended in this chapter; therefore there is no doubt that devotional service is the only absolute path for self-realization, for the attainment of the Supreme Personality of Godhead.*
*Thus end the Bhaktivedanta Purports to the Twelfth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Devotional Service.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 844 / Sri Siva Maha Purana - 844 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴*
*🌻. దేవదేవ స్తుతి - 4 🌻*
*బ్రహ్మవిష్ణువులిట్లు పలికిరి- ఓ దేవదేవా! మహాదేవా! పరబ్రహ్మా! సర్వేశ్వరా! సత్త్వరజస్తమో గుణములకు అతీతమైనవాడా! ఆనందస్వరూపా! త్రిమూర్తుల తండ్రీ! ప్రభూ! (27). మేము నిన్ను శరణు పొందుచున్నాము. ఓ విభూ! పరమేశ్వరా! శంఖచూడునిచే పీడింపబడి క్లేశములను పొంది దుఃఖితులమై యున్నాము. సత్స్వరూపుడవగు నీవే మాకు నాథుడవు. మమ్ములను రక్షింపుము (28). ఇచటకు సమీపములో నున్న లోకమునకు గోలోకమని పేరు. దానికి శ్రీకృష్ణభగవానుడు అధీశ్వరుడు. ఆయనకు నీవు ప్రభుడవు (29). శ్రీకృష్ణుని అనుంగు సహచరుడగు సుదాముడు దైవవశముచే రాధచే శపింపబడి శంఖచూడుడనే దానవుడైనాడు (30). ఓ శంభూ! ఆతడు దేవతలను పరిపరి విధముల బాధలకు గురిచేసి స్వర్గమునుండి వెళ్లగొట్టినాడు. తమ అధికారములను పోగొట్టుకొనిన దేవతలు భూలోకములో తిరుగాడుచున్నారు (31). ఆతనిని దేవతలందరిలో ఒక్క రైననూ సంహరింపజాలరు. నీవు మాత్రమే ఆతనిని సంహరించగలవు. ఓ మహేశ్వరా! నీవాతనిని వధించి లోకములకు సుఖమును కలుగజేయుము (32). నిర్గుణుడు, సత్యస్వరూపుడు, అనంతుడు, అంతములేని పరాక్రమము గలవాడు, సగుణుడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు, ప్రకృతిపురుషులకు అతీతుడు అగు పరమాత్మ నీవే (33).*
*ఓ ప్రభూ! సృష్టి కాలములో నీవు రజోగుణప్రధానుడవై బ్రహ్మరూపములో సృష్టిని చేసెదవు. విష్ణురూపములో సత్త్వగుణప్రధానుడవై ముల్లోకములను రక్షించెదవు (34). తమో గుణప్రధానుడవై రుద్రరూపములో ప్రళయకాలము నందు జగత్తును నాశము చేసెదవు. త్రిగుణా తీతమగు తురీయ శుద్ధచైతన్య స్వరూపుడవై శివనామముతో ప్రసిద్ధిని గాంచి యున్నావు (35).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 844 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴*
*🌻 Prayer to the lord of gods - 4 🌻*
Viṣṇu and Brahmā said: —
27. O lord Śiva, lord of the gods, O supreme Brahman, lord of all. O quiet one that is beyond the three attributes, O lord progenitor of the three deities.
28. We have sought refuge in you. O lord, save us who are distressed. O lord Śiva, we are harassed by Śaṅkhacūḍa and so dejected and well nigh exhausted. Save us.
29. The region that is adjacent to this place is called Goloka, Lord Kṛṣṇa is its presiding deity.
30. One of his leading attendants and comrades, Sudāmā, cursed by Rādhā and led by fate, has become the Dānava Śaṅkhacūḍa.
31. O Śiva, the gods divested of all powers ousted and harassed by him roam over the Earth now.
32. Except by you he cannot be killed by any one of the gods. Please kill him and render the worlds happy.
33. You alone are devoid as well as possessed of attributes, truthful, of infinite valour, embedded in the good and greater than Prakṛti and Puruṣa.
