top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 19, JULY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 19, JULY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀

1) 🌹 కపిల గీత - 360 / Kapila Gita - 360 🌹

🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 43 / 8. Entanglement in Fruitive Activities - 43 🌴

2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 953 / Vishnu Sahasranama Contemplation - 953 🌹

🌻 953. ప్రజాగరః, प्रजागरः, Prajāgaraḥ 🌻

3) 🌹 సిద్దేశ్వరయానం - 105🌹

🏵 యోగులు - సూక్ష్మశరీరులు 🏵

4) 🌹. శివ సూత్రములు - 267 / Siva Sutras - 267 🌹

🌻 3 - 43. నైసర్గికః ప్రాణసంబంధః - 2 / 3 - 43. naisargikah prānasambandhah - 2 🌻

*🌹📽️Chaitanya Vijnanam - Spiritual Wisdom Channel 📽️🌹*

*Like, Subscribe and Share 👀*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 360 / Kapila Gita - 360 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 43 🌴*


*43. య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషః సకృత్|*

*యో వాభిధత్తే మచ్చిత్తః స హ్యేతి పదవీం చ మే॥*


*తాత్పర్యము : అమ్మా! నా యందే చిత్తముసు నిలిపి, దీనిని భక్తిశ్రద్ధలతో ఒక్కసారి యైనను శ్రవణము చేసిన వాడును, ఉపదేశించిన వాడును పరమపదమును పొందుదురు.*


*శ్రీమద్భాగవత మహాపురాణము నందలి తృతీయ స్కందము, 32వ అధ్యాయము, 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టతతో "కపిల దేవాహుతి సంవాదము" సమాప్తము.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 360 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 8. Entanglement in Fruitive Activities - 43 🌴*


*43. ya idaṁ śṛṇuyād amba śraddhayā puruṣaḥ sakṛt*

*yo vābhidhatte mac-cittaḥ sa hy eti padavīṁ ca me*


*MEANING : Anyone who once meditates upon Me with faith and affection, who hears and chants about Me, surely goes back home, back to Godhead.*


*Thus end the Third Canto, Thirty-second Chapter, of the Śrīmad-Bhāgavatam, entitled "8. Entanglement in Fruitive Activities." With this ''Conversation of Kapila and Devahuthi" Concludes.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 953 / Vishnu Sahasranama Contemplation - 953 🌹*


*🌻 953. ప్రజాగరః, प्रजागरः, Prajāgaraḥ 🌻*


*ఓం ప్రజాగరాయ నమః | ॐ प्रजागराय नमः | OM Prajāgarāya namaḥ*


*నిత్యప్రబుద్ధరూపత్వాత్ ప్రకర్షేణాస్య జాగృతేః ।*

*ప్రజాగర ఇతిప్రోక్తో విష్ణుః శ్రుతివిశారదైః ॥*


*స్వభావ సిద్ధముగానే జ్ఞానమును పొంది యుండి జ్ఞానాత్మక స్వరూపము కలవాడు కావున - 'మిక్కిలి మెలకువతో నుండు వాడు' అను అర్థమున - ప్రజాగరః అనబడును.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 953 🌹*


*🌻 953. Prajāgaraḥ 🌻*


*OM Prajāgarāya namaḥ*


नित्यप्रबुद्धरूपत्वात् प्रकर्षेणास्य जागृतेः ।

प्रजागर इतिप्रोक्तो विष्णुः श्रुतिविशारदैः ॥


*Nityaprabuddharūpatvāt prakarṣeṇāsya jāgr‌teḥ,*

*Prajāgara itiprokto viṣṇuḥ śrutiviśāradaiḥ.*


*Being ever of the nature of knowledge, He is always exceedingly awake and hence known as Prajāgaraḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 సిద్దేశ్వరయానం - 105 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 యోగులు - సూక్ష్మశరీరులు 🏵*


*ధ్యాన సమయాలలో అప్పుడప్పుడు సూక్ష్మశరీరంతో వచ్చి కొందరు సందేశాలిచ్చే వారు. కొందరు మైత్రితో పలకరించి వెళ్ళిపోయేవారు. కొందరు మహనీయులు ఆశీర్వదించి, కర్తవ్యోపదేశం చేసేవారు. మరి కొందరు తమ సాధనలో ముందుకు వెళ్ళటానికి మార్గం చెప్పమనేవారు. మరి కొందరు మంత్రోపదేశం కోరేవారు. ఈ విధంగా ఎందరితోనో ఆశరీరులతో సంభాషించవలసి వచ్చేది. ఈ అనుభవాలలో కొన్నింటిని ఈ విధంగా పలికాను.నలభై సంవత్సరాల క్రింద రాధాసాధన మొదలు పెట్టినప్పుడు శ్యామానంద అన్న అశరీర సన్యాసి నా దగ్గరకు వచ్చాడు. దానిని ఆనాడు శ్రీరాధికాప్రసాద్ మహారాజాగారు కూడా గమనించారు. కాళీదేవి అవతరణ తర్వాత శ్రద్ధానందయోగి వచ్చి సన్యాసం తీసుకోవలసిన సమయం వచ్చిందని తెలియజేశాడు. పూర్వజన్మలో భైరవి యైన యోగిని ఒకరు సూక్ష్మదేహంతో కనిపించి ఆనాటి సంగతులు గుర్తుచేసింది. ఈ విధంగా మానవతీత ప్రపంచానికి మానవ ప్రపంచానికి ఉన్న చిత్రమైన సంబంధాలు - పరమేశ్వరి కరుణ వల్ల తెలుసుకొనే అవకాశం లభించింది.*


*ప్రకాశం జిల్లా అద్దంకిలో 'చెన్నూరు కృష్ణమూర్తి' అనే మంత్రసిద్ధుడు ఉండేవాడు. మహామంత్రవేత్త అయిన వారి తాతగారు, దగ్గర ఉండి 18 సంవత్సరములు సాధన చేయించి ఈయనను మంచి మాంత్రికునిగా తీర్చిదిద్దారు. మా ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగిన తరువాత కలిసి కొన్ని సాధనలు చేశాము. బృందావనంలో లీలానంద ఠాకూరు (పాగల్ బాబా) సమాధి దగ్గర ధ్యానం చేస్తూంటే దానిపైన స్థాపిత అయిన కాళీదేవి కొన్ని విశేషాలు తెలియచేసింది. నూట యాభై సంవత్సరముల క్రింద నేనూ, కృష్ణమూర్తి గారు కలిసి చేసిన సాధనలు కొన్నింటిని గుర్తు చేసింది. ఈ విషయం కృష్ణమూర్తి గారితో చెపితే ఆయన వచ్చి గుంటూరులో కాళీ విగ్రహం ముందు కూర్చుని ధ్యానం చేసి “మీరు చెప్పింది నిజమే. పూర్వజన్మలో నేను మీ సోదరుడను. భువనేశ్వర్ దగ్గర అడవిలో వందల కొద్ది ఉన్న సర్పాల మధ్య కాళీదేవిని గూర్చి పూజా జపహోమసాధనలు మీతో కలసి చేసినట్లు నాకు కన్పిస్తున్నది" అన్నాడు.*


*ప్రేమభక్తి నిలయమైన బృందావనంలో కూడా కాళీదేవికి ప్రత్యేకమైన స్థానమున్నది. సతీదేవి యొక్క శరీరభాగములు భూమిమీదపడి వివిధపీఠాలుగా వెలసినపుడు ఆమె కేశములు యమునా తీరంలో పడితే అక్కడ కేశకాళీ ఆలయాన్ని నిర్మించారు. ఇది కాక యమునా తీరంలో అక్కడక్కడ కాళీ ఆలయాలు నిర్మించబడి ఉన్నవి. గోపికలు కృష్ణుడు భర్త కావటం కోసం 'కాత్యాయనీ వ్రతం' చేసిన చోట నిర్మించబడిన ఆ దేవత ఆలయంలో ధ్యానంచేసినపుడల్లా కాళి కన్పించేది. కొన్నిసార్లు అక్కడకు వెడుతున్నపుడు, వస్తున్నపుడు, చీకటిలో కాళీదేవి పక్కనే నడుస్తుండేది. ఇటీవల అమెరికాలో సంచారం చేస్తున్నపుడు. ఆమె రక్షగా వచ్చిన సందర్భాలు ఉన్నవి. ఒక చోట, ఆకాశంలో, నెత్తురు బొట్లు రాలుతున్న ఆమె కత్తి నాముందు పోతూ చాలా సేపు కన్పించింది. రాబోయే ఒక ఆపదను తప్పించటానికి కాళీదేవి అలా చేసిందని తరువాత తెలియవచ్చింది. ఆ ప్రయాణనంతరము జరిగిన ఒక సమావేశంలో కలిసిన ఒక ధ్యానసాధకుడు. “ఖడ్గధారిణియైన కాళి మీలో కన్పిస్తున్నది" అని తన అనుభూతిని తెలియచేశాడు.*


*అప్పుడు చెప్పిన పద్యం -*

*అద్గినవారికెల్లరకు అద్భుతరీతి ననుగ్రహించు మౌనీడ్గణ సేవ్యమాన మహనీయమహోగ్రకరాళ కాళికా ఖడ్గము రక్షగా అమెరికా గగనంబున నిల్వ - యోగి స మ్రా ద్గురుమౌళి నైతి అసమానవచోవిభవంబు వర్ధిలన్.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 267 / Siva Sutras - 267 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*3వ భాగం - ఆణవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 3 - 43. నైసర్గికః ప్రాణసంబంధః - 2 🌻*


*🌴. స్వీయ-సాక్షాత్కార స్థితిలో, జీవ పరిమితుల నుండి విముక్తి పొందినప్పటికీ, నాడుల యొక్క ప్రకాశం కారణంగా ప్రాణంతో సంబంధం సహజంగా మరియు సున్నితంగా ప్రవహిస్తుంది.🌴*


*ప్రాణం వల్ల మాత్రమే శరీరం పనిచేయగలదు. ప్రాణ శక్తి మిగితా అన్నీ శక్తివంతమైన దైవిక శక్తుల కంటే భిన్నమైనది. స్థూల శరీరంలోకి ప్రాణమును దింపుకోవడం అనేది ఒక స్వయంచాలక వ్యవస్థ, అయితే, దైవిక శక్తి యొక్క దింపుకోవడం అనేది కోరుకునే వ్యవస్థ. ప్రాణం వాతావరణంలో పుష్కలంగా లభిస్తుంది మరియు దైవిక శక్తి యొక్క మూలం మన అవగాహనకు మించినది. కానీ గరిష్టంగా అది విశ్వం నుండి ఉద్భవించిందని చెప్పవచ్చు. ప్రాణం యొక్క సంచాలనం యోగి శరీరంలో జరిగే సహజమైన యంత్రాంగం అని ఈ సూత్రం సూచిస్తుంది. ఇది అతని నియంత్రణకు మించినదిగా ఉంటుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 267 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

*Part 3 - āṇavopāya*

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 3 - 43. naisargikah prānasambandhah - 2 🌻*


*🌴. In the self-realized state, although freed from the limitations of jiva, the connection with prana remains natural, smooth and flowing due to the illumination of nadis. 🌴*


*Body is able to function only because of prāṇa. Energy of prāṇa is different from the all powerful divine energy. Infusion of prāṇa into gross body is an automated system, whereas, the infusion of divine energy is a sought after system. Prāṇa is available in plenty in the atmosphere and the source of divine energy is beyond our comprehension and at the most can be said that it originates from the cosmos. This aphorism points out that the infusion of prāṇa is a natural mechanism that happens in the body of the yogi. It is beyond his control.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹🎥 ఆత్మ యొక్క ప్రయాణం అంతిమ సాహసం 🎥🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*

*Like, Subscribe and share 👀*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 🎥 The Soul Journey is an Ultimate Adventure 🎥🌹*

*Prasad Bharadwaj*

*Like, Subscribe and share 👀*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Commenti


bottom of page