34. At creation, O lord, you are Brahmā, the creator through Rajas. O protector of the three worlds, in the activity of protection through Sattva you are Viṣṇu.
35. In dissolution through Tamas you are Rudra the annihilator of the universe. In the state free from the three attributes you are Śiva the fourth one, of the form of brilliance.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 102 / Osho Daily Meditations - 102 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 102. వివరించకుండా ఉండండి 🍀*
*🕉 జీవితంలో ప్రతిదీ వివరించాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఏమీ వివరించవలసిన బాధ్యత మనకు లేదు. 🕉*
*లోతుగా ఉన్నది ఎప్పుడూ వివరించ బడదు. మీరు వివరించ గలిగేది చాలా ఉపరితలంగా ఉంటుంది. మీరు వివరించలేని విషయాలు ఇవి. మీరు ఒక వ్యక్తితో ప్రేమలో పడితే, మీరు ఎలా ప్రేమలో పడ్డారో ఎలా వివరించగలరు? మీరు ఏ సమాధానం చెప్పినా మూర్ఖంగా అనిపిస్తుంది అతని ముక్కు కారణంగా, ఆమె ముఖం కారణంగా, అతని స్వరం, ఏదైనా.*
*ఆ విషయాలన్నీ ప్రస్తావించ దగినవిగా అనిపించవు, కానీ ఆ వ్యక్తిలో ఏదో ఉంది. మీరు ఆ వ్యక్తిని ప్రేమించే ఏదో కారణంలో ఆ విషయాలు భాగం కావచ్చు, కానీ ఆ 'ఏదో' అన్నిటికంటే పెద్దది. మొత్తం కంటే ఏదోనే ఎక్కువ.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 102 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 102. REMAIN UNEXPLAINED 🍀*
*🕉 Everything in life need not be explained. We have no responsibility to explain anything to anybody. 🕉*
*All that is deep is always unexplained. That which you can explain will be very superficial. There are things that you cannot explain. If you fall in love with a person, how can you explain how you have fallen in love? Whatever you answer will sound stupid because of his nose, because of her face, because of his voice.*
*All those things will not seem worth mentioning, but there is something there in the person. Those things may be part of why you love the person, but that "something" is bigger than everything. That something is more than the total.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥
*108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।*
*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀*
*🌻 521 to 528 నామ వివరణము - 5 🌻*
*పదునెనిమిది పర్వములతో కూడిన మహా భారతము వేదవ్యాస మహర్షి 'జయము' అని పేర్కొనినాడు. యజము నిర్వర్తించిన వారికే జయము అని రహస్యార్థమును తెలిపినాడు. అట్లే భగవదుపదేశమును కూడ పదునెనిమిది అధ్యాయములలో యేర్పరచినాడు. సృష్టి యందు పదునెనిమిది తత్త్వములు దివ్యములని, అమృతములని, అవ్యక్తములని, ఆరు తత్త్వములు వ్యక్తములని పురుష సూక్తమున ప్రతిపాదింపబడినది. ఇట్టి వ్యక్తా అవ్యక్త సృష్టికి శ్రీమాతయే ఆధారము. అట్టి శ్రీమాతను భ్రూమధ్యమున ద్విదళ పద్మమున ఆరాధించి దర్శించుట ఉత్తమోత్తమమని ఋషుల అభిప్రాయము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥*
*108. Majasansdha hansavati mukhyashakti samanvita*
*haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻*
*🌻 521 to 528 Names Explanation - 5 🌻*
*Sage Vedavyasa called Maha Bharata consisting of eighteen Parvas as 'Jayam'. He explained the secret meaning that victory is for those who perform Yajam. Similarly, he structured the Lord's message in eighteen chapters. It is proponed in Purusha suktam that eighteen tattvas in creation are divine, immortal, immanent and six tattvas are manifest. Sri Mata is the basis of this manifested and unmanifested creation. Sages are of the opinion that it is the highest state to see and meditate upon Srimata in the double petaled lotus at the center of the eyebrows.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments